Jump to content

Punch padindi...


Recommended Posts

వైసీపీ ఎన్‍ఆర్‍ఐ సభ్యుడు పంచ్ ప్రభాకర్‍పై కేసు నమోదు 

పంచ్ ప్రభాకర్‍పై కేసు నమోదు చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు 

*ఉపరాష్ట్రపతి, లోక్‍సభ స్పీకర్‍పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు* 

రఘురామకృష్ణరాజు సహా పలువురు ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు 

యూట్యూబ్‍లో వీడియోలు పెట్టిన వ్యవహారంలో కేసు నమోదు 

స్థానిక కోర్టు అనుమతితో ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు 

యూట్యూబ్ సంస్థకు కూడా నోటీసులు జారీ చేసిన ఢిల్లీ పోలీసులు 

పంచ్ ప్రభాకర్ వీడియోల పూర్తి సమాచారం అందించాలని ఆదేశం 

ఎంపీ రఘురామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు 

పంచ్ ప్రభాకర్‍పై కేసు విచారణ కొనసాగుతుందన్న పోలీసులు....

Link to comment
Share on other sites

పంచ్ ప్రభాకర్‌పై ఢిల్లీలో కేసులు..!

By Telugu360 

అమెరికాలో ఉంటూ ఏపీ, తెలంగాణలోని రాజకీయ నేతలపై బూతులతో విరుచుకుపడే వైసీపీ కార్యకర్త పంచ్ ప్రభాకర్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పంచ్ ప్రభాకర్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై కూడా అనుచితంగా దూషించిన కేసులో నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. ఆయన దాదాపుగా ప్రతీ రోజూ యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. ప్రతీ వీడియోలోనూ ఆయన వైసీపీకి ఎవరు వ్యతిరేకంగా ఉంటారో వారిని బండ బూతులు తిడుతూ ఉంటారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఎంపీ రఘురామకృష్ణరాజులను కూడా ఆయన వదల్లేదు. ఈ అంశంపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు కేసు నమోదు చేశారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు స్థానిక కోర్టు అనుమతితో ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యూట్యూబ్ నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేశారు. పంచ్ ప్రభాకర్ వీడియోలపై పూర్తి సమాచారం అందించాలని ఆదేశించారు. తనకు తాను పంచ్ ప్రభాకర్‌గా చెప్పుకునే వ్యక్తి అసలు పేరు చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి. అమెరికాలో వెటర్నరీ డాక్టర్‌గా పని చేస్తూంటారు. తాను వైసీపీ ఎన్నారై సభ్యుడినని చెప్పుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఆయన అందరిపై బూతులతో విరుచుకుపడుతూంటారు. నరకుతా.. చంపుతానని కూడా వ్యాఖ్యలు చేస్తూంటారు. న్యాయమూర్తులపై దూషణల కేసుల్లోనూ ఆయన పేరు కీలకంగా ఉండటం.. ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్ వంటి వారినీ చంపుతానన్నట్లుగా మాట్లాడి ఉండటంతో ఆయనను ఇండియాకు పిలిపించి ప్రశ్నించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఢిల్లీ పోలీసులు కోర్టు అనుమతి తీసుకునే కేసు నమోదు చేశారు. యూట్యూబ్ నుంచి సమాచారం వచ్చిన తర్వాత ఆయనపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు.

Link to comment
Share on other sites

ఆంధ్రజ్యోతి

ఢిల్లీ: పంచ్ ప్రభాకర్‌కు ఢిల్లీ పోలీసుల నుంచి పంచ్ పడింది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక కోర్టు అనుమతి తీసుకుని పంచ్ ప్రభాకర్‌పై ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. యూట్యూబ్ సంస్థకు కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అమెరికాలో ఉంటూ వైసీపీని వ్యతిరేకించిన వారిపై యూట్యూబ్‌లో అసభ్య పదజాలంతో వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు. పంచ్ ప్రభాకర్ వీడియోల పూర్తి సమాచారం అందించాలని పోలీసులు ఆదేశించారు. ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, ఎంపీ రఘురామకృష్ణరాజు సహా.. పలువురు ప్రముఖులపై పంచ్ ప్రభాకర్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ యూట్యూబ్‌లో వీడియోలు పోస్టు చేసేవారు. ఈ వ్యవహారంలో ప్రభాకర్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తదుపరి విచారణ కొనసాగుతుందని ఢిల్లీ పోలీసులు స్థానిక కోర్టుకు తెలిపారు. 

Link to comment
Share on other sites

34 minutes ago, Yaswanth526 said:

NRI wing ani notikochina nation flags esadu inthaki avi a desaalo ina telusaa

Naaku telisina flag la lo Jamican undi left bottom lo

Inthaki akkada YSRCP wing president evaro  :dream:

E9FqJuLVEAMXQLj.jpg

Left lo

🇺🇸 : United States, 🇬🇧 : United Kingdom, 🇨🇦 : Canada, 🇩🇪 : Germany, 🇦🇺 : Australia, 🇨🇮 : Côte d’Ivoire, 🇿🇦 : South Africa, 🇯🇲 : Jamaica

right lo

🇸🇦 : Saudi Arabia, 🇴🇲 : Oman 🇶🇦 : Qatar, 🇰🇼 : Kuwait, 🇲🇺 : Mauritius, 🇸🇬 : Singapore, 🇲🇾 : Malaysia, 🇦🇪 : United Arab Emirates

Link to comment
Share on other sites

2 hours ago, Yaswanth526 said:

NRI wing ani notikochina nation flags esadu inthaki avi a desaalo ina telusaa

Naaku telisina flag la lo Jamican undi left bottom lo

Inthaki akkada YSRCP wing president evaro  :dream:

E9FqJuLVEAMXQLj.jpg

South afric matram undi 3 capitals  inspiration

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...