Jump to content

Suryalanka Air Force base


sonykongara

Recommended Posts

సూర్యలంక వైపు వాయుసేన చూపు
యుద్ధ విమానాల కేంద్రం ఏర్పాటుకు మొగ్గు
amr-gen7a.jpg
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలోని సూర్యలంకను వైమానికదళ యుద్ధ విమానాల కేంద్రంగా అభివృద్ధి చేయటానికి రక్షణ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దేశంలో వాయుసేనకు చెందిన ఏకైక క్షిపణి పరీక్ష కేంద్రం ఇక్కడ ఉండగా క్షిపణులు, బాంబులను పరీక్షించటానికి తీసుకువచ్చే యుద్ధ విమానాల కోసం కర్లపాలెం మండలం పేరలిలో రెండున్నర వేల ఎకరాల పరిధిలో ఫైరింగ్‌ రేంజ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
న్యూస్‌టుడే, బాపట్ల

కృష్ణా జిల్లా నాగాయలంకలో డీఆర్‌డీవో ఆధ్వర్యాన క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాలోనూ క్షిపణులు, బాంబుల పరీక్ష కేంద్రం నెలకొల్పేందుకు అడుగులు పడుతుండటం విశేషం. అమరావతిలో సీఎం చంద్రబాబును సూర్యలంక వాయుసేనా కేంద్రం గ్రూపు కమాండరు, గ్రూపు కెప్టెను ఆర్‌ఎన్‌ కుమారస్వామి మంగళవారం కలిసి కేంద్రం ఏర్పాటుపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో దీని కోసం సేకరించనున్న భూమిని రెవెన్యూ, వైమానికదళ అధికారులు సోమవారం పరిశీలించారు.

* సూర్యలంకలో 1968లో వైమానిక దళానికి చెందిన వాయుసేనా కేంద్రాన్ని రక్షణ శాఖ ఏర్పాటు చేసింది. అప్పట్లో దీని కోసం 1500 ఎకరాల అటవీ భూమిని కేటాయించారు. దీని ద్వారా ఏటా వాయుసేనకు చెందిన క్షిపణులను సముద్రంపైన ఆకాశంలో పరీక్షిస్తున్నారు. మూడు నెలలపాటు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తూర్పుతీరంలో రక్షణపరంగా అత్యంత కీలకమైన ప్రాంతంలో సూర్యలంక ఉండగా ఇక్కడ హెలీప్యాడ్‌ మాత్రమే ఉంది. యుద్ధ విమానాలు దిగటానికి అవసరమైన రన్‌వే, ఇతర మౌలిక వసతులు లేవు. యుద్ధ విమానాలను సైతం నిలిపేలా ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని రెండు దశాబ్దాలుగా ప్రతిపాదనలు ఉన్నా అమలు కాలేదు.
* హైదరాబాద్‌ సమీపంలో దుండిగల్‌ నుంచి వైమానికదళ హెలికాప్టర్‌ సూర్యలంక వచ్చి  సముద్రంపై లక్ష్యాన్ని జారవిడిస్తే స్థానిక కేంద్రం నుంచి క్షిపణులను ప్రయోగించి పేల్చి వేసే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో సముద్రంలో చేపల వేటను నిషేధిస్తున్నారు. వైమానిక దళానికి చెందిన బాంబులు, క్షిపణులను ప్రయోగించి పరీక్షించే కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని రక్షణ శాఖ నిర్ణయించింది. దీని కోసం యుద్ధ విమానాలను సైతం నిలపటానికి అనుకూలంగా తగిన మౌలిక వసతులు అభివృద్ధి చేయాల్సివుంది.
* ప్రస్తుతం సూర్యలంక చుట్టూ అటవీ శాఖకు చెందిన భూములే ఉన్నాయి. వీటిలో ఎక్కువ బంజరు భూములే. 3,500 ఎకరాల్లో వైమానికదళ ఫైరింగ్‌ రేంజ్‌ను ఏర్పాటు చేయాలని వాయుసేన అధికారులు ప్రతిపాదించారు. అయితే ఈ కేంద్రం ఏర్పాటునకు పూర్తిగా అటవీ భూములను సేకరించటం క్లిష్టమైన ప్రక్రియతో కావటం, ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ ఆలోచన చేశారు. సూర్యలంకకు సమీపంలోని కర్లపాలెం మండలంలోని పేరలిలో ప్రభుత్వ, అసైన్డ్‌, పట్టా భూములు కలిపి 2,500 ఎకరాలు సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ భూములతోపాటు అటవీ శాఖకు చెందిన మరో వెయ్యి ఎకరాలను కేంద్రం కోసం వినియోగించటానికి అనుమతి తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వైమానికదళ కేంద్రం గ్రూపు కమాండరు ఆర్‌ఎన్‌ కుమారస్వామి, బాపట్ల, కర్లపాలెం తహశీల్దార్లు వల్లయ్య, వెంకట ప్రసాద్‌, వాయుసేన అధికారులతో కలిసి పేరలిలో సేకరించదలిచిన భూములను పరిశీలించారు. దీనిపై ఓ నివేదికను సిద్ధం చేసుకున్నారు. సీఎం చంద్రబాబును కలిసి ఫైరింగ్‌ రేంజ్‌ ఏర్పాటుకు చేపట్టాల్సిన భూసేకరణపై చర్చించనున్నారు. ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడితే భూసేకరణ ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుడతారు. ఈ కేంద్రం వస్తే సూర్యలంక- పేరలి ప్రాంతాలు రక్షణపరంగా కీలకం అవుతాయి. ఇక్కడి నుంచే సముద్రంపైన  క్షిపణి, బాంబుల కీలక పరీక్షలు నిర్వహిస్తారు. బాపట్ల అభివృద్ధికి దోహదపడి స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

Link to comment
Share on other sites

ఏపీలో 5 చోట్ల ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లు
12-09-2018 06:12:38
 
అమరావతి: రాష్ట్రంలో ఐదుచోట్ల ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లు రాబోతున్నాయి. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసి ఎయిర్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ ఆఫ్‌ సదరన్‌ ఎయిర్‌ కమాండ్‌(తిరువనంతపురం) బి.సురేశ్‌ చెప్పారు. దొనకొండ, విజయవాడ, రాజమహేంద్రి, భోగాపురం, నెల్లూరుల్లో ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ల ఏర్పాటుకు నిర్ణయించినట్లు సురేశ్‌ వెల్లడించారు. తమకు సూర్యలంకలో 1350 ఎకరాల్లో ఎయిర్‌బేస్‌ ఉందని, దీనికి అదనంగా భూమిని కేటాయించాలని సీఎంను కోరారు. కాగా, వీటికి వెంటనే భూమి కేటాయిస్తామని చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చారు.Z1ySoZH.jpg
Edited by sonykongara
Link to comment
Share on other sites

4 hours ago, sonykongara said:
ఏపీలో 5 చోట్ల ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లు
12-09-2018 06:12:38
 
అమరావతి: రాష్ట్రంలో ఐదుచోట్ల ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లు రాబోతున్నాయి. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసి ఎయిర్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ ఆఫ్‌ సదరన్‌ ఎయిర్‌ కమాండ్‌(తిరువనంతపురం) బి.సురేశ్‌ చెప్పారు. దొనకొండ, విజయవాడ, రాజమహేంద్రి, భోగాపురం, నెల్లూరుల్లో ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ల ఏర్పాటుకు నిర్ణయించినట్లు సురేశ్‌ వెల్లడించారు. తమకు సూర్యలంకలో 1350 ఎకరాల్లో ఎయిర్‌బేస్‌ ఉందని, దీనికి అదనంగా భూమిని కేటాయించాలని సీఎంను కోరారు. కాగా, వీటికి వెంటనే భూమి కేటాయిస్తామని చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చారు.

Mana stateki emanna airforce employment lo reserve chestara , cheste gana very good opportunity for people to look beyond these routine tech jobs

Link to comment
Share on other sites

4 hours ago, BalayyaTarak said:

Mana stateki emanna airforce employment lo reserve chestara , cheste gana very good opportunity for people to look beyond these routine tech jobs

antha scene emi vundadu. aa suryalanka air force base naa chinnappati nunchi chustunna. 1300+ acres lo beach ki ankuni vuntundi. okka helicopter kuda vundadu. just a Radar station and 50-100 employees. oka 4 km long beach lo ki kuda civilians ni allow cheyyaru. 

Link to comment
Share on other sites

ndian Air Force Plans To Make Andhra Pradesh 'Strategic Base' To Keep Eye On China

DIVYIA ASTHANA | icon0
1376
| September 17 , 2018 , 08:04 IST
  • Facebook
  • Twitter
  • Google-Plus
  • Msg
  • Whatsapp
 

The Indian Air Force is planning to make Andhra Pradesh a 'strategic base' to keep an eye on neighbouring China, with which India's relations became strained during the Doklam standoff last year.

The plans include setting up a major helicopter training facility at Donakonda in Prakasam district, a drone manufacturing facility in Anantapur district and a cyber security centre in Amaravati top bureaucratic sources were quoted by PTI as saying on Sunday.

Initially, the Andhra Pradesh government had offered 2,700 acres of land at Donakonda along an abandoned World War II airstrip for the helicopter training facility, to which the IAF said that it required less land and accordingly 1,200 acres has been identified for the project.

ALSO READ: Pitch Black 2018: Indian Air Force Joins Australian Air Force For Historic Combat Free Fall

"About 300 acre of this parcel of land will be given to Airports Authority of India for civilian aircraft operations and the rest to the IAF for the helicopter training facility," a senior bureaucrat in the revenue department said to PTI.

The IAF is planning the drone manufacturing facility in Anantapur district since it is close to the Yelahanka Air Base near Bengaluru.

The IAF has also proposed the use of existing civilian airports at Rajahmundry and Vijayawada for positioning of its assets, including fighter and other aircraft, as a part of its strategy to strengthen vigil along the east coast of the country.

"On our part, we have constituted a task team to coordinate with the IAF on these projects. A preliminary ground survey has also been done to identify suitable locations and we have asked the IAF to submit detailed project reports," a top bureaucrat said.

ALSO READ: Indian Air Force Completes 5,000 Sorties In 72 Hours On Western Front In Gagan Shakti Exercise

"In view of the growing strategic importance of the east coast and China moving fast, the IAF intends to strengthen its presence in the region. Setting up asset positioning bases in Andhra Pradesh is part of the strategy," the bureaucrat said anonymously.

The IAF helicopters and other aircraft would also be useful for rescue and relief operations in case of natural calamities in the region. Currently, the IAF has a base at Arakkonam near Chennai, while the Navy has INS Dega in Visakhapatnam.

According to reports, the IAF top brass have already conducted at least 3 rounds of talks with Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu and discussed the projects. During a meeting last week between IAF Southern Command Chief Air Marshal B Suresh, his team and CM Naidu, a fresh proposal was presented to develop Air Force Enclaves at different locations.

Link to comment
Share on other sites

ఏపీలో వైమానిక స్థావరాలు
రాజమహేంద్రవరం, విజయవాడ విమానాశ్రయాలపై దృష్టి
దొనకొండలో హెలికాప్టర్‌ శిక్షణ కేంద్రం
అనంతపురంలో డ్రోన్ల తయారీ ప్లాంటు
అమరావతిలో సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌
రాష్ట్ర ప్రభుత్వానికి భారత వాయుసేన ప్రతిపాదనలు
చంద్రబాబుతో 3 దఫాల చర్చలు
16ap-main11a.jpg

అమరావతి: తమ కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్‌ను వ్యూహాత్మక కేంద్రంగా మలచుకోవాలని భారత వాయుసేన(ఐఏఎఫ్‌) యోచిస్తోంది. ఇందులో భాగంగా తొలి ప్రాధాన్యంగా ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతంలో భారీ హెలికాప్టర్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అనంతపురం జిల్లాలో డ్రోన్ల తయారీ కేంద్రాన్ని, అమరావతిలో సైబర్‌ సెక్యూరిటీ కేంద్రాన్ని నెలకొల్పాలని ఆలోచిస్తోంది. వీటికి సంబంధించిన ప్రణాళికలను రాష్ట్రప్రభుత్వానికి సమర్పించింది. అదేవిధంగా రాజమహేంద్రవరం, విజయవాడ విమానాశ్రయాలను యుద్ధవిమానాలు, ఇతర విమానాల మోహరింపు స్థావరంగా వినియోగించుకోవడానికి ప్రతిపాదించింది. ‘‘ఐఏఎఫ్‌ ప్రాజెక్టులపై సమన్వయం చేసుకునేందుకు మా వంతుగా మేం ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. తగిన స్థలాన్ని గుర్తించేందుకు ప్రాథమిక సర్వే పూర్తయింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి సవివర ప్రాజెక్టు నివేదికను సమర్పించాలని ఐఏఎఫ్‌ను కోరాం. తూర్పు తీర ప్రాంతంలో నిఘా వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుతం వినియోగంలో ఉన్న రాజమహేంద్రవరం, విజయవాడల్లోని  విమానాశ్రయాలను స్థావరాలుగా వినియోగించుకోవాలని ఐఏఎఫ్‌ భావిస్తోంది. ప్రస్తుతం చెన్నై సమీపంలోని అరక్కోణంలో వైమానికదళ స్థావరం ఉంది. నౌకాదళానికి విశాఖపట్నంలో ఐఎన్‌ఎస్‌ డేగ కేంద్రం ఉంది. తూర్పు తీర ప్రాంతానికి వ్యూహాత్మక ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలోనూ, ఈ ప్రాంతంలో చైనా వేగంగా విస్తరిస్తున్న సందర్భంగానూ ఐఏఎఫ్‌ కూడా ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ను వ్యూహాత్మక కేంద్రాల స్థావరంగా మలచుకోవాలని భావిస్తోంది’’ అని ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

అంతేకాకుండా ప్రకృతి విపత్తులు వంటివి సంభవించిన  సందర్భాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు వినియోగించే హెలికాప్టర్లు, విమానాలను ఈ స్థావరాల్లో మోహరిస్తారు. ఈ ప్రాజెక్టుల విషయమై ఐఏఎఫ్‌ ఉన్నతాధికారులు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఇప్పటికే మూడు దఫాలు చర్చలు జరిపారు. గత వారం ఐఏఎఫ్‌ దక్షిణాది కమాండ్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ బి.సురేష్‌, ఆయన బృందం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాయుసేన స్థావరాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించారు.

1200 ఎకరాలు గుర్తించాం
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వాయుసేన శిబిరంగా వినియోగమైన దొనకొండ ప్రాంతంలో 2700 ఎకరాలను ఐఏఎఫ్‌కు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రాజెక్టు కోసం 1200 ఎకరాలను గుర్తించినట్టు ఐఏఎఫ్‌ ప్రభుత్వానికి తెలిపింది. పౌరవిమాన సేవల కోసం భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థకు హెలికాప్టర్‌ శిక్షణ కేంద్రంలో 300 ఎకరాలను కేటాయించి, మిగిలిన స్థలాన్ని ఐఏఎఫ్‌కు అందించనున్నట్టు రెవెన్యూ విభాగానికి చెందిన సీనియర్‌ అధికారి వెల్లడించారు. అనంతపురం జిల్లాలో డ్రోన్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు ఐఏఎఫ్‌ యోచిస్తోంది. గుంటూరు జిల్లా సూర్యలంకలో వాయుసేన స్టేషన్‌ విస్తరణకు మరికొంత స్థలంతోపాటు నెల్లూరు, భోగాపురం వద్ద కూడా వైమానిక స్థావరాల ఏర్పాటు కోసం భూమి కావాలని ఐఏఎఫ్‌ కోరింది. ఈ ప్రతిపాదనలపై ఐఏఎఫ్‌తో సమన్వయం చేసుకోవాలంటూ మౌలికసదుపాయాలు, పెట్టుబడుల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌ జైన్‌ను సీఎం ఆదేశించారు.

Link to comment
Share on other sites

  • 2 months later...
సూర్యలంక తీరంలో క్షిపణి ప్రయోగం
09-12-2018 03:13:08
 
636799219863595011.jpg
  • రెండు రోజులపాటు వైమానిక విన్యాసాలు
  • ‘క్రాస్‌ బో-18’ విజయవంతమైందని ప్రకటన
విశాఖపట్నం, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గుంటూరు జిల్లా సూర్యలంక తీరంలో వైమానిక దళ అధికారులు క్షిపణి ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. ‘క్రాస్‌బో-2018’ పేరుతో రెండు రోజులపాటు చేపట్టిన ఈ విన్యాసాలు సక్సెస్‌ అయినట్లు నేవీ వర్గాలు తెలిపాయి. నాలుగు రకాల క్షిపణులు ఆకాశ్‌, స్పైడర్‌, ఓఎ్‌సఏ-ఏకే-ఎం, ఐజీఎల్‌ఏలను ప్రయోగించారు. భూ ఉపరితలం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఇవి ఛేదిస్తాయి. ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బీరేంద్ర సింగ్‌ ధనోవా ముఖ్యఅతిథిగా హాజరయ్యరు. దక్షిణ ఎయిర్‌ కమాండ్‌ ఆఫీసర్‌, కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ కెప్టెన్‌ ఆర్‌ఎం కుమారస్వామి వీటికి సారథ్యం వహించారు. నేవీ ఇలాంటి విన్యాసాలు చేయడం ఇదే మొదటిసారని ధనోవా పేర్కొన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సన్నద్ధంగా ఉన్నామని చెప్పడానికే ఈ ప్రయోగాలని ఆయన చెప్పారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...