Jump to content

KCR frustration peeks ki vellinattundi ga


Ramesh39

Recommended Posts

‘ప్యాకెట్లు పడేశావేంటిరా సన్నాసీ’

12/5/2018 10:29:52 AM

636796030215784105.jpg

 

  • బేవకూఫ్‌లా ఎందుకు అరుస్తున్నారు
  • ఇట్లయితే వేదిక దిగి వెళ్లిపోతా
  • కార్యకర్తలపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం
అలంపూర్‌ చౌరస్తా, డిసెంబరు 4: వరుస సభలతో క్షణం తీరిక లేకుండా తిరుగుతున్న సీఎం కేసీఆర్‌ వేదికపై తన ప్రసంగానికి ఏ చిన్న అవాంతరం ఏర్పడినా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన ఏకాగ్రతకు అంతరాయం కలిగితే అసహనం ప్రదర్శిస్తున్నారు. మంగళవారం అలంపూర్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతుండగా వందలమంది కార్యకర్తలు కేరింతలు కొడుతూ తోసుకొచ్చారు. దీంతో కేసీఆర్‌ ‘‘బాబూ లొల్లెందుకు చేస్తున్నావయ్యా? తిరుమలరెడ్డిగారూ ఎవరో ఒకరు పోండి. కూచోరాదు వయా బాబూ! ఎందుకయ్యా అల్లరి! కూర్చొండి! కూర్చొండి!’’ అంటూ వారించారు. తిరిగి ప్రసంగం ప్రారంభించారు. కొద్ది సేపటికే మళ్లీ గోల జరగడంతో ‘‘ఏఏ కూసోవయ్యా, వాలంటీర్లను కూర్చొమ్మని చెప్పండి’’ అని హరీశ్‌ వైపు చూసి అన్నారు.
 
 
కొద్దిసేపు అటువైపే చూస్తూ నిలబడ్డారు. చివరకు సముదాయింపు కాస్త ఆగ్రహంగా మారింది. ‘‘ఇలా అరిస్తే వేదిక దిగి పోతా. తుమ్మిళ్ల నీళ్లు బందయితయి. కామ్‌గ కూసోవలె కదా! నేనింకా ఐదారు సభలకు పోవాలె’’అని వ్యాఖ్యానించారు. అయినా అలజడి తగ్గక పోవడంతో మాట మరింత కఠినమైంది. ‘‘బేవకూఫ్‌లా ఎందుకు అరుస్తున్నారు. ఈ అరుపును ఓట్ల రూపంలో చూపండి’’అని గద్దించారు. ఎంపీ జితేందర్‌రెడ్డి కలగజేసుకుని, ‘‘కార్యకర్తలు ఉత్సాహం చూపుతున్నారు సార్‌’’అనడంతో, ‘‘ఈ ఉత్సాహమే కొంపలు ముంచుతుంది’’అని అన్నారు.
 
 
ప్యాకెట్లు పడేస్తావేంటిరా సన్నాసి
వికారాబాద్‌: వికారాబాద్‌ సభలోనూ కేసీఆర్‌కు కోపం తన్నుకొచ్చింది. మాట్లాడుతున్న సమయంలో వాటర్‌ ప్యాకెట్లు ఉన్న క్రేట్లను పెద్ద ఎత్తున శబ్దం వచ్చేట్లు విసిరేస్తుంటే సీఎం భగ్గుమన్నారు. ఒక్కసారిగా ‘‘ప్యాకెట్లు పడేశావేంటిరా సన్నాసీ’’ అంటూ వలంటీర్లను ఘాటుగా తిట్టడం కన్పించింది.

 

 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...