Jump to content

మాంటిస్సోరీ స్కూల్‌ మూసివేత


rajanani

Recommended Posts

విద్యార్థుల తల్లిదండ్రులకు నోటీసులు జారీ

టీసీలు తీసుకెళ్లాలన్న యాజమాన్యం

జిల్లావ్యాప్తంగా 435 పాఠశాలలది ఇదే పరిస్థితి

ఆంధ్రజ్యోతి-విజయవాడ): టీచర్లను ప్రభుత్వం తీసుకుంటున్నందున పాఠశాలను పూర్తిగా మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించినట్లు నగరంలోని చిల్డ్రన్స్‌ మాంటిస్సోరి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, కరస్పాండెంట్లు తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారమిస్తూ గురువారం నోటీసు జారీ చేశారు. విద్యార్థులు టీసీలు తీసుకుని వెంటనే సమీపంలోని పాఠశాలల్లో చేరాలని సూచించారు. 

ఆరున్నర దశాబ్దాలకు పైగా చరిత్రను సంతరించుకున్న ప్రతిష్టాత్మక మాంటిస్సోరి స్కూల్‌ మూసివేత నిర్ణయంతో ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ ఒక్క స్కూలే కాదు.. జిల్లావ్యాప్తంగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 435 ఎయిడెడ్‌ పాఠశాలలు మూతపడుతున్నాయి. ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులంతా ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను, వాటిలో పనిచేస్తున్న సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్‌ చేయాలనే ఆదేశాల వల్ల ఎయిడెడ్‌ పాఠశాలలే కాదు.. నగరంలోని సిద్ధార్థ, శారద, శాతవాహన, కేబీఎన్‌ తదితర ఎయిడెడ్‌ కళాశాలలూ మూతపడే పరిస్థితులు నెలకొన్నాయి. లయోల, స్టెల్లా తదితర ఒకటి, రెండు విద్యాసంస్థలు తమ సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకరించనప్పటికీ ఎక్కువమంది మాత్రం అంగీకారం తెలిపారు. 

పేద విద్యార్థులకు కష్టాలే..

ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలలు మూతబడటం, మిగిలినవి ప్రైవేట్‌ విద్యాసంస్థలుగా మారిపోవడం వల్ల ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు. దాదాపు 15 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరంలో ఏటా 6వేల నుంచి 7వేల మందికి పైగా విద్యార్థులు పాఠశాల విద్యను పూర్తిచేసుకుని నగరంలోని ఎయిడెడ్‌ కళాశాలల్లో డిగ్రీ కోర్సుల్లో చేరుతుంటారు. ఒక్కో కళాశాలలో 500 నుంచి 1,500 మంది వరకు విద్యార్థులు కొత్తగా చేరుతుంటారు.

ప్రస్తుతం ఉన్న ఎయిడెడ్‌ విద్యాసంస్థలు మూతబడటమో లేదా ప్రైవేట్‌ సంస్థలుగా మారిపోవడమో జరిగితే ఫీజులు పెరిగిపోతాయి. అవి పేద, మధ్యతరగతి విద్యార్థులకు భారంగా మారతాయి. ఇలాంటి వారందరికీ ఎస్‌ఆర్‌ఆర్‌-సీవీఆర్‌ ప్రభుత్వ కళాశాల ఒక్కటే దిక్కు. ఇప్పటికే విజయవాడ చుట్టుపక్కల నుంచి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ కళాశాల ఒక్కటే ఆధారంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం నగరంలో కనీసం నాలుగైదు ప్రభుత్వ కళాశాలలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఈ దిశగా ప్రతినిధులు కృషి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

Link to comment
Share on other sites

Just now, Hello26 said:

This is how state can be put back into 70s. 

So Kuuli paniki velle vallu veltharu.. ituka paniki velle vallu veltharu.. Chaduvukunna kontha mandhi out of states lo settle avutaru.. Aa kuuli pani chesukune valaki kanukalu isthu vote bank penchukuntaru.. 

 

Link to comment
Share on other sites

14 minutes ago, gnk@vja said:

Siddhartha colleges sites chala manchi area lo unnai . Vatini kuda teesukuntara enti . They come under Siddhartha academy  . 

PB Siddhartha site is not own, it is on lease and owned by Durga temple 

but aided lecturers chala mandi unnaru vallani motham tesesaru maa sir okayana papam badha padata fblo post pettaru eppatinunchi kalisi work chesina colleagues potunnaru ani

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...