Jump to content

జగన్ రెడ్డి జైలుకు ఇప్పుడు వెళ్లడం నాకిష్టం లేదు


Recommended Posts

 

జగన్ రెడ్డి జైలుకు ఇప్పుడు వెళ్లడం నాకిష్టం లేదు.

నిండా మునిగినోళ్ళకు చలేంటి..?!.

మీయన్న జైలుకు వెళ్లాలని మేము కోరుకోవడం లేదు.

మీయన్న విధ్వంసం ఇంకెంత చేస్తాడో చూడాలని ఉంది. 

2 సంవత్సరాల లోనే మాకు కాదు ముందుగా మీకు మీయన్న పరిపాలనపై విసుగొచ్చిందన్న సంగతి మాకు తెలుసు.

ఒక్క ఛాన్స్ అని ఎగిరెగిరి అవకాశం ఇచ్చినవారికి ఇప్పుడు 'దొంగకు తేలు కుట్టిన' పరిస్థితి అని కూడా తెలుసు.

3 రాజధానులు
5 ఉప ముఖ్యమంత్రులు
33 మంది సలహాదారులు
170 కోర్టు మొట్టికాయలు...... ఆహా అద్భుతం 
రూపాయి బియ్యానికి 25 రూపాయల ఖర్చు....... ఓహో మహా అద్భుతం.

"మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ" అని పెద్దలు అంటే ... మీయన్న ఆచార్యులను బెత్తంతో బార్ల వద్ద డ్యూటీలు చేయించి ప్రపంచంలోని '8'వ వింతను చూపించడం మీయన్న కే చెల్లింది .. అద్భుతం.

ప్రజావేదిక కూల్చడం నుండి మొదలైన మీయన్న విధ్వంస పాలన ఏపాటిదో తరలి వెళ్లిపోయిన పెట్టుబడులు, కంపెనీలే సాక్షి.
అమరావతిలో దుమ్ము కొట్టుకుపోయిన భవనాలే సాక్షి.
ఆగిపోయిన పొలవరమే సాక్షి. ఇలా రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఆగిపోయిన అభివృద్ధే సాక్షి.
......................  చెప్పుకుంటూ పోతే పెద్ద గ్రంధమే రాయొచ్చు.

మిగిలిన 3సంవత్సరాలలో ఇంకెంత విధ్వంసం చేయగలడో పూర్తిగా చూడాలని ఉంది. 

జైలుకు వెళ్ళి పరిపాలన పరంగా తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం... మీయన్న దాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడం.. మీరేమో 
"మాయన్న తోపు-తురుం" అని చెప్పుకోవడం గొర్రెల మంద తలలు ఊపడం.   ..   మాకు ససేమిరా..........

గీత పక్కన మరో గీత గిస్తేనే ఏది పెద్దగీతో తెలిసేది.
వెలుగు విలువ తెలియాలంటే చీకటిని చూడాల్సిందే.

అందుకే అంటున్న మీయన్న ఇప్పుడు జైలుకు వెళ్లడం మాకు కూడా ఇష్టంలేదు. #చంద్రబాబు గారి దూరద్రుష్టిని అందరూ తెలుసుకోవాలంటే మీయన్న పరిపాలన ఇంకొంత కాలం కొనసాగాల్సిందే..!

ప్రజలకు కూడా తెలియాలి కదా... ఒక్క ఛాన్స్ ఎంత విధ్వంసకరమైనదో..! 

ఏవిషయంలో ప్రయోగాలు చేయాలో.. తమ ఓటు ఎంత విలువైనదో ప్రతి ఒక్కరికీ తెలియాలంటే కనీసం ఒక్కసారైనా మీయన్న లాంటోడు పరిపాలించాల్సిందే. అప్పుడే కదా "సమర్ధత కు అసమర్థత కు" తేడాను మీరు గుర్తించేది..?!

దీనినే self - destruction అనేది. దీన్ని మనం పూర్తిగా ఆస్వాదిద్దాం సరేనా..?!

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...