Jump to content

RRR is on beast mode


Recommended Posts

  • Replies 240
  • Created
  • Last Reply

ఉచిత పథకాలతో నిధుల కొరత: రఘురామ
సీఎం జగన్‌కు ఎంపీ లేఖ.

దిల్లీ: ఉచిత పథకాలతో ఏపీ ప్రభుత్వానికి నిధుల కొరత ఏర్పడుతోందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో సీఎం జగన్‌కు ఆరో లేఖను ఆయన రాశారు. చెత్త సహా రాష్ట్రంలో విధించిన వివిధ పన్నుల అంశాన్ని రఘురామ అందులో స్తావించారు. చెత్తపై పన్ను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాదని చెప్పారు. 

‘‘రవాణా శాఖ ప్రజలపై భారం మోపి రూ.400కోట్లు ఆర్జిస్తోంది. వాహనాల జీవిత పన్నును 3శాతం పెంచారు. రవాణా వాహనాలపై త్రైమాసిక పన్నులు పెంచుతున్నారు. గ్రీన్‌ ట్యాక్స్‌ పేరిట జరిమానా వసూలు చేయబోతున్నారు. పన్నుల భారం నుంచి ప్రజలను కాపాడండి’’ అని జగన్‌ను ఎంపీ రఘురామ కోరారు.

Link to comment
Share on other sites

తిరుమలలో స్పెసిఫైడ్‌ అథారిటీ ఏర్పాటు చేసేందుకు వీలుగా.. 146 జీవో విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రజానీకం తీవ్ర ఆందోళనకు గురవుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకే ఇలాంటి చర్యలకు ఉపక్రమించారని ధ్వజమెత్తారు. హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ల నమ్మకాలను ఇది తీవ్రంగా గాయపరుస్తోందని అభిప్రాయపడ్డారు. ఇద్దరే సభ్యులతో స్పెసిఫైడ్‌ అథారిటీ ఏర్పాటు చేస్తే.. వారు సమగ్రంగా చర్చించేందుకు  వీలుండదన్నారు. సాధారణంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగానీ, కమిషనర్‌ గానీ అథారిటీలో సభ్యులుగా ఉంటారని, అటువంటి సంప్రదాయం పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడ్డారు. తీవ్రమైన ఆర్థిక లోటు నుంచి బయటపడేందుకు ప్రభుత్వ బాండ్లను జారీ చేసి,  ఆ బాండ్లను కనీసంగా రూ.5 వేల కోట్ల మేర తితిదే స్పెసిఫైడ్‌ అథారిటీ ద్వారా కొనుగోలు చేస్తారనే ప్రచారం జరుగుతోందని, దీనిపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. తక్షణమే కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు.

Link to comment
Share on other sites

దిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖల పరంపర కొనసాగుతూనే ఉంది. ‘నవ సూచనలు’ పేరుతో ఆయన ఇవాళ మళ్లీ లేఖాస్త్రం సంధించారు. జగనన్న కాలనీలు, పక్కా ఇళ్ల విషయంపై అందులో పేర్కొన్నారు. అత్యంత చౌకబారు నిర్మాణ సామగ్రి ఉపయోగించి కనిష్ఠ సౌకర్యాలు, అరకొర మౌలిక సదుపాయాలతో ఇళ్లు నిర్మించి పేదవారికి ఇవ్వొద్దన్నారు.
స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ప్రజల దీర్ఘకాలిక సంతోషాన్ని హరించవద్దని పేర్కొన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు నాసిరకం ఇళ్లు ఇచ్చి వారి డబ్బు, ఆరోగ్యం అన్నింటికి మించి వారి సంతోషాన్ని దూరం చేయొద్దని రఘురామ కోరారు. అమృత్‌ పథకం ద్వారా గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను పేదవారికి ఎందుకు ఇవ్వడం లేదు?అని ప్రశ్నించారు.

Link to comment
Share on other sites

(ఈటీవీ స్క్రోలింగ్) సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ పై వచ్చిన ఫిర్యాదులపై కేంద్ర హోంశాఖ స్పందన - సునీల్ కుమార్ వ్యవహారంపై వచ్చిన 3 ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని ఆదేశం - ఫిర్యాదులు పరిశీలించి అవసరమైతే చర్యలు తీసుకోవాలని హోంశాఖ ఆదేశం - తీసుకున్న చర్యల వివరాలపై నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ - సివిల్ సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారని గతంలో సునీల్ పై రఘురామ ఫిర్యాదు - ఐపీఎస్ హోదాలో సమాజంలో అలజడి సృష్టించేలా మాట్లాడారని ఫిర్యాదు - రఘురామ ఫిర్యాదు, సునీల్ ప్రసంగ వీడియోలను రాష్ట్రానికి పంపిన కేంద్ర హోంశాఖ - ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ కు కేంద్ర హోంశాఖ ఆదేశం - ఏ చర్యలు తీసుకున్నారో నివేదిక రూపంలో తమకు చెప్పాలని ఆదేశం - సునీల్ మత వ్యతిరేక ప్రచారం చేశారని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ అబ్జర్వేటరీ ఫిర్యాదు

Link to comment
Share on other sites

జగన్‌ అక్రమాస్తుల కేసులపై రఘురామ పిల్‌.

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జగన్‌ అక్రమాస్తుల కేసులను సీబీఐ, ఈడీ సరిగా దర్యాప్తు చేయడంలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దర్యాప్తులో దృష్టికి వచ్చిన అంశాలను వదిలిపెట్టాయని రఘురామ ఆరోపించారు. కేసులకు తార్కిక ముగింపు ఇవ్వడంలో సీబీఐ, ఈడీ విఫలమయ్యాయన్నారు. విచారణలో గుర్తించిన అన్ని అంశాలపై దర్యాప్తు చేసేలా సీబీఐ, ఈడీని ఆదేశించాలని కోరారు.

Link to comment
Share on other sites

జులై 4, 2021
శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి,
ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
విషయం: సరైన సమయంలో జీతాలు చెల్లించకపోవడం
సూచిక: నవ సూచనలు (వినమ్రతతో) లేఖ 6
ముఖ్యమంత్రి గారూ,
మన రాష్ట్రంలో పని చేస్తున్న 4,43,711 మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతం చెల్లించే గడువు తేదీ ప్రతి నెలా ఒకటో తేదీ దాటిపోతున్నది. ప్రతి నెలా పదో తేదీ వరకూ వారికి విడతల వారీగా జీతం చెల్లింపులు చేస్తున్నారు. అంతే కాదు, 2,88,480 మంది ఉపాధ్యాయులకు జీతాల చెల్లింపు కూడా వాయిదాలు పడుతూ ఇప్పటికే నెల రోజుల బకాయితో నడుస్తున్నది. రాష్ట్రంలోని 3.5 లక్షల మంది పెన్షనర్లకు అయితే నెలలో మూడో వారం వరకూ చెల్లింపులు జరగడం లేదు. జీతాల చెల్లింపు కోసం రూ.3500 కోట్లు, పెన్షన్ల చెల్లింపు కోసం నెలకు రూ.2500 కోట్లు, ఈ చెల్లింపుల కోసం తీసుకువచ్చిన అప్పులకు వడ్డీ భారం రూ 3,000 కోట్లు… ఇలా చూస్తే నెలకు రూ.9,000 కోట్లు ప్రభుత్వానికి అవసరం అవుతున్నాయి.
మీ నేతృత్వంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం గత రెండేళ్లుగా ఏనాడూ ఆర్ధికంగా బాగాలేదు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు కూడా చెల్లించలేని తీవ్రమైన వత్తిడిలోకి వచ్చేశాం. మధ్యలో శెలవుల రావడం వల్ల  జీతాలు సకాలంలో చెల్లించలేక పోతున్నామని, కరోనా కారణంగా జీతాల చెల్లింపు ఆలశ్యం అవుతున్నదని ఇంతకాలం కుంటి సాకులు చెబుతూ మన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ వచ్చాం. ప్రభుత్వం నుంచి సకాలంలో జీతాలు రాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రమైన మానసిక వత్తిడికి గురి అవుతున్నట్లు ప్రస్తుత పరిస్థితి సూచిస్తున్నది. ఈ పరిస్థితి ఇలాగే ఇంకా కొనసాగితే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవారే ఉండరేమోననే అనుమానం నాకు కలుగుతున్నది. నిరుద్యోగులలో ఈ భావన కలిగించడానికే ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్నదని నేనైతే అనుకోవడం లేదు.
గురు బ్రహ్మ గురు విష్ణు
గురుదేవో మహేశ్వరహ:
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీగురవేనమ:
మన దేశంలో ఉపాధ్యాయులను సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపులుగా భావిస్తుంటాం. అలాంటి వారికే మనం జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఉన్నాం. ఈ విధమైన పరిస్థితి నెలకొని ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు. ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వడంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశం 8వ స్థానంలో ఉన్నది. అదే భగవత్ స్వూపులైన గురువులకు వేతనాలు చెల్లించడంలో ప్రపంచంలోనే 26వ స్థానంలో ఉన్నాం. అలాంటిది ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయులకు చెల్లించే జీతాలు కూడా బకాయిలు పెడుతున్నామంటే అది ఎంత హీనమైనదో అర్ధం చేసుకోండి. భావితరాలను తీర్చి దిద్దే గురుతర బాధ్యతను నెత్తిన పెట్టుకుని మోసే ఉపాధ్యాయులకు ఈ విధంగా చేయడం మీకు భావ్యం కాదు.
151 అసెంబ్లీ స్థానాలతో అప్రతిహత విజయం సాధించి మన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రభుత్వ సిబ్బంది ఎంతో కీలకపాత్ర పోషించిన విషయం మనం మరచిపోకూడదు. ‘‘ఏరు దాటేదాకా ఓడ మల్లన్న ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న’’ అన్న చందంగా వ్యవహరిస్తూ వారికి సకాలంలో జీతాలు చెల్లించకపోవడం సహించరాని విషయం. సాధారణంగా  ఏ ప్రభుత్వం అయినా సరే ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లించి ఆ తర్వాతే మిగిలిన ఖర్చులు చూసుకుంటుంది. అయితే మీరు నేరుగా క్యాష్ ఇచ్చే స్కీమ్ లపైనే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా ఈ విధంగానే ఖర్చు అయిపోతున్నాయనే భావనలో ప్రజలు ఉన్నారు.
ఎంతో సహృదయంలో గత రెండు సంవత్సరాలుగా జీతాలు సకాలంలో రాకపోయినా సహనంతో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఇలానే కలకాలం ఉంటారని మీరు భావిస్తే అది తప్పు అవుతుంది. మనమేదో యూనియన్ నాయకులను మేనేజ్ చేసి ఇప్పటి వరకూ ప్రభుత్వ ఉద్యోగుల నోరు మూయించినట్లు ఇక రాబోయే రోజుల్లో కుదరకపోవచ్చు.  ఇప్పటికే మీ పోకడలను గమనిస్తున్న వారు కూడా మీ నాయకత్వాన్ని ‘‘ఆపదలో మొక్కులు… సంపదలో మరపులు’’ అనే అనుకుంటున్నారు. 
తెలుగులో ‘‘అత్త సొమ్ము అల్లుడు దానం’’ అన్న సామెత చెప్పినట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు, గ్రాంట్లు అన్నీకూడా మీ పేరుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మళ్లిస్తున్నట్లుగా ప్రజలకు ఇప్పటికే అర్ధం అయింది. ఉద్యోగులకు, టీచర్లకు జీతాలు, భత్యాలు ఇవ్వడమనే ప్రాధాన్యతాంశాన్ని మీరు ఉద్దేశ్యపూర్వకంగానే మరచిపోతున్నారు. గత ఏడాది కాలంగా మీరు ఉద్యోగులకు మెడికల్ రీయంబర్స్ మెంట్ డబ్బులు కూడా చెల్లించడం లేదు. గత రెండు సంవత్సరాలుగా మీరు గృహనిర్మాణ భత్యం (హౌస్ బిల్డింగ్ ఎలెవన్స్- హెచ్ బి ఏ) కు అనుమతులు ఇవ్వడం లేదు. దీని కోసం బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం ద్వారా మీరు మీ నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నట్లుగా అనుకోవాల్సి వస్తుంది…. ‘‘అద్దం అబద్ధం ఆడుతుందా?’’
ప్రభుత్వం కోసం కష్టపడి పని చేస్తున్న ఉద్యోగులకు, విద్యార్ధుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు జీతభత్యాలు ఇవ్వకుండా మనం చేస్తున్నది ఏమిటంటే ఆర్భాటంగా హెలికాప్టర్లకు, ప్రత్యేక విమానాలకు అద్దెలు చెల్లించడం. నెలలో ఒక సారో రెండు సార్లో ప్రయాణం చేసేందుకు వినియోగించే హెలికాప్టర్, ప్రత్యేక విమానం అద్దెకు తీసుకోవడం అంత అవసరమా? ఇలా చేయడానికి ఏ లాజిక్ ఉందో అర్ధం కావడం లేదు సరికదా ఇలా చేయడాన్ని ప్రజలు ‘‘నిధుల దుర్వినియోగం’’ అని అంటున్నారు. వీటితోబాటు న్యాయస్థానాలలో మనం గెలుస్తామో లేదో తెలియని, గెలవడానికి ఏ మాత్రం అవకాశం లేని కేసులలో వాదించేందుకు ఎంతో ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు.
ఆలశ్యం… అమృతం విషం.. ఇప్పటికైనా సత్వరమే స్పందించండి. మీ ప్రాధాన్యతలు మార్చుకోండి. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడాన్ని ప్రధమ ప్రాధాన్యంగా పెట్టుకోండి. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఉద్యోగులకు చెల్లించాల్సిన భత్యాలను, అడ్వాన్సులను తక్షణమే వడ్డీతో సహా చెల్లించండి. రాష్ట్రానికి రాబడి తెచ్చే విషయాలను ఇప్పటికైనా ఆలోచించండి. కేవలం మీ పేరుతో అమలు చేసుకునే సంక్షేమ పథకాలకు నిధులు ఖర్చు మాత్రమే చేసే విషయాలపై పునరాలోచించండి. ఆర్ధిక క్రమశిక్షణ లేని ఈ స్థితి నుంచి బయటపడేందుకు ఇప్పటికైనా ప్రయత్నించండి. అలా కాకుండా మీరు ఇదే విధమైన పరిస్థితిని కొనసాగిస్తే రాష్ట్రం మరింత ఆర్ధిక సంక్లిష్టతలో చిక్కుకుంటుంది.
భవదీయుడు
కె.రఘురామకృష్ణంరాజు

Link to comment
Share on other sites

2 hours ago, goldenstar said:

E5XXoLZVoAMHQNV.jpeg

Lol ! Kaneesam vadi meeda investigation kuda cheyakunda adhi kuda AP Govt ku vadilesaru ga....... Inthosi daniki malla edho letter pampincharu ani enduku musiri pothunnaro ardham kavadam ledu ......

Link to comment
Share on other sites

On 7/4/2021 at 8:11 PM, goldenstar said:
On 7/4/2021 at 10:57 PM, JAYAM_NANI said:

Lol ! Kaneesam vadi meeda investigation kuda cheyakunda adhi kuda AP Govt ku vadilesaru ga....... Inthosi daniki malla edho letter pampincharu ani enduku musiri pothunnaro ardham kavadam ledu ......

 

I

India is name sake democracy

Imagine the situation when common people has to fight with system? 

No rules apply to Bureaucrats and politicians 

Link to comment
Share on other sites

ఐటీ చట్టం సెక్షన్‌ 66ఏ కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పోలీసు కేసుల నమోదు ఆపాలని ఎంపీ రఘురామ కోరారు. నవ సూచనల పేరుతో సీఎం జగన్‌కు లేఖ రాస్తున్న ఎంపీ ఇవాళ రాసిన లేఖలో సెక్షన్‌ 66ఏ గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో సోషల్‌ మీడియా కార్యకలాపాలపై ఈ చట్టం ప్రకారం విచ్చలవిడిగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. ఈ చట్టాన్ని 2015లోనే సుప్రీంకోర్టు రద్దు చేసినా పోలీసులు అదే సెక్షన్‌పై కేసులు నమోదు చేయడంపై ఇటీవల సుప్రీం కోర్టు నోటీసులు కూడా ఇచ్చిందన్నారు. 

‘‘చట్ట విరుద్ధ చర్యలను తక్షణమే నిలుపుదల చేయకపోతే భరించే శక్తిలేని ప్రజలు మన ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే అవకాశం కన్పిస్తోంది. నా పార్లమెంటు నియోజకవర్గం సహా.. రాష్ట్రంలో మరి కొన్ని చోట్ల కూడా జరుగుతున్న కొన్ని సంఘటనలను తలచుకుంటే బాధేస్తోంది. ఎవరైనా నా ఫొటోను వారి ఫోన్‌లో డిస్ ప్లే చేసినా, మెసేజింగ్ యాప్‌లలో వాడుకున్నా వారిని పోలీసు స్టేషన్ కు పిలుస్తున్నారు. చాలా సందర్భాలలో బాధిత ప్రజలు న్యాయస్థానాలకు వెళ్లడం లేదు కాబట్టి పోలీసులు యథేచ్ఛగా అదృశ్య శక్తి ఆదేశాలు అమలు చేస్తున్నారు’’ అని రఘురామ లేఖలో పేర్కొన్నారు. 

Link to comment
Share on other sites

2 minutes ago, NTR_0619 said:

RRR mp membership cancel chesthe ee party tarapuna contest chesthadu? Indipendent ga contest chese chances unnaya all parties support tho?

enduku cancel avvuddi boss . 0% chances for cancellation. 

so, your question will not arise. 

 

Link to comment
Share on other sites

18 minutes ago, bharath_k said:

enduku cancel avvuddi boss . 0% chances for cancellation. 

so, your question will not arise. 

 

Inko one year ki bi election vachi RRR win ayithe baaguntadi bro. Win chances kuda baguntayi anukutunnaa

Link to comment
Share on other sites

25 minutes ago, NTR_0619 said:

RRR mp membership cancel chesthe ee party tarapuna contest chesthadu? Indipendent ga contest chese chances unnaya all parties support tho?

Wrong question .

Cancel chesthe ....contest cheyadu chesina odopothadu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...