Jump to content

టిడిపి గెరిల్లా యుద్దానికి తెగించడం వెనుక జగన్ రెడ్డి 


Cyclist

Recommended Posts

టిడిపి గెరిల్లా యుద్దానికి తెగించడం వెనుక జగన్ రెడ్డి 

"ఎక్కడా దాని ఆనవాళ్లు కనిపించకూడదు. నీళ్ల ట్యాంకుల నుండి శ్మశానాల వరకు అది చేసిన నిర్మాణాలకు మీ రంగులు పూసుకోండి. ఎక్కడికక్కడ చేతిలోని అధికారం బలంతో అణచివేయుండి, ఎంతటి నాయకుడు అయినా..."

ఇలా వైకాపాకు కేంద్రంలో వున్న బిజెపి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందా? అంటే ఔననే చెబుతారు, రాజకీయ విశ్లేషకులు. 

కార్యకర్తల నుండి టిడిపి నాయకుల వరకు అరెస్టులు అవ్వడం, ఎక్కడికక్కడ రక్తం కళ్లజూడ్డం, స్థానిక ఎన్నికల్లో నామినేషన్ పత్రాలు కూడా చించేయడం, ప్రీ-క్లైమాక్స్ లెక్కన చంద్రబాబు నివాసం వైపు 20 వాహనాల్లో గూండాలను దాడికి పంపించడం, ఆఖర్లో మంగళగిరిలో వున్న టిడిపి జాతీయ కార్యాలయం మీద దాడికి తెగించి విధ్వంసం చెయ్యడంతో, అప్పటి వరకు నాయుడు నాకేం చేశాడు అనుకొనే నాయకుల నుండి కార్యకర్తల వరకు వున్న నిస్తేజంలో కసి పుట్టింది. 

ఆంధ్రా మారుమూలల నుండి సంఘీభావంగా పోలీసులు కూడా అడ్డుకోలేని స్థాయిలో ప్రవాహంలా కదిలింది కార్యకర్తల దండు, మంగళగిరి వైపు. 

అసెంబ్లీలో ఏకంగా నాయుడి సతీమణి మీద ప్రేలాపనలు చేసినప్పుడు, నాయుడి కళ్లలో కారిన కన్నీటి చుక్కను చూసి, బేలగా నేను రాజకీయాలలోకి వచ్చి ప్రజాసేవ చేస్తే ఇచ్చే గౌరవం ఇదా అని ఆయన ప్రశ్నించినప్పుడు, ప్రతి తెలుగువాడిలో పౌరుషం పుట్టింది. వైకాపా అంటే జుగుప్స కలిగింది. ఇంట్లో ఆడాళ్ల మీద మాటలు మాట్లాడించే నీచానికి మన జగన్ రెడ్డి స్థాయి దిగజారిందా అని వైకాపా నాయకులు & ఆయన సామాజిక వర్గంలో కూడా అంతర్మథనం జరిగింది. 

కార్యకర్త మీద కేసు పెడితే వెంటనే నాయుడు గాని & ఆయన కొడుకు కానీ స్పందిస్తుండడంతో, కేసులలోని బాధితులే నాయకులులా కార్యకర్తలు & జనం హీరోల్లా భావించారు. అక్కడి నుండి సమస్యల మీద నాయకులు పోరాడితే జగన్ రెడ్డి వారిని గృహనిర్భందాల్లో వుంచాడు. అప్పుడే పుట్టుకు వచ్చారు, నాయకులు లేకపోతే మేము చేస్తామని  తెగించి వచ్చిన కొత్త నాయకులు. వాళ్లను అరెస్ట్ చేసే కొద్దీ, వేధించే కొద్దీ.. వెనకకు తగ్గకుండా మళ్లీ మళ్లీ వచ్చారు పోరాటాలతో. సోషల్మీడియాలో పోస్టుల మీద అరెస్టులు చూస్తే, అటు అరెస్ట్ అయిన వారు మళ్లీ మళ్లీ రెట్టించి కసితో పోస్టులు పెట్టారు. 

గెరిల్లాల్లా మారారు. అణచివేస్తే ఎలా పోరాడాలో నేర్చుకొన్నారు. ఇది కేవలం జగన్ రెడ్డి వలన, మొట్టమొదటి సారి టిడిపి నాయకులు & కార్యకర్తలు ఇలా రాటుదేలారు.  

తెలంగాణాలో పేరుకు టీఆర్ఎస్ అయినా వాళ్ల పార్టీల గ్రూప్ ఫోటోలు చూస్తే, కేసీఆర్ అళ్లుడు హరీష్ రావు & కేటీఆర్ తప్ప కేసీఆర్ తో సహా అంతా కనిపించి, కేవలం టిడిపి పేరు టీఆర్ఎస్ అయిందని అనిపిస్తుంది, చూసే ఎవరికైనా. అందువలన అక్కడ టిడిపి జెండా పట్టుకొనే వారు వున్నా.. నాయకత్వం వహించే వారు ముందుకు రాలేదు. 

అక్కడ అంత అభివృద్ధి చేసినా మనం ఎందుకు వెనుకకు తగ్గాలి అని నాయుడు మళ్లీ, అన్నగారు పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వెళ్లారు, అక్కడి నుండి మొదలెడతాం అని. వెంట ఆంధ్రా & తెలంగాణా నుండి అనుభవం వున్న పెద్ద పెద్ద నేతలు & కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. 

మరో వైపు జాతీయ కార్యాలయం మంగళగిరిలో  యువకులు మొత్తం పోటెత్తారు. లోకేశ్ బైక్ ర్యాలీతో అక్కడి చేరుకొనే సరికి, కార్యాలయం కిక్కిరిసి పోయింది సంబరాలతో. విధ్వంసం ఇక్కడ జరిగిందా అని అనుమానం వచ్చేలా పండగ వాతావరణం కనిపించింది. 

మరో వైపు విదేశాలలో & బెంగుళూరు తదిత పటణాల్లో ప్రవాస ఆంధ్రులు ఎక్కడికక్కడ కార్ల ర్యాలీలు, బైకు ర్యాలీలను చేపట్టడం, పునరంకిత సమావేశాలను నిర్వహించడం, 40 ఏళ్ల పండగలు కేకులతో భారీగా నిర్వహించారు. 

కానీ కార్యక్షేత్రం ఆంధ్రాలో ప్రతి మారుమూల పల్లెల్లో కూడా, పొటా పోటీగా, అన్నగారి విగ్రహాలు పెట్టి, జెండ దిమ్మెలకు రంగులు వేసి పెద్ద ఎత్తున సంబరాలు చేశారు.   నాయకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది, చాలా చోట్ల పాల్గొనడం కోసం. ఈ పండగలను అడ్డుకోడానికి అధికార బలంతో అక్కడక్కడా వైకాపా ప్రయత్నించినా..  ఎక్కడికక్కడ ప్రతిఘటన ఎదురయ్యే సరికి తోకముడవక తప్పలేదు. 

ఒక రకంగా 40 ఏళ్ల సంబరాలు అన్నివైపులా ఇలా చెయ్యడం, గెరిల్లా యుద్దానికి తెగించి తెరతీసిందా టిడిపి అని అనుకొనేలా అనిపించింది. 

ఇది ఇక్కడితో ముగిసేది కాదు. ఒక విధంగా కరోనా కాలాన్ని నాయుడు వ్యూహరచనకు వాడాడా? అసెంబ్లీకి మళ్లీ సిఎంగానే వస్తా అని వచ్చేశాక దొరికిన సమయం భారీ ప్రణాళికలకు శ్రీకారం చుట్టిన ఫలితాలా ఇవి అని చర్చించుకొంటున్నారు. 

ఇంకో రెండు నెలల కాలంలో జనంలోకి వెళ్లడానికి ఇప్పటికే ఆలోచన, ప్రణాళిక, వ్యూహాలు, తర్ఫీదులు అయినట్లు కనిపిస్తోంది.   

నాయుడు & లోకేశ్ అపాయింట్మెంట్లు సులభంగా దొరికేవి ఆ మధ్య. ఇప్పుడు కనీసం ఫోన్లో అందుబాటులోకి రావడానికి అనుభవం వున్న నేతలకు కూడా కష్ట సాధ్యం అవుతోంది, వారి తీరికలేని సమయాలతో. 

బాబు వస్తే జాబు వస్తుంది అనే నినాదం ఒకప్పుడు టిడిపి ఇచ్చింది. ఇసుకతో మొదలెట్టి చెత్త పన్నుల వరకు కడుపు కొడుతోందని జనమే ఇప్పుడు బాబు వస్తేనే కడుపుకు బువ్వ దొరికేది అని అనుకొంటుకొంటున్న వేళ, అది ఎలాంటి నినాదంతో వస్తుందో అని వైకాపా వణుకుతోంది. మంత్రులనందరినీ పీకేసి, జిల్లా స్థాయి పార్టీ బాధ్యతలు ఇవ్వడానికి   వణుకుతూ.. పావులను చెల్లాచెదురు చేసుకొంటోంది దాని రాజకీయ చదరంగంలో, వైకాపా. 

జగన్ ఏమీ చెయ్యలేడు. ఆఖరికి జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని దుర్భర చేతగాని స్థితికి ఎన్ని ముసుగులు వేసినా.. ఆఖరికి వైకాపా నాయకులు కూడా సమాధానం చెప్పుకోలేని స్థితిలో, మంత్రి వర్గ విస్తరణ ముహూర్తమే దానికి శాపంలా మారోతోంది రాజకీయం. 

ఓ వైపు శత్రు పార్టీని గెరిల్లాల్లా మార్చి, తమ పార్టీని అత్యంత బలహీనంగా జనంలోకి వెళ్లలేనంత పరిస్థితులను జగన్ రెడ్డే చేసుకోవడం, స్వయంకృతం. 

చివరి ఆరునెలల్లో తిరగబడాల్సిన బెరుకు ప్రజలు, ఇక జగన్ రెడ్డి వల్లా ఊడేదేం లేదని, ఇంకా రెండేళ్లు వుండగానే తిరగబడుతున్నారు ఇప్పుడే. ఇంకా ఈయన్ను నమ్ముకొంటే మనకే నష్టం అని వైకాపా సాంప్రదాయ ఓటు బ్యాంకు వర్గాల నాయకులు మెల్ల మెల్లగా రాజకీయం మార్చుతున్నారు. స్వయం ప్రకటిత మేధావులు, ఇక జగన్ గురించి ఒక్క మాట పొగిడినా, మన మేధావితనం పోతుంది, జనం మళ్లీ మేధావులుగా మనలను గుర్తించాలి అంటే, జగన్ పాలన గురించి విమర్శలే శరణ్యం అని మేధావి వుండవల్లి నుండి ఇప్పటికే నోటిమాటలు మారాయి. 

పెయిడ్ ఆర్టిస్టులుగా పేలి, రోడ్డున పడ్డాం అని సినిమా పరిశ్రమలో ప్రుథ్వీ లాంటి అనుభవ ఆర్టిస్టులు కూడా క్షమాపణ పర్వాలకు దిగారు. 

జగన్ గురించి ఏ రంగమైనా, ఏ సంఘమైనా నాలుగు మంచి మాటలు చెబితే, వైకాపాకు అమ్ముడుపోయినట్లు జనం కాండ్రించేలా మా జగనే చేసుకొన్నాడు అని ఒక వైకాపా ఎంపీపీ చెప్పడం, ప్రస్తుత వైకాపా పరిస్థితికి అద్దం పడుతోంది. 

పాలన, స్థానిక & ఉప ఎన్నికల నిర్వహణలో వైకాపా ముందగానే నేర్పిన పాఠాలతో, గెరిల్లా యుద్ధానికి, గెలుపే లక్ష్యంగా తయారైన టిడిపి ముందు, ఇక పికె నుండి బిజెపి వరకు బహిరంగంగా & రహస్యంగా మన వైకాపా ఎన్ని మాయోపాయాలు పన్నినా వృధానే, ఇక దీని మీద సమయం & డబ్బులు వెచ్చించడం దండగ అని వైకాపా శ్రేణులు మానసికంగా నిర్ణయాలకు వచ్చేశారు, ఇప్పటికే. ఈ మార్పు వైకాపా సోషల్మీడియాను చూస్తే గమనించవచ్చు. #చాకిరేవు. 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...