Jump to content

gorantla buchaiah resigning from tdp


ravindras

Recommended Posts

గోదావరి జిల్లాల్లో టీడీపీకి ఊహించని షాక్.. ఎమ్మెల్యే రాజీనామా..!

అమరావతి : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు నుంచే మొదలైన నేతల జంపింగ్‌లు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అసలు ఎప్పుడు ఏ నేత.. ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. ఊహించని రీతిలో సీట్లు దక్కించుకుని అధికారంలోకి వచ్చిన వైసీపీలోకి పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీలు, కీలక నేతలు జంప్ అయ్యారు. ఇంకొందరు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనప్పటికీ వారి కుటుంబ సభ్యులను పార్టీలో చేర్చి.. అధికార పార్టీకి మద్దతిస్తూ వస్తున్నారు. అంతేకాదు.. తామంతా రాజీనామాకు కూడా సిద్ధంగా ఉన్నట్లు అనేక సార్లు ప్రకటనలు కూడా చేశారు. అయితే.. ఈ వరుస షాకుల నుంచి తెలుగుదేశం పార్టీ తేరుకోక ముందే మరో ఊహించని షాక్ తగలబోతోంది.

కారణం ఇదేనా...!?

గోదావరి జిల్లాల్లో ఇప్పటికే పలువురు సిట్టింగ్‌లు వైసీపీ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా మరో సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి గుడ్ బై చెప్పేయడానికి సిద్ధమైపోయారు. రెండు మూడ్రోజుల్లో శాసన సభ్యత్వానికి, టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ తీరుపై బుచ్చయ్య తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలియవచ్చింది. సీనియర్లను హైకమాండ్ అవమానిస్తోందని బుచ్చయ్య ఆవేదనకు లోనైనట్లు సమాచారం. తన లాంటి సీనియర్ నేత ఫోన్‌ను కూడా తండ్రీకొడుకు (నారా చంద్రబాబు, నారా లోకేష్) అటెండ్ చేయట్లేదని ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని తెలుస్తోంది.

వైసీపీలోకేనా...!?

అయితే.. బుచ్యయ్య పార్టీకి రాజీనామా  చేయలేదు. ఒకవేళ పార్టీ పెద్దలు బుజ్జగిస్తే వెనక్కి తగ్గుతారా..? లేకుంటే రాజీనామా చేసేసి పార్టీ మారిపోతారా..? అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ రాజీనామా చేసేస్తే రాష్ట్రం అధికారంలో ఉన్న వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా..? లేకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా..? అనేది తెలియాలి. వాస్తవానికి వైసీపీపై మొదట్లో బుచ్చయ్య.. తీవ్ర స్థాయిలో అటు మీడియా ముందు.. ఇటు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రశ్నాస్త్రాలు సంధిస్తుండే వారు. గత మూడు నాలుగు నెలలుగా ఆయన టీడీపీ కార్యక్రమాల్లో కానీ.. అధికార పార్టీ గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. దీన్ని బట్టి చూస్తే బుచ్చయ్య కచ్చితంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఏదేమైనా రెండు మూడ్రోజుల్లో బుచ్చయ్య వ్యవహారం ఓ కొలిక్కి రానుంది.

Link to comment
Share on other sites

  • Replies 198
  • Created
  • Last Reply

తెదేపాకు రాజీనామా చేయనున్నారంటూ గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ సీనియర్‌ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సరిగా స్పందించలేదు. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు గురువారం ఆయన నివాసం వద్ద ప్రశ్నించగా దానిపై ఇప్పుడేమీ మాట్లాడనని చెప్పారు. పార్టీలో సీనియర్లకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేస్తారనే ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా ఆయన ఇప్పుడేమీ మాట్లాడనని స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

T.D.P. కి. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల రాజీనామా...

శాసన సభ్యత్వానికి రాజీనామా చేయనున్న గోరంట్ల ?

టీడీపీ పార్టీని అవమాన పరుస్తున్నారనే మనస్తాపం వ్యక్థము.

చంద్రబాబు, లోకేష్ కనీసం ఫోన్ కూడా attempt చేయట్లేదని ఆరోపణ.

సీనియర్ నాయకులు తీరుపై సరైన గౌరవం లేదన్న గోరంట్ల.

వారం రోజులలో పార్టీ మార్పు పై ప్రకటన ?:

*గోరంట్ల బుచ్చయ్య చౌదరి*

Link to comment
Share on other sites

Manchi leader, Babu garu inka mansulo petukonaru emo split ainapudu cheraledu ani.

Apatlo NTR digipoyaka, Gorantla mediator ga velte kotaru.

But ilanti values vunna nayakulu ne vadlukovadam manchidi kadu, kanisam phone aina eti vundali.

Almost 80+ age ianke, he deserves atleast damn respect.

Hope he will revert his decision.

Link to comment
Share on other sites

6 minutes ago, bharath_k said:

Aina eeyyana phone ettananta busy gaa vunnara babu garu  

------

GBC ...  black mail type kaadu, edina vunte direct gane cheptadu 

let us wait and see.  

I agree party sthapinchina appatininchi vunna vyakti ycp wave lo kuda gelichina mla mohamatam lekunda direct ga cheppe manishi aayana phone chesthe pattinchukoledante very sad emaina marpulu cherpulu vunte ayanaki cheyalsina nyayam ivvalsina gouravam ichi adjustments chesthe manchidi never expected 😔

Link to comment
Share on other sites

అమరావతి : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేస్తానని అధికారికంగా ఎమ్మెల్యే ప్రకటించేశారు. అయితే ఈ విషయాన్ని ముందే గ్రహించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత రాత్రి చౌదరికి చంద్రబాబు ఫోన్‌ చేశారు. సుమారు అరగంటకు పైగా వీరిద్దరి మధ్య పలు విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. వచ్చేవారం తాను వస్తానని అన్ని విషయాలు మాట్లాడుదామని.. అన్నీ సర్దుకుంటాయని కూడా బుచ్చయ్యకు చంద్రబాబు హామీ ఇచ్చారు. అయినప్పటికీ బుచ్చయ్య మాత్రం 24 గంటల గ్యాప్‌లోనే తాను రాజీనామా చేసేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.

Link to comment
Share on other sites

 

జూ ఎన్టీఆర్ ను సమర్ధించిన కారణంగానా..

కొద్ది రోజుల క్రితం చంద్రబాబు పర్యటనల్లో కుప్పంతో పాటుగా మచిలీ పట్నంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు-ఆయనను పార్టీలోకి తీసుకురావాలనే నినాదాలు వినిపించాయి. ఆ సమయంలో గోరంట్ల బుచయ్య చౌదరి వారి డిమాండ్ పైన సానుకూలంగా స్పందించారు. జూనియర్ సేవలు ఇప్పుడు పార్టీకి అవసరమని తేల్చి చెప్పారు. జూనియర్ రాకను ఎవరూ అడ్డుకోవాల్సిన అవసరం లేదని.. ఆయనకు ఆ బాధ్యత ఉందంటూ బుచ్చయ్య చెప్పుకొచ్చారు. ఆ సమయంలో బుచ్చయ్య స్పందించిన తీరు పైన పార్టీలో చర్చ జరిగింది. అధినాయకత్వం దీని పైన వ్యతిరేకంగా స్పందించినట్లు ప్రచారం జరిగింది. అప్పటి నుంచే బుచ్చయ్య ఫోన్ చేసినా చంద్రబాబు- లోకేష్ నుంచి స్పందన లేదని చెబుతున్నారు.

Link to comment
Share on other sites

2 minutes ago, raghu6 said:

 

జూ ఎన్టీఆర్ ను సమర్ధించిన కారణంగానా..

కొద్ది రోజుల క్రితం చంద్రబాబు పర్యటనల్లో కుప్పంతో పాటుగా మచిలీ పట్నంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు-ఆయనను పార్టీలోకి తీసుకురావాలనే నినాదాలు వినిపించాయి. ఆ సమయంలో గోరంట్ల బుచయ్య చౌదరి వారి డిమాండ్ పైన సానుకూలంగా స్పందించారు. జూనియర్ సేవలు ఇప్పుడు పార్టీకి అవసరమని తేల్చి చెప్పారు. జూనియర్ రాకను ఎవరూ అడ్డుకోవాల్సిన అవసరం లేదని.. ఆయనకు ఆ బాధ్యత ఉందంటూ బుచ్చయ్య చెప్పుకొచ్చారు. ఆ సమయంలో బుచ్చయ్య స్పందించిన తీరు పైన పార్టీలో చర్చ జరిగింది. అధినాయకత్వం దీని పైన వ్యతిరేకంగా స్పందించినట్లు ప్రచారం జరిగింది. అప్పటి నుంచే బుచ్చయ్య ఫోన్ చేసినా చంద్రబాబు- లోకేష్ నుంచి స్పందన లేదని చెబుతున్నారు.

Wrong news annai.. 

Adireddy and GBC la madhya adhipatya poru valla vachina tippalu ivanni.. 

Link to comment
Share on other sites

Just now, Raaz@NBK said:

Wrong news annai.. 

Adireddy and GBC adhipatya poru valla vachina tippalu ivanni.. 

hmm hope so …GBC velthe very bad signal 

YCP down avuthundi anukonte TDP kooda week ayithe fetching for YCP 

Public view lo 

Link to comment
Share on other sites

15 minutes ago, Uravakonda said:

Kaani aa reason tho exit ayyi, ye party lo join avvali GBC? Anni parties lo valla adhyakshulu just ala phone cheyagane ette position lo unnara ani think cheyali.

Phone ettaledu ante 

Gap perigindi baaga anedi main point 

Link to comment
Share on other sites

 

As he is becoming aged, tammudi kodukuni next elections lo rajamundhry rural lo nilabettali ane alochanato vunnadu  

Rajamundhry lone oka vargam  ... denni  oppose chestunnatlu vunnaru. 

ekkado kaali vuntadi.  

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...