Jump to content

TDP


Recommended Posts

ఎంపీలు’ ఎవరు?
03-10-2018 02:11:52
 
636741654275711182.jpg
  • సగంచోట్ల కొత్త ముఖాలు!
  • లోక్‌సభ స్థానాల అభ్యర్థులపై టీడీపీ కసరత్తు
  • 11 చోట్ల పాత అభ్యర్థులే
  • రాయపాటి, ఎస్పీవై రెడ్డి రిటైర్మెంట్‌
  • అరకు నుంచి ఓ ఉన్నతాధికారి!
  • కాకినాడలో చలమలశెట్టి సునీల్‌?
  • అసెంబ్లీకి తోట నరసింహం
  • నరసాపురంలో రఘురామరాజు
  • 3-4 సీట్లలో ఇంకా అస్పష్టత
అమరావతి, (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో సుమారుగా సగం చోట్ల ఈసారి తెలుగుదేశం పార్టీ కొత్త ముఖాలు బరిలోకి దించనున్నట్లు తెలిసింది. ఆ పార్టీ అధిష్ఠానం నిర్వహిస్తున్న కసరత్తు ఈ పరిణామాన్ని సూచిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి 11 సీట్లలో పాతవారికే తిరిగి పోటీ చేసే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. పదిచోట్ల కొత్తవారు రంగంలోకి దిగడం ఖాయమని తెలుస్తోంది. నాలుగు చోట్ల పాతవారు కొనసాగుతారో లేక కొత్తవారు వస్తారో స్పష్టత రాలేదు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి టీడీపీ నాలుగు సీట్లు (విశాఖ, నరసాపురం, రాజంపేట, తిరుపతి) కేటాయించింది. ఈసారి ఆ సీట్లలో తానే సొంతంగా పోటీ చేయనుంది. రెండు సీట్లలో సిటింగ్‌ ఎంపీలు అనారోగ్య కారణాలతో
రిటైర్మెంట్‌ తీసుకోనున్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. రాయపాటి ఈసారి కూడా పోటీ చేస్తానని ప్రకటనలు ఇస్తున్నా పార్టీ వర్గాలు మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నాయి.
 
ఆ 11 మందికి లైన్‌ క్లియర్‌
గత ఎన్నికల్లో పోటీచేసిన వారిలో 11 మంది మళ్లీ బరిలోకి దిగడం ఖాయమేనని టీడీపీ వర్గాలు అంటున్నాయి. వీరిలో కొందరు సిటింగ్‌ ఎంపీలు.. మరికొందరు పోయినసారిఓడిన అభ్యర్థులు. కింజరాపు రామ్మోహన్‌నాయుడు(శ్రీకాకుళం), అశోక్‌ గజపతిరాజు(విజయనగరం), పండుల రవీంద్రబాబు(అమలాపురం), మాగంటి బాబు(ఏలూరు), కేశినేని నాని(విజయవాడ), కొనకళ్ల నారాయణరావు(మచిలీపట్నం), గల్లా జయదేవ్‌(గుంటూరు), శ్రీరాం మాల్యాద్రి(బాపట్ల), శివప్రసాద్‌(చిత్తూరు), బుట్టా రేణుక(కర్నూలు) ఈ జా బితాలో ఉన్నారు. 2014లో ఒంగోలులో పోటీ చేసి ఓడి న మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈసారి అక్కడే పోటీ చేయనున్నారు. రవీంద్రబాబు, మాగంటి బాబు, శివప్రసాద్‌ స్థానికంగా చిన్న చిన్న అసంతృప్తులు ఎదుర్కొంటున్నా వారి కొనసాగింపునకే అధినాయకత్వం మొగ్గు చూపుతోందని సమాచారం. కొనకళ్ల ఈసారి అ సెంబ్లీకి పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నా.. ఆయన్ను ఎంపీగానే కొనసాగిస్తారని సమాచారం.
 
కొత్తవారికి అవకాశాలు
కొన్ని సీట్లలో కొత్తవారికి అవకాశాలు రానున్నాయి. అరకులో ఒక ఉన్నతాధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన త్వరలో రిటైర్‌ కానున్నారు. బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ సీట్లో ఈసారి కొత్త అభ్యర్థి తెరపైకి రానున్నా రు. మాజీ ఎంపీ ఎంవీవీఎస్‌ మూర్తి, ఆయన మనవ డు భరత్‌, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త పేరు ప్రచారంలో ఉన్నాయి. కొంత మంది మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు కూడా ప్రచారంలో పెడుతున్నారు. టీడీపీ అధిష్ఠానం ఇంకా ఈ సీటుపై స్పష్టతకు రాలేదు. కాకినాడ ఎంపీ తోట నరసింహం ఈసారి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఆ సీటును చలమలశెట్టి సునీల్‌కు ఇచ్చే యోచనలో టీడీపీ ఉంది. చంద్రబాబును ఇటీవల తరచూ కలుస్తు న్న ఆయన కొద్ది రోజుల్లో అధికారికంగా టీడీపీలో చేరనున్నారు. బీజేపీ ఎంపీ గంగరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం సీటుకు తన అభ్యర్థిని టీడీపీ అంతర్గతంగా ఖరారు చేసింది.
 
పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజును నిలపనున్నట్లు సమాచారం. రాయపాటి ప్రాతినిధ్యం వహిస్తున్న నరసరావుపేట సీటుకు గట్టి అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషిస్తోంది. టీటీ డీ చైర్మన్‌ సుధాకర్‌ యాదవ్‌ కుమారుడు, అటవీ మం త్రి సిద్ధా రాఘవరావు, గుంటూరు-2 ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పేర్లు ఇక్కడ వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన తిరుపతి(ఎస్సీ) స్ధానంలో ఈసారి టీడీపీ అభ్యర్థిని నిలపనుంది. పోయినసారి అక్కడ బీజేపీ తరపున పోటీ చేసిన అభ్యర్థి జయరాజ్‌ తర్వాత టీడీపీలో చేరారు. ఆయనతోపాటు మాజీ మంత్రి పర్సా రత్నం, నెలవల సుబ్రమణ్యం పేర్లు వినిపిస్తున్నాయి. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తన కుమారుడు పవన్‌ రెడ్డికి అవకాశమివ్వాలని చంద్రబాబును కోరారు.
 
టీడీపీ అధిష్ఠా నం కూడా సుముఖంగానే ఉంది. హిందూపురం ఎం పీ నిమ్మల కిష్టప్ప అసెంబ్లీకిరావాలని కోరుకుంటున్నా రు. కానీ అధిష్ఠానం ఏ నిర్ణయానికీ రాలేదు. ఆయన్ను అసెంబ్లీకి తీసుకొస్తే ఎంపీగా కొత్తవారికి చాన్సు వస్తుంది. కడపలో..జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం వి వాద పరిష్కారం కోసం మంత్రి ఆదినారాయణ రెడ్డి.. మండలిలో ప్రభుత్వ విప్‌ పి.రామసుబ్బారెడ్డిల్లో ఒకరిని కడప ఎంపీగా నిలపాలని టీడీపీ భావిస్తోంది. పోయినసారి ఇక్కడ పోటీ చేసిన శ్రీనివాసరెడ్డి ఎంపీగానైనా లేక ఎమ్మెల్యేగానైనా పోటీకి సిద్ధమని అంటున్నారు. మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి పేరును కూడా తెరపైకి తెస్తున్నారు. రాజంపేటలో పోయినసారి బీజేపీ అభ్యర్థిగా పురందేశ్వరి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి అక్కడ ఎమ్మెల్సీ చెంగల్రాయుడిని నిలపాలన్న యోచన పార్టీ వర్గాల్లో ఉంది. నంద్యాలలో ఎస్పీవై రెడ్డి స్థానంలో ఇంకా స్పష్టత రాలేదు.
  
 
కొన్ని సీట్లపై ఇంకా రాని స్పష్టత
కొన్ని లోక్‌సభ స్థానాలపై టీడీపీలో ఇంకా స్పష్టత రాలేదు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు అసెంబ్లీకి పోటీ చేస్తానని పార్టీ అధినేత తో చెప్పారు. కొంతకాలం గడిస్తే తప్ప దీనిపై స్పష్టత వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఆయన అసెంబ్లీకి వెళ్లే పక్షంలో ఆ లోక్‌సభ స్థానానికి మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ, విశాఖ డెయిరీ చైర్మన్‌ అడారి తులసీరావు తనయుడు ఆనంద్‌, మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్లు వినవస్తున్నాయి. రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌ విషయంలో కూడా అస్పష్టత ఉంది. ఆయన మళ్లీ పోటీ చే యాలని ఆశిస్తున్నారు. కానీ పార్టీ నేతలు ఆయన పోటీ పట్ల సుముఖంగా లేరు. ఈ సీటుపైనా నిర్ణయానికి కొంత సమయం పట్టేలా ఉంది. నెల్లూరు లోక్‌సభ స్థానానికి పోయినసారి మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి పోటీ చేశారు. ఈ సారి ఆయన అసెంబ్లీ బరిలో నిలవనున్నారు. దీంతో ఈ సీటుపై స్పష్టత రావాల్సి ఉంది.
Link to comment
Share on other sites

సగం కొత్త ముఖాలే?
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో   పోటీపై తెదేపాలో అంచనా
  3, 4 చోట్ల సిట్టింగ్‌లను  మార్చే అవకాశం
ఈనాడు - అమరావతి

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులుగా చాలాచోట్ల కొత్త ముఖాలు తెరపైకి వచ్చే అవకాశముంది. 25 లోక్‌సభ స్థానాలకుగానూ దాదాపు సగం స్థానాల్లో ఈసారి కొత్త అభ్యర్థులుగానీ, గత ఎన్నికల్లో వేరే పార్టీ తరఫున పోటీ చేసి ప్రస్తుతం తెదేపాలో చేరినవారుగానీ పోటీ చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో మరే పార్టీతోనూ పొత్తు లేకపోతే తెదేపా 25 స్థానాల్లో సొంతంగా బరిలోకి దిగనుంది. గత ఎన్నికల్లో తెదేపా గెలిచిన 15 లోక్‌సభ స్థానాల్లోనూ... మూడు నాలుగు చోట్ల సిట్టింగ్‌ ఎంపీలను మార్చే అవకాశముంది. వైకాపా నుంచి తెదేపాలో చేరిన వారిలో బుట్టా రేణుకకు టిక్కెట్‌ ఖాయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. విశాఖ నుంచి గత ఎన్నికల్లో భాజపా అభ్యర్థి హరిబాబు గెలుపొందారు. ఈసారి అక్కడ బలమైన అభ్యర్థి కోసం తెదేపా అన్వేషిస్తోంది. గీతం విద్యా సంస్థల అధినేత, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి కుటుంబం నుంచి ఒకరి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. మంత్రి గంటా శ్రీనివాసరావును విశాఖ నుంచి పోటీ చేయించాలన్న ప్రతిపాదనా ఉన్నట్లు తెలుస్తోంది. గంటా మాత్రం శాసనసభకు పోటీ చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. అనకాపల్లి ఎంపీగా ఉన్న అవంతి శ్రీనివాస్‌ ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయనకు శాసనసభ అవకాశమిస్తే అనకాపల్లి లోక్‌సభ స్థానానికి వేరే అభ్యర్థిని వెతకాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో అరకులో వైకాపా అభ్యర్థి కొత్తపల్లి గీతపై తెదేపా తరఫున గుమ్మడి సంధ్యారాణి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం సంధ్యారాణి ఎమ్మెల్సీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అరకు స్థానానికి తెదేపా అభ్యర్థిగా రాయలసీమలో ఒక జిల్లాకు కలెక్టరుగా పని చేసి, ప్రస్తుతం విశాఖలో ఉన్న ఒక ఐఏఎస్‌ అధికారి పేరు పరిశీలనలో ఉంది. విజయనగరం జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్‌ స్వాతిరాణి భర్త అరకు టిక్కెట్‌ ఆశిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ సిట్టింగ్‌ ఎంపీ తోట నరసింహాన్ని వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పంపించే అవకాశముంది. గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్‌కు కాకినాడ లోక్‌సభ అభ్యర్థిగా అవకాశమివ్వనున్నట్లు తెలిసింది. ఆయన త్వరలోనే తెదేపాలో అధికారికంగా చేరనున్నారు. నరసాపురంలో గత ఎన్నికల్లో భాజపా అభ్యర్థి గోకరాజు గంగరాజు గెలిచారు. వచ్చే ఎన్నికల్లో పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజును తెదేపా పోటీ చేయించనుంది. నరసరావుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయపాటి సాంబశివరావుకు బదులుగా వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడికిగానీ, మరొక అభ్యర్థికిగానీ అవకాశమిస్తారని భావిస్తున్నారు. ఒంగోలులో గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన్నే బరిలో దించే అవకాశముంది. నెల్లూరులో తెదేపా అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేస్తారా? ప్రత్యామ్నాయం చూస్తారా? అన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఆయనకు ప్రత్యామ్నాయంగా బీసీ వర్గానికి చెందిన వారినెవరినైనా పరిశీలించవచ్చునని భావిస్తున్నారు. తిరుపతిలో గత ఎన్నికల్లో భాజపా తరపున పోటీ చేసిన కారుమంచి జయరాం ఇటీవల తెదేపాలో చేరారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా ఆయన పేరు పరిశీలనకు వచ్చే అవకాశముంది. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఇప్పటికే ప్రకటించారు. తన కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డికి ఆయన టిక్కెట్‌ అడుగుతున్నారు. పవన్‌కుమార్‌రెడ్డే అనంతపురం అభ్యర్థయ్యే అవకాశమున్నట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. నంద్యాలలో ప్రస్తుత ఎంపీ ఎస్పీవై రెడ్డి అనారోగ్య కారణాలవల్ల వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండే అవకాశముంది. తన కుటుంబం నుంచే ఒకరికి ఆయన టిక్కెట్‌ అడుగుతున్నారు. అక్కడ బలమైన అభ్యర్థి కోసం పార్టీ అన్వేషిస్తోంది. కడప నుంచి మంత్రి ఆదినారాయణరెడ్డితోగానీ, ప్రస్తుతం శాసన మండలిలో ప్రభుత్వ విప్‌గా ఉన్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితోగానీ పోటీ చేయించే అవకాశముంది.. రాజంపేటలో గత ఎన్నికల్లో భాజపా అభ్యర్థి పురందేశ్వరి పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడిని బరిలో దించాలని పార్టీ భావిస్తోంది. ఆయన మాత్రం తిరుపతి శాసనసభ స్థానంవైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం

2ap-main11a.jpg
Link to comment
Share on other sites

ఎమ్మెల్యేలు, నేతల తీరుపై ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్‌ నివేదిక
10-10-2018 11:31:09
 
636747678698039501.jpg
‘‘ఎమ్మెల్యేలు, కొందరు కీలక నేతలు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సెటిల్‌మెంట్లతో పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారు. ఇసుక, మట్టి, గ్రావెల్‌ వంటి లాభసాటి వ్యాపారాల్లో బాగా దండుకున్న ఎమ్మెల్యేలు అక్కడితో ఆగకుండా వివాదపరమైన ఆర్థిక లావాదేవీల్లోనూ తలదూరుస్తున్నారు. ఉచిత ఇసుక పాలసీని అభాసుపాలు చేయడంతో ఇప్పటికే పార్టీ కేడర్‌లోనే అర డజను మంది ఎమ్మెల్యేలు, కీలక ప్రజాప్రతినిధులపై వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి దందాలకు చెక్‌పెట్టకపోతే ఎన్నికల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోక తప్పదు..’’ ఎమ్మెల్యేలు, కీలక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతల దందాలపై ఇంటెలిజెన్స్‌ అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదిక సారాంశం.
 
 
కాకినాడ: జిల్లాలో 19 అసెంబ్లీ సెగ్మెంట్లకుగానూ 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలిన మూడు చోట్ల నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిలు ఉన్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలపై పార్టీ కేడర్‌లో అసంతృప్తి నెలకొంది. గ్రామ, మండల స్థాయి అభివృద్ధి పనులలోనూ తమను పట్టించుకో వడంలేదంటూ పలుచోట్ల ఎమ్మెల్యేలపై టీడీపీ కార్యకర్తలే గుర్రుగా ఉన్నారు. పనులలో ప్రాధాన్యత పక్కనపెడితే ఇతర పార్టీల నుంచి ఇటీవల టీడీపీలో చేరిన వారికి ఇస్తున్న ప్రాధాన్యత కూడా తమకు ఇవ్వడంలేదంటూ పలు అసెంబ్లీ సెగ్మెంట్లలలో కార్యకర్తల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి.
 
జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతల కార్యకలాపాలపై ఇటీవల రెండు, మూడు దఫాలుగా పార్టీ ప్రైవేటు సర్వే కూడా చేయించుకున్నట్టు సమాచారం. ఆ సర్వేలోనూ కొందరి ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తాజా ఇంటిలిజెన్స్‌ నివేదికలోనూ ఎనిమిది మంది ఎమ్మెల్యేల తీరుపై నెగిటివ్‌ రిపోర్టు వెళ్లినట్టు తెలిసింది. కొందరు ఎమ్మెల్యేల తనయులు, సోదరుల దందాలూ పార్టీకి నష్టం తెచ్చేవిగా ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. కోనసీమలో ఓ ప్రజాప్రతినిధి సోదరుడు కాంట్రాక్టరుకి, సబ్‌కాంట్రాక్టర్‌కి మధ్య వివాదంలో కాంట్రాక్టర్‌ని పోలీస్‌ స్టేషన్‌లో నిర్భంధించి ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించినట్లు ఫిర్యాదులు వచ్చాయి.
 
బిజినెస్‌... అని సమర్థించుకుంటున్నారు
జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు, కీలక ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు వాళ్లు చేస్తున్న దందాలకు బిజినెస్‌ అనే పేరు పెట్టుకుంటున్నారు. వ్యాపారం చేసుకుంటే తప్పేముంది? అని బాహాటంగానే చెప్తున్నారు. నిజమే.. వ్యాపారం తప్పుకాదు. కానీ వీళ్లది పెట్టుబడిలేని.. పలుకుబడితో చేసే వ్యాపారం. ఏదైనా అక్రమ వ్యాపారంలో అధికార యంత్రాంగం నుంచి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రజాప్రతినిధి అండగా ఉంటారు. ఇందుకోసం సదరు నేతకు వాటా ఇస్తారు. ఇలాంటివి ప్రజలకు పెద్దగా తెలియవు. కానీ భూవివాదాలలో తలదూర్చి... ఖరీదైన భూములను కారుచౌకగా కొట్టేస్తున్న వైనంపై జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపైనా ఇంటిలిజెన్స్‌ ఆరా తీసింది. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలనూ కోడ్‌ చేసినట్లు తెలుస్తోంది. కొత్తపేటలో ట్రస్టుకి చెందిన భూమిని లే అవుట్‌ వేసిన వైనంపైనా ఆరా తీసినట్టు తెలుస్తోంది.
 
బ్రేక్‌ వేయకపోతే పార్టీకి నష్టం..
జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల దందాలు, పేకాట క్లబ్బులకు బ్రేక్‌ వేయకపోతే రాబోయే ఎన్నికలలో పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని నివేదికలో స్పష్టం చేసినట్టు సమాచారం. ఉచిత ఇసుక పాలసీని పకడ్బందీగా అమలు చేయాలని, హౌసింగ్‌ వంటి వ్యక్తిగత బెనిఫిట్‌ స్కీమ్స్‌లో మామూళ్లకు చెక్‌ పెట్టాలని కూడా నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలలో ప్రభుత్వంపై సానుకూలత ఉన్నా, కొందరు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల వైఖరితో ఆ ఫలితాలు అనుకున్నంతగా రావడంలేదని, దీనిపై సీరియస్‌గా దృష్టిసారించాలని వివరించినట్లు తెలుస్తోంది. ఇంటిలిజెన్స్‌ ఇచ్చిన నివేదికను పరిశీలించి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతల దందాలకు చెక్‌పెట్టడానికి టీడీపీ అధిష్ఠానం చర్యలు చేపడుతుందో.. ఇదే ధోరణి కొనసాగిస్తుందో వేచిచూడాలి.
Link to comment
Share on other sites

  • 2 months later...
జనవరిలో జాబితా
20-12-2018 02:29:46
 
636808697876230975.jpg
  • సంక్రాంతి వెళ్లగానే టీడీపీ అభ్యర్థుల ప్రకటన
  • మొదట 60-70 మందితో తొలి జాబితా
  • తర్వాత విడతల వారీగా లిస్టుల విడుదల
  • ఫిబ్రవరి చివరిలో ఎన్నికల తేదీల ప్రకటన!
  • మార్చి మొదట్లోనైనా షెడ్యూలు రావొచ్చు
  • ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి: చంద్రబాబు
  • పది వేల మంది నేతలతో టెలీకాన్ఫరెన్స్‌
అమరావతి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. జనవరిలోనే అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నట్లు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. బుధవారం ఉదయం ఆయన పది వేల మంది పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అభ్యర్థుల పేర్లు ముందే ప్రకటిస్తామని ఆయన ఆ సందర్భంగా తెలిపారు. ‘ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల తేదీలు రావచ్చని అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి. అందుకే అభ్యర్థులను కూడా ముందుగానే ప్రకటించాలనుకుంటున్నాం. జనవరిలో అభ్యర్థుల ప్రకటన ఉంటుంది’ అని చెప్పారు. జనవరిలో జన్మభూమి కార్యక్రమం ఉంది. సంక్రాంతి పండుగ తర్వాత తొలి జాబితా వెలువడవచ్చని అంటున్నారు. మొత్తం అన్ని సీట్లకూ కాకుండా ఖాయంగా బరిలోకి దించే 60-70 మంది అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలో విడుదల చేసే అవకాశం ఉంది. ప్రాంతాలు, సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని ఈ జాబితా రూపొందుతోంది. తర్వాత విడతల వారీగా మిగిలిన సీట్లకు అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని సమాచారం. వీలైనంత ముందుగా అన్ని సీట్లకూ అభ్యర్థులను ప్రకటించి.. ఎన్నికల క్షేత్రంలోకి దూకాలని టీడీపీ అధిష్ఠానం నిశ్చయించింది.
 
 
పీలేరు టాప్‌.. తర్వాత కుప్పం
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఏ నియోజకవర్గం ఏ స్థానంలో ఉందో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో చదివి వినిపించారు. లక్ష్యాన్ని అధిగమించి 102 శాతం పూర్తి చేసి చిత్తూరు జిల్లా పీలేరు రాష్ట్రంలో ప్రథమ స్ధానం పొందింది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి ఈ నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం వంద శాతం లక్ష్యాన్ని పూర్తిచేసి రెండో స్థానంలో ఉంది. లక్ష్యాన్ని చేరుకున్నవారందరినీ సీఎం అభినందించారు. 175 స్థానాలకు గాను 15 నియోజకవర్గాలు సభ్యత్వ నమోదులో వెనుకబడి ఉన్నాయి. వీటిలో పాతిక శాతంలోపే జరిగింది. ఎవరూ బాధ్యత తీసుకోకపోవడం, నాయకత్వం నిరాసక్తత ప్రదర్శించడం దీనికి కారణాలుగా చెబుతున్నారు. నెల్లూరు అర్బన్‌, నెల్లూరు రూరల్‌, రాజంపేట వంటి నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి. వారంలోగా అన్ని చోట్లా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని, ఇక సాగదీయొద్దని చంద్రబాబు ఆదేశించారు. బూత్‌ కన్వీనర్ల ఎంపిక త్వరగా పూర్తిచేయాలని సూచించారు.
 
 
30నే బీసీ సదస్సు
రాజమహేంద్రవరంలో ఈ నెల 30న నిర్వహించదలచిన ‘జయహో బీసీ’ సదస్సు అదే తేదీన జరపాలా లేక జనవరి 3న నిర్వహించాలా అన్న అంశం సహా మరికొన్నిటిపై ఈ టెలికాన్ఫరెన్స్‌లో అప్పటికప్పుడు అభిప్రాయ సేకరణ జరిపారు. నూతన సంవత్సర వేడుకల హడావుడి ఉన్నందువల్ల వాయిదా వేస్తే బాగుంటుందని కొందరు సూచించడంతో పార్టీ నేతల అభిప్రాయం అడిగారు. తొంభై శాతం మంది 30నే నిర్వహించాలని స్పష్టం చేశారు. వారానికోసారి పది వేల మంది పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ జరపాలని 85 శాతం మంది సూచించడం గమనార్హం.
Link to comment
Share on other sites

టార్గెట్‌.. 175-25 సీట్లు!
20-12-2018 02:31:43
 
636808699046383961.jpg
  • టీడీపీయే రావాలని మార్మోగాలి..
  • మనం రాకుంటే అభివృద్ధికి బ్రేక్‌
  • వర్గ విభేదాలు వద్దే వద్దు..
  • ఎవరూ భేషజాలకు పోవద్దు
  • 5 రాష్ట్రాల్లో బీజేపీని తిరస్కరించారు..
  • చరమాంకంలో మోదీ పాలన
  • ఆంధ్ర విషయంలో ఆయన, కేసీఆర్‌ ఒకటే..
  • గుజరాత్‌కు నష్టమని ఒకరు
  • హైదరాబాద్‌కు కష్టమని ఇంకొకరు..
  • ప్రధాని కనుసన్నల్లోనే జగన్‌-ఒవైసీ
  • టీఆర్‌ఎస్‌ గెలిస్తే వైసీపీ సంబరాలా?
  • ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం
అమరావతి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాలు, 25 లోక్‌సభ సీట్లు గెలవడమే లక్ష్యంగా అడుగు ముందుకు వేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపిచ్చారు. ‘నాలుగున్నరేళ్లు రాత్రింబవళ్లూ పని చేశాం. విభజన తర్వాత దారీ తెన్నూ లేకుండా ఉన్న రాష్ట్రాన్ని ఎంతో కొంత తలెత్తుకొని నిలబడగలిగేలా చేశాం. ప్రజలు మన కష్టాన్ని గుర్తిస్తున్నారు. మనకు అండగా ఉండాలనుకుంటున్నారు. వారి మనోభీష్టాన్ని మనం అందుకోవాలి. మళ్లీ టీడీపీయే రావాలన్న నినాదం రాష్ట్రమంతటా ప్రతిధ్వనించాలి. టీడీపీ గెలుపు చారిత్రక అవసరం. మనం మళ్లీ రాకపోతే ఇంతకాలం మనం చేసిన శ్రమ నీరుగారిపోతుంది. చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలు నిలిచిపోతాయి. అభివృద్ధి ఆగిపోతుంది. దీనిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. దూరంగా ఉన్నవారిని దరి చేర్చుకోవాలి. అందరినీ ఏకం చేసి మద్దతు కూడగట్టుకోవాలి’ అని సూచించారు.
 
 
రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని పది వేల మంది టీడీపీ నేతలతో ఆయన బుధవారం ఉదయం టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగినన్ని అభివృద్ధి పనులు గతంలో ఎప్పుడూ జరగలేదు. మనం చేసిన పనులతో గెలుపు ఏకపక్షం కావాలి. టీడీపీకి కార్యకర్తలే ప్రాణాధారం. వారిని ఎల్లప్పుడూ కాపాడుకుంటుంది. ఎన్నికల తర్వాత పనులు చేసేది ప్రభుత్వం. పార్టీలో అందరికీ భవిష్యత్‌ ఉంటుంది. అందరికీ భాగస్వామ్యం ఉంటుంది. ఎవరూ భేషజాలకు పోవద్దు. వర్గ విభేదాలు ఉండవద్దు. మనం పని చేసి చూపించాం. ఆత్మవిశ్వాసంతో ప్రజల్లోకి వెళ్దాం. ఇప్పటి నుంచే ఒక ఊపుతో ఎన్నికల్లో పనిచేయాలి. అసెంబ్లీ నియోజకవర్గాన్ని గట్టిపరచుకుంటే ఎంపీ సీటు కూడా వస్తుంది. ఒక్క కుప్పం నియోజకవర్గం వల్ల చిత్తూరు ఎంపీ సీటు వస్తోంది. ఇలాగే ప్రతి అసెంబ్లీ సీటు మనకు బలంగా నిలవాలి’ అని ఆయన ఆకాంక్షించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సెమీ క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరపాలని సూచించారు.
 
 
దేశం మోదీని తిరస్కరిస్తోంది
ప్రధాని మోదీ పాలనకు చరమాంకం వచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్కచోట కూడా బీజేపీ గెలవలేకపోయిందని, దేశం మొత్తం మోదీ పాలనను తిరస్కరిస్తోందని తెలిపారు. ‘మోదీ నినాదాలకే పరిమితం అయ్యారు. రైతాంగంలో అశాంతి, మైనారిటీల్లో అభద్రత పెంచారు. రాఫెల్‌పై సుప్రీంకోర్టుకే తప్పుడు సమాచారం ఇచ్చారు. మోదీ ప్రభుత్వ అరాచకాలకు ఇది పరాకాష్ఠ. విదేశాల నుంచి నల్ల ధనం తెచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారు. వేయలేకపోయారు. ఇప్పుడు ఆర్‌బీఐలో ఉన్న మిగులు నిధులపై కన్నేశారు. ప్రతి వ్యవస్ధనూ నాశనం చేస్తున్నారు’ అని విమర్శించారు.
 
 
మన క్షేమం కోరరు..!
మోదీ, కేసీఆర్‌ ఒక్కటేనని, వారిద్దరూ ఆంధ్రప్రదేశ్‌ క్షేమం కోరుకునేవారు కాదని సీఎం అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందితే గుజరాత్‌కు నష్టమని మోదీ... హైదరాబాద్‌కు కష్టమని కేసీఆర్‌ భావిస్తున్నారు. అందుకే మనకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి మోదీ నిరాకరిస్తున్నారు. ఇస్తామని సోనియాగాంధీ తెలంగాణ ప్రచారంలో చెబితే టీఆర్‌ఎస్‌ నాయకులు ఆమెను తిట్టిపోశారు. నేను కేసీఆర్‌ను కలుపుకెళ్దామని ప్రయత్నించాను. ఇద్దరం కలిసుండి 35-40 లోక్‌సభ సీట్లు తెచ్చుకోగలిగితే ఆ ఉమ్మడి బలంతో రెండు రాష్ట్రాలనూ అభివృద్ధి చేసుకోవచ్చని.. ఇద్దరం లాభపడతామని చెప్పాను. కానీ కేసీఆర్‌ కలిసి రాలేదు. ఆంధ్ర అభివృద్ధి చెందితే హైదరాబాద్‌కు పోటీ వస్తుందని ఆయన భయపడుతున్నారు. ముందు హోదాకు అంగీకారం తెలిపారు.
 
 
సోనియా హోదాను ఇస్తామంటే దానిని సాకుగా చూపి తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టారు. అక్కడ టీఆర్‌ఎస్‌ గెలిస్తే ఇక్కడ వైసీపీ నేతలు పండగ చేసుకుంటున్నారు. మనకు హోదా వద్దన్నవారు గెలిస్తే ఇక్కడ టపాసులు కాల్చి ఫ్లెక్సీలు పెడతారా? వీళ్లకు స్వప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు’ అని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని దెబ్బతీయాలనుకునేవారిని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మోస్తూ తిరుగుతున్నారని, మోదీ కనుసన్నల్లోనే ఆయనకు, ఒవైసీకి దోస్తీ కుదిరిందని చెప్పారు.ప పెథాయ్‌ తుఫాను బాధితులకు పార్టీ శ్రేణులు అండగా ఉండాలని, హుద్‌హుద్‌, తితలీ తుఫాన్ల బాధితులకు సాయం చేసిన మాదిరిగానే ఈ సమయంలో కూడా అదే స్ఫూర్తితో అండగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Link to comment
Share on other sites

విజయవాడలో ‘దేశం’ దూకుడు.. తొలి జాబితాలో ఎనిమిది మంది!?
20-12-2018 11:27:29
 
636809022184387771.jpg
  • సానుకూల ఓటుపై ఆత్మవిశ్వాసం
  • ఒంటరి పోరువైపు అడుగులు
  • ఎన్నికలకు ముందే అభ్యర్థుల వెల్లడికి కసరత్తు
ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వెల్లడవుతున్న సంతృప్తి.. టీడీపీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలు ఉండవచ్చన్న సంకేతాలు రావడంతో ఆ పార్టీలో దూకుడు పెరిగింది. ఒంటరి పోరుకు సిద్ధమవుతోంది. జిల్లాలోని 16 నియోజకవర్గాల్లో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు సర్వేలు చేయిస్తూ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల పనితీరును బలం, బలహీనతను గమనిస్తున్నారు. ప్రత్యర్థుల కంటే ముందుగా కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించడానికి కసరత్తు చేస్తున్నారు. అంచనాల ప్రకారం జిలాల్లో ఎనిమిది సీట్లు ‘సేఫ్‌’గా ఉన్నాయని తెలుస్తోంది.
 
విజయవాడ : వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల పోరులో ప్రత్యర్థుల కంటే ముందుండటానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీ వచ్చే ఎలక్షన్లలో ఒంటరి పోరుకు సిద్ధమవుతోంది. 2014లో టీడీపీ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా, బీజేపీ రెండు చోట్ల అభ్యర్థులను నిలి పింది. అయితే బీజేపీతో కటీఫ్‌ కావడంతో జిల్లాలోని 16 నియోజకవర్గాలపై చంద్రబాబు దృష్టి సారించారు. ప్రతి నియోజకవర్గ పరిస్థితిని ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ 10 స్థానాల్లో, బీజేపీ ఒక స్థానంలో విజయకేతనం ఎగరవేయగా, వైసీపీ అయిదుచోట్ల గెలిచింది.
 
 
వైసీపీ నుంచి గెలిచిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరారు. ప్రస్తుత పరిస్థితుల్లో 16 అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు ఇప్పటికే కొంత కసరత్తు చేశారు. ఎప్పటికప్పుడు సర్వేలు చేయించి ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల పని తీరుపై ప్రోగ్రెస్‌ రిపోర్టులు ఇస్తున్నారు. గ్రేడ్‌లు తక్కువగా ఇచ్చిన ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లతో అనేక సార్లు ముఖాముఖి మాట్లాడి వారి బలాలు, బలహీనతలను వివరించారు. ఆరోపణలు ఉన్న వారిని మందలించడం, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకపోవడం, ప్రజల్లో తక్కువగా కనిపించడం వంటి రిమార్క్స్‌ ఉన్న నేతలను హెచ్చరించారు.
 
 
తొలి జాబితాపై చంద్రబాబు కసరత్తు
2019లో జరిగే ఎన్నికల కోసం ఇతర పార్టీల కంటే ముందుగానే కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు అవకాశాలు అధికంగా ఉండి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు లేదా ఇన్‌చార్జిల పని తీరు కూడా అన్ని విధాలుగా బాగుంటే వారి పేర్లను తొలి జాబితాలో ప్రకటించడానికి కసరత్తు జరుగుతోంది. పార్టీ అంచనాల ప్రకారం జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ సీట్లు ‘సేఫ్‌’లో ఉన్నాయి. వీటికి ముందే అభ్యర్థులను ప్రకటిస్తే ఎలా ఉంటుందని పరిశీలిస్తున్నారు. విజయవాడ తూర్పు, సెంట్రల్‌, పెనమలూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, గన్నవరం, అవనిగడ్డ నియోజకవర్గాలు ‘సేఫ్‌’ జాబితాలో ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీటికి ప్రాతినిధ్యం వహిస్తున్న గద్దె రామ్మోహన్‌, బొండా ఉమా, బోడె ప్రసాద్‌, మంత్రి దేవినేని ఉమా, తంగిరాల సౌమ్య, శ్రీరాం రాజగోపాల్‌, వల్లభనేని వంశీమోహన్‌, మండలి బుద్ధప్రసాద్‌ల పేర్లు తొలి జాబితాలో ఉంటాయని సమాచారం. ఇతర కారణాలతో ఏమైనా మార్పులు ఉంటే తప్ప ఈ ఎనిమిది సీట్లకు ముందే పేర్లను ప్రకటిస్తారని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 
 
నాయకత్వలోపం, విభేదాలు సరిదిద్ది..
జిల్లాలో మిగిలిన ఎనిమిది నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల నాయకత్వ లోపం, పార్టీలో ఉన్న విభేదాలను సరిదిద్దాలనుకుంటున్నారు. తర్వాత అభ్యర్థులను ప్రకటించే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్టు సమాచారం.
 
 
రెండో జాబితాలో..
హడావుడిగా అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తే సమస్యలు వస్తాయని భావించే నియోజకవర్గాలను రెండో జాబితాలో చేరుస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో పార్టీ పరంగా పటిష్టంగా ఉన్నా అంతర్గత కారణాలు నాయకులకు తలనొప్పిగా మారాయి. పార్టీ అధినేత చంద్రబాబు సమస్యాత్మక నియోజకవర్గాల నేతలతో ముఖాముఖి మాట్లాడి పరిస్ధితులను చక్కదిద్దుతారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
 
 
పని తీరుపై సర్వేలు...
తొలి జాబితాలోనే సీట్లు దక్కుతాయని భావిస్తున్న గద్దె, బొండా, బోడె, వంశీమోహన్‌, దేవినేని ఉమా, శ్రీరాం రాజగోపాల్‌కు ఎమ్మెల్యేల పని తీరుపై చంద్రబాబు చేయించిన సర్వేల్లో మంచి గ్రేడ్‌లు వచ్చాయి. చంద్రబాబు కూడా వారిని ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తన పట్ల పార్టీలో ఉన్న అసంతృప్తిని కొంత కాలంగా తొలగించుకుంటూ వచ్చారు. ప్రజలలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు. తంగిరాల కుటుంబానికి ఆ నియోజకవర్గంలో ఉన్న ఆదరణ, టీడీపీకి ఉన్న బలం నందిగామను సేఫ్‌ జోన్‌లో చేర్చింది. నగరంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, తూర్పు, సెంట్రల్‌ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌, బొండా ఉమా పనితీరుతో నియోజకవర్గాల్లో టీడీపీని మొదటి స్థానంలో నిలిపాయి.
 
 
అభివృద్ధి పనులే శ్రీరామ రక్ష
మైలవరంలో మంత్రి ఉమా గత అయిదేళ్లలో చేసిన అభివృద్ధి పనులు, కష్టపడే తత్వం, ప్రజలకు అందుబాటులో ఉండటం వంటివి ఆయనకు అనుకూల అంశాలు. చింతలపూడి రిజర్వాయర్‌ నిర్మాణం కూడా పార్టీ ఇమేజ్‌ను పెంచింది. సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా వేల సంఖ్యలో లబ్ధి పొందారు. కిడ్నీ బాధితులకు ఇస్తున్న పెన్షన్‌లు ఇతర సంక్షేమ కార్యక్రమాలు మైలవరంలో పార్టీని బలంగా నిలిపాయి. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ మంచితనం, మృదుస్వభావం, ప్రజలతో మమేకమవడం, పార్టీ కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేయడం, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ఎమ్మెల్సీ జనార్దన్‌, మాజీ మంత్రి రఘురాం ఆశీస్సులతో పార్టీ ఏకతాటిపై ఉండటం ఇక్కడ సానుకూల అంశాలు.
 
 
గన్నవరం ఎమ్మెల్యే వంశీమోహన్‌కు కేడర్‌తో ఉన్న సంబంధాలు, ప్రజలకు అందుబాటులో ఉండటం, తిరుగులేని నాయకత్వం ఆయనను మరోసారి అభ్యర్థిగా నిలపనున్నాయి. దూకుడు మనస్తత్వంతో అప్పుడప్పుడు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించడం ఆయనకు మైనస్‌ పాయింట్‌. నియోజకవర్గ అభివృద్ధి పనులు ఏమైనా ఉంటే సీఎం వెంటపడి మరీ సాధిస్తారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు ప్రజలకు అందుబాటులో ఉంటారు. టీడీపీకి పట్టు ఉన్న నియోజకవర్గాల్లో పెనమలూరు ఒకటి. అవనిగడ్డలో ప్రత్యేక పరిస్థితులు, సామాజిక సమీకరణల దృష్ట్యా మండలి బుద్ధప్రసాద్‌కే మరోసారి సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గాంధేయ వాదిగా, మృదు స్వభావిగా, ఎవరినీ నొప్పించని వ్యక్తిగా మండలిని అందరూ అభిమానిస్తారు. 2014లో ఎన్నికల ముందు పార్టీలో చేరినా స్వల్ప కాలంలోనే టీడీపీ శ్రేణులందరితో కలిసిపోయారు.
Link to comment
Share on other sites

ఐదు రోజులే గడువు.. ఎమ్మెల్యేలకు సీఎం సీరియస్‌ క్లాస్‌
20-12-2018 10:54:17
 
636809000591166826.jpg
  • ఏమిటీ అలసత్వం !
  • తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల నమోదులో ఎమ్మెల్యేలు నిరుత్సాహం
  • చింతలపూడి, టీపీ గూడెంలో వెనకడుగు
  • 83 శాతంతో పాలకొల్లు టాప్‌
  • 24లోపు పూర్తి చేయాల్సిందే
  • అలసత్వం, నిర్లక్ష్యాన్ని సహించం
 
 
ఏలూరు: ‘మీలో ఎందుకీ అలసత్వం. పదే పదే చెబుతున్నాం. ఎన్నికల దగ్గరపడుతున్నాయి. మనంతట మనంగా బలపడాలి. ఇంకా చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. కాని ఇప్పటికే మీకు అప్పగించిన పనులపై సీరియస్‌ లేదు. ఈ నెల 24వ తేదీలోపు పార్టీ సభ్యత్వాలు పూర్తిచేసి తీరాల్సిందే’ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకింత అసహనం, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే మీకు ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం అంతా జరిగి తీరాలి. ఒకటి, రెండుసార్లు ఇప్పటికే చెప్పాం. అర్ధం చేసుకుని పూర్తి చేయండి.. అని హితవు పలికారు. అమరావతి నుంచి ఎమ్మెల్యేలు,ఎంపీలతో సహా మిగతా ముఖ్యులతో బుధవారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఇంతకు ముందు మిగతావారికి మాట్లాడే అవకాశం ఇచ్చేవారు. కాని ఈ సారి దీనికి భిన్నంగా అనేక రాజకీయ అంశాలను, పాలనా అంశాలను సీఎం చంద్రబాబు తానే ఏకరువుపెట్టారు.
 
 
50 శాతం మించని సభ్యత్వాలు...
రాష్ట్రంలో సభ్యత్వ నమోదు పూర్తి చేయడంలో మొదటి పదినియోజకవర్గాల్లో ఈ జిల్లాకు సంబంధించి పాలకొల్లుకు స్థానం లభించింది. సుమారు 85 శాతం సభ్యత్వ నమోదుతో పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు ఈ సారి కూడా అధిష్ఠానం అభినందనలు అందు కున్నారు. జిల్లాలోనూ పాలకొల్లే మొదటిస్థానంలో నిలవగా.. అట్టడుగు స్థానంలో తాడేపల్లిగూడెం నమోదైంది. కేవలం 40 శాతంకు మించి సభ్యత్వం నమోదు చేయని నియోజకవర్గాలు అరడజను పైగానే ఉన్నాయి.ఇప్పటి వరకూ 15 నియోజకవర్గాల్లోనూ 4 లక్షల 70 వేలు మాత్రమే పూర్తిచేయగలిగారు. అంటే 50 శాతంకు మించి సభ్యత్వం కదల్లేదు.దీనిపై అధిష్ఠానం సీరియస్‌గా వ్యవహరించబోతుంది. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరులో 79 శాతం, ఆచంటలో 68 శాతం మాత్రమే సభ్యత్వం నమోదుకావడం విశేషం. మాజీ మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడిలో కేవలం 28 శాతం పూర్తయింది. ఈ లెక్కన నియోజకవర్గాల్లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై అధిష్ఠానం దృష్టిపెట్టి ప్రత్యేకంగా ఆరాతీయబోతుంది.
 
 
అసలేం జరుగుతుందంటే...
గతంలో పార్టీ అధిష్ఠానం నుంచి ఎటువంటి ఆదేశం వచ్చినా క్షణాల్లో ఎమ్మెల్యేలంతా ఆచరణలోకి దిగేవారు. క్షేత్రస్థాయి వరకు సమాచారం పంపేవారు. కిందిస్థాయి కేడర్‌ను అప్రమత్తం చేసేవారు. కాని ఏమైందో.. ఏమోగాని ఇటీవల ఎమ్మెల్యేల్లో పార్టీపరమైన వ్యవహారాల్లో కొంత నిరాసక్తత కనిపిస్తుంది. అంతకంటే మించి చేద్దాం.. చూద్దాం.. అనే ధోరణి.దీంతో జిల్లాలో సభ్యత్వంలో అనుకున్నంత పురోగతి సాధించలేకపోతున్నారు.ఆఖరికి మంత్రులు ప్రాతినిధ్యం వహి స్తున్న నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. గతంలో 5 లక్షల 88 వేలు లక్ష్యంగా కాగా, ఈ సారి దానికి మరో మూడు లక్షలు అదనంగా చేర్చారు.
 
సగానికి సగం నియో జకవర్గాల్లో 50 శాతం లోబడే పార్టీ సభ్యత్వం నమోదైంది. వీటన్నింటిపైనా సీఎం చంద్రబాబు బుధవారం నిర్వ హించిన టెలికాన్ఫరెన్సులో సీరియస్‌ అయ్యారు. ఏ నియోజకవర్గాన్ని ప్రస్తావించకుండానే.. సభ్యత్వంలో ఎందుకు ఈ అలసత్వం అంటూ గట్టిగానే ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన గడువు మరో ఐదు రోజులే మిగిలి ఉంది. ఇంత స్వల్ప వ్యవధిలో లక్ష్య సాధన పూర్తవుతుందా? పార్టీ ఆదేశాలకు ఇప్పటికైనా ఎమ్మెల్యేలు విలువిస్తారా? తమంతట తాముగానే నియోజకవర్గాల స్థాయిలో ఎందుకు వెనుకంజ వేశారు? మరికొందరు అసలు ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోలేదు ఎందుకు? అనే ప్రశ్నల పరంపర పార్టీలో వినిపిస్తోంది.
Link to comment
Share on other sites

చ్చే నెల నుంచే ప్రక్షాళన.. ఎమ్మెల్యేలకు మరో అవకాశం
20-12-2018 10:46:36
 
636808996582584270.jpg
  • అన్నింటా పరుగులే
  • పథకాల్లో చురుకుదనం
  • సాగునీటి పనులపై అటెన్షన్‌
  • కలెక్టర్‌ సహ పలువురి బదిలీలకు రంగం సిద్ధం
  • లక్ష్యాలు చేరాలని ఆదేశం
  • జన సంతృప్తి ముఖ్యం
  • ముంచుకొస్తున్న ఎన్నికల కోడ్‌
 
ఏలూరు: వచ్చే నెలలో ఎమ్మెల్సీ ఎన్నికలు. ఆపై వచ్చే నెలలోసాధారణ ఎన్నికలు. నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం. రాబోయే కొద్ది రోజులూ అత్యంత కీలకంగా భావిస్తుంది ప్రభుత్వం. అందుకే పథకాలపైనే ఇప్పుడంతా అటెన్షన్‌. ఏ పథకం ఎక్కడ వరకూ వచ్చింది..ప్రజాసంతృప్తి ఏ స్థాయిలో ఉంది. ప్రజలు ఏమనుకుంటున్నారు. ఏమిజరగాలని కోరుకుంటున్నారు.. పూర్తిస్థాయి ఆరా. క్షేత్రస్థాయిలో మేలైన పాలన జరిగేలా జాగ్రత్తలు. ఒక్కసారిగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశాలు. నియోజకవర్గస్థాయిలో పేరు కుపోయిన పెండింగ్‌ను వదిలించుకునేందుకు తంటాలు.
 
ప్రభుత్వపరంగా అమలవుతున్న వాటిపై ప్రత్యేక దృష్టి.వచ్చే నెలలో కలెక్టర్‌ దగ్గర నుంచి కొందరు అధికారులను నేరుగా బదిలీ చేసే అవకాశాలు. అంతకంటే మించి ఎమ్మెల్యేల సిఫారసుల మేరకు పనిచేయని వారిపై అధికారిక మార్కు ఉండేలా చర్యలు. సాధారణ ప్రజలు మెచ్చేలా రాబోయే 60 రోజులు వీలైనంత పాలనా వ్యవహారాల్లో చురుకుదనం. తక్షణ నిర్ణయాలు. త్వరలో తీసుకోబోయే సంక్షేమ పథకా లపై ప్రజాభిప్రాయం.. ఎన్నికల గోదాలో దిగేముందే ప్రజల నుంచి మంచి మార్కులు కొట్టేయాలనే తాపత్రయం స్పష్టంగా కనిపిస్తుంది.
 
 
పథకాల పరుగులు...
గడచిన ఐదేళ్ళగా అమలవుతున్న పథకాల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో ఇప్పుడు ప్రభుత్వమే నేరుగా దృష్టిపెట్టింది. ఇన్నాళ్ళు సమీక్షలతో కొంత సంతృప్తిపడినా..మరోవైపు ఉన్నది ఉన్నట్టుగా ఆరాతీసేందుకు సంసిద్ధమ వుతోంది. గడచిన రెండు నెలల కిందటే రేషన్‌కార్డుల జారీపై పూర్తి స్థాయి కసరత్తు నిర్వహించి..ఇదే నెలలో 30 వేల కార్డులను నేరుగా ప్రజలకు అందజేశారు.కార్డులు రాలేదని అసం తృప్తితో ఉన్న వారంతా ఒక్కసారిగా ప్రభుత్వ చర్యతో తెగమురిసిపోయారు.ఇంకా పెండింగ్‌లో ఉన్న కార్డులకు త్వరలోనే ఆమోదముద్ర పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నా యి.
 
మరోవైపు పింఛనుకు దరఖాస్తు చేసుకునేవారికి కొదవ లేదు.ఇలాంటి దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే కనిపి స్తున్నాయి.ఇవన్నీ పండగకు ముందే క్లియర్‌చేసి ప్రజాభిమానం కూడగట్టుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. గృహనిర్మా ణంలో మేలైన రికార్డు సాధించి ప్రజాభిమానం కూడగట్టుకునే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి.దీనిలో భాగంగా అర్బన్‌ హౌసింగ్‌, ఎన్‌టీఆర్‌ హౌసింగ్‌లో వచ్చే నెలలోనే సామూహిక గృహప్రవేశాలకు సిద్ధమవుతు న్నారు.జిల్లా వ్యాప్తంగా 40 వేలకు పైబడి పక్కా గృహాల నిర్మాణానికి అర్హులైనవారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇదంతా కూడా వచ్చే నెల రెండో వారంలోపు పూర్తిచేయాలని ఆతృతపడుతున్నారు.
 
 
సాగునీటికి పెద్దపీట...
సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలన్న ఆదేశాలు వెలువడ్డాయి. రాబోయే రెండు నెలల వ్యవధిలోనే చింతలపూడి ఎత్తిపోతలను కొలిక్కితేవాలని భావిస్తున్నారు. మిగతా సాగునీటి పనులపై అప్రమత్తం అయ్యారు. రైతులకు గోదావరి జలాలను అందించి, మేలైన పంటకు తోడ్పడి, తద్వారా రైతు ప్రభుత్వంగా నిలవాలన్న తపన స్పష్టంగా ఉంది. అందుకే పట్టిసీమ ఎత్తిపోతల నుంచి ఈ ఏడాది గోదావరి జలాలు సంతృప్తికరంగా విడుదల చేయకపోయినా, భవిష్యత్‌లో రైతులంతా డెల్టా పరిధిలోకి వచ్చేలా కాల్వలను ఆధునీకరించాలని భావిస్తున్నారు. తాడిపూడిలో పెండింగ్‌ పనులను ఈ ఏడాదే పూర్తిచేయ బోతున్నారు. పోలవరం ప్రాజెక్టు వీటిన్నంటికి అదనం.
 
 
పాలనా పరమైన ప్రక్షాళన
పాలనా పరమైన వ్యవహారాల్లోనూ ఉన్న వ్యవధిలోనే సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చేనెల మొదటివారంలో జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ దగ్గర నుంచి మరి కొంత మంది అధికారులు స్థానచలనం పొందబోతున్నారు. ఇప్పటికే దీనిపై ప్రభుత్వపరంగా సుదీర్ఘకసరత్తు సాగింది. వచ్చేనెల మొదటివారంలో ఓటర్ల తుదిజాబితా ప్రకటించిన వెంటనే అప్పటి వరకు ఉన్న షరతులు కాస్త అధికారుల బదిలీలపై సడలుతాయి. అందుకే మొదటివారంలో బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈలోపే సాధ్యమైనంతమేర శాఖలుపరంగా లోతట్టు పరిశీలన చేయాలని, అధికారికంగా రావాల్సిన అనుతులు పొందాలని, ఏవైనా ఆంక్షలు అడ్డంకింగా ఉంటే పాలనాపరమైన వెసులుబాటును కూడా పరిశీలిస్తున్నారు.
 
 
ఎమ్మెల్యేలకు మరో అవకాశం
ఇప్పటి వరకూ ఎమ్మెల్యేలు చేతులుకట్టి.. పాలనా వ్యవహారాల్లో వారి జోక్యం ఉండబోదని చెబుతుండడంతో ఈ విషయంలో ఒకింత సడలింపునకు దిగే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యేల నుంచి వచ్చే సిఫారసులను పరిస్థితిని బట్టి ఆమోదించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే వివిధ శాఖల్లో భారీగా బదిలీలు ఉండవచ్చునని భావిస్తున్నారు. కాని ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా వ్యవహరించకుండా ఈ విషయంలో కాస్తంత పరిశీలన తర్వాత ఆమోదముద్ర వేయాలనే అంశం పరిశీలనలో ఉన్నట్టు మరొక సమాచారం. దీనిపై ప్రభుత్వం భారీగా కసరత్తు చేస్తోంది. 60 రోజులు పరుగులు పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని సూచనలు అందుతున్నాయి. దీనిలో భాగంగానే దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుడుతున్నారు.
Link to comment
Share on other sites

చంద్రబాబు ప్రకటనతో సిట్టింగ్‌ అభ్యర్థుల్లో ఉత్కంఠ!

46CHANDRA.jpg

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ అధికార తెలుగుదేశంలో హడావుడి మొదలైంది. అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తామన్న చంద్రబాబు మాటతో.. నాయకుల ఉత్కంఠ రెండింతలయ్యింది. పనితీరు మార్చుకోవాలని ఇప్పటికే  అనేక మార్లు హెచ్చరించినందున మార్పులు, చేర్పులు ఎలా ఉంటాయోనని ఆసక్తిగా చూస్తున్నారు. ప్రతి జిల్లాలో ఇద్దరు నుంచి ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు దక్కకపోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది.

సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవ్వడంతో ఆ దిశగా తెలుగుదేశం కసరత్తు ముమ్మరం చేసింది. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. నేతల పనితీరుపై అంతర్గత సర్వేలు నిర్వహించి పలువురు నాయకులను చాలాసార్లు హెచ్చరించారు. అభ్యర్థుల ప్రకటనపై తెలుగుదేశంలో చివరి నిమిషం వరకు తర్జన భర్జన ఉంటుందన్న అపవాదును తొలగించేలా ఈసారి ముందుగా అన్ని టికెట్లు ఖరారు చేస్తామని చంద్రబాబు స్పష్టంచేశారు. దాదాపు 40 నుంచి 50 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. అలాగే మార్చాలనుకుంటున్న సిట్టింగ్‌ అభ్యర్థుల  జాబితాను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ఆశావహులకు సంబంధించి మరో జాబితాను రూపొందించాలని పార్టీలో ప్రచారం జోరుగా సాగుతోంది.

జిల్లాలవారీగా పరిశీలిస్తే  శ్రీకాకుళంలో రెండు నుంచి మూడు స్థానాల్లో సిట్టింగ్‌లకు ఈసారి టికెట్లు దక్కకపోవచ్చని తెలుస్తోంది. విజయనగరం జిల్లాలోను అదే పరిస్థితి ఉంటుందని అంచనా. విశాఖలోనూ రెండు మూడు చోట్ల  కొత్త వారికి అవకాశం కల్పిస్తారని సమాచారం. తూర్పుగోదావరి జిల్లాలో ఒకరిద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారే సూచనలు కన్పిస్తున్నందున వారిని బుజ్జగిస్తారా? లేకుంటే కొత్త అభ్యర్థులను అన్వేషిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఆ ఎమ్మెల్యేలను ఇప్పటికే ఒకటి రెండు సార్లు పిలిచి మాట్లాడారు. వీరు కాకుండా  ఇంకా ఒకరిద్దరిని మార్చే దిశగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.  పశ్చిమ జిల్లాలో కూడా ఓ  మంత్రి, మరో మాజీమంత్రికి టికెట్లు దక్కడం అనుమానమే అనే పరిస్థితి పార్టీ వర్గాల్లో ఉంది.  కృష్ణాజిల్లాలో కూడా ఒకరిద్దరు సిట్టింగ్‌లకు సీటు కష్టమేనని అంటున్నారు. సీనియారిటీ ఉన్నా పనితీరు సరిగా లేని తూర్పు కృష్ణా ప్రాంత ఎమ్మెల్యే పట్ల  సీఎం అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. పశ్చిమ కృష్ణ పరిధిలో ఓ నియోజకవర్గ ఇన్‌ఛార్జికి టికెట్‌ కష్టమే అంటున్నారు. జిల్లాలో మరికొందరు సిట్టింగ్‌లకు స్థాన చలనం తప్పదని సూచనలు ఉన్నట్లు నేతలు అంచనా వేస్తున్నారు. గుంటూరు నగర పరిధిలోని ఓ సిట్టింగ్‌కు ఈసారి సీటు ఇస్తారా? లేక మరో చోటుకు పంపిస్తారా? అన్న చర్చ జరుగుతోంది. సదరు ఎమ్మెల్యే పార్టీ మారతారన్న ప్రచారం ఉంది. రావెల కిశోర్‌బాబు జనసేనలో చేరడంతో ప్రత్తిపాడులో కొత్త అభ్యర్థికి అవకాశం దక్కనుంది. పల్నాడు ప్రాంతంలో కొన్నిచోట్ల మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు. ప్రకాశం జిల్లాలో ఒకరిద్దరు నేతల పనితీరుపై  చంద్రబాబు చాలా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు  తక్కువగా ఉన్నా వలసలతో సంఖ్య కొంత పెరిగింది. అలాగే ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది. వీరిలో ఎవరికి అదృష్టం దక్కుతుందో  తెలియడం లేదు. మంత్రులు ఇద్దరికి ప్రత్యర్థి పార్టీల కంటే సొంత పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.

రాయలసీమలో టికెట్ల కేటాయింపు ఈసారి కత్తిమీద సాము అయ్యే పరిస్థితి కన్పిస్తోంది. కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తారా? లేక లోకేష్‌ను బరిలోకి దింపుతారా? అని ఆసక్తిగా మారింది. ఉత్తరాంధ్ర లేదా రాజధాని ప్రాంతం నుంచి చంద్రబాబు పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. చిత్తూరు జిల్లా నుంచి మాజీ మంత్రికే అవకాశం ఇవ్వడమా? లేక ఆయన కుటుంబ సభ్యులను పోటీలో నిలపడమా అనే పరిస్థితి ఉత్కంఠ రేపుతోంది.  మరో రెండు స్థానాల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. అనంతలో కనీసం నలుగురు సిట్టింగ్‌లను మార్చే పరిస్థితి ఉంది. మాజీ మంత్రులైన కొందరు నేతలపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కర్నూలు జిల్లాలో సిట్టింగ్‌ స్థానాలను దక్కించుకునేందుకు పోటీ ఎక్కువగానే ఉంది. కడప జిల్లాలో నియోజకవర్గ ఇన్‌ఛార్జులుగా కొనసాగుతున్న వారిలో కొందరికే ఈసారి టికెట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తారా? లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది.

 

Link to comment
Share on other sites

బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఒకవేళ టీడీపీలోకి వస్తే...
21-12-2018 11:32:29
 
636809889935245625.jpg
  • తొలి జాబితాలో చోటెవరికో?
  • జనవరిలో ప్రకటించనున్నట్టు చంద్రబాబు వెల్లడి
  • సిట్టింగ్‌లలో పలువురికి అవకాశం
  • కొన్నిచోట్ల మార్చే యోచన?
  • సర్వే ఆధారంగా గెలుపు గుర్రాలకే టిక్కెట్లు
ఎన్నికల వేడి రాజుకుంది. ఇంకో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు ప్రకటన వచ్చే అవకాశం వున్నదని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అయితే 60 నుంచి 70 స్థానాల్లో అభ్యర్థులను సంక్రాంతి తరువాత ప్రకటిస్తామని చెబుతోంది. దీనికి అవసరమైన సర్వే పూర్తయిందని, పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిందని తెలిసింది. ఈ జాబితాలో ఎక్కువగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే స్థానం కల్పిస్తారని పార్టీ వర్గాల సమాచారం. దీంతో తొలి విడత జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయనే దానిపై చర్చ మొదలైంది.
 
 
(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం)
రాష్ట్ర ఆర్థిక రాజధాని, ఉత్తరాంధ్ర ప్రాంతానికి కేంద్రం విశాఖపట్నం. జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికలలో మిత్రపక్షం బీజేపీతో కలిపి తెలుగుదేశం పార్టీ 12 సీట్లు గెలుచుకుంది. వైఎస్‌ఆర్‌ సీపీ మూడు చోట్ల విజయం సాధించింది. అయితే గెలిచిన ముగ్గురిలో ఇద్దరు (పాడేరు, అరకు ఎమ్మెల్యేలు) టీడీపీలో చేరారు. దాంతో 15 మందిలో 13 మంది ప్రస్తుతం టీడీపీ (ఇటీవల బీజేపీ దూరమైన సంగతి తెలిసిందే) పక్షాన వున్నట్టుగా లెక్క. ఈ లెక్కల ప్రకారం జిల్లాలో పార్టీ పటిష్ఠంగా వున్నట్టే లెక్క. అయితే ప్రస్తుత సిట్టింగ్‌లలో కొద్దిమందిని మార్చాలనే ప్రతిపాదన వున్నదనే ప్రచారం జోరుగా సాగుతుంది. సిట్టింగ్‌లలో కొందరు ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కాకుండా మరో సెగ్మెంట్‌ కావాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాలలో పోటీ లేని, గెలుపు ఖాయమనుకున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను మొదటి విడతలో ప్రకటించే అవకాశం వున్నదని అంచనా వేస్తున్నారు.
 
విశాఖ నగర పరిధిలో ఏడు నియోజవర్గాలు ఉన్నాయి. ఒక్క విశాఖ ఉత్తరం మినహా మిగిలిన చోట్ల ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. భీమిలి విషయంలో తొలుత పట్టుబట్టిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఇటీవల సయోధ్య కుదరడంతో వెనక్కి తగ్గినట్టు చెబుతున్నారు. భీమిలి బదులు రూరల్‌లో చోడవరం టిక్కెట్‌ను ముత్తంశెట్టి అడుగుతున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు భీమిలిలోనే తిరిగి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొద్దిరోజులుగా పూర్తిగా భీమిలిపైనే దృష్టిసారించి, అభివృద్ధి పనులు వేగవంతం చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణబాబుకు, విశాఖ పశ్చిమంలో పెతకంశెట్టి గణబాబులకు పోటీ లేదు. దాంతో ఈ ముగ్గురి పేర్లు తొలి జాబితాలో వుండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు వుంటే ఆ ప్రభావం విశాఖ దక్షిణంపై పడుతుందనే వాదన ఉంది. అది తప్ప అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌కు ఇబ్బంది వుండకపోవచ్చుననేది అంచనా. ప్రస్తుతం పార్టీ సభ్యత్వ నమోదులో ఆయన జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్నారు.
 
 
గతంలో మిత్రపక్షం బీజేపీకి ఇచ్చిన విశాఖ ఉత్తర నియోజకవర్గంపై అధిష్ఠానం తొలి జాబితాలో ప్రకటన చేయకపోవచ్చునని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక్కడ పోటీ ఎక్కువగా ఉంది. ఎలమంచిలి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ఈ స్థానం ఆశిస్తున్నారు. పార్టీలోకి రావాలని భావిస్తున్న సబ్బం హరి కూడా ఇదే స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కూడా పార్టీ మారి టీడీపీలోకి వచ్చే అవకాశం లేకపోలేదని, అలా వస్తే ఆ సీటు ఆయనకే ఇవ్వవచ్చునని చెబుతున్నారు. దీంతో ప్రస్తుత జాబితాలో ఉత్తరం పేరు వుండదని భావిస్తున్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పనితీరుపై ఎటువంటి అనుమానాలు లేకపోయినా ఆ నియోజకవర్గ అభ్యర్థిని మొదట జాబితాలో ప్రకటించరని, ఆ నియోజకవర్గం, ఆయనతో ముడిపడిన అంశాలు కొన్ని వున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పెందుర్తి విషయానికి వస్తే అక్కడ బండారు సత్యనారాయణమూర్తి సీనియర్‌ ఎమ్మెల్యే. మాజీ మంత్రి కూడా. అక్కడ ఆయనకు పోటీ లేదు. తొలి జాబితాలోనే ఆయన పేరు ప్రకటించే అవకాశం ఉంది.
 
 
రూరల్‌ విషయానికొస్తే రోడ్లు భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పోటీ చేస్తే మాత్రం నర్సీపట్నం టిక్కెట్‌ ఆయనదే. అయితే ఆయన కుమారుడు విజయ్‌ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. దీనికి చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారు? అనేది తేలాల్సి ఉంది. బరిలో దిగేందుకు అయ్యన్న ఓకే అంటే తొలి జాబితాలో నర్సీపట్నం అభ్యర్థిగా ఆయన పేరు ఖరారవుతుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎలమంచిలి ఎమ్మెల్యే, రూరల్‌ పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు తిరిగి అదే చోట నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా లేరని చెబుతున్నారు. నగరంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం కావాలని చాలాకాలం నుంచి అధినేతను కోరుతున్నారు. వచ్చే ఎన్నికలలో ఎలమంచిలిలో గట్టి పోటీ వుండనున్నందున పంచకర్లను మరో నియోజకవర్గానికి మార్చేందుకు అధిష్ఠానం అంగీకరించకపోవచ్చుననే వాదన ఉంది. ఎలమంచిలి నుంచి పోటీ చేసేందుకు పంచకర్ల సై అంటే తొలి జాబితాలో ఆయనకు అవకాశం వుండవచ్చునని అంచనా. ప్రస్తుతం వున్న సమీకరణల నేపథ్యంలో అనకాపల్లి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పీలా గోవింద్‌కే అవకాశం వుంటుందని ప్రచారం సాగుతుంది. చోడవరం కోసం ముత్తంశెట్టి పోటీ పడుతున్నారు. మరోవైపు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా కేఎస్‌‌ఎన్‌ఎస్‌ రాజు ఉన్నారు. అందువల్ల తొలి జాబితాలో ఈ సీటుపై సస్పెన్షన్‌ ఉంటుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి.
 
మాడుగుల టిక్కెట్‌ను అక్కడ ఇన్‌చార్జి జి.రామానాయుడు ఆశిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ పైలా ప్రసాదరావు పోటీ పడుతున్నారు. విశాఖ మాజీ మేయర్‌ సబ్బం హరిని మాడుగుల నుంచి నిలిపితే ఎలా వుంటుందని కూడా అధిష్ఠానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా మాడుగుల అభ్యర్థిని తొలి జాబితాలో ప్రకటించకపోవచ్చునంటున్నారు. ఇక పాయకరావుపేట సిట్టింగ్‌ ఎమ్మెల్యే అనిత నియోజకవర్గంలో అభివృద్థి పనులపై దృష్టిసారించారు. పార్టీ కార్యక్రమాల అమలు, విపక్షం ఆరోపణలను తిప్పికొట్టడంలో అనిత ముందుంటున్నందున ఆమెపై అధిష్ఠానానికి వ్యతిరేకత లేదు. అయితే ఆమె పాయకరావుపేట కాకుండా విశాఖలో నివాసం ఉంటున్నారు. ఇంకా అక్కడ ఆమెపై ఒక వర్గం వ్యతిరేకంగా ఉందంటున్నారు. అందువల్ల తొలి జాబితాలో ఆమెకు చోటుంటుందా? లేదా? అనేది చూడాలి.
 
 
ఏజెన్సీలో అరకులోయ నుంచి ఇటీవల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తనయుడు శ్రావణ్‌కుమార్‌కు టిక్కెట్‌ దాదాపు ఖరారైందనే చెప్పాలి. వచ్చే ఎన్నికలలో అరకు నుంచి శ్రావణ్‌కు టిక్కెట్‌ ఇవ్వాలని ఉద్దేశంతోనే ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి ఇచ్చారు. పాడేరు టిక్కెట్‌పై ఇప్పటికప్పుడు తేలకపోవచ్చునని పార్టీ వర్గాలు అంచనాకు వచ్చాయి. వైకాపా నుంచి విజయం సాధించి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితోపాటు మరికొందరు పాడేరు సీటు ఆశిస్తున్నారు.
 
 
ఇక పార్లమెంట్‌ సీట్ల విషయంలో తొలివిడతలో విశాఖలోని మూడు సీట్లకు అభ్యర్థులు ప్రకటించకపోవచ్చుననే వాదన ఉంది. ప్రధాన ప్రతిపక్షం నుంచి అభ్యర్థి తేలితేనే విశాఖ నుంచి పార్టీ అభ్యర్థి ప్రకటిస్తారు. మాజీ ఎంపీ ఎంవీవీఎస్‌ మూర్తి మనుమడు, మంత్రి లోకేష్‌ తోడల్లుడు భరత్‌ విశాఖ సీటు ఆశిస్తున్నారు. అనకాపల్లి విషయంలో ముత్తంశెట్టి వైఖరి బట్టి ఉంటుంది. అరకు ఎంపీ సీటుకు అనేకమంది పోటీపడుతున్నందున చివరి జాబితాలో ఖరారయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
 
 
సర్వే మేరకు జాబితా
రానున్న ఎన్నికల కోసం చంద్రబాబు ఇప్పటికే మూడు, నాలుగు విధాలుగా సర్వేలు చేయించారు. సొంతంగా ఒకటి, పార్టీ, ఐవీఆర్‌ఎస్‌, ఇంటెలిజెన్స్‌, ఇతర వర్గాల నుంచి వేర్వేరుగా సర్వే చేయించి వాటిని క్రోడీకరించి తుది జాబితా ఖరారు చేసినట్టు పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీని ప్రకారం విజయావకాశాలు పుష్కలంగా వున్న నియోజకవర్గాలను తొలి విడత లేదా రెండో విడతలో అభ్యర్థులను ప్రకటించనున్నారు.
Link to comment
Share on other sites

బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఒకవేళ టీడీపీలోకి వస్తే...
21-12-2018 11:32:29
 
636809889935245625.jpg
  • తొలి జాబితాలో చోటెవరికో?
  • జనవరిలో ప్రకటించనున్నట్టు చంద్రబాబు వెల్లడి
  • సిట్టింగ్‌లలో పలువురికి అవకాశం
  • కొన్నిచోట్ల మార్చే యోచన?
  • సర్వే ఆధారంగా గెలుపు గుర్రాలకే టిక్కెట్లు
ఎన్నికల వేడి రాజుకుంది. ఇంకో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు ప్రకటన వచ్చే అవకాశం వున్నదని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అయితే 60 నుంచి 70 స్థానాల్లో అభ్యర్థులను సంక్రాంతి తరువాత ప్రకటిస్తామని చెబుతోంది. దీనికి అవసరమైన సర్వే పూర్తయిందని, పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిందని తెలిసింది. ఈ జాబితాలో ఎక్కువగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే స్థానం కల్పిస్తారని పార్టీ వర్గాల సమాచారం. దీంతో తొలి విడత జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయనే దానిపై చర్చ మొదలైంది.
 
 
(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం)
రాష్ట్ర ఆర్థిక రాజధాని, ఉత్తరాంధ్ర ప్రాంతానికి కేంద్రం విశాఖపట్నం. జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికలలో మిత్రపక్షం బీజేపీతో కలిపి తెలుగుదేశం పార్టీ 12 సీట్లు గెలుచుకుంది. వైఎస్‌ఆర్‌ సీపీ మూడు చోట్ల విజయం సాధించింది. అయితే గెలిచిన ముగ్గురిలో ఇద్దరు (పాడేరు, అరకు ఎమ్మెల్యేలు) టీడీపీలో చేరారు. దాంతో 15 మందిలో 13 మంది ప్రస్తుతం టీడీపీ (ఇటీవల బీజేపీ దూరమైన సంగతి తెలిసిందే) పక్షాన వున్నట్టుగా లెక్క. ఈ లెక్కల ప్రకారం జిల్లాలో పార్టీ పటిష్ఠంగా వున్నట్టే లెక్క. అయితే ప్రస్తుత సిట్టింగ్‌లలో కొద్దిమందిని మార్చాలనే ప్రతిపాదన వున్నదనే ప్రచారం జోరుగా సాగుతుంది. సిట్టింగ్‌లలో కొందరు ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కాకుండా మరో సెగ్మెంట్‌ కావాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాలలో పోటీ లేని, గెలుపు ఖాయమనుకున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను మొదటి విడతలో ప్రకటించే అవకాశం వున్నదని అంచనా వేస్తున్నారు.
 
విశాఖ నగర పరిధిలో ఏడు నియోజవర్గాలు ఉన్నాయి. ఒక్క విశాఖ ఉత్తరం మినహా మిగిలిన చోట్ల ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. భీమిలి విషయంలో తొలుత పట్టుబట్టిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఇటీవల సయోధ్య కుదరడంతో వెనక్కి తగ్గినట్టు చెబుతున్నారు. భీమిలి బదులు రూరల్‌లో చోడవరం టిక్కెట్‌ను ముత్తంశెట్టి అడుగుతున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు భీమిలిలోనే తిరిగి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొద్దిరోజులుగా పూర్తిగా భీమిలిపైనే దృష్టిసారించి, అభివృద్ధి పనులు వేగవంతం చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణబాబుకు, విశాఖ పశ్చిమంలో పెతకంశెట్టి గణబాబులకు పోటీ లేదు. దాంతో ఈ ముగ్గురి పేర్లు తొలి జాబితాలో వుండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు వుంటే ఆ ప్రభావం విశాఖ దక్షిణంపై పడుతుందనే వాదన ఉంది. అది తప్ప అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌కు ఇబ్బంది వుండకపోవచ్చుననేది అంచనా. ప్రస్తుతం పార్టీ సభ్యత్వ నమోదులో ఆయన జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్నారు.
 
 
గతంలో మిత్రపక్షం బీజేపీకి ఇచ్చిన విశాఖ ఉత్తర నియోజకవర్గంపై అధిష్ఠానం తొలి జాబితాలో ప్రకటన చేయకపోవచ్చునని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక్కడ పోటీ ఎక్కువగా ఉంది. ఎలమంచిలి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ఈ స్థానం ఆశిస్తున్నారు. పార్టీలోకి రావాలని భావిస్తున్న సబ్బం హరి కూడా ఇదే స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కూడా పార్టీ మారి టీడీపీలోకి వచ్చే అవకాశం లేకపోలేదని, అలా వస్తే ఆ సీటు ఆయనకే ఇవ్వవచ్చునని చెబుతున్నారు. దీంతో ప్రస్తుత జాబితాలో ఉత్తరం పేరు వుండదని భావిస్తున్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పనితీరుపై ఎటువంటి అనుమానాలు లేకపోయినా ఆ నియోజకవర్గ అభ్యర్థిని మొదట జాబితాలో ప్రకటించరని, ఆ నియోజకవర్గం, ఆయనతో ముడిపడిన అంశాలు కొన్ని వున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పెందుర్తి విషయానికి వస్తే అక్కడ బండారు సత్యనారాయణమూర్తి సీనియర్‌ ఎమ్మెల్యే. మాజీ మంత్రి కూడా. అక్కడ ఆయనకు పోటీ లేదు. తొలి జాబితాలోనే ఆయన పేరు ప్రకటించే అవకాశం ఉంది.
 
 
రూరల్‌ విషయానికొస్తే రోడ్లు భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పోటీ చేస్తే మాత్రం నర్సీపట్నం టిక్కెట్‌ ఆయనదే. అయితే ఆయన కుమారుడు విజయ్‌ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. దీనికి చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారు? అనేది తేలాల్సి ఉంది. బరిలో దిగేందుకు అయ్యన్న ఓకే అంటే తొలి జాబితాలో నర్సీపట్నం అభ్యర్థిగా ఆయన పేరు ఖరారవుతుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎలమంచిలి ఎమ్మెల్యే, రూరల్‌ పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు తిరిగి అదే చోట నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా లేరని చెబుతున్నారు. నగరంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం కావాలని చాలాకాలం నుంచి అధినేతను కోరుతున్నారు. వచ్చే ఎన్నికలలో ఎలమంచిలిలో గట్టి పోటీ వుండనున్నందున పంచకర్లను మరో నియోజకవర్గానికి మార్చేందుకు అధిష్ఠానం అంగీకరించకపోవచ్చుననే వాదన ఉంది. ఎలమంచిలి నుంచి పోటీ చేసేందుకు పంచకర్ల సై అంటే తొలి జాబితాలో ఆయనకు అవకాశం వుండవచ్చునని అంచనా. ప్రస్తుతం వున్న సమీకరణల నేపథ్యంలో అనకాపల్లి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పీలా గోవింద్‌కే అవకాశం వుంటుందని ప్రచారం సాగుతుంది. చోడవరం కోసం ముత్తంశెట్టి పోటీ పడుతున్నారు. మరోవైపు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా కేఎస్‌‌ఎన్‌ఎస్‌ రాజు ఉన్నారు. అందువల్ల తొలి జాబితాలో ఈ సీటుపై సస్పెన్షన్‌ ఉంటుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి.
 
మాడుగుల టిక్కెట్‌ను అక్కడ ఇన్‌చార్జి జి.రామానాయుడు ఆశిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ పైలా ప్రసాదరావు పోటీ పడుతున్నారు. విశాఖ మాజీ మేయర్‌ సబ్బం హరిని మాడుగుల నుంచి నిలిపితే ఎలా వుంటుందని కూడా అధిష్ఠానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా మాడుగుల అభ్యర్థిని తొలి జాబితాలో ప్రకటించకపోవచ్చునంటున్నారు. ఇక పాయకరావుపేట సిట్టింగ్‌ ఎమ్మెల్యే అనిత నియోజకవర్గంలో అభివృద్థి పనులపై దృష్టిసారించారు. పార్టీ కార్యక్రమాల అమలు, విపక్షం ఆరోపణలను తిప్పికొట్టడంలో అనిత ముందుంటున్నందున ఆమెపై అధిష్ఠానానికి వ్యతిరేకత లేదు. అయితే ఆమె పాయకరావుపేట కాకుండా విశాఖలో నివాసం ఉంటున్నారు. ఇంకా అక్కడ ఆమెపై ఒక వర్గం వ్యతిరేకంగా ఉందంటున్నారు. అందువల్ల తొలి జాబితాలో ఆమెకు చోటుంటుందా? లేదా? అనేది చూడాలి.
 
 
ఏజెన్సీలో అరకులోయ నుంచి ఇటీవల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తనయుడు శ్రావణ్‌కుమార్‌కు టిక్కెట్‌ దాదాపు ఖరారైందనే చెప్పాలి. వచ్చే ఎన్నికలలో అరకు నుంచి శ్రావణ్‌కు టిక్కెట్‌ ఇవ్వాలని ఉద్దేశంతోనే ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి ఇచ్చారు. పాడేరు టిక్కెట్‌పై ఇప్పటికప్పుడు తేలకపోవచ్చునని పార్టీ వర్గాలు అంచనాకు వచ్చాయి. వైకాపా నుంచి విజయం సాధించి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితోపాటు మరికొందరు పాడేరు సీటు ఆశిస్తున్నారు.
 
 
ఇక పార్లమెంట్‌ సీట్ల విషయంలో తొలివిడతలో విశాఖలోని మూడు సీట్లకు అభ్యర్థులు ప్రకటించకపోవచ్చుననే వాదన ఉంది. ప్రధాన ప్రతిపక్షం నుంచి అభ్యర్థి తేలితేనే విశాఖ నుంచి పార్టీ అభ్యర్థి ప్రకటిస్తారు. మాజీ ఎంపీ ఎంవీవీఎస్‌ మూర్తి మనుమడు, మంత్రి లోకేష్‌ తోడల్లుడు భరత్‌ విశాఖ సీటు ఆశిస్తున్నారు. అనకాపల్లి విషయంలో ముత్తంశెట్టి వైఖరి బట్టి ఉంటుంది. అరకు ఎంపీ సీటుకు అనేకమంది పోటీపడుతున్నందున చివరి జాబితాలో ఖరారయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
 
 
సర్వే మేరకు జాబితా
రానున్న ఎన్నికల కోసం చంద్రబాబు ఇప్పటికే మూడు, నాలుగు విధాలుగా సర్వేలు చేయించారు. సొంతంగా ఒకటి, పార్టీ, ఐవీఆర్‌ఎస్‌, ఇంటెలిజెన్స్‌, ఇతర వర్గాల నుంచి వేర్వేరుగా సర్వే చేయించి వాటిని క్రోడీకరించి తుది జాబితా ఖరారు చేసినట్టు పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీని ప్రకారం విజయావకాశాలు పుష్కలంగా వున్న నియోజకవర్గాలను తొలి విడత లేదా రెండో విడతలో అభ్యర్థులను ప్రకటించనున్నారు.
Link to comment
Share on other sites

జనవరి సమీపిస్తుండటంతో టీడీపీ నేతల్లో టెన్షన్.. కారణమేంటంటే..
21-12-2018 10:33:50
 
636809853813002749.jpg
  • ముందస్తు టెన్షన్ 
  • తొలిజాబితాలో ఉంటామో లేదోనని టీడీపీ నేతల్లో ఉత్కంఠ
 
వచ్చే ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల ప్రకటనకు ముహుర్తం ఖరారైంది. జనవరిలోనే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. దీంతో గుంటూరు జిల్లా పార్టీ నేతల్లో ఉత్కంఠ మొదలైంది.
 
 
(ఆంధ్రజ్యోతి - గుంటూరు)
వచ్చే ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల ప్రకటనకు ముహుర్తం ఖరారైంది. జవనరిలోనే అభ్యర్థులను ప్రకటిచనున్నట్లు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఆయన బుధవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో దీనిపై స్పష్టత ఇచ్చారు. దీంతో జిల్లా పార్టీ నేతల్లో ఉత్కంఠ మొదలైంది. ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ రావచ్చని భావిస్తున్న నేపథ్యంలో సంప్రదాయానికి విరుద్ధంగా అధినేత తీసుకున్న నిర్ణయంతో నేతల్లో హడావిడి నెలకొంది. సంక్రాంతి తర్వాత తొలి జాబితాలో 60 - 70 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించనున్నట్లు పార్టీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు. దీంతో సిట్టింగులు, ఇన్‌చార్జులు, వారసులు లాబీయింగ్‌ను ముమ్మరం చేస్తున్నారు.
 
 
జన్మభూమి వేదికగా...
పాలనపరంగా ప్రజలకు చేరువయ్యేందుకు టీడీపీ రూపొందించిన జన్మభూమి కార్యక్రమాన్ని నేతలు వేదికగా మలుచుకునే పనిలో పడ్డారు. జనవరి మొదటి వారంలో ఈ కార్యక్రమం మొదలు కానుంది. నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన పనులను జన్మభూమిలో శ్వేత పత్రం రూపంలో ప్రజల ముందుంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వ్యవసాయం, మౌలిక వసుతులు, పారిశ్రామిక పురోగతి, నీటిపారుదల రంగం, సంక్షేమం తదితర అంశాల పై రోజుకో రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. దీనిని నేతలు అసరాగా తీసుకుని నాలుగేళ్లలో తాము చేసిన అభివృద్ధిని ప్రజల ముందుంచే ప్రయత్నం చేయనున్నారు. నిన్నటి దాకా విమర్శలు ప్రతి విమర్శలకే పరిమితమైన నేతలు తమ మకాంను నియోజకవర్గాలకు మార్చేసి ప్రజలతో మమేకం అవుతున్నారు.
 
 
నియోజకవర్గాల వారీగా శ్వేతపత్రాలు
నాలుగున్నరేళ్ల టీడీపీ హయాంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివద్ధి, సంక్షేమ పథకాలపై కరపత్రాలు, బుక్‌లెట్‌ తరహాలో ప్రజలకు పంపిణీ చేయనున్నారు. చంద్రన్న బీమా, రుణాల మాఫీ, డ్వాక్రా సంఘాలకు పసుపు కుంకుమ నిధులు, ముఖ్యమంత్రి సహాయనిధి, నిరుద్యోగ భృతి వంటి అంశాలను కరపత్రాలు, బుక్‌లెట్ల్‌ ద్వారా ప్రచారం చేయబోతున్నారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ఇప్పటి వరకు ఎన్ని నిధులు కేటాయించారు, పేదలకు అందిన మేలు ఇతర అంశాలపై శాసన సభ్యులు ఇప్పటికే సీపీఓ కార్యాలయం నుంచి వివరాలు తీసుకుంటున్నారు.
 
పార్లమెంట్‌ సభ్యులు అదే తరహాలో ఎంపీ నిధులతో చేపట్టిన పనులతో అంసెబ్లీ నియోజవర్గాల వారీగా బుక్‌లెట్‌ తయారు చేశారు. వీటిని ప్రజలకు అందించి తమకు మద్దతు ఇవ్వాలని టీడీపీ అభ్యర్థులు కోరబోతున్నారు. ప్రతిపక్ష వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలో జన్మభూమిని సజావుగా సాగించడానికి టీడీపీ చెందిన ప్రజాప్రతినిధులను, కార్పొరేషన్‌ ఛైర్మన్‌లను ప్రోటోకాల్‌ పేరుతో నియమిస్తున్నారు. ఇలా ఉండగా జిల్లాలో టీడీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు తొలిజాబితాలో తమ పేరు ఉంటుందా లేదా అనే టెన్షన్‌లో ఉన్నారు.
Link to comment
Share on other sites

పైకి ధీమా.. లోలోపల గుబులు

12/21/2018 10:47:43 AM

636809861383606611.jpg

 

జనవరిలో తొలివిడత అభ్యర్థుల జాబితా 
ముఖ్యమంత్రి ప్రకటనతో అనంతపురం సిట్టింగుల్లో కలవరం
ఎంతమందికి టికెట్లు దక్కుతాయోనని చర్చోపచర్చలు
ముందస్తు జాబితాలో చోటుపై సందేహాలు
చంద్రబాబు దృష్టిలో పడేందుకు నానా తంటాలు
స్థానికంగా వ్యతిరేకతను తగ్గించుకునే యత్నాలు ముమ్మరం
విభేదాల్లేవని చాటేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఆరాటం
 
అనంతపురం (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): టికెట్‌.. ఇప్పుడు ఇదే జిల్లాలోని ప్రజాప్రతి నిధులను ఆందోళనకు గురిచేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు జనవరిలో శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటిస్తానని చెప్పడంతో నాయకుల్లో టెన్షన్‌ మొదలైంది. మొదటి విడతలో 60 నుంచి 70 మంది అభ్యర్థులను ప్రకటించనుండడంతో అందులో చోటు దక్కుతుందోలేదోనని సిట్టింగులు కలవరపడుతున్నారు. సీఎం దృష్టిలో పడడానికి అప్పుడే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటిదాకా ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరిన ప్రజా ప్రతి నిధులు.. తమ మధ్య విభేదాల్లేవని చాటడానికి ఒకరినొకరు చేతులు పట్టుకుని సంఘీభావం ప్రకటిస్తున్నారు.
 
 
‘ఎన్నికల సమయం వచ్చేసింది. మీరంతా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లాలి. గతంలో మాదిరిగా ఉండే పరిస్థితి ఈసారి లేదు. రాష్ట్రంలోని 175 శాసనసభస్థానాల్లో 60 నుంచి 70 సీట్లకు ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తాం.. పోటీ చేసేందుకు సిద్ధం కండి’ అంటూ టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం జరిగిన టెలికాన్ఫరెన్సులో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రంలో టీడీపీ విడుదల చేసే ముందస్తు అభ్యర్థుల జాబితాపై జిల్లా ప్రజాప్రతినిధులకు ముచ్చెమటలు పడుతున్నాయి. చంద్రబాబు హెచ్చరిక వినగానే అధికార పార్టీ నేతల్లో టెన్షన్‌ మొదలైంది. చాలా మందికి హై ఫీవర్‌ కూడా వచ్చినంత పనవుతోంది. వాస్తవానికి టీడీపీకి జిల్లా కంచుకోట. 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలోనూ జిల్లాలో టీడీపీకి ఆరు సీట్లు వచ్చాయి. 2014లో కూడా రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడానికి జిల్లా బలంగా నిలిచింది. జిల్లాలోని 14 స్థానాలకు గానూ 12 సీట్లు టీడీపీకి దక్కాయి. అనంతర పరిణామాల్లో కదిరి వైసీపీ ఎమ్మెల్యే కూడా టీడీపీలో చేరడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 13కు చేరింది.
 
ఇంతవరకూ బాగానే ఉన్నా.. జిల్లాలోని కొంతమంది అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు అతి నమ్మకం పెరగడంతో సమన్వయం చెదిరిపోయింది. రాష్ట్ర విభజన తరువాత క్లిష్ట పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. జిల్లా అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూనే ఉందనే అభిప్రాయాలున్నాయి. ఈ కోవలో గడచిన నాలుగున్నరేళ్లలో సీఎం చంద్రబాబు జిల్లాలో 34 సార్లు పర్యటించారు. అంటే ఏడాదికి ఎనిమిది సార్లు చొప్పున జిల్లాకు వచ్చారు. ఆయన పర్యటనప్పుడే కా కుండా జిల్లా నేతలను అమరావతికి పిలిపించుకుని మాట్లాడినప్పుడల్లా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రజాప్రతినిధులకు పదేపదే చెబుతూ వస్తున్నారు. అయినా, జిల్లాలోని కొందరు ప్రజాప్రతినిధులు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని సీఎం సూచనల మేరకు పనిచేస్తుండగా మరికొంత మంది తమ సమయం ఇతర రాష్ర్టాలు, దేశాల పర్యటనలు, వారివారి వ్యాపారాల్లోనే గడిపారనే విమర్శలున్నా యి. తీరా ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ టీడీపీ అధిష్ఠానం నిర్ణయించిన గ్రామదర్శిని, గ్రామ వికాసం కోసం ఎవరికి వారు త మతమ నియోజకవర్గాల్లో గ్రామస్థాయి నేతలను కలుస్తున్నారు.
 
 
చంద్రబాబు దృష్టిలో పడేందుకు నానా తంటాలు..
సీఎం చంద్రబాబు దృష్టిలో పడేందుకు జిల్లాకు చెందిన పలువురు నేతలు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటివరకూ ఎవరికి వారుగా ప్రత్యేకంగా సర్వేలు చేయించుకుని తమ తమ జాతకాలు వారే తెలుసుకున్నారు. కొందరైతే తమ సర్వేల ప్రకారం వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరైతే సీఎం చంద్రబాబు వద్ద ఉన్న సర్వేల ప్రకారం ఆ రేటింగ్‌ను నమ్ముకుంటున్నారు. ఆ రెండింటిలోనూ నమ్మకం లేని వారు పల్లెల్లో తిరుగుతూ ఇప్పటివరకూ తాము పట్టించుకోకుండా వదిలేసిన టీడీపీ సీనియర్లను, దూరంగా ఉన్న గ్రామస్థాయి నాయకులనూ కలుస్తున్నారు. నాలుగున్నరేళ్లు జరిగిందేదో జరిగిపోయిందని, వచ్చే ఎన్నికలకు తమ గెలుపుకోసం సహకరించి పనిచేయాలని అభ్యర్థిస్తున్నారు. కాగా, కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటివరకు మండలాల ఇన్‌చార్జిలతో పాలన నడిపించిన కొందరు ప్రజాప్రతినిధులు ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు.
 
ఈ విషయంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన కొందరు తమ కుటుంబాలకు సంబంధించిన వారినే మండలాలకు కన్వీనర్లుగా నియమించుకుని వారి ద్వారానే అభివద్ధి పనులు చేయించారు. ఈ తంతును కొన్నిచోట్ల మండలాల టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేక వ్యతిరేకులుగా మారడంతో ప్రజాప్రతినిధులే నేరుగా అలాంటి వారిని కలుస్తూ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొందరైతే ఇప్పటివరకు మండలస్థాయిలో తమకు దూరంగా ఉన్న నాయకులను ఎలాగోలా తమతమ ఇళ్లకు పిలిపించుకుని గంటల తరబడి వారికోసం సమయం కేటాయించి వారి సమస్యలు పరిష్కారిస్తామని హామీ ఇచ్చి పంపుతున్నారు. అయితే ఇప్పటివరకు ఆయా ఎమ్మెల్యేల అనుచరుల ప్రవర్తనతో విసిగిపోయిన కొందరు ఏకంగా తిరుగుబావుటా ఎగరేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు వచ్చే ఎన్నికలకు గానూ ముందస్తుగానే వంద సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తామని చెబుతూండడంతో చాలా మంది ప్రజాప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎలాగైనా తమ నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకత తగ్గించుకుని ఆ పరిస్థితి అధినేత వద్దకు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
 
ముందస్తు జాబితాలో ఎంత మందికి స్థానమో..?
టీడీపీ అధిష్ఠానం ముందస్తుగా ప్రకటించే 60-70 మంది అభ్యర్థుల్లో జిల్లాలో ఎంతమందికి స్థానం పదిలమవుతుందనేది ఇప్పుడు జిల్లా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సీఎం చంద్రబాబు జిల్లాకు వచ్చిన సమయంలో రెండు రోజుల పాటు మకాం వేశారు. ఆ సమయంలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిస్థితిని సమీక్షించారు. గ్రామీణ ప్రాంత టీడీపీ శ్రేణులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇదే క్రమంలో దుందుడుకుగా వెళ్లే కొందరిని మందలించారు. సమన్వయం దెబ్బతీసేవిధంగా వెనుక చక్రం తిప్పే మరికొందరిని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు మునిగేందుకు సిద్ధంగా ఉన్నా తానుమాత్రం అఽలా కాకుండా అధికారంలోకి రావాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టు స్పష్టం చేశారు. పార్టీ విజయం కోసం అవసరమైతే ఎంతటి వారినైనా మార్చడానికి వెనుకాడబోనని చెప్పారు. ఇది జరిగి సరిగ్గా నెల రోజులు కూడా తిరగక ముందే.. ఎప్పటిలా సీట్ల కేటాయింపు చివరి వరకు తేల్చకుండా ఉండబోమని, రాష్ట్రంలో ముందస్తుగా 60-70 మంది అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. దీంతో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఆలోచనల్లో పడిపోయారు. ముందస్తు జాబితాలో ఎంత మందికి చోటు దక్కుతుందోనని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.
 
ఇప్పటికే జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు కనీసం నాలుగైదు నియోజకవర్గాల్లో సిట్టింగులను మార్చితే తప్ప టీడీపీకి అనుకున్నంత బలం రాదని సీఎం చంద్రబాబుకు చెప్పిన విషయాలు గుర్తు చేసుకుంటున్నారు. ఒకవేళ జిల్లాలోని 14 స్థానాల్లో వచ్చే ఎన్నికలకు తెరమీదికి వచ్చే ఆ నాలుగైదు కొత్తముఖాలేవి అనే అంశంపై చర్చలు మొదలయ్యాయి. పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పటివరకు సీఎం సూచనలు పాటించకుండా ఎవరికి వారుగా సమన్వయలోపంతో నడిచే వారిపై వేటు వేసే అవకాశాలు లేకపోలేదని టీడీపీకి చెందిన ముఖ్య నాయకులే అంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ ముందస్తు జాబితాలో 60-70 మందిని ప్రకటిస్తే జిల్లాకు దామాషా ప్రకారం ఎనిమిది నుంచి తొమ్మిది మందిని ముందుగానే ప్రకటించే అవకాశాలున్నాయి. ఇదే సమయంలోనే జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ల కోసం సిట్టింగులతోపాటు ద్వితీయశ్రేణి నాయకులు కూడా పోటీ పడుతున్నారు. మరికొందరు తమ వారసులుగా యువనేతలను రంగం మీదకు తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇంకొందరు నియోజకవర్గంలో టీడీపీ సీటు తమకు కాకుండా ఇంకెవరికి ఇస్తారు? అనే ధీమాలో ఉన్నారు. వారందరి జాతకాలూ చేతిలో ఉంచుకున్న చంద్రబాబు మాత్రం వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకు ముందస్తు జాబితాలో చోటు కల్పించేందుకు రంగం సిద్ధం చేశారంటూ ముఖ్యనేతలు చెబుతున్నారు. మరి ప్రజాప్రతినిధుల్లో మొదలైన సీట్ల ఫీవర్‌ ఎప్పటికి తగ్గుతుందో వేచిచూద్దాం.
Link to comment
Share on other sites

తొలి జాబితాలో చోటెవరికి?.. టీడీపీలో ఉత్కంఠ!
21-12-2018 17:35:38
 
636810107965730470.jpg
కడప: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా జనవరిలో వెల్లడిస్తామన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటన ఆ పార్టీలో టికెట్లు ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ రేపుతోంది. ఆ జాబితాలో ఎవరెవరి పేర్లు ఉంటాయనే విషయంపై టీడీపీ నేతల్లో జోరుగా చర్చ సాగుతోంది. జిల్లాలోని పది అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే టీడీపీలో టికెట్లు ఆశిస్తున్న వారు చంద్రబాబును కలిసి తమ పేర్లను పరిశీలించాలని కోరారు. ఇలా కలిసిన వారితో పాటు ఇంకెవరైనా ‘బెటర్‌ క్యాండెట్స్‌’ ఉన్నారా అని ఆరా తీసిన చంద్రబాబు గెలుపు గుర్రాలపై సర్వే నిర్వహించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతి నియోజకవర్గంలో టికెట్ల కోసం పోటీ తీవ్రంగానే ఉండడంతో ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈసారి టికెట్‌ తమకేనంటూ ప్రచారం కూడా మొదలుపెట్టారు.
 
టికెట్ల కోసం పోటాపోటీ
2014 ఎన్నికల్లో జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. కారణం.. ఆనాటి ఎన్నికల్లో వైఎస్‌ సానుభూతి, జగన ప్రభంజనం జోరుగా ఉండడమే. ఈ నాలుగున్నరేళ్ల టీడీపీ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేసి ప్రజల్లో పట్టు సాధిస్తూ వస్తోంది. పులివెందులతో పాటు జిల్లాకు కృష్ణా జలాలు తీసుకువచ్చి రైతులకు సాగునీరందించడం మొదలు ఉక్కు పరిశమ్ర ఏర్పాటు తదితర ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఇవన్నీ టీడీపీకి కలిసి వచ్చే అంశాలుగా ఆ పార్టీ నేతలు పేర్కొంటుండగా, గతంలో ఉన్న సానుభూతి పవనాలు వైసీపీకి జిల్లాలో అంతగా లేవని, ఈ సారి మెజార్టీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపు సాధిస్తారని వివిధ సర్వేల్లో వెల్లడైంది. అందుకనే ప్రతి నియోజకవర్గంలో టికెట్‌ ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నియోజకవర్గ ఇనచార్జిలతో పాటు కొత్తతరం నేతలు, వ్యాపారులు ఇతర రంగాల్లో స్థిరపడిన వారు ఈసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఉవ్విళ్లూరుతున్నారు. పలువురు గెలుస్తామన్న ధీమాతో ఉండడంతో టీడీపీలో టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది.
 
తొలిజాబితా జనవరిలో..
జనవరి 2 నుంచి పదిరోజుల పాటు జన్మభూమి - మాఊరు కార్యకమ్రం నిర్వహించిన తరువాత ఇక పూర్తిగా టీడీపీ అధినేత సార్వత్రిక ఎన్నికలపైనే దృష్టి పెట్టనున్నారు. ‘ముందస్తు’ వ్యూహంతో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభించిన చంద్రబాబు గెలుపు గుర్రాలపై ఇప్పటికే సర్వే నిర్వహించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం నియోజకవర్గ ఇనచార్జిలు, కొత్తగా పార్టీలో చేరిన ఇతర పార్టీల నేతలతో పాటు వ్యాపార రంగాల్లో స్థిరపడిన వారిని కూడా పరిగణనలోకి తీసుకుని సర్వే నిర్వహించినట్లు సమాచారం. జనవరిలో తొలి జాబితా ప్రకటిస్తున్నట్లు స్వయంగా చంద్రబాబు బుధవారం జరిగిన టెలికాన్ఫరెన్సలో పేర్కొనడంతో జిల్లాలో టికెట్లు ఆశిస్తున్న నేత ల్లో ఉత్కంఠ మొదలైంది. తొలిజాబితాలో జిల్లాకు చాన్స్‌ ఉంటుందా..? తమ పేర్లు ప్రకటిస్తారా, లేదా అన్న చర్చ పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది.
 
ఆశావహుల్లో ఉత్కంఠ
జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తుండగా అధినేత చంద్రబాబు మాత్రం ఒకరు కడప లోక్‌సభకు, మరొకరు జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి ఉంటుందని ఇప్పటికే వెల్లడించారు. కానీ వీరిద్దరూ మాత్రం జమ్మలమడుగు టికెట్‌నే కోరుతున్నారు.
 
మైదుకూరు నియోజకవర్గ ఇనచార్జిగా వ్యవహరిస్తున్న టీటీడీ చైర్మన పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతుండగా ఓ మాజీ మంత్రిని పార్టీలోకి ఆహ్వానించి పోటీ చేయించాలని టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కమలాపురం నియోజకవర్గంలో నియోజకవర్గ ఇనచార్జి పుత్తా నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డితో పాటు ఒకరిద్దరి పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. రైల్వేకోడూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ అల్లుడు పి.నరసింహమూర్తి, మాజీ ఎమ్మెల్యే కోడలు వడ్డె అన్నపూర్ణ స్థానిక టీడీపీ నేతలు విశ్వనాథనాయుడు, బత్యాల చెంగల్రాయులు ద్వారా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాజంపేట నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేడా వెంకటమల్లికార్జునరెడ్డి, బత్యాల చెంగల్రాయులు, ఆకేపాటి శ్రీనివాసులరెడ్డి టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.
 
పులివెందులలో నియోజకవర్గ ఇనచార్జి సతీ్‌షరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్‌రవి టికెట్ల రేసులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. బద్వేలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే జయరాములు, గతంలో పోటీ చేసి ఓడిపోయిన విజయజ్యోతి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సిఫారసు చేస్తున్న లాజరస్‌ టికెట్ల పోటీలో ఉన్నారు. రాయచోటి నుంచి నియోజకవర్గ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమే్‌షకుమార్‌రెడ్డి, సుగవాసి ప్రసాద్‌బాబు టికెట్లు ఆశిస్తున్నారు. కడప నియోజకవర్గం నుంచి జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి అహ్మదుల్లాతో పాటు హరిప్రసాద్‌, దుర్గాప్రసాద్‌ టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కడప లోక్‌సభ నుంచి టీడీపీ జిల్లా అధ ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి టికె ట్‌ ఆశిస్తుండగా జమ్మలమడుగు సమీకరణలో మార్పు వస్తే వారికి టికెట్‌ కేటాయిస్తారని సమాచారం. రాజంపేట నుంచి మాజీ ఎంపీ సాయిప్రతాప్‌ అల్లుడు సాయిలోకే్‌షతో పాటు మరో ఇద్దరి పేర్లు పరిశీలిస్తున్నారు. జనవరిలో ఎవరెవరికి టికెట్లు వస్తాయన్నది తేలనుంది. అప్పటివరకు ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ కొనసాగనుంది.
Link to comment
Share on other sites

చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ ఆపరేషన్ స్టార్ట్‌!
21-12-2018 16:38:23
 
636810073282077332.jpg
జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతులపై సాక్షాత్తు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. రానున్న ఏడాదిలో జరిగే ఎన్నికల్లో జిల్లాలోని మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన తనదైన శైలిలో అధ్యయనం మొదలు పెట్టారు. నియోజకవర్గాల వారీగా వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకోవడం కోసం తనకు విశ్వసనీయులు, నియోజకవర్గంపై పూర్తి పట్టున్న సీనియర్లను కో-ఆర్డినేటర్లగా నియమిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మూడు నియోజకవర్గాలకు కో- ఆర్డినేటర్లను నియమించి రంగంలోకి దించారు. నియోజకవర్గ పరిధిలో నాయకుల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలు, అసంతృప్తులను చల్లబరచడం వీరి బాధ్యత. ఈ విషయంలో అవసరమైతే వీరి సూచనల మేరకు అధి ష్ఠానం నేరుగా జోక్యం చేసుకుం టుంది. మిగిలిన ఏడు నియోజక వర్గాలకూ త్వరలోనే కో-ఆర్డినే టర్లను నియమించనున్నారు. మరోవైపు గెలుపు లక్ష్యంతో కొత్త శక్తులను సమీకరించుకునే ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ క్రమంలో శుక్రవారం చంద్రబాబుతో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు భేటీ అవుతున్నారు.
 
 
నెల్లూరు: రానున్న ఎన్నికల్లో జిల్లాలో మెజారిటీ స్థానాల గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాచరణ రూపొందించుకున్నారు. అభ్యర్థుల సమాచారం మీదనే ఆధారపడకుండా వారికున్న బలాలు, బలహీనతలను తెలుసుకోవడంతోపాటు నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించేలా కో-ఆర్డినేటర్లను నియమించుకొంటున్నారు. ఈ క్రమంలో భాగంగా ఇప్పటికి మూడు నియోజకవర్గాల్లో నియామకాలు పూర్తయ్యాయి. ఉదయగిరికి తనకు అత్యంత విశ్వసనీయుడు, మాజీ ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్‌ను కో-ఆర్డినేటర్‌గా నియమించారు. ప్రతి గ్రామం తిరిగి పార్టీ పరిస్థితిని అధ్యయనం చేయడంతోపాటు పార్టీ శ్రేణులను సమన్వయం చేసే బాధ్యతలను ఈయనకు అప్పగించారు. ఆత్మకూరుకు కంభం విజయరామిరెడ్డిని కో-ఆర్డినేటర్‌గా నియమించారు. నియోజకవర్గంపై పూర్తి అవగాహన కలిగిన మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంకు వెంకటగిరి బాధ్యతలు అప్పగించారు. మిగిలిన నియోజకవర్గాలకు కూడా త్వరలో ఇదే తరహాలో కో-ఆర్డినేటర్లను నియమించనున్నారు.
 
సమన్వయం.. అధ్యయనం..
కొత్తగా నియమించిన కో-ఆర్డినేటర్లు నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమన్వయం పరచడంతోపాటు వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయడం ప్రధాన విధులుగా పని చేస్తారు. నియోజకవర్గ పరిఽధిలో పార్టీ నాయకుల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలను, అసంతృప్తులను చల్లబరచడం వీరి బాధ్యత. ఈ విషయంలో అవసరం అయితే వీరి సూచనల మేరకు అధిష్ఠానం నేరుగా జోక్యం చేసుకొని నాయకులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తుంది. అలాగే రాబోయే ఎన్నికల్లో పార్టీ బలాబలాలపై వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయడం వీరి ప్రధాన బాధ్యత. ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఎలా ఉంది... ఏం చేస్తే మరింత బలపడుతుందో వీరు అధిష్ఠానానికి వివరించాల్సి ఉంటుంది.
 
అధిష్ఠానంతో టచ్‌లో..
ఈ కోర్డినేటర్లు నేరుగా అధిష్ఠానంతో టచ్‌లో ఉంటారు. నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితిని వీరు నేరుగా తెలియజేస్తారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా అధిష్ఠానానికే వివరిస్తారు. వీరిపై జిల్లా నాయకత్వం ప్రభావం ఉండదు. వీరి సూచనల మేరకు అధిష్ఠానం జిల్లా నాయకత్వానికి ఆదేశాలు, సూచనలు జారీ చేస్తుంది. ఆ మేరకు నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి జిల్లా పార్టీ చర్యలు తీసుకుంటుంది.
 
వారంలో జిల్లా నేతలతో అధినేత రివ్యూ
వారం రోజుల వ్యవధిలో జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గ ముఖ్య నేతలతో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. వాస్తవానికి డిసెంబరులో చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటించి ఇక్కడే పార్టీ వర్గాలతో సమీక్షించాల్సి ఉంది. అయితే ఈ పర్యటన రద్దు కావడంతో వారం రోజుల్లో జిల్లా నేతలనే అమరావతికి పిలిపించుకొని చర్చించనున్నారు. నియోజకవర్గాల వారీగా జరిగే ఈ సమీక్షలో పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
 
నేడు సీఎంతో కొమ్మి భేటీ
ఆత్మకూరు నియోజకవర్గంలో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న టీడీపీ అధిష్ఠానం అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. బొల్లినేని కృష్ణయ్యను రంగంలోకి దించడం, మొన్న జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడం తెలిసిందే. తాజాగా మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడును కూడా పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. బొల్లి.. బొమ్మి.. కొమ్మిల కామినేషన్‌తో ఆత్మకూరు గెలుపునకు అవకాశాలు మెరుగుపడుతాయని అధిష్ఠానం భావిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం అమరావతిలో కొమ్మి లక్ష్మయ్య నాయుడు సీఎం చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. బొల్లినేని కృష్ణయ్య ఈయన్ను సీఎం వద్దకు తీసుకెళుతున్నారు. ఆ తరువాత ఆత్మకూరు అభ్యర్థి విషయంలోనూ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అభ్యర్థిగా బొల్లినేని కృష్ణయ్య పేరు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, కొమ్మి లక్ష్మయ్య నాయుడుల కలయికతో ప్రజల్లో అభ్యర్థి విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది. ఈ వారం రోజుల్లో జరగబోయే సీఎం సమీక్షలో ఈ విషయంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...