Yesterday at 07:27 AM1 day Author వైభోగాపురంBy Andhra Pradesh News DeskPublished : 10 Jul 2026 04:01 ISTEeFont size4 min readఆధునికత, సాంకేతికతల కలబోతగా అంతర్జాతీయ విమానాశ్రయంగడువుకు ముందే పూర్తయిన నిర్మాణంరాష్ట్ర చరిత్రలో మరో సువర్ణ అధ్యాయంఈనాడు - విజయనగరంవిజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమవబోతోంది.. రాష్ట్ర చరిత్రలో మరో సువర్ణాధ్యాయం ఆవిష్కృతమవబోతోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక, సాంకేతికత, భారీ మౌలిక వసతులతో గడువుకు ముందే నిర్మాణం పూర్తయింది. ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్‌లా.. పర్యాటకం సహా పలు రంగాల ప్రగతి సాధనకు గేమ్ ఛేంజర్‌గా మారనుంది.అత్యాధునిక వసతులురన్వే: ఎయిర్ బస్, బోయింగ్ విమానాలు సులభంగా ల్యాండయ్యేలా 3,800 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పున కేట్ ఐ -1 రన్‌వే కార్గో టెర్మినల్: 5 వేల చ.మీ. విస్తీర్ణంలో 25 వేల టన్నుల సరకు రవాణా టెర్మినల్ప్రయాణికుల టెర్మినల్ బిల్డింగ్: రెండు అంతస్తుల్లో 79 వేల చ.మీ విస్తీర్ణం. చెక్‌ఇన్, బ్యాగేజ్ రీక్లెయిమ్, అవుట్‌బౌండ్- ఇన్‌బౌండ్ బ్యాగేజ్ స్క్రీనింగ్, ఎయిర్‌లైన్ కార్యాలయాలు, సేవా ప్రాంతాలు.. ప్రయాణికుల భద్రత స్క్రీనింగ్, ఇమిగ్రేషన్, ఎమిగ్రేషన్, కార్యాలయాలు, వాణిజ్య స్థలాలు. ఆహార, పానీయాల సేవలు.. టెర్మినల్ పైకప్పు కింద ఎయిర్‌పోర్ట్ ప్లాజా, సెల్ఫ్ సర్వీస్ కియోస్కులు, టికెట్ కౌంటర్లు, రిటైల్ యూనిట్లు, ఆహార పానీయాల అవుట్‌లెట్లు, ప్యాసింజర్ టెర్మినల్ లోపల ప్రయాణికులు, సామగ్రి స్క్రీనింగ్, సిబ్బంది తనిఖీలు, వస్తువుల డెలివరీకి నిబంధనలకు అనుగుణంగా భద్రత వ్యవస్థలు..ఏటీసీ టవర్: 55 మీటర్ల ఎత్తులో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం. 360 డిగ్రీల్లో ఏరో డ్రోమ్ విమాన సమాచార సేవలుఎంఆర్వో: 25 ఎకరాల్లో విమానాల నిర్వహణ, మరమ్మతుల ఓవర్‌హాల్ (ఎంఆర్‌వో).. యాప్రాన్లు, విమానాలు కడిగే ప్రదేశాలు, ఎయిర్‌సైడ్, ల్యాండ్ సైడ్ సర్క్యులేషన్, హ్యాంగర్లు, ఇంజిన్ రన్‌అప్ బేలు విమానాశ్రయం విహంగ వీక్షణంప్రత్యేక ఆకృతిజీఎంఆర్ సంస్థ ఈ విమానాశ్రయంపై ప్రత్యేక శ్రద్ధ చూపింది. సముద్ర తీరానికి సమీపంలో ఉండటంతో ఎగిరే చేప ఆకృతిలో నిర్మించింది. విమానాశ్రయ టెర్మినల్ సీలింగ్ సంప్రదాయ ముగ్గుల థీమ్‌తో అలరిస్తోంది. దీనికి అనుబంధంగా కమర్షియల్ హబ్, హోటళ్లు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లతో జీఎంఆర్ ఏరో సిటీ అభివృద్ధి చేశారు. విశాఖపట్నం నుంచి విమానాశ్రయానికి అనుసంధానంగా చేపట్టిన ఏడు రోడ్లలో ఐదు పూర్తయ్యాయి. మిగిలిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తొలి దశలో ప్రయాణికుల సామర్థ్యం ఏడాదికి 60 లక్షల మంది.. విస్తరణ రెండో దశలో 1.2 కోట్లకు.. మూడో దశలో పూర్తి స్థాయి అభివృద్ధితో 1.8 కోట్ల మందికి సేవలు చేరువ చేయాలని లక్ష్యం నిర్దేశించారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ప్రయాణికుల రవాణాతోపాటు వ్యవసాయ, సముద్ర, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు ఊపందుకోనున్నాయి.తొలి దశలో ఇలా.. శంకుస్థాపన: 2023 మే 3నిర్మాణ వ్యయం: రూ.4,750 కోట్లువిస్తీర్ణం: 2,203 ఎకరాలు500 ఎకరాల్లో విమానయాన అనుబంధ పరిశ్రమలుకూటమి ప్రభుత్వం జీఎంఆర్ సంస్థకు అదనంగా అప్పగించిన 500 ఎకరాల్లో విమానయాన అనుబంధ పరిశ్రమలు నెలకొల్పుతారు. భీమిలి మండలం అన్నవరంలో 136.33 ఎకరాల్లో జీఎంఆర్- మాన్సాస్ ఎడ్యుసిటీ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పైలట్లు, ఏరోస్పేస్ ఇంజినీర్లు, రక్షణ రంగ నిపుణులను తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం.బ్యాగేజ్ స్కానింగ్ కౌంటర్లుసైక్లోన్ ప్రూఫ్ ఎయిర్‌పోర్టు తీరంలో తుపాన్ల తాకిడిని దృష్టిలో ఉంచుకుని గంటకు 275 కి.మీ. వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా విమానాశ్రయాన్ని నిర్మించారు. భద్రతా తనిఖీల్లో ప్రయాణికుల సౌలభ్యం కోసం 12 డిజి యాత్ర పాడ్‌లు, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ కౌంటర్లు ఏర్పాటు చేశారు.39 ఎకరాల్లో టౌన్షిప్దిల్లీలో మాదిరి భోగాపురం విమానాశ్రయానికి ఎదురుగా 139 ఎకరాల్లో జీఎంఆర్ టౌన్‌షిప్ నిర్మించనున్నారు. ఇందులోనే మోడ్రన్ ఇంటర్నేషనల్ స్కూల్, ఆధునిక వసతులతో ఆసుపత్రి నెలకొల్పుతారు. విమానాశ్రయ రక్షణను పర్యవేక్షించే కేంద్ర పారిశ్రామిక భద్రత దళం అధికారులు, సిబ్బందికి నివాస గృహ సముదాయం నిర్మించనున్నారు. విధుల్లో వారికి సహకరించే శునకాలకు ప్రత్యేకంగా కెన్నెల్ ఏర్పాటు చేయనున్నారు.యువతకు నైపుణ్య శిక్షణ వరలక్ష్మి ఫౌండేషన్ తరఫున.. 200 మంది నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ప్రారంభించారు. ఉచిత భోజనం, వసతితో యువతీ, యువకులకు 60 రోజుల పాటు బృందాల వారీగా శిక్షణ ఇస్తారు. వారికి ఈ పరిసరాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు.చెక్ ఇన్ కౌంటర్లు: 40 స్క్రీనింగ్ ఏటీఆర్డొమెస్టిక్: 10, ఇంటర్నేషనల్: 5, ఇ-గేట్లు :10బస్ గేట్లు: డొమెస్టిక్ 8, ఇంటర్నేషనల్ 2బ్యాగేజ్ బెల్ట్‌లు: డొమెస్టిక్ 5, ఇంటర్నేషనల్ 2ఇమిగ్రేషన్ ఎరైవల్స్ : 10 కేంద్రాలు ఇమిగ్రేషన్ డిపార్చర్స్ : 10 కేంద్రాలు
Create an account or sign in to comment