Jump to content

సెక్షన్ 41(ఏ)


goldenstar

Recommended Posts

ఆకివీడు SHO కి 15 రోజుల జైలు శిక్ష కాబట్టి పోలీస్ స్టేషన్ నుంచి ఎవరైనా మీకు CI, SI పిలుస్తున్నారు రమ్మనమని మీకు ఎవరైనా కాల్ చేసినా భయపడకుండా వెంటనే సెక్షన్ 41(ఏ) కింద నోటీసు ఇస్తే నేను హాజరవుతానని చెప్పండి నోటీస్ అందుకొని అప్పుడు నిర్భయంగా మనం హాజరు కావచ్చు

Link to comment
Share on other sites

*అమరావతి (హైకోర్టు)*

_*తెదేపా నేత పట్టాభి విషయంలో వివరాలు సమర్పించండి*_

*తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభి అరెస్ట్ వ్యవహారంపై 41ఏ నోటీసు తదితర విషయాలపై మెజిస్ట్రేట్ సంతృప్తి చెందకపోయినా.. రిమాండ్కు ఎలా అనుమతిచ్చారని హైకోర్టు ప్రశ్నించింది.*

*- పట్టాభికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించింది.*

★ తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అరెస్టు విషయంలో పోలీసులు న్యాయస్థానం ముందు ఉంచిన 41ఏ నోటీసు తదితర విషయాలపై మేజిస్ట్రేట్‌ సంతృప్తి చెందకపోయినా.. రిమాండుకు ఎలా అనుమతి ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. 

★ పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసుల తరఫు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) శ్రీనివాసరెడ్డిని ఆదేశించింది. 

★ బెయిలు పిటిషన్‌పై శనివారం విచారిస్తామని తెలిపింది. 

★ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత శుక్రవారం ఈ మేరకు స్పష్టం చేశారు. 

★ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై దూషణల కేసులో పట్టాభిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, మేజిస్ట్రేట్‌ ఆయనకు నవంబరు 2 వరకు రిమాండ్‌ విధించారు.

★ శుక్రవారం హైకోర్టు ప్రారంభం కాగానే పట్టాభిరామ్‌ తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు.. బెయిలు పిటిషన్‌పై అత్యవసరంగా (లంచ్‌మోషన్‌) విచారణ జరపాలని న్యాయమూర్తిని కోరారు. 

★ పోలీసులు నమోదు చేసిన కొన్ని సెక్షన్లు చెల్లుబాటు కావన్నారు. 

★ సీఆర్‌పీసీ 41ఏ ప్రకారం ముందుగా నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలన్నారు. 

★ 41ఏ నోటీసులో ఖాళీలపై మేజిస్ట్రేట్‌ అభ్యంతరం తెలిపి, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని దర్యాప్తు అధికారిని ఆదేశించారన్నారు. 

★ న్యాయమూర్తి స్పందిస్తూ.. రిమాండ్‌లోని అంశాలతో సంతృప్తి చెందకపోయినా మేజిస్ట్రేట్‌ రిమాండుకు ఎలా అనుమతి ఇచ్చారని పీపీని ప్రశ్నించారు. 

★ పీపీ బదులిస్తూ రికార్డులన్నీ దిగువ కోర్టులో ఉన్నాయని, వివరాలు సమర్పించేందుకు సమయం కావాలన్నారు. 

★ అందుకు అంగీకరించిన న్యాయమూర్తి.. ఈ వ్యవహారంపై శనివారం విచారణ జరుపుతామన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...