Jump to content

Formula 1 Powerboat World Championship in Amaravati


Recommended Posts

3 hours ago, AnnaGaru said:

@chsrk one of sony bro posts has race route map...

 

based on that find a spot with comfort....better have your tent kind of with all arrangements for full day...

 

3 hours ago, sonykongara said:

punnami ghat manchidi  anukunta brother

will check it out...Thank u Annagaru and Sony bros

Link to comment
Share on other sites

మజారే..స్‌
16-11-2018 09:27:52
 
636779572731941954.jpg
  • నగర వీధుల్లో పవర్‌బోట్ల ప్రదర్శనకు అనూహ్య స్పందన
  • కార్నివాల్‌ను అనుసరిస్తూ నడిచిన నగరవాసులు
  • అమరావతి టీమ్‌కు సాదర స్వాగతం
  • తొమ్మిది దేశాల రేసర్లకు ఆహ్వానం పలికిన విద్యార్థులు
  • ఘాట్‌ వద్ద భళా అనిపించేలా గ్యాలరీలు, ఏర్పాట్లు
లబ్బీపేట/విజయవాడ: విజయవాడ నగరంలో తొలి కార్నివాల్‌ ప్రయత్నం అదిరిపోయింది. నగర వాసులకు కనువిందు చేసింది. పున్నమి ఘాట్‌ నుంచి బందరురోడ్డు వరకు ఉన్న 8.7 కిలోమీటర్ల మేర నిర్వహించిన పవర్‌ బోట్‌ కార్నివాల్‌కు నగరవాసుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మాలక్ష్మి గ్రూప్స్‌, యూఐఎమ్‌(ఎఫ్‌1హెచ్‌2ఓ) ఆధ్వర్యంలో శుక్రవారం మొదలుకుని నవంబర్‌ 18వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే విజయవాడలోని పున్నమి ఘాట్‌ వద్ద ఫార్ములా వన్‌ హెచ్‌2ఓ పవర్‌ బోట్ల కార్నివాల్‌ను రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించింది. తొమ్మిది కంటైనర్లలో తొమ్మిది దేశాల తరఫున ఎఫ్‌1హెచ్‌2ఓ రేసులో పాల్గొనబోయే బోట్లను ప్రదర్శిస్తూ కార్నివాల్‌ నిర్వహించారు.
 
Untitled-16.jpgకార్నివాల్‌లో పాల్గొన్న విదేశీ రేసర్లకు అడుగడుగునా స్వాగతం పలుకుతూ, సెల్ఫీల కోసం పలువురు స్థానికులు, విద్యార్థులు బారులు తీరారు. రేసు నిర్వహించనున్న ప్రాంతంలోనూ సకల ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కనకదుర్గా ఫ్లై ఓవర్‌ కింద రూ.5 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఎఫ్‌1హెచ్‌2ఓ పార్కులో స్థానికుల కోలాహలం మొదలైంది. విద్యుత్‌ దీపాలతో ధగధగాయమానంగా వెలుగుతున్న ఫ్లై ఓవర్‌ ఫార్ములా వన్‌ రేసుకే వన్నె తెచ్చేలా సిద్ధమైంది.
 
ahe45aew5.jpgగురువారం మధ్యాహ్నం బందరు రోడ్డులోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం నుంచి కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ఈ కార్నివాల్‌ను ప్రారంభించగా డీవీ మానర్‌ వరకు, అక్కడినుంచి తిరిగి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు నిర్వహించారు. కార్నివాల్‌ వెంట సాగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, డప్పు వాయిద్యాలతో పాటు రేస్‌ బోట్ల ప్రదర్శన ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. అడుగడుగునా ఈ కార్నివాల్‌కు ప్రజలు, వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్ధినీ విద్యార్థులు బ్రహ్మరధం పట్టారు. రోడ్డుకు ఇరువైపులా నిలబడి విదేశీ అతిథులకు అభివాదం చేస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీకాంతం, టూరిజం ఎండీ హిమాన్షు శుక్లాలు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని, పలు దేశాల నుంచి 500 మంది విదేశీయులు వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం అమరావతికి గర్వకారణం అని లక్షమంది ప్రజలు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేసినట్లుగా ఆయన వివరించారు. ఈ కార్నివాల్‌ ద్వారా రేసింగ్‌ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతుందని, ప్రపంచం దృష్టి అమరావతి రాజధానిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
ఘాట్ల వద్ద ఏర్పాట్లు భళా
రేసులను నిర్వహించే పున్నమి ఘాట్‌ మొదలుకుని దుర్గాఘాట్‌, భవానీ ఘాట్‌తో పాటు భవానీ ఐలాండ్‌లోనూ పర్యాటక శాఖాధికారులు విశేషమైన ఏర్పాట్లను, ఫుడ్‌ కోర్టులను ఏర్పాటుచేశారు. సాయంత్రపు వేళ అందరినీ అలరించేలా మ్యూజికల్‌ నైట్‌ను, పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటుచేశారు. అడుగడుగునా పోలీస్‌ జాగిలాలతో, పటిష్టమైన భద్రతా సిబ్బందితో పున్నమి ఘాట్‌ మొదలుకుని కనకదుర్గమ్మ గిరి పరిసర ప్రాంతాల్లోనూ పోలీస్‌ అధికారులు చర్యలు తీసుకున్నారు.
 
పార్కు నిర్మాణం పూర్తి
ఎఫ్‌1హెచ్‌2ఓ పవర్‌ బోటింగ్‌ను దృష్టిలో ఉంచుకుని దాదాపు రూ.5కోట్లకుపైగా నిధులతో కనకదుర్గా ఫ్లై ఓవర్‌ కింద ఏర్పాటుచేసిన ఎఫ్‌1హెచ్‌2ఓ పార్కు నిర్మాణం 90 శాతం పూర్తయింది. చెస్‌ కోర్టు, ఫుడ్‌ కోర్టు, చిన్నారుల కోసం ప్రత్యేక ప్లేయింగ్‌ కోర్టుతో పాటు మల్టీప్లెక్స్‌లు, షాపింగ్‌మాల్స్‌లో మాత్రమే కనిపించిఏ పలు ఆట వస్తువులతో ఆ పార్కును తీర్చిదిద్దారు. నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో ఉంచడానికి ఏర్పాటుచేసిన స్ర్కాడ్‌ స్కల్ప్చర్స్‌ను నగర పాలక సంస్థ అధికారులు ఆ ఫ్లై ఓవర్‌ పార్కులో అక్కడక్కడా ఏర్పాటుచేయడంతో ఆయా శిల్పాలు పార్కుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దానికి తోడు ఫ్లై ఓవర్‌ పిల్లర్లకు, చెట్లకు ఎఫ్‌1హెచ్‌2ఓ పేర్లను ప్రతిబింబిస్తూ ఏర్పాటుచేసిన విద్యుత్‌ దీపాలు రాత్రి వేళల్లో ప్రత్యేకంగా మారాయి. దీంతో పార్కును అధికారికంగా ప్రారంభించకపోయినా స్థానిక చిన్నారులు, కుటుంబీకులు ఆ పార్కులో అపుడే సందడి మొదలుపెట్టేశారు. అధికారులు ఏర్పాటుచేసిన ఆట వస్తువులతో ఆటలు ప్రారంభించగా.. స్కేటర్లు కూడా ఆయా స్కేటింగ్‌ కోర్టులో ప్రాక్టీస్‌ను ఆరంభించారు. దీంతో ఎఫ్‌1హెచ్‌2ఓ సందడి ఆప్రాంతంలో ఒకరోజు ముందుగానే మొదలైంది.
 
18న ప్రధాన ఘట్టం
 
ఈ పోటీల్లో ప్రధాన ఘట్టం 18వ తేదీన జరుగుతుందని కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు. 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పోటీలు ప్రారంభిస్తారని, ఆ రోజు ట్రయల్‌ రన్‌ మాత్రమే జరుగుతాయని ఆయన వివరించారు. 17వ తేదీ నుంచి పోటీలను ప్రారంభించి, 18వ తేదీన ఫైనల్స్‌ నిర్వహిస్తామని తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు ముఖ్యమంత్రి హాజరవుతారని, 3.15 నుంచి 3.35 నిమిషాల వరకు షార్ములా - 4 రేస్‌, సాయంత్రం 4 గంటల నుంచి ఐదు గంటల వరకు ఫార్ములా - 1 గ్రాండ్‌ ప్రిక్స్‌ రేస్‌ సుమారు 50 నిమిషాలపాటు ఉంటుందన్నారు.
 
ఆటవిడుపు 
arenrfAsef.jpgనగరానికి వచ్చింది మొదలు రెక్కలు ముక్కలయ్యేలా.. కష్టపడ్డ విదేశీ రేసర్లు, క్రూస్‌(సిబ్బంది) మూడో రోజున కాస్త రిలాక్స్‌ అయ్యారు. మూడు రోజుల పాటు టెంట్ల ఏర్పాట్లు, యంత్రాల అమరిక, బోట్ల మరమ్మతు, టెక్నికల్‌గా అణువణువునా పరీక్షించుకోవడంలో 19మంది రేసర్లు నిమగ్నమయ్యారు. శుక్రవారానికి కావాల్సిన సరంజామా పూర్తి కావడంతో గురువారం సాయంత్రానికల్లా యావత్‌ సిబ్బంది పెడెక్‌లో రిలాక్స్‌ అయ్యారు. మాటామంతితో కాలక్షేపం చేస్తూ వెంట తెచ్చుకున్న ఆల్‌ టెరైన్‌ వెహికల్‌(ఏటీవీ), సైకిళ్లతో ఆటవిడుపుగా గడిపారు. పెడెక్‌లో భద్రతా చర్యల పరిశీలన నిమిత్తం తీసుకొచ్చిన పోలీస్‌ జాగిలాలతో సైతం ఆటలు ఆడుతూ టీమ్‌ జర్మనీ, మాడ్‌ క్రాక్‌ వంటి పలు బృందాలు కనిపించాయి. అప్పటివరకు పరుగులు పెట్టిన మాలక్ష్మి గ్రూప్‌, పర్యాటక శాఖాధికారులు కూడా రేసర్లతో మాటలు కలిపారు. బరిలోకి దిగుతోన్న 19 రేసర్లకు చెందిన పవర్‌ బోట్లున్న పెడెక్‌లోకి ఇతరులను అడుగుపెట్టనీయకుండా భద్రతా చర్యల్లో నిమగ్నమైన భద్రతాధికారులు గురువారం సాయంత్రానికి సెల్ఫీలతో బిజీ అయిపోయారు. రేసర్ల టెంట్ల వద్ద, బోట్ల వద్ద సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...