Jump to content

'దీదీ’ని విడిచి ఉండలేకపోతున్నా.. టీఎంసీ గూటికి బీజేపీ నేత సోనాలి!


KING007

Recommended Posts

దీదీ’ని విడిచి ఉండలేకపోతున్నా.. టీఎంసీ గూటికి బీజేపీ నేత సోనాలి!

May 22 2021 @ 17:37PMfb-icon.pngwatsapp-icon.pngtwitter-icon.png

05222021173646n65.jpg

Advertisement

‘దీదీ’ని విడిచి ఉండలేకపోతున్నా.. టీఎంసీ గూటికి బీజేపీ నేత సోనాలి!

May 22 2021 @ 17:37PMfb-icon.pngwatsapp-icon.pngtwitter-icon.png
05222021173646n65.jpg

 

కోల్‌‌కతా: టీఎంసీ మాజీ ఎమ్మెల్యే సోనాలి గుహ పార్టీని వీడినందుకు తెగ చింతిస్తున్నారు. దీదీపై కోపంతో ఎన్నికలకు ముందు కమలం తీర్థం పుచ్చుకున్న ఆమె దీదీని చూడకుండా ఉండలేకపోతున్నారట. దీంతో ఎప్పుడెప్పుడు తిరిగి సొంత గూటికి చేరుకుందామా? అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి శనివారం లేఖ రాశారు. పార్టీని వీడినందుకు తనను క్షమించాలని, తిరిగి తనను పార్టీలో చేర్చుకోవాలని అందులో కోరారు. మమతకు రాసిన ఈ లేఖను సోనాలి ట్విట్టర్‌లో షేర్ చేశారు. భావోద్వేగంతోనే తాను పార్టీని వీడినట్టు అందులో వివరణ ఇచ్చారు. 

ముక్కలైన హృదయంతో నేను ఈ లేఖ రాస్తున్నా. భావోద్వేగంలో పార్టీని వీడి మరో పార్టీలో చేరా. నేనక్కడ ఇమడలేకపోతున్నా’’ అని అందులో రాసుకొచ్చారు. ‘‘చేప ఎలాగైతే నీళ్లు లేకుండా బతకలేదో.. నేను కూడా మీరు లేకుండా ఉండలేను. దీదీ.. నన్ను క్షమించమని వేడుకుంటున్నా. మీరు క్షమించడం నాకు కావాలి. మీరు క్షమించకుంటే నేను జీవించలేను. నన్ను తిరిగి వెనక్కి రానివ్వండి. మిగతా జీవితమంతా మీ ప్రేమాప్యాయతల మధ్య గడనివ్వండి’’ అని సోనాలి ఆ లేఖలో పేర్కొన్నారు. 

 

నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన గుహ ఒకానొక సమయంలో ముఖ్యమంత్రికి ‘షాడో’ అని కూడా ప్రచారం జరిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా ఆమెకు టికెట్ నిరాకరించడంతో పార్టీని వీడి కాషాయ కండువా పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె పోటీ చేయకపోయినప్పటికీ బీజేపీ బలోపేతానికి పనిచేస్తానని చెప్పుకొచ్చారు.  

 

‘‘బీజేపీలో చేరాలన్న నా నిర్ణయం తప్పు. బీజేపీని వీడుతున్నానని చెప్పడానికి బాధపడను. నేనక్కడ అనవసరమని భావిస్తున్నా. మమతను తిట్టిపోయడానికి నన్ను ఉపయోగించుకోవాలని చూశారు. కానీ నేనా పనిచేయలేదు’’ అని గుహ చెప్పుకొచ్చారు.

 

మమతను కలిసి త్వరలోనే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. తాను వ్యక్తిగతంగా ఆమెను కలవాలని ప్రయత్నించానని, కానీ ముఖ్యమంత్రి కావడంతో నిత్యం బిజీగా ఉంటారని పేర్కొన్నారు. అడగ్గానే కలిసేందుకు సమయమిస్తారని భావించవద్దని అన్నారు. వచ్చే వారం మమతను ఇంటికి వెళ్లి కలిసి మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని సోనాలి వివరించారు. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...