Jump to content

Ap State


Sinna.Sinna

Recommended Posts

ఫైనాన్షియల్ కొలాప్స్ మొదలయ్యిందా? యుద్ధ ప్రాతిపదికపై ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వమని ఎపిఈఆర్సి లేఖ వ్రాసింది డిస్కంలకు. 15 వేలా కోట్ల చిల్లర బాకీలు వసూలు చెయ్యకపోతే, రెండు వారాల తరువాత కరెంటు కట్ చెయ్యమని హెచ్చరించింది. అసోషియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైజెస్ ఇండస్ట్రీ ఏకంగా రెడ్ కార్నర్ వార్నింగ్ నోటీస్ ఇష్యూ చేసింది. ఆంధ్రాకు వైద్య పరీక్షలు నిర్వహించే పరికరాల బాకీలు రానందువల్లా.. 100% డబ్బులు ముందుగా పంపితే గాని ఏవీ ఇవ్వకండి అని. విద్యుత్ వైద్య రంగాలు కుప్పకూలడానికి కూతవేటు దూరంలో వున్నాయి. అటు చూస్తే ఇవ్వాళ తీసుకొనే అప్పు పరిమితిని పెంచడానికి కేంద్రం కుదరదంది. కోర్టుల ఉత్తర్వుల ద్వారా చెల్లించాల్సినవి చాలా మొత్తం వుంది. ఏమీ పాలుపోని స్థితిలో హస్తినలో బుగ్గన వున్నాడు. ఇటు తెలంగాణా మంత్రి కేంద్రం దగ్గర బిక్షం ఎత్తుకుంటోంది ఆంధ్రా అని ఘాటుగా విమర్శించారు. చివర అంకంలో భాగంగా, దింపుడుగల్లం ఆశలతో.. ఇక్కడ యువతను అంబానీలను చేస్తా అనే బడాయి గౌతం రెడ్డిని హస్తిన పంపినట్లున్నారు. ఏదో పొడుస్తాడాని. ఇక్కడేమో చివరికి కరోనా వ్యాక్సిన్ సిరంజ్ సూదికి దిక్కులేకున్నా.. 16 ఆసుపత్రులు కడతాం, విలేజీ క్లినిక్కుల్లో వైద్యం చేస్తామని ఏదో లోకం కబుర్లు. ఆశగా డిమాండ్లు పెడుతున్న ఉద్యోగులకు సర్దిచెబుతూ.. రోజులు దొంగలిసస్తూ నెట్టుకొస్తున్నారు, వాస్తవాలు దాచి. ఉద్యోగ సంఘ నాయకులకు తెలిసినా.. ఇన్నాళ్లు భజన చేసినందుకు, ప్రాయశ్చిత్తంగా, డిమాండ్ చేస్తున్నట్లు ఆడిపోసుకొనే డ్రామా ఆడక తప్పదు. డబ్బుంటే, బటన్ నొక్కడం గుడ్డి ముసల్ది కూడా చేస్తుంది. దానికి కాలు బెణికేలా వ్యాయామాలు చేసి కూర్చోవాల్సిన అవసరం లేదు. గూగుల్ పే.. ఫోన్ పే సామాన్య జనం చెయ్యడం లేదా. అకౌంట్ లో డబ్బు వుంటే, దానికి ఏమన్నా ఎక్స్పర్ట్ కావాలా? పైసా ఆదాయం పెంచకుండా, పన్నులు పెంచి పెంచి, ఇక జనం తిరగబడే స్థితిలో.. ఇంకా మాకు ప్రజాభిమానం వుందని, అధికార జులుం వాడి, ఫోర్జరీ విత్ డ్రాల నుండి, బెదిరించి, లొంగదీసుకొని, దొంగ ఓట్లు వేయించుకుని, ఎక్కడికక్కడ బాధితులు రోడ్ల మీదకు వస్తే లాఠీఛార్జీలు చేసి భయపెట్టి, నిత్యం సమీక్షా సమావేశాలు అనే తంతుతో జరిపే కాలక్షేపం కథ కంచికి చేరడానికి పరిస్థితులు చివరి అంకానికి & పక్వానికి వచ్చాయి. యావత్తు దేశానికి ఎకనామికి టైమ్స్ వార్త ద్వారా ఆంధ్రా ఆర్థిక పతనం గురించి తెలుసు. తెలియనట్లు ఇక్కడ మనం నటిస్తున్నామంతే. ఎలా ఎగ్జిట్ అవుతారు అనేదే తేలాల్సివుంది. వైకాపా ప్రభుత్వాన్ని అలాగే వుంచి, కేంద్రం ఆదుకోవచ్చు కదా అని అమాయకంగా అనవచ్చు. బిజెపికి ఏమన్నా వెర్రా? ఈయన ఇన్నాళ్లూ తోపు అని ప్రచారం చేసుకొన్నాడు కదా, అంతే హీనంగా చరిత్రహీనుడు అయ్యేలా.. ఆయానతోనే మంగళం పాడించి, వైకాపా చాప చుట్టేస్తారు. అది తమ కథ ముగిస్తోంది అని వైకాపాకు తెలిసినా, కేసుల భయంతో తేలుకుట్టిన దొంగలా వుండక తప్పని పరిస్థితి. ఇసుక నుండి ప్రతి విషయంలో స్వయంకృతం. అత్త మీద కోపం దుత్త మీద అన్నట్లు, కేవలం చంద్రబాబు నాయుడు మీద ఇంకా అవాకులు చవాకులు పేలడం మినహా ఏమీ చేయలేని స్థితి. చెట్టు మీద నుండి పోతూ పోతూ దెయ్యం కొమ్మ విరిచినట్లు ఆంధ్రాను విరుస్తూ.. దానిని టిడిపి మీద పడేలా చేసి పోవడం తప్ప వేరే మార్గం ఆలోచించరు. గౌరవంగా కేంద్రం ఇవ్వాల్సింది ఇచ్చి ఆదుకోనందువలన, లక్డౌన్ గట్రా పరిస్థితుల్లో ముందుకు వెళ్లలేని స్థితి అని చెప్పి రాజీనామా చేసి వెళ్లే మార్గం ఎంచుకోవడానికి జగన్ మనస్తత్వం అంగీకరించదు. కేంద్రం రాష్ట్రపతి పాలన పెడితే నాయుడు బిజెపితో కలిసి కుట్ర చేశాడని సానుభూతి పొందడాన్ని ఎంచుకోవచ్చు. కానీ ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తురది ఎట్లన్నన్ దెప్పలుగ జెరువు నిండిన గప్పలు పదివేలు చేరు గదర సుమతీ అనే లెక్క అధికారం పోంగానే.. కొలువుల్లో చేరిన సాక్షి మంద కూడా అక్కడ వుండరు. రాష్ట్రపతి పాలనలో ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దుతూ, మరో వైపు బీజేపీలో చేరికలకు ద్వారాలు ఎత్తితే ఇక్కడ రెడ్డికి శిక్ష పడితే సీఎం అవదామనే ఆశావహుల నుండి అందరూ అటు జంప్ అవుతారు. కాంగ్రెస్ నుండి వచ్చిన ఓటు బ్యాంకు కొంత బిజెపి వైపు, మరికొంత టిడిపి వైపు, మిగిలినది కాంగ్రెస్ వైపు మరలుతుంది. ఇది తథ్యం.. వేరే మార్గం లేదు. హోల్ సేల్ గా ఎక్కడికక్కడ ఆస్తులు అమ్మాలి అంటే కోర్టుకు ఆంధ్రా దివాళా తీసింది అని అంగీకారాన్ని తెలపాలి. ఆ అంగీకారం ఆత్మహత్యా సదృశ్యం. ఎందుకంటే ఆ పరిస్థితులు ఎందుకు దాపురించాయి మీరు చక్కదిద్దుతారా లేదా ఆర్థిక ఎమెర్జెన్సీ కోసం రాష్ట్రపతికి అఫీషియల్ గా నివేదించండి అనే సలహా ఇవ్వవచ్చు. ఇలాగే కొనసాగాలి అంటే విద్య, వైద్య, ఆర్టీసీ, రోడ్లు & భవనాలు, ఎపిఐఐసి ఇలా అన్ని సంస్థల ఆస్తులు వేలాల ప్రక్రియ మొదలెట్టినా.. అగ్రీగోల్డ్ లెక్కన కొన్ని ఏళ్లు పడుతుంది. అంతవరకు అప్పుల కొండలు వేచి చూడరు. చేజేతులా అన్ని రత్నాలకు మంగళం పాడి, ఉద్యోగుల జీతాల నుండి తగ్గించుకోమని & అర్థం చేసుకోమని ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించే ధైర్యం, జగన్ రెడ్డికి లేదు. అలా ఆయనకు సలహా ఇచ్చేవారు పుట్టివుంటే లక్డౌన్ అప్పుడే, బటన్లు నొక్కడం వారించేవారు. అద్భుతాలు జరగవు. జనం వాస్తవాలు అంగీకరించక తప్పదు. తమ తప్పుడు నిర్ణయాలకు ప్రాయశ్చిత్తముగా, నవరత్నాలే కాదు, చాలా త్యాగాలు చెయ్యక తప్పదు. అనివార్యమైన ఈ పరిస్థితికి మానసికంగా సిద్ధపడక తప్పదు. CA Bosu Kancharla

Link to comment
Share on other sites

విజయవాడ చేరుకున్న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతినిధులు

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ ప్రతినిధులు ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. తమకు రావాల్సిన రెండు వేల కోట్ల రూపాయల బకాయిలను ఈ నెల ఆఖరిలోపు చెల్లించాలని, లేదంటే డిఫాల్టర్‌గా ప్రకటిస్తామని హెచ్చరించారు. తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు లేఖ రాశారు. కొద్దిసేపటి క్రితం ఐదుగురు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. బకాయిల అంశంపై చర్చించేందుకు ఉన్నతాధికారులను బుధవారం కలవనున్నారు. సీఎం జగన్‌తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Link to comment
Share on other sites

19 minutes ago, Anil013 said:

విజయవాడ చేరుకున్న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతినిధులు

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ ప్రతినిధులు ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. తమకు రావాల్సిన రెండు వేల కోట్ల రూపాయల బకాయిలను ఈ నెల ఆఖరిలోపు చెల్లించాలని, లేదంటే డిఫాల్టర్‌గా ప్రకటిస్తామని హెచ్చరించారు. తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు లేఖ రాశారు. కొద్దిసేపటి క్రితం ఐదుగురు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. బకాయిల అంశంపై చర్చించేందుకు ఉన్నతాధికారులను బుధవారం కలవనున్నారు. సీఎం జగన్‌తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

orini.. ilaantidi eppudaina jarigindaa history lo? nenu eppudu choodalaa? paruvu teestannaaru kadara Jaffas .. :wall:

Link to comment
Share on other sites

Just now, Narendra1 said:

orini.. ilaantidi eppudaina jarigindaa history lo? nenu eppudu choodalaa? paruvu teestannaaru kadara Jaffas .. :wall:

vacchi nollaki jaggadu vedantam chebutadu .  anta midhya ani Adi shankara charya range lo advytha siddatanni bodhistadu. 

Vallu kadhu ante, vallani bathroom loki nedatadu. 

Link to comment
Share on other sites

On 11/15/2021 at 4:45 AM, Venkatpaladugu said:

లాండ్ టాక్స్ పెంచిన..కూడ సరిపోదు..

Definitely..central only can save ..or else handsup..

Dec వరకు ok..Jan,Feb March months are crucial..

Ivvala paper chudandi.. asti Pannu pempu ani..

Nxt Tg lo kuda implement chestunnaru..

Link to comment
Share on other sites

ఈ రాష్ట్రానికి ఎక్కడా అప్పు పుట్టడం లేదని.. వేల కోట్లు అప్పులిచ్చినవాళ్లు వస్తుంటే.. కనీస మర్యాదైనా పాటించకుండా నిర్లక్ష్యంగా, అంటీముట్టనట్లుగా వ్యవహరించడమేంటని ఆశ్చర్య ం వ్యక్తమవుతోంది. ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీ ఇంతవరకు రాష్ట్రానికి రూ.వేల కోట్ల అప్పులిచ్చాయి. ఇకపై ఇచ్చే సంకేతాలు లేకపోవడంతో ఇక వాళ్లతో అవసరం ఏముందిలేనని భావించి సీఎం నుంచి అధికారుల వరకు ఇలా వ్యవహరిస్తున్నారని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...