Jump to content

ఆ తల్లి శోకం, మీకు శాపం


AbbaiG

Recommended Posts

ప్రియమైన సోదరా... 
నాకు ఇష్టంలేని నాయకుడు చంద్రబాబు. అతను కేవలం కొందరు వ్యాపారస్తుల ప్రయోజనాలకే పనిచేశాడు. ప్రజా ఉద్యమాలను అణచివేశాడు. అందుకే నాకు మీ నాయకుడు చంద్రబాబు అంటే అయిష్టం, వ్యతిరేకత. శుక్రవారం అసెంబ్లీలో తలెత్తిన జుగుప్సాకర ఘటన అత్యంత దుర్మార్గమైనది. మనసున్న ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. అందులో సందేహం లేదు. పైగా  చంద్రబాబు బిగ్గరగా ఏడ్చినందుకో, భువనేశ్వరి ఎన్ఠీఆర్ కూతురు అయినందుకో కాదు. మానవ సమాజం సిగ్గుతో తలదించుకునేలా వై.సీ.పీ ఎమ్మెల్యేలు ఒక మహిళ వ్యక్తిత్వాన్ని అత్యంత హేయమైన రీతిలో మనిషన్నవాడు ఎవడూ నోటితో ఉచ్చరించడానికి కూడా సిగ్గుపడేలా  అవమానకరంగా చట్ట సభల్లో మాట్లాడటం బహుశా తెలుగు జాతి చరిత్ర లో ఇదే మొదటిది కావచ్చు. ఇదే ఆఖరిదీ కావాలని కోరుతున్నాను. 


     దీనిపై కులం, ప్రాంతం, అభిమానం పేరుతో రకరకాల విశ్లేషణలు చేసి, ఒక వైపు స్టాండ్ తీసుకోడానికి ఇదేమీ రాజకీయ సిద్దాంతం కాదు. అలాంటి అమానవీయ ఘటనను సమర్ధించడానికి పశువులం అంత కన్నా కాదు. నీతి, నైతికత పునాదిగా కొన్ని విలువలను నియమించుకొని, వాటి ఆధారంగా బతుకుతున్న జీవులం. నాగరికత నేర్చిన మనుషులం. " నీ కొడుకు నీకు పుట్టాడో లేదో డీ. ఎన్. ఏ పరీక్ష చేయించు" అంటూ ప్రజల ఓట్లతో గెలిచి ప్రజాస్వామ్య బద్దంగా పాలిస్తామని ప్రమాణం చేసి మరీ ఐదు కోట్ల ఆంధ్రుల ఆశల గుడిలోకి అడుగుపెట్టిన నాయకులు , ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే దిగజారి, పశువులు కూడా చీదరించుకునేలా నోరు పారేసు కుంటే.! వాళ్ళను ఆదర్శంగా తీసుకున్న సామాన్యులు రేపు అదే బాటలో నడిస్తే...అవే వ్యాఖ్యలు ఇతరుల మీద ప్రయోగిస్తే, అప్పుడు తలెత్తే పరిణామాలు తలుచుకుంటేనే భయంగా ఉంది. ఎంత మంది మహిళలు తమ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోడానికి అగ్నిలో దూకాలో. మరెందరు బిడ్డలు తమ పుట్టుక మీద ఊర కుక్కలు జల్లిన బురదకు జీవితాంతం పశ్చాత్తాప పడాల్సి వచ్చేదో.! 


       రాజకీయ పలుకుబడి, గుర్తింపు కలిగిన ఒక నాయకుడి భార్యకే ఇంత అవమానం ఎదురైతే, తట్టుకోవడం ఇంత కష్టంగా ఉందంటే, ఇలాంటి అవమానాలను సహించే శక్తి, భరించే ధైర్యం ఎందరు సామాన్యులకు ఉంటుంది. 


చంద్రబాబు గతాన్ని తవ్వి, ఇంత జరగాలసిందే అని మానసిక దౌర్బల్యానికి పాల్పడలేను. ఎన్నికల స్టంట్ అని దిగజారుడు రాజకీయం ప్రదర్శించలేను. ఇంతా జరగాలసిందే అని రక్షసత్వాన్ని ప్రదర్శించలేను. వైసీపీ ఎమ్మెల్యేల ప్రవర్తన ముమ్మాటికీ అమానుషమే. అందులో ఇసుమంత కూడా సందేహం లేదు. 


    తనకు ఏ పాపం తెలియని ఒక మహిళ తను చేయని తప్పుకు అతిపెద్ద అపవాదును ఎదుర్కోవడమే గాక అత్యంత మనో వ్యధకు లోనవ్వడం...తలుచుకుంటేనే కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఎందుకంటే ఆమె ఎన్ఠీఆర్ కూతురనో, చంద్రబాబు భార్య అనో కాదు...ఒక మహిళ అని. ఆ స్థానంలో మనం ఉంటే...అనే ప్రశ్న వేసుకున్నప్పుడే ఆ తల్లి బాధ మనకు అర్ధం అవుతుంది. ఆమె శోకం సమాజానికి కూడా మంచిది కాదు. ఇలాంటి సమయంలో పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా సమాజం అంతా భువనేశ్వరి గారికి మద్దతు గా ఉండాలి. తప్పు చేసి కూడా సిగ్గులేకుండా సమర్ధించుకుంటున్న వైసీపీ నాయకుల తీరును ఎండగట్టాలి. మగతనం అనే మదాన్ని భుజానేసుకొని, ఒంటి నిండా అంగాలతో అచ్చోసిన ఆంబోతుల్లా  స్వైరవిహారం చేస్తున్న వల్లభ నేని వంశీ, కొడాలి నాని, ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు వంటి మగోన్మత్తులకు తగిన బుద్ధి చెప్పాలి. నిసిగ్గుగా వాళ్ళను వెనకేసుకొస్తున్న జగన్ కు బదులు చెప్పాలి. వాళ్ళ ఇళ్లల్లోని ఆడవాళ్లు కూడా ఆ వెధవలకు తగిన బుద్ధి చెప్పాలి. ఈ విషయంలో మౌనం దాల్చిన మేధావులను నపుంసకులు అనుకొని ఆ మహాతల్లి క్షమాభిక్ష పెట్టాలి. ఈ విషయంలో ఆ తల్లిని క్షోభ పెట్టిన నీచులను ఛీత్కరించడం మినహా మరేమీ చేయలేకపోతున్నందుకు ఒక ఆంధ్ర ప్రదేశ్ పౌరుడిగా భువనేశ్వరి గారిని క్షమాపణ కోరుతున్నాను. 


       చివరగా ఒక్కమాట,  చంద్రబాబు ఏడవ వలసిందే. బిగ్గరగా కాదు, గుండెలు అవిసేలా కాదు, ఎక్కి ఎక్కి కాదు...ఇంకా ఇంకా ఎడవాల్సిందే. ఎందుకంటే,  తాను వల్లభనేని వంశీ, కొడాలి నాని, తమ్మినేని సీతారాం వంటి వ్యక్తులను రాజకీయాల్లో పెంచి పోషించాడు కనుక. నిజమైన నాయకుడి నైపుణ్యం అంతా మంచి నాయకులను తయారు చేయడంలోనే ఉంటుంది. ఆ విధంగా చూస్తే, మీరు పెంచి పెద్ద చేసిన నాయకులంతా ఎవరండి.! అవకాశం కోసం మిమ్మల్ని నడివీధి లో పెట్టి బూతులు తిట్టేవారా. సీతక్క వంటి వారెందరిని ప్రోత్సహించారు. అంతటి సంస్కార వంతులు మీ చుట్టూ ఎందరున్నారు. కనుక ఎక్కి ఎక్కి ఎడవండి. ఫర్లేదు. మీరు ఎప్పుడూ వ్యాపారస్తులు పక్షమే. మీరు అహోరాత్రాలు శ్రమించిందీ వ్యాపారస్తుల కోసమే. అందుకే అవసరం మేరకే మీతో కలుస్తారు.  అధికారం పోగానే మిమ్మల్ని "తూ నా" బొడ్డు అంటారు. ప్రెస్ మీట్లు పెట్టి, మైకులు ఇరగ గొట్టే నాయకులే కానీ ప్రజల్లో పనిచేసే, ప్రజా సమస్యల మీద ఒక పంథా తో పనిచేసే నాయకులు మీ చుట్టూ ఎందరున్నారు. అలాంటి వాళ్ళను ఒక్కరినైనా చూపించండి ప్లీజ్.! అభం, శుభం తెలియని కార్యకర్తలే కదా మీకు ఎన్నడూ అండగా ఉండేది. మరి, వాళ్ళ నుంచి ఎందరు సామాన్యులను మీరు నాయకులను చేశారు. "ప్చ్ ! సమాధానం లేదు". కనుకే మీ పంథా, మీ ఆలోచన, మీ వ్యూహాలు అన్నీ ఇప్పుడు ఔట్ డేటెడ్. ప్రజల్లో పనిచేసే వాళ్ళను ప్రోత్సహించండి. ప్రెస్ మీటుల్లో వీర ప్రగల్భాలు పలికే వారినికాదు. 
చంద్రబాబును ఎంత ద్వేషించినా, శుక్రవారం నాటి ఘటనతో అతనిలోని ఒక గొప్ప లక్షణం నన్ను అమితంగా ఆకట్టుకుంది. తన భార్యను అంతలా అవమానించిన తర్వాత, ప్రెస్ మీట్ లో ఆమె ఔన్నత్యాన్ని కొనియాడుతూ అన్న మాటలు ఉన్నాయి చూశారా! అది ప్రతి మగాడు నేర్చుకోవాలి. ఆ సంఘటన తో ఇప్పుడు నా దృష్టిలో చంద్రబాబు రామాయణంలోని రాముడికన్నా గొప్పవాడు.  ఎందుకంటే, తన రాజ్యంలోని ఒక పామరుడి నిందకు తలొగ్గిన రాముడు సీతమ్మ ను అనుమానించి మళ్లీ అడవికి పంపాడు కానీ, తన భార్య ఔన్నత్యాన్ని బహిర్గత పరచలేకపోయాడు. భార్యను ప్రేమించడంలో చంద్రబాబు ముందు శ్రీరాముడు కూడా చిన్నబోయాడు. జీవిత సహచరిని ప్రేమించడంలో ప్రతి మగాడు చంద్రబాబును చూసి చాలా నేర్చుకోవాలి. మీ దంపతులు వీలైనంత త్వరగా ఈ బాధ నుంచి కోలుకుని తిరిగి సాధారణ జీవితాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చంద్రబాబు గారు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం కాదు, మానవీయ విలువల తో కూడిన ఒక మంచి సంస్కృతిని పెంపొందించేందుకు ఇకనైనా ప్రయత్నించండి. ప్రజాస్వామ్య విలువలను గౌరవించండి. పుత్ర ప్రేమ అంధత్వంలో పడి రాజనీతిని కోల్పోకండి. తర, తమ బేధం లేకుండా టాలెంట్ ను ప్రోత్సహించండి. ముఖ్యంగా సోషల్ మీడియా, ప్రెస్ మీట్ ఉద్యమాలను గాక ప్రజా ఉద్యమాలను నమ్ముకోండి. 
                              ఇట్లు
            చంద్రబాబుకి బద్ధ వ్యతిరేకుల్లో ఒకడు

Link to comment
Share on other sites

Pushtaakalo pranpancham chusi raasukunnattundi…. U can’t expect to build a new ideal world….

Anyways the primary is human ethics & core values….
& U can’t expect Every1 to like/support everything one does…. Kudos to the write up….

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...