Jump to content

Pattabhi Bail update veyandi


gnk@vja

Recommended Posts

  • Replies 60
  • Created
  • Last Reply

తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను తోట్లవల్లూరు పీఎస్‌ నుంచి విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు సాయంత్రం కోర్టులో హాజరుపర్చారు. ఈసందర్భంగా పట్టాభికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పట్టాభిపై గతంలోనే అనేక కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పట్టాభికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. అంతకు ముందు ప్రభుత్వాసుపత్రిలో పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించారు. సీఎం జగన్‌పై పట్టాభి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య ఆయనను నిన్న రాత్రి 10 గంటలకు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Link to comment
Share on other sites

తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరికి మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. తెదేపా కార్యాలయంపై దాడి జరిగిన రోజు అక్కడికి వెళ్లిన తనను నిర్బంధించారని ఆర్‌.ఐ సక్రూనాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయగా ... అందులో బ్రహ్మం చౌదరి ఏ6గా ఉన్నారు. బుధవారం రాష్ట్ర బంద్‌ సందర్భంగా ఉండవల్లిలో ఆందోళన చేస్తున్న బ్రహ్మం చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారమంతా జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తిప్పారు. ఇవాళ ఉదయం మంగళగిరి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. మధ్యాహ్నం మంగళగిరి కోర్టులో హాజరు పర్చారు. అరెస్టు అనంతరం పోలీసులు తనను తీవ్రంగా దూషించారని, మేడికొండూరు సీఐ మారుతీ కృష్ణ కొట్టారని బ్రహ్మం చౌదరి న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. అనంతరం బ్రహ్మం చౌదరికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో గుంటూరు సబ్‌ జైలుకు తరలించారు.

Link to comment
Share on other sites

50 minutes ago, fan no 1 said:

Mukul Rahtogi ni jilla courts ki testunnada mee Jagan anna?

when RRR was arrested, guntur police took him to tihar jail? 

 

have you heard of Supreme Court Advocate Adinarayana Rao, who worked alongside Rohatgi?

Link to comment
Share on other sites

1 hour ago, goldenstar said:

తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరికి మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. తెదేపా కార్యాలయంపై దాడి జరిగిన రోజు అక్కడికి వెళ్లిన తనను నిర్బంధించారని ఆర్‌.ఐ సక్రూనాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయగా ... అందులో బ్రహ్మం చౌదరి ఏ6గా ఉన్నారు. బుధవారం రాష్ట్ర బంద్‌ సందర్భంగా ఉండవల్లిలో ఆందోళన చేస్తున్న బ్రహ్మం చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారమంతా జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తిప్పారు. ఇవాళ ఉదయం మంగళగిరి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. మధ్యాహ్నం మంగళగిరి కోర్టులో హాజరు పర్చారు. అరెస్టు అనంతరం పోలీసులు తనను తీవ్రంగా దూషించారని, మేడికొండూరు సీఐ మారుతీ కృష్ణ కొట్టారని బ్రహ్మం చౌదరి న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. అనంతరం బ్రహ్మం చౌదరికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో గుంటూరు సబ్‌ జైలుకు తరలించారు.

 

1 hour ago, Siddhugwotham said:

Brahmam got bail...

Which one correct?

Link to comment
Share on other sites

1 minute ago, goldenstar said:

Worst behavior of police. I hope tdp will go aggressive and remove them from jobs.

Man handle chese untaru brahmmanni

Tuglaq gadu Pattabhini kuda kottamani untadu 

Power Loki vachaka Out right ruthless ga suspend cheyakapothe power Loki vachi waste 

TDP workers life sacrifice chesedi deniki 

Link to comment
Share on other sites


పట్టాభి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
విజయవాడ: టీడీపీ నేత పట్టాభిని అరెస్ట్ చేయడానికి గల కారణాలను పోలీసులు వెల్లడించారు. పట్టాభిని అరెస్ట్ చేయకపోతే ఆయన మరింత బెదిరింపులు దిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. పట్టాభి వ్యాఖ్యల ద్వారా ప్రజల ప్రశాంతతకు భంగం కలుగుతుందని తెలిపారు. పట్టాభిని అరెస్ట్ చేయకపోతే రాజకీయ బలంతో ఫిర్యాదుదారుడిని ఇతర సాక్షులను బెదిరించి ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పారు. పట్టాభి రాజకీయ మైలేజీని పొందాలనే ఉద్దేశ్యంతో నేరపూరిత చర్యలను కొనసాగించవచ్చన్నారు. పట్టాభి వ్యాఖ్యల వల్ల ప్రజల ప్రశాంతతకు భంగం కలుగుతుందని తెలిపారు. 

Link to comment
Share on other sites

AP News: మేజిస్ట్రేట్‌ రిమాండ్‌కు ఎలా ఇచ్చారు? 

తెదేపా నేత పట్టాభి విషయంలో వివరాలు సమర్పించండి

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అరెస్టు విషయంలో పోలీసులు న్యాయస్థానం ముందు ఉంచిన 41ఏ నోటీసు తదితర విషయాలపై మేజిస్ట్రేట్‌ సంతృప్తి చెందకపోయినా.. రిమాండుకు ఎలా అనుమతి ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసుల తరఫు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) శ్రీనివాసరెడ్డిని ఆదేశించింది. బెయిలు పిటిషన్‌పై శనివారం విచారిస్తామని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత శుక్రవారం ఈ మేరకు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై దూషణల కేసులో పట్టాభిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, మేజిస్ట్రేట్‌ ఆయనకు నవంబరు 2 వరకు రిమాండ్‌ విధించారు.

శుక్రవారం హైకోర్టు ప్రారంభం కాగానే పట్టాభిరామ్‌ తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు.. బెయిలు పిటిషన్‌పై అత్యవసరంగా (లంచ్‌మోషన్‌) విచారణ జరపాలని న్యాయమూర్తిని కోరారు. పోలీసులు నమోదు చేసిన కొన్ని సెక్షన్లు చెల్లుబాటు కావన్నారు. సీఆర్‌పీసీ 41ఏ ప్రకారం ముందుగా నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలన్నారు. 41ఏ నోటీసులో ఖాళీలపై మేజిస్ట్రేట్‌ అభ్యంతరం తెలిపి, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని దర్యాప్తు అధికారిని ఆదేశించారన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. రిమాండ్‌లోని అంశాలతో సంతృప్తి చెందకపోయినా మేజిస్ట్రేట్‌ రిమాండుకు ఎలా అనుమతి ఇచ్చారని పీపీని ప్రశ్నించారు. పీపీ బదులిస్తూ రికార్డులన్నీ దిగువ కోర్టులో ఉన్నాయని, వివరాలు సమర్పించేందుకు సమయం కావాలన్నారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి.. ఈ వ్యవహారంపై శనివారం విచారణ జరుపుతామన్నారు.

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి పట్టాభి

రాజమహేంద్రవరం నేరవార్తలు, న్యూస్‌టుడే: పట్టాభిరామ్‌ను శుక్రవారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. మచిలీపట్నం జిల్లా కారాగారంలో ఉన్న పట్టాభిరామ్‌ను కొవిడ్‌ పరీక్ష నెగెటివ్‌ రావడంతో విజయవాడ పోలీసులు శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఓ వ్యానులో తీసుకొచ్చి, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం అధికారులకు అప్పగించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...