Jump to content

Pattabhi Bail update veyandi


gnk@vja

Recommended Posts

ఇటీవల సీఎం జగన్ ను దూషించిన కేసులో అరెస్టయిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి బెయిల్ మంజూరైంది. పట్టాభి బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న పిమ్మట పట్టాభికి బెయిల్ ఇస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. పట్టాభి ప్రస్తుతం రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు

Link to comment
Share on other sites

  • Replies 60
  • Created
  • Last Reply

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. పట్టాభిరామ్‌ ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విజయవాడ గవర్నర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో బుధవారం రాత్రి విజయవాడ పటమటలోని ఆయన ఇంటివద్ద పోలీసులు హైడ్రామా నడుమ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం పట్టాభిని విజయవాడ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. అదే రోజు రాత్రి మచిలీపట్నం జైలుకు తరలించి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించిన అనంతరం మరుసటి రోజు అక్కడి నుంచి రాజమహేంద్రవరం జైలు తరలించారు.

Link to comment
Share on other sites

పోలీసులు ఓవరాక్షన్ తగ్గించుకోవాలన్న జడ్జి, 41 సీఆర్పీసీ సమాధానం రాకుండానే ఎందుకు అరెస్టు చేసారని ప్రశ్నించిన హైకోర్టు. రూల్ ఆఫ్ లా కు సీఎం ఎక్కువ కాదన్న న్యాయమూర్తి.
 
Link to comment
Share on other sites

1 hour ago, Siddhugwotham said:
పోలీసులు ఓవరాక్షన్ తగ్గించుకోవాలన్న జడ్జి, 41 సీఆర్పీసీ సమాధానం రాకుండానే ఎందుకు అరెస్టు చేసారని ప్రశ్నించిన హైకోర్టు. రూల్ ఆఫ్ లా కు సీఎం ఎక్కువ కాదన్న న్యాయమూర్తి.
 

constitutional head anta, vaadi M..

vadiki vade ekkada leni powers ichesukodam… idi perfect example what he feels of himself..

Link to comment
Share on other sites

28 minutes ago, surendra.g said:

Legal support ivvaledu ani edchinattu vunnaru!! Ikkada varu avaru kanapadatlede!!?

 

aa edupu edisthe… evari sayam vallu chesthe ee bail vachindemo …kada?

madhyalo deny kuda ayindanukunta… apudu idhe dialogue sepithiri aa

 

Link to comment
Share on other sites

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ రాజమహేంద్రవరం జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. హైకోర్టు  ఇవాళ పట్టాభికి బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో పట్టాభిని   బుధవారం రాత్రి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Link to comment
Share on other sites

*అమరావతి (హైకోర్టు)*

_*తెదేపా నేత పట్టాభి విషయంలో వివరాలు సమర్పించండి*_

*తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభి అరెస్ట్ వ్యవహారంపై 41ఏ నోటీసు తదితర విషయాలపై మెజిస్ట్రేట్ సంతృప్తి చెందకపోయినా.. రిమాండ్కు ఎలా అనుమతిచ్చారని హైకోర్టు ప్రశ్నించింది.*

*- పట్టాభికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించింది.*

★ తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అరెస్టు విషయంలో పోలీసులు న్యాయస్థానం ముందు ఉంచిన 41ఏ నోటీసు తదితర విషయాలపై మేజిస్ట్రేట్‌ సంతృప్తి చెందకపోయినా.. రిమాండుకు ఎలా అనుమతి ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. 

★ పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసుల తరఫు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) శ్రీనివాసరెడ్డిని ఆదేశించింది. 

★ బెయిలు పిటిషన్‌పై శనివారం విచారిస్తామని తెలిపింది. 

★ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత శుక్రవారం ఈ మేరకు స్పష్టం చేశారు. 

★ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై దూషణల కేసులో పట్టాభిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, మేజిస్ట్రేట్‌ ఆయనకు నవంబరు 2 వరకు రిమాండ్‌ విధించారు.

★ శుక్రవారం హైకోర్టు ప్రారంభం కాగానే పట్టాభిరామ్‌ తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు.. బెయిలు పిటిషన్‌పై అత్యవసరంగా (లంచ్‌మోషన్‌) విచారణ జరపాలని న్యాయమూర్తిని కోరారు. 

★ పోలీసులు నమోదు చేసిన కొన్ని సెక్షన్లు చెల్లుబాటు కావన్నారు. 

★ సీఆర్‌పీసీ 41ఏ ప్రకారం ముందుగా నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలన్నారు. 

★ 41ఏ నోటీసులో ఖాళీలపై మేజిస్ట్రేట్‌ అభ్యంతరం తెలిపి, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని దర్యాప్తు అధికారిని ఆదేశించారన్నారు. 

★ న్యాయమూర్తి స్పందిస్తూ.. రిమాండ్‌లోని అంశాలతో సంతృప్తి చెందకపోయినా మేజిస్ట్రేట్‌ రిమాండుకు ఎలా అనుమతి ఇచ్చారని పీపీని ప్రశ్నించారు. 

★ పీపీ బదులిస్తూ రికార్డులన్నీ దిగువ కోర్టులో ఉన్నాయని, వివరాలు సమర్పించేందుకు సమయం కావాలన్నారు. 

★ అందుకు అంగీకరించిన న్యాయమూర్తి.. ఈ వ్యవహారంపై శనివారం విచారణ జరుపుతామన్నారు.

Link to comment
Share on other sites

2 hours ago, Nfdbno1 said:

 

aa edupu edisthe… evari sayam vallu chesthe ee bail vachindemo …kada?

madhyalo deny kuda ayindanukunta… apudu idhe dialogue sepithiri aa

 

Appudu memu telisi teliyakunda am vaaga ledu... Vaagina vallanu adigite anduku vaagaledu ani adugutunnanu!! Bhale logic le!!!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...