Jump to content

jaffas Passports seized by CBI

Recommended Posts

8 minutes ago, rajanani said:

"సీబీఐ కార్యాలయం ముందు వైసీపీ శ్రేణులు హల్చల్ చేశాయoట".  సీబీఐ మరీ కామెడీ పీస్ ఇపోయిందిగా

Comedy piece ee ga bro.. 

Link to comment
Share on other sites

  • Replies 69
  • Created
  • Last Reply

సీబీఐ దూకుడుతో వైసీపీ సోషల్ మీడియాలో వణుకు..! By Telugu360

ప్రభుత్వ డిజిటల్ డైరక్టర్‌గా ప్రజాధనం జీతంగా తీసుకుంటున్న గుర్రంపాటి దేవేందర్ రెడ్డి .. అధికారికంగా నిర్వహించే విధులు మాత్రం వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్‌గా. ఆయన ట్వీట్లు… పోస్టులు ఎంత దారుణంగా ఉంటాయో… ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు దగ్గర్నుంచి రఘురామకృష్ణరాజు వరకూ ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా దూషించడంలో ఆయన పీహెచ్‌డీ చేశారు. ఆయన బాటలోనే ఆయన సోషల్ మీడియా టీం ఉంది. తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ఉత్సాహంతో ..అదే దూకుడు న్యాయస్థానాలపైనా చూపించి ఇప్పుడు ఇరుక్కుపోయారు. ఆయనను సోమవారం దాదాపుగా ఎనిమిది గంటల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. న్యాయస్థానాలపై … న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నీ.. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పెట్టినవే. అన్నీ ఆర్గనైజ్డ్‌గా పెట్టారని.. సీబీఐ అనుమానిస్తోంది. ఓ పద్దతి ప్రకారం.. అందరికీ సూచనలు వెళ్లాయని.. అవి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి నుంచే వెళ్లాయని భావిస్తున్నారు. ఎనిమిది గంటల విచారణలో గుర్రంపాటి నుంచి కీలకమైన సమాచారాన్ని సీబీఐ అధికారులు సేకరించారని అంటున్నారు. అసలు వైసీపీ సోషల్ మీడియా ఎలా నడుస్తుంది.. ఎంత ఖర్చు పెడుతున్నారు… పోస్టింగ్స్ పెట్టాలని ఎలా సందేశాలు పంపుతారు.. లాంటి వాటిని కూడా కూపీ లాగినట్లుగా తెలుస్తోంది. గుర్రంపాటి ఫోన్‌ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకుని ఆయన సోషల్ మీడియా ఖాతాలను తెరిచి.. వివరాలను అడిగినట్లుగా కొంత మంది వైసీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. పరిస్థితి సీరియస్‌గా ఉందని తేలడంతో.. గుర్రంపాటి దేవేందర్ రెడ్డికి తోడుగా సీబీఐ విచారణకు ఇద్దరు ఎమ్మెల్యేను వైసీపీ హైకమాండ్ పంపింది. అయితే.. వారిని సీబీఐ అధికారులు కార్యాలయంలోకి అనుమతించలేదు. దాంతో వారు వెళ్లిపోయారు. మళ్లీ ఆయన విచారణ పూర్తయిన తర్వాత బయటకు వచ్చే సమయంలో రిసీవ్ చేసుకోవడానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు వచ్చారు. మీడియాతో మాట్లాడిన గుర్రంపాటి టీడీపీనే తమపై సీబీఐతో తప్పుడు కేసులు పెట్టించిందని ఆయన ఆరోపించి వెళ్లిపోయారు. ఈ కేసు అంత తేలికగా వదిలేది కాదని.. చాలా మంది చిక్కుల్లో పడబోతున్నారన్న ఓ అభిప్రాయం మాత్రం వైసీపీ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. 

Link to comment
Share on other sites

1 hour ago, rajanani said:

want to see తుంపర సేద్యం గాడు ఇన్ సిబిఐ investigation...

Link to comment
Share on other sites

జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఐదుగురి అరెస్ట్‌.. ఇద్దరు వైకాపా నేతలపై సీబీ‘ఐ’!

దిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐదుగురిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. శనివారం పి.ఆదర్శ్‌, ఎల్‌ సాంబశివరెడ్డిని అధికారులు అరెస్ట్‌ చేయగా.. జులై 28న ధామిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్‌ను అరెస్ట్‌ చేసినట్లు సీబీఐ తెలిపింది. జులై 9న ఈ కేసులో నిందితుడిగా ఉన్న లింగారెడ్డి రాజశేఖర్‌ రెడ్డిని కువైట్‌ నుంచి వస్తుండగా అరెస్ట్‌ చేసినట్లు పేర్కొంది. శనివారం అరెస్టయిన ఆదర్శ్‌, సాంబశివరెడ్డిలను కోర్టులో ప్రవేశ పెట్టినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 16 మందిపై కేసులు నయోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

ఈ కేసులో వైకాపాకు చెందిన ఎంపీ నందిగం సురేష్‌, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ల ప్రమేయంపై కూడా దర్యాప్తు జరుపుతున్నామని సీబీఐ అధికారులు తెలిపారు. మొత్తం 16 మందిలో ముగ్గురు విదేశాల్లో ఉన్నారని, ఐదుగురిని అరెస్ట్‌ చేశామని చెప్పారు. ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న వ్యక్తులపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అది తేలాక వారిపై కూడా లీగల్‌ చర్యలు తీసుకుంటామని తెలిపారు. జడ్జీలపై వ్యాఖ్యల వెనుక భారీ కుట్ర ఉందని అనుమానిస్తున్నట్లు సీబీఐ అధికార ప్రతినిధి ఆర్‌సీ జోషి ఈ సందర్భంగా తెలిపారు.

న్యాయమూర్తులపై వ్యాఖ్యల కేసులో విచారణ జరపాలని సీబీఐకి ఏపీ హైకోర్టు ఇది వరకే ఆదేశించింది. పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలంది. దీంతోపాటు  దేశంలో న్యాయాధికారులపై దాడులు, దూషణలు అధికం కావడంపై శుక్రవారం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. ఈ విషయంలో నిఘా విభాగం (ఇంటెలిజెన్స్‌ బ్యూరో-ఐబీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లు న్యాయ వ్యవస్థకు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ ఈ ప్రకటన చేయడం గమనార్హం

Link to comment
Share on other sites

మరో ఐదుగురు అరెస్ట్.... జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల వెనుక భారీ కుట్ర : C.B.I

  ఆంధ్రప్రదేశ్‌లో న్యాయమూర్తుల్ని కించ పరుస్తూ, తిడుతూ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టిన కేసుల్లో మరో ఐదుగుర్ని సీబీఐ అరెస్ట్ చేసినట్లుగా సీబీఐ ప్రకటించింది. రెండు రోజుల కిందట సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్…. న్యాయమూర్తులను వేధిస్తున్న వారి విషయంలోనూ సీబీఐ, ఐబీ నిర్లక్ష్యంగా ఉంటున్నాయని... న్యాయవ్యవస్థకు సహకరించడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో సీబీఐలో కదలిక వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆ కేసుకు సంబంధించి తాజాగా మరో ఐదుగుర్ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. తాజా అరెస్టులతో ఎనిమిది మందికి చేరినట్లుగా తెలుస్తోంది.* 

 *ఉన్నత న్యాయస్థానంపై అనుచిత వ్యాఖ్యల కేసులో అనేక మంది ప్రముఖులు ఉన్నారు. గతంలో హైకోర్టులో ప్రభుత్వానికి తీర్పులు వ్యతిరేకంగా వచ్చాయన్న కారణంగా సోషల్ మీడియాలో విపరీత వ్యాఖ్యలు చేశారు. వారి వ్యవహారాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి, ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్, జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వంటి వారు సహా మొత్తం 90మందికి నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఈ కేసులో ఎంపీ నందిగం సురేష్, ఆమంచి కృష్ణమోహన్‌లను ప్రశ్నించే అవకాశం ఉందని సీబీఐ తెలిపింది. జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసులో భారీ కుట్ర ఉందని సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తోంది.*

 *హైకోర్టు నోటీసులు జారీ చేసినా సీఐడీ పట్టించుకోకపోవడంతో కేసును సీబీఐకి ఇచ్చింది. సీబీఐ కూడా లైట్ తీసుకుంది. ఇటీవలి కాలంలో ఒకరిద్దర్ని అరెస్ట్ చేసింది. కానీ రెండురోజుల క్రితం... సాక్షాత్తూ సీజేఐనే అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఇప్పుడు చురుగ్గా కదులుతున్నట్లుగా కనిపిస్తోంది ఎంపీ నందిగం సురేష్ అయితే న్యాయమూర్తుల కాల్ లిస్ట్ చెక్ చేయాలని డిమాండ్ చేశారు. సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు సుమన్ టీవీ అనే యూ ట్యూబ్ చానల్‌కు ప్రత్యేకంగా ఇంటర్యూ ఇచ్చి..న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీడియో క్లిప్‌లతో హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. పంచ్ ప్రభాకర్ అనే అమెరికాలో ఉండే వ్యక్తి దారుణంగా తిడుతూ ఉంటారు. ఆయనకూ నోటీసులు వెళ్లాయి. వీళ్లందరిపై సీబీఐ ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్‌ని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కీలక ఆధారాలు సేకరించారు. అంతా ఓ నెట్ వర్క్ ప్రకారం.. జరిగిందన్న ఆరోపణల నేపధ్యంలో సీబీఐ అరెస్టులు కలకలం రేపుతున్నాయి.*

Link to comment
Share on other sites

ముగ్గురు విదేశాల్లో ఉన్నారని చెప్పారు. నిందితుల ఇళ్లలో ఇంట్లో సోదాలు జరిపినప్పుడు.. వారిలో ఒకరు వేరే పేరుతో పాస్‌పోర్టు ఉపయోగిస్తున్నట్లు తెలిందని జోషి చెప్పారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...