Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Chennai - Bangalore Industrial Corridor

Featured Replies

  • 4 months later...
  • 5 years later...
  • 2 months later...
  • 2 weeks later...
  • 1 month later...
  • 1 month later...
  • 4 weeks later...
  • Author

Kris City: క్రిస్‌ సిటీకి అడ్డంకులు తొలిగాయ్‌!

పరిశ్రమల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. గతంలో ప్రతిపాదించిన, ఓ దశకు వచ్చి వేర్వేరు కారణాలతో నిలిచిపోయిన పారిశ్రామిక పార్కులకు ఆటంకాలు తొలగిస్తోంది.

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 15 Mar 2025 03:26 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

ప్రభుత్వ భూములు సాగు చేస్తున్న రైతులకు పరిహారం చెల్లింపునకు ఉత్తర్వులు

ap140325main9a.webp

చిల్లకూరు మండలం తమ్మినపట్నం రెవెన్యూ పరిధిలో క్రిస్‌ సిటీ కోసం ఏపీఐఐసీ సేకరించిన భూములు

ఈనాడు, తిరుపతి; న్యూస్‌టుడే, చిల్లకూరు: పరిశ్రమల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. గతంలో ప్రతిపాదించిన, ఓ దశకు వచ్చి వేర్వేరు కారణాలతో నిలిచిపోయిన పారిశ్రామిక పార్కులకు ఆటంకాలు తొలగిస్తోంది. చెన్నై- బెంగళూరు పారిశ్రామిక నడవా (సీబీఐసీ)లో భాగమైన కృష్ణపట్నం ఇండస్ట్రియల్‌ సిటీ (క్రిస్‌ సిటీ) దీనికి నిదర్శనం.తిరుపతి, నెల్లూరు జిల్లాల పరిధిలోని ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం చేసింది. భూసేకరణ సమస్య కూడా పరిష్కరించే యత్నం చేయలేదు. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులో వేగం పుంజుకుంది. ప్రధాని నరేంద్ర మోదీతో శంకుస్థాపన చేయించింది. మొదటి దశ పనులు జరిగే చిల్లకూరు, కోట మండలాల్లో 985.604 ఎకరాల్లోని ప్రభుత్వ భూమిలో సాగు చేసుకుంటోన్న రైతులకు పరిహారం అంశంపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగించింది.  

మొత్తం 3 దశల్లో అభివృద్ధి చేసే క్రిస్‌ సిటీని 10,502.23 ఎకరాల్లో ప్రతిపాదించారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తే రూ.37,500 కోట్ల పెట్టుబడులు వచ్చి 4.67 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నది అంచనా. తొలి దశలో 2,500.49 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయించారు. తిరుపతి జిల్లాలోని చిల్లకూరు మండలం తమ్మినపట్నం, తూర్పు కనుపూరు, వెల్లపాలెం, మోమిడి, బల్లవోలు, కోట మండలం కొత్తపట్నం, సిద్ధవరం, కర్లపూడి గ్రామాల్లో ఈ భూములున్నాయి. తమ్మినపట్నం, కొత్తపట్నంలో ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న రైతులు పరిహారం విషయం తేల్చందే.. భూములు ఇవ్వమని అభ్యంతరం తెలిపారు. వైకాపా అధికారంలో ఉన్న ఐదేళ్లూ దీన్ని ఎటూ తేల్చలేదు.

జేసీ నేతృత్వంలో కమిటీ నియమించిన కలెక్టర్‌

కూటమి ప్రభుత్వం వచ్చి క్రిస్‌ సిటీపై దృష్టి సారించింది. జనవరి 8న ప్రధానితో వర్చువల్‌గా శంకుస్థాపన చేయించింది. ఇదే క్రమంలో రెండు గ్రామాల్లోని రైతులు నష్టపోకూడదని భావించింది. కలెక్టర్‌ నేతృత్వంలో ఓ కమిటీని నియమించి.. సర్వే చేయించింది. 600 మంది రైతులకు గతంలో జరిగిన సేల్‌ డీడ్‌ల ఆధారంగా ఎకరాకు రూ.8 లక్షల చొప్పున వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద రూ.78.84 కోట్లు ఇవ్వాలని కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గతనెల 11న పరిహారం చెల్లిస్తామని ఉత్తర్వులూ ఇచ్చింది.


పరిహారం చెల్లింపు హర్షణీయం
- గుడి మస్తానయ్య, రైతు

ap140325main9b.webp

2 దశాబ్దాలుగా ఎకరా ప్రభుత్వ భూమి నా అనుభవంలోనే ఉంది. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా. గతంలో జరిపిన సర్వేలో భూమిని తీసుకుంటామని ప్రకటించినా పరిహారం హామీ ఇవ్వలేదు. ఇప్పుడు రూ.8 లక్షలు చెల్లిస్తామని ఉత్తర్వులు ఇవ్వడం హర్షణీయం.

  • 3 months later...
  • 1 month later...
  • 2 weeks later...
  • 5 months later...
  • 4 months later...
  • 3 weeks later...

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.