Jump to content

వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కేసులో ప్రతిపక్షాలకు ఊరట


Ramesh39

Recommended Posts

వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కేసులో ప్రతిపక్షాలకు ఊరట
08-04-2019 12:46:17
 
636903243842693964.jpg
 
న్యూఢిల్లీ: వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు కేసులో సుప్రీంకోర్టులో ప్రతిపక్షాలకు ఊరట లభించింది. సోమవారం దీనిపై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో...5 వీవీప్యాట్‌ల స్లిప్పులు లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో 35 వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు జరపాలని పేర్కొంది. 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాల్సిన అవసరం లేదన్న... ఈసీ అభ్యర్థనను ధర్మాసనం కొట్టివేసింది.
 
ఈవీఎంలలో ఏ బటన్ నొక్కినా ఓట్లు బీజేపీకే పడుతున్నాయని ఆరోపిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని 21 పార్టీలకు చెందిన విపక్ష నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా ఉండే ఈవీఎంలలో 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించడానికీ... ఫలితాలు వెల్లడించడానికీ దాదాపు ఆరు రోజులు పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ యేతర పార్టీల బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆరు రోజులు పట్టినా పర్వాలేదనీ, వీవీప్యాట్‌లలోని స్లిప్పులను లెక్కించాలని ఆదేశించాలని కోరింది. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ సమగ్ర విచారణ చేపట్టి... ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
Link to comment
Share on other sites

ఒకటి కాదు.. ఐదు వీవీప్యాట్లు లెక్కించాల్సిందే  

ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం

vvpats.jpg


దిల్లీ: యాభై శాతం వీవీప్యాట్ల లెక్కింపు చేపట్టాలని ప్రతిపక్షాల అభ్యర్థనపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 వీవీప్యాట్లలోని స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చాలని పేర్కొంది. అలాగే లోక్‌ సభ నియోజకవర్గాల్లో అయితే 35 వీవీపాట్ల స్లిప్పులను లెక్కపెట్టాలని తెలిపింది. ఈ విషయంలో ఈసీ అభ్యర్థనను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టి వేసింది. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం నియోజకవర్గానికి కేవలం ఒక్క వీవీప్యాట్‌ స్లిప్‌లనే లెక్కపెడుతున్న విషయం తెలిసిందే.
 

యాభై శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కపెట్టినట్లియితే ఆరు రోజుల ఆలస్యంగా ఫలితాలు వెల్లడవుతాయని ఎన్నికల సంఘం పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై 21 రాజకీయ పార్టీలు స్పందిస్తూ.. ఎన్నికల ఫలితాలు ఆరు రోజులు ఆలస్యమైనా ఫరవాలేదని సుప్రీంకోర్టుకు తెలిపాయి. ఈమేరకు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని విపక్షాలు ప్రమాణపత్రాన్ని సమర్పించాయి. ఎన్నికల ప్రక్రియ నిబద్ధతను కాపాడేటట్లయితే ఇదేమీ ఎక్కువ సమయం కాదని పేర్కొన్నాయి.  సిబ్బంది సంఖ్యను పెంచితే ఆలస్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని చెప్పాయి. పారదర్శక ఎన్నికలు, ప్రజా ప్రయోజనం కోసమే పిటిషన్‌ వేశామని ప్రమాణపత్రంలో స్పష్టం చేశాయి. ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించడం తమ ఉద్దేశం కాదని, ఎన్నికల ప్రక్రియ నిబద్ధతపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకేనని పేర్కొన్నాయి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...