Jump to content

అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేస్ కొట్టేసిన హై కోర్టు


rajanani

Recommended Posts

అమరావతి: జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, మరికొందరిపై..ఇన్‌సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన కేసులను గురువారం హైకోర్టు కొట్టేసింది. దమ్మాలపాటి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ అవినీతి చట్టంకింద ఆయనపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇటీవల ఈకేసు విచారణకు రాగా.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనేది ఎక్కడ జరగలేదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్ధిస్తూ.. ఈ కేసును నెల రోజుల్లో విచారణ చేయాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది. 

దీంతో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఏపీ ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంది. ఈకేసుకు సంబంధించి హైకోర్టులో గత నెలరోజులుగా వాదనలు జరిగాయి. అనంతరం తీర్పును రిజర్వు చేసింది. గురువారం జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ బెంచ్ ముందు కేసుల విచారణ జరిగింది. దమ్మాలపాటితో పాటు ఆయన బంధువులు, కుటుంబీకులపై చేసిన ఆరోపణలు నిరాధారమని, ఎక్కడా రుజువులు లేవని న్యాయస్థానం పేర్కొంటూ కేసులను కొట్టేసింది. అలాగే ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. దమ్మాలపాటిపై అన్యాయంగా కేసులు పెట్టి మానసిక వేదనకు గురిచేసినందుకు ఆయన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Link to comment
Share on other sites

54 minutes ago, rajanani said:

దమ్మాలపాటిపై అన్యాయంగా కేసులు పెట్టి మానసిక వేదనకు గురిచేసినందుకు ఆయన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...