Jump to content

Akhanda success celebration pics


goldenstar

Recommended Posts

🍁 _*అఖండ* విజయోత్సవం_🍁

ద్వారకా క్రియేషన్స్ పతాకంపై _*శ్రీ మిర్యాల రవీందర్ రెడ్డి*_ గారి నిర్మాణతలో, _*యస్.యస్.థమన్*_ గారి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో, సంచలన హిట్ చిత్రాల దర్శకుడు _*శ్రీ బోయపాటి శీను*_ గారి దర్శకత్వంలో మన _నందమూరి నటసింహం *బాలకృష్ణ*_ గారు *అఖండ* గా ఆవిర్భవించి, అఖండమైన విజయాన్ని అందించిన శుభసందర్భాన్ని పురష్కరించుకుని స్థానిక _చాంద్ థియేటర్లో_ నందమూరి అభిమానసంఘాల గౌరవాధ్యక్షులు *డా.యన్.వీరాంజనేయులు* గారి ఆధ్వర్యంలో _చాంద్ థియేటర్_ నిర్వాహకుడు _*శ్రీ సంపత్ రెడ్డి*_ గారికి పూలమాలలు వేసి, శాలువాతో సన్మానించి, *అఖండ* త్రిశూలాన్ని పోలిన _భారీ కేక్_ ను _జై బాలయ్య! జై జై బాలయ్య!_ అనే హోరెత్తిన నినాదాల మధ్య కట్ చేసి అభిమానులకు పంచి పెట్టిన అనంతరం *డా.యన్.వీరాంజనేయులు* గారు మాట్లాడుతూ "కరోనా కష్టాలతో చలనచిత్ర పరిశ్రమ అతలాకుతలమై, సినిమాను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ రోడ్డు మీద పడిన వైనం ఒకవైపైతే; ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన _వైసిపి ప్రభుత్వం_ అదనపు షోల మీద, టికెట్ ధరలపైన నియంత్రణ అంటూ తెలుగుసినిమా మీద పెత్తనం చెలాయిస్తున్న తరుణంలో తమ సినిమాలు విడుదల చేస్తే ఎక్కడ యిబ్బంది కలుగుతుందోనని _సినీ పెద్దలు_ అనబడే _గుంట నక్కలు_ ముందూవెనకకు ఊగిసలాడుతూ భయపడుతున్న సందర్భంలో యివేవీ లెక్కచేయని _*సింహం*_  జూలు విదిల్చి, ధైర్యంగా ఒకడుగు  ముందుకు వేసి, _*అఖండ*_ రూపంలో తన చిత్రాన్ని విడుదల చేసి అఖండమైన విజయాన్ని అందించి తెలుగుసినిమాకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ఊపిరిని పోసి, తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా _డల్లాస్ లో ర్యాలీలు చేసి స్క్రీన్ దగ్గర గోల పెట్టడం, సిడ్నీలో సీట్ల మీదకెక్కి డ్యాన్సులు చేయడం, లండన్ లో పోలీసులు వార్నింగ్ యివ్వడం_ యిలా ఖండాతరాలలో కూడా తన ఖాతాను నమోదు చేసి అంతులేని అఖండమైన ఘనవిజయాన్ని చిత్రపరిశ్రమకు అందించిన _బాక్సాఫీస్ బొనాంజ *బాలయ్య*_ గారికి, చిత్రం యూనిట్ కు, ఆదరించిన ప్రేక్షకాభిమానులకు, ప్రత్యేక శ్రద్ధతో ఫోకస్ చేసిన _నందమూరి అభిమానులకు_ పేరుపేరునా ధన్యవాదములు" తెలిపిన యీ కార్యక్రమంలో _డా.యమ్.నాగభూషణం(RMP)_ గారు _అఘోర_ వేషధారణలో అలరించడం, కడప పార్లమెంటరీ తెలుగుయువత కార్యదర్శి _యమ్మనూరు ఆంజనేయులు, సి.జె.వెంకటసుబ్బయ్య, కందుల నరసింహారెడ్డి, సింహా శేఖర్ యాదవ్, తాటి సుధాకరయాదవ్, యస్.సురేష్ కుమార్, యమ్.మల్లికార్జున, బి.శ్రీనివాసులు, గోగుమాకుల కుళాయప్ప, బి.రాజేష్, ఇంజేటి వ్యానిష్, యు.వి.సుబ్బయ్య, ఉంగరాల శ్రీను, జి.విమల్_ తదితర అభిమానులు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది..

_*💥జై అఖండ🔥*_
_*💪జై బాలయ్య✌️*_

05-12-2021
ఆదివారం

_నందమూరి యువసేవాసమితి_
ప్రొద్దుటూరు, కడపజిల్లా.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...