Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Alluri Sitarama Raju International Airport #Bhogapuram

Featured Replies

  • Replies 325
  • Views 28.8k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • sonykongara
    sonykongara

    Dr.Koneru bro help chesadu avi open cheyyataniki

  • Siddhugwotham
    Siddhugwotham

    Nice to see Old Threads

  • Gmr అయితే good, తెలుగు వాడు n Cbn ki ఎంతో kontha favor ga vunde vadu n more over they are proved.... 

Posted Images

  • Author
జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాకు విశాఖ విమానాశ్రయ కాంట్రాక్టు?

 

ap-main21a_1.jpg

ఈనాడు, హైదరాబాద్‌: విశాఖపట్నం సమీపంలోని భోగాపురంలో ప్రతిపాదించిన నూతన అంతర్జాతీయ విమానాశ్రయ కాంట్రాక్టును జీఎంఆర్‌ గ్రూపు దక్కించుకోనుందని తెలుస్తోంది. అదే జరిగితే దేశంలో మూడో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దక్కించుకున్న ప్రత్యేకత ఈ సంస్థకు లభిస్తుంది. జీఎంఆర్‌ గ్రూపు ఇప్పటికే దిల్లీ, హైదరాబాద్‌ విమానాశ్రయాలను నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఇందులో హైదరాబాద్‌ విమానాశ్రయాన్ని పూర్తిగా కొత్తగా నిర్మించారు. దిల్లీలో పాత విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. విశాఖ నూతన విమానాశ్రయాన్ని కొత్తగా నిర్మించే అవకాశం ఈ సంస్థకు లభించనుందని సమాచారం. దీనికోసం ప్రాధమికంగా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పోటీపడ్డాయి. జీఎంఆర్‌ గ్రూపు, జీవీకే, డూఇట్‌ ఇన్‌ఫ్రా, ఐ-ఇన్వెస్ట్‌మెంట్‌, ఎన్‌ఐఐఎఫ్‌, ఎస్సెల్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా ఇందులో ఉన్నాయి. కానీ గడువు ముగిసే సమయానికి మూడు సంస్థలు... జీఎంఆర్‌, జీవీకే, డూఇట్‌ ఇన్‌ఫ్రా మాత్రమే ఆర్థిక బిడ్లు దాఖలు చేశాయి. ఈ బిడ్లను మంగళవారం తెరిచి చూశారు. దీని ప్రకారం మొదటి స్ధానంలో జీఎంఆర్‌ గ్రూపు ఉన్నట్లు అటు రాష్ట్ర అధికార వర్గాలు, ఇటు జీఎంఆర్‌ గ్రూపు నిర్ధారించాయి. దీని ప్రకారం ఈ సంస్థకే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ కాంట్రాక్టు దక్కుతుందని స్పష్టమవుతోంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాతే అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కొత్తగా నిర్మించడంతో పాటు, 40 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టు సంస్థకే ఉంటుంది.

ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న విమానాశ్రయం భారత నౌకాదళానికి చెందినది. దీని ద్వారా గత ఏడాదిలో 23.30 లక్షల మంది ప్రయాణించారు. అంతేగాక 5,000 టన్నుల సరకు రవాణా నమోదైంది. గత నాలుగేళ్లలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఏటా 14 శాతం చొప్పున ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సరకు రవాణా విషయానికి వస్తే, దేశంలో 5వ పెద్ద విమానాశ్రయంగా ఇది ఉంది.

విశాఖపట్నం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతిపాదిక భోగాపురం విమానాశ్రయం విజయనగరానికి కూడా దగ్గరే. విజయనగరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. ఇక్కడ విమానాశ్రయం నిర్మాణానికి రూ.2,500 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. తొలిదశలో ఏటా 60 లక్షల మంది ఇక్కడ నుంచి ప్రయాణించగలిగే విధంగా విమానాశ్రయాన్ని నిర్మించాలనేది ప్రతిపాదన. దీనికోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 3,000 ఎకరాల స్థలాన్ని సేకరించింది.  దేశానికి తూర్పు మధ్య తీరంలో ఇదే పెద్ద విమానాశ్రయం అవుతుందని, ఈ ప్రాంతం సత్వర అభివృద్ధి సాధించడానికి దోహదపడుతుందని జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా వర్గాలు అభిప్రాయపడ్డాయి. విమానాశ్రయంతో పాటు ఇక్కడ ఎంఆర్‌ఓ (మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఆపరేషన్స్‌) సదుపాయాన్ని, సరకు రవాణా కేంద్రాన్ని నిర్మిస్తారు.

ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మిస్తాం
భోగాపురం విమానాశ్రయాన్ని దక్కించుకోవటం జరిగితే తమ ప్రతిష్ఠ ఎంతగానో పెరిగినట్లు  అవుతుందని జీఎంఆర్‌ గ్రూపు బిజినెస్‌ ఛైర్మన్‌ జీబీఎస్‌ రాజు అభిప్రాయపడ్డారు. ఇక్కడ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అత్యుత్తమ విమానాశ్రయాన్ని నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. తద్వారా ఇక్కడ సత్వర పారిశ్రామికాభివృద్ధికి కూడా తాము ప్రయత్నిస్తామని తెలిపారు.

 

  • Author
భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి జీఎంఆర్‌ చేతికి
27-02-2019 00:36:54
 
636868246149516933.jpg
  • అత్యధిక బిడ్‌ను దాఖలు చేసిన కంపెనీ
  • తొలి దశలో 60 లక్షల ప్రయాణికుల సామర్థ్యంతో నిర్మాణం
  • ఇందుకు రూ.2,300 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్‌, ఆంధ్రజ్యోతి బిజినెస్‌ : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సమీపంలో ప్రతిపాదించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనుబంధ కంపెనీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ (జీఏఎల్‌) అభివృద్ధి చేయనుంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ విమానాశ్రయం అభివృద్ధి, కార్యకలాపాల నిర్వహణ తదితరాలను చేపట్టడానికి జీఏఎల్‌ అత్యధిక ఆర్థిక బిడ్‌ను దాఖ లు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. మొదటి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే విధంగా దీన్ని రూపొందిస్తారు. ఇందుకు దాదాపు రూ.2,300 కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా తెలిపింది. భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి చేసే పనులను అప్పగించే ప్రక్రియను 2018, నవంబరులో ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఏడీసీఎల్‌) ప్రారంభించింది. ఆసక్తి ఉన్న కంపెనీల నుంచి ప్రాథమిక బిడ్‌లను కోరింది. అభివృద్ధి చేసిన తర్వాత విమానాశ్రయాన్ని 40 ఏళ్లపాటు నిర్వహించాల్సి ఉంటుంది.
 
ఈ కాలంలో నవీకరణ, విస్తరణ మొదలైనవి చేపట్టే విధంగా బిడ్‌లను ఆహ్వానించింది.. ప్రాథమిక బిడ్లను దాఖలు చేసిన కంపెనీల నుంచి జీఎంఆర్‌ గ్రూప్‌, జీవీకే, డోల్ట్‌ ఇన్‌ఫ్రా, ఐ-ఇన్వె్‌స్టమెంట్‌, ఎన్‌ఐఐఎఫ్‌, ఎస్సెల్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా కంపెనీలను షార్ట్‌లిస్ట్‌ చేసింది. ఈ కంపెనీల్లో జీఎంఆర్‌ గ్రూప్‌, జీవీకే, డాల్ట్‌ ఇన్‌ఫ్రాలు మాత్రమే ఫైనాన్షియల్‌ బిడ్లను దాఖలు చేశాయి. విమానాశ్రయం అభివృద్ధికి అత్యధిక బిడ్‌ను దాఖలు చేసిన జీఎంఆర్‌ను ఎంపిక అయింది. కొత్తగా అభివృద్ధి చేస్తున్న విమానాశ్రయం విశాఖపట్నానికి 45 కిలోమీటర్లు, విజయనగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న విమానాశ్రయం నుంచి 2018లో దాదాపు 23.3 లక్షల మంది ప్రయాణం చేశారు. 5,000 టన్నుల కార్గో రవాణా జరిగింది. గత నాలుగేళ్లుగా ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు నిర్వహిస్తున్న ప్రయాణికుల సంఖ్య ఏడాదికి 14 శాతం చొప్పున పెరుగుతోంది.
 
ప్రయాణికుడికి రూ.303 చెల్లింపు
ఒక్కో ప్రయాణికుడికి రూ.303 చెల్లించే విధంగా జీఎంఆర్‌ అత్యధిక బిడ్‌ను దాఖలు చేసింది.. ఫైనాన్షియల్‌ బిడ్లను దాఖలు చేసిన మిగిలిన రెండు కంపెనీల్లో జీవీకే రూ.207, డోల్ట్‌ ఇన్‌ఫ్రాలు రూ.261 చెల్లించడానికి ముందుకు వచ్చాయి. అత్యధిక బిడ్‌ను దాఖలు చేసిన జీఎంఆర్‌కు నిర్మాణం పనులను అవార్డు చేసే ప్రక్రియ 2-4 వారాల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తం 1.8 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు నిర్వహించే విధంగా మూడు దశల్లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకు రూ.4,000 కోట్లకు పైగా ఖర్చు కానుంది.
 
 
2703 ఎకరాల్లో..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మొత్తం 2703 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్‌ ఎయిర్‌పోర్ట్‌గా దీన్ని అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలోనే భోగాపురం విమానాశ్రయంలో ఏరోసిటీ, మెయింటెనెన్స్‌, రిపేర్‌ అండ్‌ ఓవర్‌ హాలింగ్‌ (ఎంఆర్‌ఓ) కేంద్రం, ఏవియేషన్‌ అకాడమీని ఇక్కడ నెలకొల్పనున్నారు. వ్యూహాత్మక ప్రదేశంలో తూర్పు తీర ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్న భోగాపురం విమానాశ్రయం ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమల అభివృద్ధికి, విమానయాన సేవల విస్తరణకు దోహదం చేయనుంది. రిటైల్‌, ఆతిథ్యం వంటి పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందే వీలుందని జీఎంఆర్‌ గ్రూప్‌ బిజినెస్‌ ఛైర్మన్‌ జిబిఎస్‌ రాజు తెలిపారు. జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ నిర్మించి, నిర్వహిస్తున్న విమానాశ్రయాల్లో మరో కీలక విమానాశ్రయం చేరనుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న భోగాపురం విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా పురోగతికి దోహదం చేయగలదన్నారు. ప్రపంచంలోనే ప్రధాన విమానాశ్రయాల అభివృద్ధి నిర్వహణ కంపెనీగా జీఎంఆర్‌ అభివృద్ధి చెందే దిశలో ఈ విమానాశ్రయం కీలకమవుతుందన్నారు.
  • 5 years later...
  • Author

Change of guard in Andhra Pradesh brings MRO facility at proposed Bhogapuram airport to focus

The YSRCP, after coming to power in 2019, shelved the MRO proposal and kept aside 500 acres earmarked for it for other purposes

Published - June 11, 2024 07:56 pm IST - VIZIANAGARAM

READ LATER
PRINT
The site for the greenfield airport proposed at Bhogapuram in Vizianagaram district.

The site for the greenfield airport proposed at Bhogapuram in Vizianagaram district. | Photo Credit: File photo

The National Democratic Alliance (NDA) government in Andhra Pradesh is expected to focus on the Maintenance, Repairs and Overhaul (MRO) facility, adjacent to the Bhogapuram international airport.

The TDP, during its tenure between 2014 and 2019, proposed the MRO. Of the total 2,700 acres earmarked for the Bhogaopuram airport project, 500 acres were allocated for the MRO facility. However, the YSRCP government, after coming to power in 2019, shelved the proposal and kept aside this 500 acres for other purposes.

Then Union Minister for Civil Aviation P. Ashok Gajapathi Raju, who strongly vouched for the MRO facility and other industries related to the aviation sector, expressed displeasure over the move of diverting the land parcel meant for the MRO facility.

 
 
 

Now that the TDP-JSP-BJP alliance is all set to form the government, a comprehensive plan is expected to be executed to stimulate financial activity in and around Bhogapuram in Vizianagaram district.

Srikakulam MP K. Ram Mohan Naidu, the Union Minister for Civil Aviation, is expected to the move this file again. He is likely to review the progress and pending works soon. Vizianagaram MP Kalisetti Appalanaidu, who met Mr. Ram Mohan Naidu in New Delhi, hoped that the NDA government would ensure speedy development of the district while concentrating on the Bhogapuram airport and other projects.

Meanwhile, Vizianagaram MLA-elect Aditi Gajapathi Raju assured that she would strive to ensure hassle-free connectivity between Vizianagaram and Bhogapuram via Chintalavalasa by laying an 80-feet road. “The previous government ignored all important projects including road connectivity to the proposed airport at Bhogapuram from Vizianagaram. We will bring the issue to the notice of the new government,” she said.

  • 2 weeks later...
2 hours ago, narens said:

2027 ki full fledged ga rollout ayyi .akkada youth ki employment generate ayyithe thats more than enough

Indirect employment and economic activities peruguthayi... dependent companies vasthayi

Also Vizag woon will become like Hyd international airport .... no big airport close by...

Old airport restrictions valana no of flights takkuva... now ekkuvagaa vasthayi

4 minutes ago, NatuGadu said:

Indirect employment and economic activities peruguthayi... dependent companies vasthayi

Also Vizag woon will become like Hyd international airport .... no big airport close by...

Old airport restrictions valana no of flights takkuva... now ekkuvagaa vasthayi

Easy ga madhurawada to bhogapuram down town city ayye chances ekkuva my dream to see it like that... Yes ipudu vunna airport naval base so lot of restrictions for night landing expansion of runway etc... Idi vasthe UA and east valaki super vuntundi... Hyd has no port whereas vizag has it so biggest advantage 

  • Author
21 minutes ago, OneAndOnlyMKC said:

Easy ga madhurawada to bhogapuram down town city ayye chances ekkuva my dream to see it like that... Yes ipudu vunna airport naval base so lot of restrictions for night landing expansion of runway etc... Idi vasthe UA and east valaki super vuntundi... Hyd has no port whereas vizag has it so biggest advantage 

Ipuudu unna Airport  Pharmaceutical Cargo Handling ki saripovtam ledu, kotha Airport tho  Pharma and  Aqua exports ki boost.

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.