Jump to content

*మాన్నాస్‌ ట్రస్టు ఛైర్మన్‌ నియామక జీవో రద్దు*


Recommended Posts

*మాన్నాస్‌ ట్రస్టు ఛైర్మన్‌ నియామక జీవో రద్దు*


అమరావతి: మాన్నాస్‌ ట్రస్టు ఛైర్మన్‌ నియామక జీవోను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. సంచయిత గజమతిరాజు నియామక జీవోను రద్దు చేసి అశోక్‌ గజపతిరాజును ట్రస్టు ఛైర్మన్‌గా పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది.

14-06-21 | 12:35 IST

Link to comment
Share on other sites

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ , మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కామెంట్స్

దేశంలో చట్టాలు ఉన్నాయని, రాజ్యాంగం ఉందని ఈ విషయంతో రుజువైంది

వివాదం జరిగి ఇన్ని రోజులు గడిచాయి ఎక్కడెక్కడ శాశ్వత డేమేజెస్ జరిగాయో చూడాల్సిన అవసరం ఉంది

ఉదాహరణకు  సింహచలం దేవస్థానం లో గోశాల లో గోవుల ప్రాణాలు పోయాయి.

వాటిని సంరంక్షించాల్సింది పోయి వాటిని హింసించి చంపారు.

వాటి ప్రాణాలు ఎవరు తెస్తారు?

అలాగే 105 ఈమధ్య కాలంలో  దేవాలయాల్లో పరిస్థితులు చూడాలి.

ఇప్పుడు వరకు ఏం జరిగింది అనేది తెలుసుకుని  రిస్టోర్ చేయాల్సి ఉంది

ప్రభుత్వం కూడా ఎంతవరకు సహకరిస్తుంది అనేది చూడాలి

ట్రస్టు చైర్మన్ తో పాటు సింహచలం దేవస్థానం చైర్మన్ పదవి నుంచి నుంచి తొలగించారు

డిస్మిస్  ఆర్డర్ ఇచ్చారు

వాదనలు విన్న తరువాత కోర్టు దాన్ని కొట్టేసింది

నాపై ఆరోపణలు హాస్యాస్పదం

నేను రామతీర్ధాలు దేవస్థానానికి విరాళం ఇస్తే తిప్పి పంపారు

నేను చైర్మన్ గా ఉన్న సమయంలో అక్రమాలు జరిగాయి అని వాదించారు

ఎలాంటి నష్టం జరిగిందో చెప్పలేకపోయారు.

ఇప్పటికైనా ప్రభుత్వం చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాలి అని కోరుతున్నాను.

అధికారులు ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి

కోర్టు తీర్పు పూర్తి పాఠం వొచ్చినాక మిగతా వివరాలు వెల్లడిస్తాను.

Link to comment
Share on other sites

సీఎంకు, మంత్రులకు జ్ఞానం ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్న: అశోక్ గజపతి

విజయనగరం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. మాన్సాస్ ఛైర్మన్, సింహాచలం దేవస్థాన అనువంశిక ధర్మకర్త హోదాకు అశోక్ గజపతిరాజే అర్హుడని హైకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో అశోక్ తన కుటుంబ సభులతో, పార్టీ నేతలతో పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. వేదపండితులు పూర్ణ కలశంతో అశోక్ గజపతిరాజుకు ఘన స్వాగతం పలికారు. పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం శేషవస్త్రం, ప్రసాదాలను పూజారులు అందజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్ది, మంత్రులకు మంచి జ్ఞానం ప్రసాదించాలని పైడితల్లి అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన అన్నారు. నిన్న మొన్నటి వరకు శాశ్వత నష్టం చేకూర్చినవారిలా కాకుండా మూగజీవాలకు పూర్తి రక్షణ కల్పిస్తామని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

7 hours ago, rajanani said:

☝️ మామూలు పెంట చెయ్యలేదుగా వీళ్ళు. ఇవన్నీ సరిచెయ్యటానికి ఎంత కాలం పడుతుందో

Okka trust ke time padithey, inka state ni gaadi lo pettalante inkentha time paduthundhoo cheppu.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...