Jump to content

అన్నక్యాంటీన్‌ కూల్చేశారు


John

Recommended Posts

నాడు అమరావతిలో ప్రజా వేదిక..

నేడు కడపలో అన్న క్యాంటీన్‌

 

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో ప్రజావేదికను కూల్చేసి కోట్లాది రూపాయల ప్రజాధనం నేలపాలు చేశారు. తాజాగా కడప నగరంలో అన్న క్యాంటీన్‌ను కూల్చే శారు. రూ.31లక్షల ప్రజాధనంతో నిర్మించిన  ఈ ఆధునిక భవనాన్ని.. పెట్రోల్‌ బంకు ఏర్పాటు కోసం కూల్చేశామంటూ కార్పొరేషన్‌ అధికారులు అంటున్నారు. అయితే దీని నిర్మాణం కోసం ఖర్చు పెట్టిన ప్రజాధనం రూ.31 లక్షలు ఇప్పుడు ఏ అధికారి చెల్లిస్తారనేది సామాన్యుడి ప్రశ్న.

 

కడప, మార్చి22(ఆంధ్రజ్యోతి): ఏదైనా భవనం శిథిలమై కూలేందుకు సిద్ధంగా ఉన్నా... రహదారి విస్తరణో.. ప్రజా ప్రయోజనాల కోసమైతేనో కూలుస్తుంటారు. అది ప్రభుత్వ ఆస్తి అయినా ప్రైవేటు ఆస్తి అయినా ఇలాగే వ్యవహరిస్తారు. అయితే అలాంటివి ఏమీ లేకుండా ఆధునాతన భవనాన్ని కూల్చారంటే.. అది జగన్‌ సర్కార్‌కే సాధ్యం..! ఎందుకంటే అమరావతిలో ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజా వేదికను నాడు వైసీపీ రాష్ట్ర పాలన చేపట్టిన వెంటనే కూల్చివేశారు. దీనిని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో కానీ.. కార్పొరేషన్‌ అధికారులు ‘అన్న క్యాంటీన్‌’ భవనాన్ని కూల్చేసి రూ.31 లక్షల ప్రజా ధనాన్ని వృధా చేశారు. అదేమంటే పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు కోసం అన్నా క్యాంటీన్‌ కూల్చేసినట్లు కమిషనర్‌ రంగస్వామి వివరించారు. అన్నా క్యాంటీన్‌ భవనం కూల్చివేత తీవ్ర విమర్శలకు తావిచ్చింది. 

చంద్రబాబు పాలనలో రూ.5కే ఉదయం అప్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి పూట చపాతీలను అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఇవి విశేష ప్రజాదరణ పొందాయి. భవన నిర్మాణ కార్మికులు, వివిధ పనుల నిమిత్తం వచ్చే వారు, నిరుద్యోగులకు ఇక్కడ రూ.5కే ఆహారం దొరికేది. తొలుత కడపలో జడ్పీ ఆవరణలో అన్నా క్యాంటీన్‌ ఏర్పాటు చేశారు. ఆస్పత్రులు ఎక్కువగా ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి జనం కడపకు వస్తుంటారు. దీంతో అప్పటి పురపాలక శాఖ మంత్రి నారాయణ, టీడీపీ నేత హరిప్రసాద్‌ సెవెన్‌రోడ్స్‌కు సమీపంలోని పాత రిమ్స్‌ పరిఽధిలో అన్నాక్యాంటీన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రూ.25 లక్షలు భవనం, రూ.6 లక్షలతో కాపౌండ్‌ నిర్మాణానికి మొత్తం రూ.31 లక్షలు ఖర్చు పెట్టి అన్నా క్యాంటీన్‌ నిర్మించారు. 2018 సెప్టెంబర్‌ 3న ప్రారంభించారు. దీనికి విశేష ఆదరణ లభించింది. అయితే ప్రభుత్వం మారడంతో అన్నా క్యాంటీన్లు మూసేశారు. అనంతరం పాత రిమ్స్‌ వద్ద ఉన్న కేంద్రాన్ని కొవిడ్‌ సెంటర్‌గా ఉపయోగించుకున్నారు. 

పెట్రోల్‌ బంక్‌ పేరుతో..

కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పెట్రోల్‌ బంక్‌ కోసం అన్నా క్యాంటీన్‌ను  అధికారులు కూల్చేశారు. రెండు రోజులుగా కూల్చివేతకు శ్రీకారం చుట్టి సోమవారం రాత్రి పూర్తిగా కూల్చేశారు. చక్కగా ఉన్న భవనాన్ని కూల్చేయడం స్థానికులతో పాటు పలువురిని విస్మయానికి గురి చేసింది. పెట్రోల్‌ బంక్‌ కోసం ప్రజాధనంతో నిర్మించిన భవనాన్ని ఎలా కూలుస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించకుండా ఇలా కట్టిన భవనాలను కూల్చేసి వృధా చేస్తారా అంటూ మండిపడ్డారు.

అన్న క్యాంటీన్‌ కూల్చేయడం దుర్మార్గం : టీడీపీ

‘‘కార్మికులు, నిరుద్యోగులు, పేదలకు, రూ.5కే ఆహారాన్ని అందించాలని ఎంతో సదుద్దేశంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను జగన్‌ సర్కార్‌ రద్దు చేసి పేదల పొట్టకొట్టింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పెట్రోల్‌ బంక్‌ కోసం అటూ అన్నా క్యాంటీన్‌ని కూల్చి వేయడం దుర్మార్గం’’ అని టీడీపీ నేతలు మండిపడ్డారు. కూల్చివేసిన అన్నా క్యాంటీన్‌ వద్ద మంగళవారం వీరు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు లింగారెడ్డి, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వీఎ్‌స అమీర్‌బాబు, కార్యనిర్వాహక కార్యదర్శులు హరిప్రసాద్‌, గోవర్ధన్‌రెడ్డి, నగర అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డి, లక్ష్మీరెడ్డి, పలువురు టీడీపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్‌ రెడ్డిపాలన అంతా కూల్చడం, విధ్వంసం, కేసులుగానే మారిందన్నారు. అన్నాక్యాంటీన్లు కొనసాగిస్తే చంద్రబాబుకు పేరు వస్తుందనే అక్కసుతో మూసివేశారన్నారు. భవవనాన్ని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోకుండా పెట్రోల్‌ బంక్‌ కోసమని కూలగొట్టి రూ.31 లక్షల ప్రజాధనాన్ని నేలపాలు చేశారన్నారు. కూల్చిన అన్నా క్యాంటీన్‌ను మళ్లీ నిర్మించేంత వరకు టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు జయకుమార్‌, శివరామ్‌, వికాస్‌ హరి, బాలదాసు, రామ్‌ప్రసాద్‌, సురేష్‌, ముని తదితరులు పాల్గొన్నారు

Link to comment
Share on other sites

 టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు లింగారెడ్డి, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వీఎ్‌స అమీర్‌బాబు, కార్యనిర్వాహక కార్యదర్శులు హరిప్రసాద్‌, గోవర్ధన్‌రెడ్డి, నగర అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డి, లక్ష్మీరెడ్డి, పలువురు టీడీపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్‌ రెడ్డిపాలన అంతా కూల్చడం, విధ్వంసం, కేసులుగానే మారిందన్నారు. అన్నాక్యాంటీన్లు కొనసాగిస్తే చంద్రబాబుకు పేరు వస్తుందనే అక్కసుతో మూసివేశారన్నారు. భవవనాన్ని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోకుండా పెట్రోల్‌ బంక్‌ కోసమని కూలగొట్టి రూ.31 లక్షల ప్రజాధనాన్ని నేలపాలు చేశారన్నారు. కూల్చిన అన్నా క్యాంటీన్‌ను మళ్లీ నిర్మించేంత వరకు టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు జయకుమార్‌, శివరామ్‌, వికాస్‌ హరి, బాలదాసు, రామ్‌ప్రసాద్‌, సురేష్‌, ముని తదితరులు పాల్గొన్నారు.

Barring Linga Reddy.... migatha vaallantha paisa ki paniki raaru.  Veellandaru ninaadaalu chestoone vunnaaru... vuntaaru.... what is the use.  Where is the public mobilization.... janaalanu enduku kalupukuni povadam ledu... issues vunnaa.... ilaa ninaadaalatho... press meets tho saripedithe.... veetannintini aaa Sadist enjoy chesthaadu.  

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...