Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

APNRT Icon Towers

Featured Replies

1 hour ago, ramntr said:

Adega middle class badha.. ఆ prices ni bharinchalem.. If activity increased n more jobs then understandable but ippude Ala vunte repu ఎలా.. 

Bro! Now rates are reasonable for middle class. Time to invest and get benefits ?

  • Replies 119
  • Views 11.9k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • darsincha le recent ga,.. leader ki salaam,.. prices ki lal salaam

  • sonykongara
    sonykongara

    ఏపీఎన్‌ఆర్‌టీ భవన నిర్మాణానికి తొలి అడుగు రాజధాని అమరావతిలో మరో కీలక నిర్మాణానికి వారం రోజుల్లో ముందడుగు పడనుంది. ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీ) భవన నిర్మాణ పన

  • Author
1 hour ago, sonykongara said:
ఏపీఎన్‌ఆర్‌టీ చుట్టూ 100 ఫ్లాట్లు 

 

‘యు’ ఆకారంలో నిర్మాణం... నెల రోజుల్లో అమ్మకానికి 
ఐకాన్‌ భవనం కింద సర్వీస్‌ అపార్టుమెంట్లు... వాణిజ్య సముదాయాలు 
ఈనాడు డిజిటల్‌ - అమరావతి

21ap-main2a_3.jpg

ఆంధ్రప్రదేశ్‌ ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీ) భవనం చుట్టూ ఆంగ్ల అక్షరం ‘యు’ ఆకారంలో కొత్తగా 100 ఫ్లాట్లు రానున్నాయి. ఒక్కొక్క ఫ్లాటు విస్తీర్ణం 3000- 4000 చదరపు అడుగులు ఉంటుంది. డిజైన్‌ను రెండ్రోజుల క్రితమే ఆమోదించారు. వీటిని నెల రోజుల్లో బుకింగ్‌కు ఉంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా కేవలం ఎన్‌ఆర్‌ఐల ద్వారా సేకరించిన మొత్తంతోనే ఏపీఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ భవనాన్ని అత్యాధునిక హంగులతో కృష్ణా నదికి సమీపంలో నిర్మించనున్నారు. అమరావతి పరిపాలన నగరికి చేరువగా రూ.500 కోట్లతో 33 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తారు. ఇప్పుడు ఈ భవనం చుట్టూ కొత్తగా నిర్మించే వంద ఫ్లాట్లను ఎన్‌ఆర్‌ఐలే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. భవనం కింది భాగంలో సర్వీస్‌ అపార్టుమెంట్లు (హోటళ్లు), వాణిజ్య సముదాయాలు నిర్మించనున్నారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 ఫ్లాట్లు అందుబాటులోకి తీసుకువస్తారు. ఒక్కొక్కటి వెయ్యి నుంచి 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కలిగి ఉంటాయి. వీటిని వారం రోజుల్లో బుకింగ్‌కు ఉంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో చ.అ. కనీస ధర రూ.7,000కి మించి ఉండే అవకాశం ఉంది. 
హాట్‌ కేకుల్లా 124 ఫ్లాట్ల అమ్మకం 
ఆన్‌లైన్‌లో బుకింగ్‌ ప్రారంభించిన గంట వ్యవధిలోనే ఏపీఎన్‌ఆర్‌టీ భవనంలో 124 ఫ్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆంగ్ల ఆక్షరం ‘ఎ’ అకారంలో ఉండే ఐకాన్‌ భవనంలో మొత్తం 132 ఫ్లాట్లు ఉంటాయి. ఒక్కొక్కటి 5,000 చ.అ. విస్తీర్ణంలో నిర్మిస్తారు. వీటిని నివాసాలుగానే కాకుండా కార్యాలయాలకూ వినియోగించుకోవచ్చు. ఇందులోనే రివాల్వింగ్‌ హోటల్‌, ఈత కొలను వంటివీ ఉంటాయి. ఒక్కో చ.అ. కనీస ధర రూ.5,500గా నిర్ణయించారు. 80 శాతం మేర ప్రవాసాంధ్రులు అమెరికా నుంచే బుకింగ్‌ చేసుకున్నారు. కువైట్‌, యూకే, ఆస్ట్రేలియాలలో ఉన్నవారి నుంచి కూడా ఆసక్తి వ్యక్తమయింది. అమరావతి సందర్శనకు వచ్చే పర్యాటకులను ఆకర్షించేలా ఏపీఎన్‌ఆర్‌టీ అధికారులు ఐకాన్‌ భవన డిజైన్‌ను తీర్చిదిద్దారు. భవనం మధ్యలో గ్లోబ్‌ ఆకారంలో నిర్మాణాన్ని ఎల్‌ఈడీ బల్బులతో నింపనున్నారు. గ్లోబ్‌ కింది భాగంలో లేజర్‌ దీపాలను ఏర్పాటు చేస్తారు. వీటి సాయంతో అత్యాధునిక 7డీ సాంకేతికతను ఉపయోగించి ప్రతిరోజూ రాత్రి 7:30, 9:30 గంటలకు లేజర్‌ షోను సందర్శకులు తిలకించేలా ఏర్పాటు చేస్తారు.

 

AP nrt  LO MANA DB vallu okkarau anna konadi sami memu m peru cheppukoni vcchi chusthamu

30 minutes ago, sonykongara said:

AP nrt  LO MANA DB vallu okkarau anna konadi sami memu m peru cheppukoni vcchi chusthamu

7500 per sq. ft petti kone capacity unnodu ee db lo enduku untadu sony bro. mostly businessman untaru. :D

  • 1 month later...
  • 6 years later...
  • Author

అమరావతిలో ఎన్‌ఆర్టీ ఐకానిక్‌ టవర్‌.. మంత్రి కొండపల్లి ఆధ్వర్యంలో కమిటీ

రాజధాని అమరావతిలో ఎన్‌ఆర్టీ సొసైటీ ఐకానిక్‌ టవర్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Eenadu icon
By Andhra Pradesh News TeamPublished : 21 Feb 2025 20:50 IST
Ee
Font size
 
 
 
 
1 min read
 
 

125033033_21nrt-1a.webp

అమరావతి: రాజధాని అమరావతిలో ఎన్‌ఆర్టీ సొసైటీ ఐకానిక్‌ టవర్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ నేతృత్వంలో.. తొమ్మిది మంది అధికారులతో  ప్రాజెక్టు కమిటీ ఏర్పాటైంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే బాధ్యతలను కమిటీకి అప్పగిస్తూ సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. పెట్టుబడిదారులు, టెండర్లు, పెండింగ్‌ కేసుల పరిష్కారం తదితర అంశాలను కమిటీ పర్యవేక్షించనుంది.Image

image.png

  • Author

ఏపీఎన్‌ఆర్‌టీ భవన నిర్మాణానికి తొలి అడుగు

రాజధాని అమరావతిలో మరో కీలక నిర్మాణానికి వారం రోజుల్లో ముందడుగు పడనుంది. ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీ) భవన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 09 May 2025 05:44 IST
Ee
Font size
 
 
 
 
1 min read
 
 

సబ్‌ సర్ఫేస్‌ టెండర్ల ఖరారు

ap080525main14a.webp

ఇటీవల ఏపీఎన్‌ఆర్‌టీ బిల్డింగ్‌ నమూనాను ఆవిష్కరిస్తున్న సీఎం చంద్రబాబు, పక్కన ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధులు

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో మరో కీలక నిర్మాణానికి వారం రోజుల్లో ముందడుగు పడనుంది. ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీ) భవన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ భవనాన్ని మూడు విడతల్లో నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొదటి దశలో సబ్‌ సర్ఫేస్‌ (పునాది), తదుపరి బిల్డింగ్‌ సూపర్‌ స్ట్రక్చర్, అనంతరం బయటికి కనిపించే అందమైన భాగం కడతారు. ఇప్పటికే పునాదికి సంబంధించి టెండర్ల ప్రక్రియను ఏపీఎన్‌ఆర్‌టీ అధికారులు పూర్తిచేశారు. ఆస్ట్రేలియా-యూకేకి చెందిన కెల్లర్‌ సంస్థ ఈ పనుల్ని దక్కించుకుంది. వీటిని మూడు నెలల్లో పూర్తి చేయనుంది. ఆలోగా బిల్డింగ్‌ సూపర్‌ స్ట్రక్చర్‌ నిర్మాణానికి టెండర్లు పిలవనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ భవనాన్ని 2028 నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం.

ap080525main14b.webp

ఏపీఎన్‌ఆర్‌టీ భవన నమూనా 

30 వేల మందికి ఉపాధి

ఏపీఎన్‌ఆర్‌టీ.. రూ.600 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించనుంది. దీనికయ్యే వ్యయాన్ని ఎన్‌ఆర్‌ఐలే భరించనున్నారు. మొత్తం 36 అంతస్తులతో జంట టవర్లు నిర్మిస్తారు. పార్కింగ్‌ కోసం రెండంతస్తుల సెల్లారు, దానిపై పోడియం ఉంటుంది. ఆపై 33 అంతస్తులు నిర్మిస్తారు. ఒక్కో టవర్‌లో 29 అంతస్తులుంటాయి. ఒక టవర్‌లో అంతస్తుకు రెండు చొప్పున రెసిడెన్షియల్‌ ఫ్లాట్లు ఉంటాయి. రెండో టవర్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. ఆయా కంపెనీల ద్వారా సుమారు 30 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశముంది. రెండు టవర్లనూ కలుపుతూ పైన నాలుగంతస్తులు నిర్మిస్తారు. వాటిని వాణిజ్య అవసరాలకు వినియోగించనున్నారు.

  • 3 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • Author

ఎన్‌ఆర్‌ఐల ఉద్యోగ కల్పనకు ‘సీఎక్స్‌వో’ క్లబ్‌

 

Eenadu icon
By Andhra Pradesh News DeskUpdated : 28 Jun 2025 06:26 IST
Ee
Font size
 
 
 
 
3 min read
 
 

ప్రపంచంలోని వివిధ కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు
నిరుద్యోగ యువత సమాచారం వారికి చేరవేత
ఎన్‌ఆర్‌ఐలను ఆంత్రప్రెన్యూర్లుగా మార్చేందుకు చర్యలు
ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ అధ్యక్షుడు వేమూరి రవికుమార్‌ 

ap270625main36a.webp

బాధ్యతలు స్వీకరించిన వేమూరి రవికుమార్‌ను అభినందిస్తున్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌

ఈనాడు, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా నెలకొన్న నేపథ్యంలో విదేశాల్లో ఉండి ఉద్యోగాలు లేని తెలుగు యువతకు ఉద్యోగ కల్పనకుగాను ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనతో ‘సీఎక్స్‌వో’ క్లబ్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌) అధ్యక్షుడు వేమూరి రవికుమార్‌ ప్రకటించారు. ఇందులో ప్రపంచంలోని వందల కంపెనీలకు చెందిన సీఈవో, సీఐవో, సీటీవోలను చేర్చి.. ఉద్యోగాలు దక్కక ఇబ్బందులుపడే తెలుగు యువత సమాచారం వారికి అందిస్తామని చెప్పారు. అదే సమయంలో ఆయా కంపెనీలకు అవసరమయ్యే నైపుణ్యాన్ని కూడా సదరు ఎన్‌ఆర్‌ఐ యువతకు అందించే బాధ్యతను తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి వెళ్లే తెలుగు యువత సమాచారాన్ని కూడా సీఎక్స్‌వోలోని ప్రతినిధులకు అందించి వారి ఉపాధి అవకాశాల మెరుగుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తాడేపల్లిలోని కార్యాలయంలో శుక్రవారం ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ అధ్యక్షుడు, ప్రవాస తెలుగు వ్యవహారాల సలహాదారుగా వేమూరి రవికుమార్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, పలువురు నేతలు ఆయన్ను అభినందించారు. అనంతరం వేమూరి రవికుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ‘వైకాపా ప్రభుత్వంలో ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ ద్వారా ఎన్‌ఆర్‌ఐల ఎంపవర్‌మెంట్‌ తగ్గింది. వారి ఆదాయం 50 శాతం పెరగాలని సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఉద్యోగాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలను ఆంత్రప్రెన్యూర్లుగా మార్చాలని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా తెలుగు యువతను ఆంత్రప్రెన్యూర్లుగా చేయడం కోసం ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్‌ క్లబ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఎన్‌ఆర్‌ఐలు ఇక్కడి ఉత్పత్తులు విదేశాల్లో, అక్కడివి రాష్ట్రానికి తెచ్చి విక్రయించేందుకు సహకారమందిస్తాం. రాష్ట్రానికి చెందిన వారికి విదేశాల్లో మంచి ఉద్యోగాలు కల్పించేందుకు ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ కోఆర్డినేటర్లందరినీ నియామక ఏజెంట్ల తరహాలో మార్చబోతున్నాం’ అని వివరించారు. 

ఎన్‌ఆర్‌ఐల నుంచి పెట్టుబడుల ఆకర్షణ

‘ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌లో 1.25 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. దీన్ని 5 రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎన్‌ఆర్‌ఐల నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించేందుకు ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ లైజనింగ్‌ చేస్తుంది. వారి బాగోగులు చూసుకునేందుకు బీమా ప్రయోజనాన్ని కల్పిస్తాం. గతేడాది 35 వేల మంది తీసుకున్నారు. దాన్ని పది రెట్లు పెంచబోతున్నాం’ అని పేర్కొన్నారు

ఇక విదేశాల్లో కనకదుర్గమ్మ పూజలు.. శ్రీశైలం మల్లన్న అభిషేకాలు

‘మన చరిత్ర, సంస్కృతి, సాహిత్యం ప్రపంచంలోని తెలుగు వారికంతా తెలియజేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. శ్రీవారి కల్యాణోత్సవాలను వివిధ దేశాల్లో తితిదే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఇదే తరహాలో కనకదుర్గమ్మ అమ్మవారి పూజలు, శ్రీశైలం మల్లన్న అభిషేకాలను కూడా నిర్వహిస్తాం. వ్యవస్థీకృతంగా ఈ వేడుకలను నిర్వహిస్తాం. ఏ దేశంలో ఉన్న వారు అక్కడే పూజలు చేసుకోవచ్చు’ అని తెలిపారు.

రెండేళ్లలో ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ పూర్తి

‘ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ భవనాన్ని ప్రవాసాంధ్రుల నిధులతో చేపడుతున్నాం. వైకాపా ప్రభుత్వం దీన్ని పూర్తిగా పక్కన పెట్టింది. తాజాగా పనులు ప్రారంభించాం. రెండేళ్లలో పూర్తి చేస్తాం. రూ.950 కోట్లతో రాష్ట్రానికి గర్వకారణంగా నిర్మిస్తాం’ అని వెల్లడించారు.

ఉద్యోగాలకు అమెరికా స్వర్గధామమేమీ కాదు

ఉద్యోగాలకు అమెరికా స్వర్గమనే అభిప్రాయం ఉంది. నిన్నమొన్నటి వరకు అవకాశాలు కూడా విచ్చలవిడిగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాలసీల్లో మార్పులొచ్చాయి. ఇక్కడున్న అవకాశాలను వదులుకుని కళ్లు మూసుకుని అమెరికా వెళ్లడం అంత సరికాదు. విదేశాల్లో ఏ తప్పూ చేయకుండా ఇబ్బంది పడే ఎన్‌ఆర్‌ఐలకు అండగా ఉంటాం. అక్కడి నిబంధనలు అతిక్రమించిన వారికి భవిష్యత్తులో అలా వ్యవహరించకుండా అవసరమైన సలహాలు, సూచనలిస్తాం. ఎన్‌ఆర్‌ఐలకు రాష్ట్రంలో ఉండే సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం’ అని వివరించారు.

  • Author

రెండేళ్లలో ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ పూర్తి

‘ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ భవనాన్ని ప్రవాసాంధ్రుల నిధులతో చేపడుతున్నాం. వైకాపా ప్రభుత్వం దీన్ని పూర్తిగా పక్కన పెట్టింది. తాజాగా పనులు ప్రారంభించాం. రెండేళ్లలో పూర్తి చేస్తాం. రూ.950 కోట్లతో రాష్ట్రానికి గర్వకారణంగా నిర్మిస్తాం’ అని వెల్లడించారు.

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.