Jump to content

Secrets of Simla Tour


Recommended Posts

పైపైన అంతా మామూలుగానే క‌నిపిస్తుంది. కానీ, లోలోన అంతుచిక్క‌ని మిస్ట‌రీ దాగుంటుంది. రాజ‌కీయాల్లో ఇది మ‌రింత ఖ‌త‌ర్నాక్‌గా సాగుతుంది. పైపైన‌ చూస్తే మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసిన‌ట్టే అనిపిస్తుంది. స‌ర‌దాగా గ‌డ‌ప‌టానికే అన్న‌ట్టు ఉంటుంది. కానీ, లోలోన ఎవ‌రూ ఊహించ‌ని ప‌రిణామాల‌కు శ్రీకారం ప‌డుతుంది. ఫోటోల్లో శాలువాలు, జ్ఞాపికలు మాత్ర‌మే  క‌నిపిస్తాయి. లోన విందు రాజ‌కీయం ఎవ‌రి కంటాప‌డ‌దు. ప్ర‌క‌ట‌న‌లో సేద తీర‌డానికేన‌ని ఉంటుంది. లోయ‌ల్లో జ‌రిగే ఫ్యామిలీ సీక్రెట్ మీటింగ్స్ సారాంశం బ‌య‌ట‌కు పొక్క‌దు. మంచులా అక్క‌డే క‌రిగిపోతుంది. కానీ.. ప్ర‌తీసారీ ఇలా మేట‌ర్ ర‌హ‌స్యంగానే ఉండ‌దు. ఇలా అత్యంత విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల ద్వారా స‌మాచారం అప్పుడ‌ప్పుడు బ‌య‌ట‌ప‌డుతుంది. అదే ఈ షాకింగ్ న్యూస్‌...
పాయింట్ నెంబ‌ర్ 1 : గ‌త‌వారం కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి తాడేప‌ల్లి ప్యాలెస్‌లో సీఎం జ‌గ‌న్‌ను క‌లిశారు. విందు రాజ‌కీయంలో కీల‌కాంశాలు చ‌ర్చించారు. 

పాయింట్ నెంబ‌ర్ 2 : సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వారం రోజుల ప‌ర్య‌ట‌న కోసం సిమ్లా వెళ్లారు. కుటుంబంతో క‌లిసి మంచుకొండ‌ల్లో సేద తీరుతున్నారు.

ఈ రెండూ పైపైన చూస్తే ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేని అంశాలు అనిపించ‌వ‌చ్చు. ఇలానే ఉంటుంది రాజ‌కీయం. కానీ, ఈ రెండు ప‌రిణామాల‌కు చాలా చాలా లింక్ ఉంద‌ని తెలుస్తోంది. కిష‌న్‌రెడ్డితో మీటింగ్ త‌ర్వాతే జ‌గ‌న్ సిమ్లా టూర్ క‌న్ఫామ్ కావ‌డం కాక‌తాళీయం కానేక‌ద‌ని అంటున్నారు. ఆ రెండింటి లింకు లాగితే సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ఆ సిమ్లా టూర్ భ‌విష్య‌త్ రాజ‌కీయ ప‌రిణామాల‌ను అమాంతం మార్చేయ‌వ‌చ్చు.

గ‌తంలో కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రిగా చేశారు కిష‌న్‌రెడ్డి. జ‌స్ట్.. కొన్ని వారాల కింద‌రే ఆ శాఖ నుంచి మారిపోయారు. ఇన్నాళ్లూ హోంమంత్రి అమిత్‌షాతో క‌లిసి ప‌నిచేశారు. ఆ శాఖ‌లో జ‌రుగుతున్న ప్ర‌తీ విష‌యం పాయింట్ టు పాయింట్ కిష‌న్‌రెడ్డికి తెలుసు. అదే తీరున సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల గుట్టు కూడా ఆయ‌న‌కు బాగానే తెలుసు. అందుకే భ‌విష్య‌త్‌లో జ‌రగబోయే అవ‌కాశం ఉన్న ప‌రిణామాల‌పై సీఎం జ‌గ‌న్‌రెడ్డికి ఆయన జోస్యం చెప్పార‌ని తెలుస్తోంది. జ‌గ‌న్ ఫ్యూచ‌ర్‌ను తెరిచిన పుస్త‌కంలా చూపించార‌ట‌. కేంద్రం త‌ర‌ఫున‌ జ‌గ‌న్‌రెడ్డికి మ‌రెంతో కాలం స‌హాయస‌హకారాలు అందే ప‌రిస్థితి లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టే చెప్పార‌ట‌. గ‌తంలో ఎన్వీ ర‌మ‌ణ సీజేఐ కాకుండా అడ్డుకొనే ప్ర‌య‌త్నం చేసి జ్యుడీషియ‌రీ విష‌యంలో ఎంత త‌ప్పిదం చేశారో కూడా గుర్తు చేశార‌ట‌.

సీబీఐ, ఈడీ ఉచ్చు ఎంత గ‌ట్టిగా బిగిసిందో వివ‌రించార‌ట‌. విజ‌య్ మాల్యా, నీర‌వ్ మోదీ, చోక్సీల ఘటనలను జగన్ రెడ్డికి గుర్తు చేశారట.ఈడీ కేసుల తర్వాత వాళ్ల పరిస్థితి ఏంటో, వాళ్లు ఏం చేశారో పూసగుచ్చినట్లు చెప్పారట. అన్నీ సైలెంట్‌గా విన్న జ‌గ‌న్‌..ఆ విషయాలపై కుటుంబ సభ్యులతో చర్చించడానికే అప్ప‌టిక‌ప్పుడు సిమ్లా టూర్ ప్లాన్‌ వేశార‌ని అంటున్నారు. అది పేరుకే ఫ్యామిలీ ట్రిప్ కానీ.. అస‌లు సంగ‌తి వేరే ఉంద‌ని అంటున్నారు.....ప్ర‌స్తుతం భార్య భార‌తి రెడ్డితో క‌లిసి సిమ్లాలో ఉన్నారు సీఎం జ‌గ‌న్‌. అయితే ఇక్క‌డ మ‌రో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. రేపేమాపో త‌ల్లి విజ‌య‌మ్మ‌, చెల్లి ష‌ర్మిల సైతం సిమ్లాలో జ‌గ‌న్‌తో జాయిన్ అవుతార‌ని స‌మాచారం. కొన్ని రోజులుగా జగన్ తో షర్మిలకు విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అన్నమీద కోపంతోనే తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టారనే వాదన ఉంది. అదే సమయంలో అన్న చెల్లెలు లోలోపల సఖ్యతగానే ఉంటూ.. పైకి మాత్రం గొడవలు ఉన్నట్లుగా రాజకీయ డ్రామా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ను కలిసేందుకు షర్మిల వెళుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. త‌ల్లి, చెల్లి, భార్య‌కు త‌న భ‌విష్యత్ కార్య‌చ‌ర‌ణ వివ‌రించి.. వారితో మ‌రింత చ‌ర్చించి.. ఓ అవ‌గాహ‌న‌కు రావాల‌నే ఏపీ సీఎం జగన్ రెడ్డి.. స‌డెన్‌గా ఈ సిమ్లా టూర్ ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. అక్ర‌మాస్తుల కేసులో త‌న‌కు  జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉండ‌టంతో.. అదే జరిగితే ఏం చేయాలనే దానిపై  కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మేధోమ‌ధ‌నం చేస్తార‌ట‌ జగన్. తన ఆస్తులు, వ్యాపారాల విషయంలోనూ చర్చలు జరుపుతారని అంటున్నారు. అన్ని అంశాల‌పై ఫ్యామిలీతో చ‌ర్చించి.. క్లారిటీ తెచ్చుకోవ‌డ‌మే జ‌గ‌న్‌రెడ్డి సిమ్లా టూర్ ల‌క్ష్య‌మ‌ని అంటున్నారు. సిమ్లాలో జగన్ ఫ్యామిలికి పవర్ ప్లాంట్ లు ఉన్నాయని, వాటికి సంబంధించిన గెస్ట్ హౌజ్ లోనే ప్రస్తుతం జగన్ మకాం చేశారని అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమచారం. మొత్తానికి ఫ్యామిలి ట్రిప్ అని చెబుతున్న ఏపీ సీఎం జగన్ రెడ్డి సిమ్లా పర్యటన వెనుక పెద్ద కథే ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది...

Link to comment
Share on other sites

3 hours ago, kalyan babu said:

Enti e secret discussions lo palace kompa lo cheileda, inthoti danike Shimla ke povala. Ekada nunchi Testaru sami.

Inka nayam Vijaysai reddy oversees ke veli tirgiradu analedu.

ante Tadepalli lo unte every day activities untayi kadha. some one or other will always come to meet CM. Also, are you expecting Sharmila to join him in Tadepalli ? If the discussion needs Sharmila, then definetely Shimla is a good choice.

Link to comment
Share on other sites

6 hours ago, kalyan babu said:

Inka nayam Vijaysai reddy oversees ke veli tirgiradu analedu.

 

Visa Reddy foreign tour ki velli a taruvata, if situations  turn different, he will not come back. andulo vinta emi undi. 
 

not just now, even future vadu Vijay Malya / Nirav modi laga escape avutadu. No second question about it

Link to comment
Share on other sites

7 hours ago, Bittu_77 said:

Visa Reddy foreign tour ki velli a taruvata, if situations  turn different, he will not come back. andulo vinta emi undi. 
 

not just now, even future vadu Vijay Malya / Nirav modi laga escape avutadu. No second question about it

too much le saami opinions. I don't think it will happen.

Link to comment
Share on other sites

9 hours ago, Bittu_77 said:

Visa Reddy foreign tour ki velli a taruvata, if situations  turn different, he will not come back. andulo vinta emi undi. 
 

not just now, even future vadu Vijay Malya / Nirav modi laga escape avutadu. No second question about it

You are ignoring that fact that BJP is hand in glove with YCP! Oka broody hen entha careful ga eggs poduguthundooo….. Modi and Shaw are protecting Jagan! 
 

vellu malleeee desam dharmam antu sollu vakyaaaalu cheptaaaaru in return!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...