Jump to content

18/11/2021 mptc, zptc results


Saradhi_eluru

Recommended Posts

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ వెలువడుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ జెండా ఎగిరింది. వైసీపీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల స్వగ్రామాల్లో సైతం టీడీపీ జెండా ఎగరడం గమనార్హం. ఇప్పటికే సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇదే జరగ్గా.. తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ సేమ్ సీన్ రిపీటయ్యింది.

రాజధాని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సొంత నియోజకవర్గంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఫిరంగిపురం మండలంలో రెండు ఎంపీటీసీ స్థానాలుండగా.. ఈ రెండు చోట్లా టీడీపీ జెండా ఎగిరింది. ఈ రెండు స్థానాలను అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసుకున్నప్పటికీ ఏ మాత్రం వారి ప్రయత్నాలు ఫలించలేదు. గుండాలపాడులో 457 ఓట్లు మెజారిటీ, వేమవరం 93 ఓట్ల మెజారిటీ టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కాగా.. రాజధాని నియోజకవర్గంలో రెండు స్దానాల ఓటమితో వైసీపీ డీలపడినట్లయ్యింది. ఈ ఓటమితో వైసీపీ పెద్దల నుంచి శ్రీదేవికి ఫోన్లు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఓటమిపై శ్రీదేవి ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

102 ఓట్లతో దుర్గాసి గెలుపు.. (12:18 PM)

విజయనగరం జిల్లా గుర్ల మండలం నాగుల వలస ఎంపీటీసీ స్థానంలో టీడీపీ గెలిచింది. వైసీపీ అభ్యర్థిపై 102  మెజార్టీతో దుర్గాసి కోటేశ్వరరావు గెలుపొందారు. ఇదే జిల్లా నుంచి రామభధ్రపురం మండలం బూసాయివలస టీడీపీ ఎంపీటీసీ అభ్యర్ధి మడక స్వర్ణలత 623 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

పశ్చిమ గోదావరిలో టీడీపీ జెండా ఎగురుతోంది.. (12:00 PM)

జిల్లాలో టీడీపీ జెండా ఎగురుతోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం సత్తా చాటుతోంది. ఇప్పటికే పలు స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ తాజాగా.. పోలవరం మండలం కొరుటూరు ఎంపీటీసీ స్థానంలో గెలుపొందింది. వైసీపీ అభ్యర్థిపై టీడీపీ తరఫున పోటీచేసిన అరగంటి పెంటమ్మ 429 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. పెదవేగి మండలం రామశింగవరం ఎంపీటీసీ స్థానంలోనూ టీడీపీ గెలిచి నిలిచింది. వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి 87 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పెదపాడు మండలం సత్యవోలు ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి 27 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే.. వైసీపీ అభ్యర్థి రీ కౌంటింగ్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. ప్రస్తుతం రీ కౌంటింగ్ కొనసాగుతోంది.

కట్టా ప్రసాద్ గెలుపు.. (11:40 AM)

గుంటూరు జిల్లాలో ఎక్కువ ఎంపీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటోంది. ఇప్పటికే పలు స్థానాల్లో తెలుగుదేశం గెలవగా.. తాజాగా ఫిరంగిపురం మండలం గుండాలపాడు ఎంపీటిసీ స్థానంలోనూ గెలిచింది. వైసీపీ అభ్యర్థిపై టీడీపీ నుంచి పోటీ చేసిన కట్టా ప్రసాద్ 457 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు.

పెనుకొండలో టీడీపీ విజయం.. (10:25 AM)

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం రాంపురం టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి పద్మావతి 51 ఓట్లతో విజయం సాధించారు. మరోవైపు.. రాయదుర్గం నియోజకవర్గం చెర్లోపల్లి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి నుంచి మల్లికార్జున 315 ఓట్లతో విజయం సాధించారు.

శ్రీకాకుళంలో సుగుణ విజయం..  (09:54 AM)

శ్రీకాకుళంలో జిల్లా ఆముదాలవలస మండలం కాత్యాచార్యులపేట ఎంపీటీసీ టీడీపీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థిపై 256 ఓట్ల ఆధిక్యంలో బొడ్డేపల్లి సుగుణ గెలుపొందారు.

https://www.andhrajyothy.com/telugunews/zptc-mptc-counting-started-mrgs-andhrapradesh-1921111808574287

Link to comment
Share on other sites

కట్టా ప్రసాద్ గెలుపు.. (11:40 AM)

గుంటూరు జిల్లాలో ఎక్కువ ఎంపీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటోంది. ఇప్పటికే పలు స్థానాల్లో తెలుగుదేశం గెలవగా.. తాజాగా ఫిరంగిపురం మండలం గుండాలపాడు ఎంపీటిసీ స్థానంలోనూ గెలిచింది. వైసీపీ అభ్యర్థిపై టీడీపీ నుంచి పోటీ చేసిన కట్టా ప్రసాద్ 457 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు

 

maa village ne

Link to comment
Share on other sites

2021 సెప్టెంబర్: 514 జడ్పీటీసీ లకుగాను 6 చోట్ల విజయం సాధించిన టీడీపీ🙃 

2021 నవంబర్: 8 సీట్లలో పోటీ చేసి ఇప్పటికే 3 గెలుచుకున్న తెలుగుదేశం✌️

Link to comment
Share on other sites

56 minutes ago, kishbab said:

కట్టా ప్రసాద్ గెలుపు.. (11:40 AM)

గుంటూరు జిల్లాలో ఎక్కువ ఎంపీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటోంది. ఇప్పటికే పలు స్థానాల్లో తెలుగుదేశం గెలవగా.. తాజాగా ఫిరంగిపురం మండలం గుండాలపాడు ఎంపీటిసీ స్థానంలోనూ గెలిచింది. వైసీపీ అభ్యర్థిపై టీడీపీ నుంచి పోటీ చేసిన కట్టా ప్రసాద్ 457 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు

 

maa village ne

Wowwww Phirangipuram lo TDP gelichindha :surprise:

How is it possible ?

Bro Medhi Phirangipuram mandal aa ?

Link to comment
Share on other sites

శ్రీకాకుళం : హిర మండలం కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత - 89 ఓట్లతో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి బుచ్చిబాబు గెలిచినట్లు ప్రకటించిన అధికారులు -

వైసీపీ ఒత్తిడితో రీకౌంటింగ్‍కు అధికారుల సన్నాహాలు - రీకౌంటింగ్ కుదరదంటూ టీడీపీ నిరసన - కౌంటింగ్ కేంద్రం దగ్గర టీడీపీ కార్యకర్తల ధర్నా 

కౌంటింగ్ కేంద్రానికి మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ - టీడీపీ కార్యకర్తలను చెదరగొడుతున్న పోలీసులు

Link to comment
Share on other sites

3 hours ago, Raaz@NBK said:

:shakehands:

Madi complete tdp village. No scope for any other party..irrespective of situation for any election tdp lead will be there.

Even before tdp comes they are against congress.  When I am child My grandfather used to say fascinating stories how they are against neelam Sanjeev reddy and KBR when they are young...mostly NG ranga followers. When he compromised with congress...used to follow vavilala goplakrishnayya from communists. Once tdp comes line is clear. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...