Jump to content

Krishnapatnam Port ,Nellore


Recommended Posts

ఈ ఓడరేవు ఓ అద్భుతం...
11-07-2018 15:23:22
 
636669194012968416.jpg
నెల్లూరుకే తలమానికంగా ఉన్న కృష్ణపట్నం ఓడరేవు ఓ అద్భుతంగా నిలిచింది. నెల్లూరుకు 18 కిలోమీటర్ల దూరంలో ఈ పోర్టు ఉంది. శ్రీ కృష్ణ దేవరాయలు నాటి కాలంలో సరకు రవాణా కోసం ఈ ఓడరేవును వాడేవారు... అందుకే దీనికి కృష్ణపట్నం ఓడరేవు అనే పేరొచ్చింది. ఇది భారత దేశంలోనే అతిపెద్ద ఓడరేవుగా గుర్తింపు ఉంది. 500 ఏళ్ల క్రితమే ఏర్పడిన సహజ ఓడరేవు ఇదే. తర్వాత దీన్ని రూ. 7500 కోట్లతో ప్రభుత్వం ఆధునీకరించి.. అభివృద్ధి చేసింది. ఈ రేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కీర్తికి శిఖరంగా నిలిచింది. భారీ, అతి భారీ సరకు రవాణాకు ఈ రేవు ఒక వేదిక అయింది.
 
Tags : Krishnapatnam Port, Nellore
Link to comment
Share on other sites

idi complete 100% CBN master mind and oka state govt chesina private port.....KP port ane maha karyam ki CBN padina kastam mamuldi kadu....National highway(quadrangular lo part ga) completion 1st in india with link road...railway lane land acquisition and getting it done from Vajpayee govt.....taruvata industrial kosam land acquisition.....

 

e port anedi CBN political ki chesina nastam antha intha kadu......decoit batch chesina pracharaniki janalu bhayapadi odincharu nellore lo 2004 lo....chala duramrgam ga chesaru adi CBN own port and me villages mottam lagesukuntadu ani

just like AMaravati designs lo Maaki laga 1st lo koncham tippalu vachai ..kanni malli 2003 lo final works ichadu Navayuga ki.....2003 lo tanu ichina works e nadichai tarvata.....CBN ichina works contract lo 3 phases lo 1st phase matrame chesi port lo vere evadu rakunda chusukunnaru decoit batch GALI gaadi kosam

 

Link to comment
Share on other sites

15 minutes ago, AnnaGaru said:

idi complete 100% CBN master mind and oka state govt chesina private port.....KP port ane maha karyam ki CBN padina kastam mamuldi kadu....National highway(quadrangular lo part ga) completion 1st in india with link road...railway lane land acquisition and getting it done from Vajpayee govt.....taruvata industrial kosam land acquisition.....

 

e port anedi CBN political ki chesina nastam antha intha kadu......decoit batch chesina pracharaniki janalu bhayapadi odincharu nellore lo 2004 lo....chala duramrgam ga chesaru adi CBN own port and me villages mottam lagesukuntadu ani

just like AMaravati designs lo Maaki laga 1st lo koncham tippalu vachai ..kanni malli 2003 lo final works ichadu Navayuga ki.....2003 lo tanu ichina works e nadichai tarvata.....CBN ichina works contract lo 3 phases lo 1st phase matrame chesi port lo vere evadu rakunda chusukunnaru decoit batch GALI gaadi kosam

 

Leaders and village level cadre needs to educate this particular thing to the people in Nellore. This needs to be taken up to the notice of TDP Leadership...someone in DB who are close to leadership ...kindly do so.

Link to comment
Share on other sites

krishnapatnam port credit goes to ysr.

 under cbn rule, gangavaram port awarded to dvs raju company with 2.1% revenue share with government for first 30 years, 4.2% for next 10 years(31-40), 8.4% for next 10 years(41-50)

under cbn rule , krishnapatnam awarded to natco with revenue with 5% for 1-5 years, 8% 6-10 years, 10% for 11-15 years, 12% from 16th year . natco didn't started port works as it didn't got financial closure. natco roped navayauga and reduced natco  shareholding pattern to 26% . cv rao who is friend of ysr wrote a letter to ap governement in 2004 to revise revenue share on the lines of gangavaram port by citing current project is unbankable. navayuga also asked to revise master plan of krishnapatnam port to make it one of the biggest in the country. ap government revised  revenue share to  2.6% for 1-30 years, 5.2% for 31-40 years, 10.4% for 41-50 years in september 2004. ysr alloted more land to port and sez promoted by navayuga. ysr goverment also acquired land for power plant and other industries near by port. navayuga promoter helped jagan to buy hydro power plants in sikkim. navayuga also have good relations with cbn.

please read cag link . read this pdf from page 18

http://www.agap.cag.gov.in/agers/AR(ES)2012/Chapter2.pdf

Link to comment
Share on other sites

18 minutes ago, ravindras said:

krishnapatnam port credit goes to ysr.

 under cbn rule, gangavaram port awarded to dvs raju company with 2.1% revenue share with government for first 30 years, 4.2% for next 10 years(31-40), 8.4% for next 10 years(41-50)

under cbn rule , krishnapatnam awarded to natco with revenue with 5% for 1-5 years, 8% 6-10 years, 10% for 11-15 years, 12% from 16th year . natco didn't started port works as it didn't got financial closure. natco roped navayauga and reduced natco  shareholding pattern to 26% . cv rao who is friend of ysr wrote a letter to ap governement in 2004 to revise revenue share on the lines of gangavaram port by citing current project is unbankable. navayuga also asked to revise master plan of krishnapatnam port to make it one of the biggest in the country. ap government revised  revenue share to  2.6% for 1-30 years, 5.2% for 31-40 years, 10.4% for 41-50 years in september 2004. ysr alloted more land to port and sez promoted by navayuga. ysr goverment also acquired land for power plant and other industries near by port. navayuga promoter helped jagan to buy hydro power plants in sikkim. navayuga also have good relations with cbn.

please read cag link . read this pdf from page 18

http://www.agap.cag.gov.in/agers/AR(ES)2012/Chapter2.pdf

mottam details kavalante cheppandi.....NATCO tappukunna taruvata malli revised mottam NAVAYUGA 100% project ki ichindi kuda CBN e....CBN ichina contract ki taruvata nadichindi....JAGAN himself declared this in High court officially later to escape from his land scam for industry...Sonia open chesina bertha PORT matram CBN ichina contract e finish chesaru......taruvata malli CBN vachi 1000 crores tho monna extension chesaru...

 

Ippudu MAAKI design CBN cancel chesadu ani Amaravati designs taruvata vachina vadiki credit istaru telini vallu unte...NATCO tappukunnadi highlit chestunaru gani CBN malli track lo techi works ichndi tappincharu ga telivi ga..

What YSR did is scam on giving extra land for industrial allocation....adi Jagan gadiki chuttukundi kani PORT berths works went as per CBN given award....

 

CBN master plan geyinchi,road works finish chesi,railway lane finish chesi, works iste taruvata scam chesukunna vadiki istara credit....aha....super

 

inka enduku future lo BHAVANAPADU ki kuda sketch geyandi CBN ni tappinchi....CBN mottam antha ground zero nunchi chesi works kuda modalu pedtunnaru ga......

 

 

 

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

14 minutes ago, AnnaGaru said:

just stop it bro if you don't know full details.....NATCO tappukunna taruvata malli mottam NAVAYUGA 100% project ki ichindi kuda CBN e....CBN ichina contract ki taruvata nadichindi....JAGAN himself declared this in High court officially...

 

Ippudu MAAKI design CBN cancel chesadu ani Amaravati designs taruvata vachina vadiki credit istaru telini vallu unte...

What YSR did is scam on giving land for industrial allocation....

please read cag report from page 18

http://www.agap.cag.gov.in/agers/AR(ES)2012/Chapter2.pdf 

i agree that ,in high court jagan mentioned cbn alloted project .  in court jagan also filed that emaar mgf alloted by cbn. ysr has no role in it. are we going to agree with that?  emaar mgf land acquired under ysr rule. ysr also revised agreement with mgf and did scam in emaar mgf.  they(jagan&co) will tell lies in court  as per their needs.

natco roped navayuga after september 2004. please read following pdf from page 4 to page 5

https://www.bseindia.com/downloads/ipo/200933116251KPCL-Disclosure Document -Final.pdf

Edited by ravindras
Link to comment
Share on other sites

@ravindras 

 

ade cheptunna Natco tappukundi highlist chesaru gani malli track lo pettindi kuda CBN ani SKIP chesaru ga.....YSR declared I will keep CBN contract of berths as is by the way and change industrial part land deals....

 

In futrue me lante valle CBN Amaravati cheyyaledu vere evado chesadu ani chupincha gala samrdulu.....ademante CBN maaki designs tho time waste ayyindi so progress avvaledu akkade agipoyindi ani story rayavachu....

 

Do you know that first vessel came in december 2004 on a 1st berth done by CBN award? adi 3 months lo YSR chesadu ani cheppoddu....na vaalla  kadu..

 

Krishnapatnam 1st phase berths contract CBN award prakaram nadichindi....only industry di golmal chesaru decoit batch...

https://www.thehindu.com/2004/10/28/stories/2004102808610400.htm

 

inka enduku late future lo BHAVANAPADU ki kuda manchi stroy sketch geyandi CBN ni tappinchi....CBN mottam antha ground zero nunchi chesi works kuda modalu pedtunnaru ga......

 

 

 

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

5 minutes ago, AnnaGaru said:

@ravindras 

 

ade cheptunna Natco tappukundi highlist chesaru gani malli track lo pettindi kuda CBN ani SKIP chesaru ga.....YSR declared I will keep CBN contract of berths as is by the way and change industrial part land deals....

 

Do you know that first vessel came in december 2004 on a 1st berth done ASAP? adi 3 months lo YSR chesadu ani cheppoddu....na vaa kadu..

 

 

 

http://www.krishnapatnamport.com/milestones.html 

krishnapatnam port handled first vessel 18/april/2008

krishnapatnam port officially inaugurated on 17/july/2008

Link to comment
Share on other sites

9 minutes ago, ravindras said:

http://www.krishnapatnamport.com/milestones.html 

krishnapatnam port handled first vessel 18/april/2008

 krishnapatnam port officially inaugurated on 17/july/2008

 

https://www.thehindu.com/2004/12/08/stories/2004120803220500.htm

e response chalu emo meeku...inka apestunna(I am out of this).....inka rest mi istam......don't say 3 months lo YSR did that berth......berths contract CBN ichinde execute ayyindi....decoits changed mainly industrial land allocation and giving more benefits and taking bribes and expansion....

a rojullo antha pedda port ki e roju Amaravati kanna pedda kastam ayyindi.....yes there were struggles(for SEVEN years starting from ground zero) for such MAJOR project no state govt ever done themselves but CBN done it....anthe gani a struggle chupinchi drama veste emi cheyyalem.....railway lane,canal for water,road, land acq,master plan, dredging works anni chesi 1st berth kuda ayyindi....taruvata 4 berths kuda CBN contrate....

 

meanwhile gangavaram,kakinada paruglu pettinchi finish chesadu.....KP matram a magnitude ki bhane struggle ayyaru.....kani a manishi kastanni drama company laga marcheste kastam..

 

inka enduku late future lo BHAVANAPADU ki kuda manchi stroy sketch geyandi CBN ni tappinchi....CBN mottam antha ground zero nunchi chesi works kuda modalu pedtunnaru ga......andutlonu 4+ years pattindi kada so story kuda baga allavachu CBN di emi ledu ani...

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

3 hours ago, AnnaGaru said:

 

https://www.thehindu.com/2004/12/08/stories/2004120803220500.htm

e response chalu emo meeku...inka apestunna(I am out of this).....inka rest mi istam......don't say 3 months lo YSR did that berth......berths contract CBN ichinde execute ayyindi....decoits changed mainly industrial land allocation and giving more benefits and taking bribes and expansion....

a rojullo antha pedda port ki e roju Amaravati kanna pedda kastam ayyindi.....yes there were struggles(for SEVEN years starting from ground zero) for such MAJOR project no state govt ever done themselves but CBN done it....anthe gani a struggle chupinchi drama veste emi cheyyalem.....railway lane,canal for water,road, land acq,master plan, dredging works anni chesi 1st berth kuda ayyindi....taruvata 4 berths kuda CBN contrate....

 

meanwhile gangavaram,kakinada paruglu pettinchi finish chesadu.....KP matram a magnitude ki bhane struggle ayyaru.....kani a manishi kastanni drama company laga marcheste kastam..

 

inka enduku late future lo BHAVANAPADU ki kuda manchi stroy sketch geyandi CBN ni tappinchi....CBN mottam antha ground zero nunchi chesi works kuda modalu pedtunnaru ga......andutlonu 4+ years pattindi kada so story kuda baga allavachu CBN di emi ledu ani...

No doubt it is vision and work of CBN in the first place, that is bearing the fruits now. If he didn't do it, it would have taken few more decades.

It is actually in resonance with his Vision 2020 to improve AP infrastructure drastically, he went aggressive about roads and ports.

It adds to confusion that unlike kakinada and gangavaram ports,  krishnapatnam guys didn't mention the history in their website.

http://www.gangavaram.com/about-port.htm

http://kakinadaseaports.in/?page_id=6

 

Another source that mentions brief story of KPCL

https://www.bseindia.com/downloads/ipo/200933116251KPCL-Disclosure Document -Final.pdf

 

In consonance with the programme of liberalization, State Government of Andhra Pradesh (GoAP) had invited bids from private sector parties for the development of four minor ports in the State, including Krishnapatnam Port, on Build, Operate, Share & Transfer (BOST) basis. GoAP accepted the offer for development of Krishnapatnam Port by the NATCO group-led consortium. GoAP & the NATCO Group of Companies have entered into a Memorandum of Understanding (MoU) in this regard on March 10, 1996. On 15th March 1996, NATCO Group of Companies incorporated Krishnapatnam Port Company Ltd.

(KPCL) as a Special Purpose Company (SPC) for the development of the Port. Subsequently the Concession Agreement (CA) was executed between GoAP & KPCL on January 4, 1997. KPCL requested GoAP for certain amendments in agreement in order to make the project bankable and in line with other port concessions given to private developers in the state. GoAP has agreed to certain amendments to the agreement dtd. 04/01/1997. GoAP has approved the DPR on 25/06/1999. The DPR was revised by KPCL and submitted to GoAP on 07/04/2003. Subsequently, the revised CA was executed between KPCL & GoAP on September 17, 2004. Subsequently, the NAVAYUGA Group has joined the consortium as a majority partner.

 

Another source:

http://media1.autohaus.de/fm/3576/9909991394updateportsector.pdf

2.4.7.3 Status of Privatized Ports

(i) Kakinada Deep Water Port was privatized in March 1999 to M/S ISPL on OMST terms for 20 years.

(ii) Krishnapatnam Port was privatized in Jan 1997 on BOOT terms to M/S Krishnapatnam Port Company Ltd.(NATCO) for 30 years. Revised agreement was signed on 17-9-2004. Navayuga Engineering Company has taken 74% equity stake in KPCL and NATCO 26%.

(iii) Gangavaram Port was privatized in August, 2003 for development of Deep Water Port on BOOT terms initially for 30 years. The port has started handling cargo.

Link to comment
Share on other sites

Another thing is intention.  CBN didn't start these ports or other infrastructure projects to mint money for himself. 

On the other hand, YSR did start Polavaram but his intention and the way he executed them was different. 

Link to comment
Share on other sites

కృష్ణపట్నం పోర్టులో ఎకో ఫ్రెండ్లీ క్రేన్స్‌
13-07-2018 04:15:42
 
636670521414392774.jpg
  • పెరగనున్న కంటైనర్‌ హ్యాండ్లింగ్‌ సామర్థ్యం
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కృష్ణపట్నం పోర్ట్‌ కంటైనర్‌ టెర్మినల్‌ (కెపిసిటి).. కంటైనర్‌ హ్యాండ్లింగ్‌ సామర్థ్యాలను పెంచేందుకు గాను ఐదు ఎలక్ట్రికల్‌ రబ్బర్‌ టైర్డ్‌ గ్యాంట్రీ క్రేన్స్‌ (ఇ-ఆర్‌టిజిసి)ను ప్రారంభించినట్లు ప్రకటించింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఇ-ఆర్‌టిజిసిలతో కంటైనర్‌ హ్యాండ్లింగ్‌ సామ ర్థ్యం మరింతగా పెరగనుందని తెలిపింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో కంటైనర్‌ హ్యాండ్లింగ్‌ చేయటంలో 88 శాతం వృద్ధిని సాధించగా తాజాగా మరింత వృద్ధిని సాధించే అవకాశం ఉందని పేర్కొంది. డీజిల్‌తో నడిచే ఆర్‌టిజిసిలతో పోల్చితే ఎలక్ట్రికల్‌ రబ్బర్‌ టైర్డ్‌ గ్యాంట్రీ క్రేన్స్‌.. దాదాపు 1400 టన్నల గ్రీన్‌ హౌజ్‌ ఉద్గారాలను తగ్గిస్తాయని తెలిపింది. అంతేకాకుండా ఇంధన వ్యయాలను 80 శాతానికి పైగా తగ్గిస్తుందని కెపిసిటి వెల్లడించింది. కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించటంతో పాటు నిర్వహణాపరంగా సామర్థ్యాలను పెంచుకునే ఉద్దేశంతో కొత్తగా ఇ-ఆర్‌టిజి ఫ్లీట్‌ను ఏర్పాటు చేసినట్లు కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్‌, సిఇఒ అనిల్‌ యెండ్లూరి తెలిపారు. ప్రస్తుతం కృష్ణపట్నం పోర్ట్‌ కంటైనర్‌ టెర్మినల్‌.. దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పోర్టుల్లో ఒకటిగా ఉంది. ప్రస్తుతం ఏటా 12 లక్షల టిఇయుల సామర్థ్యం గల కంటైనర్‌ హ్యాండ్లింగ్‌ సామర్థ్యాన్ని 20 లక్షల టిఇయులకు చేర్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
Link to comment
Share on other sites

పారిశ్రామిక ప్రగతి వీచిక 
అభివృద్ధి దిశగా కృష్ణపట్నం ఓడరేవు 
జాతికి అంకితం చేసి పదేళ్లు పూర్తి 
nlr-gen1a.jpg

కృష్ణపట్నంపోర్టు(ముత్తుకూరు), న్యూస్‌టుడే : జిల్లా పారిశ్రామిక ప్రగతికి చిహ్నంగా ఉన్న కృష్ణపట్నం ఓడరేవు అభివృద్ధి దిశగా దూసుకెళుతోంది. ఆసియాలోనే అతిపెద్ద నౌకాశ్రయంగా రూపుదిద్దుకునేందుకు అడుగులేస్తుంది. ప్రపంచ చిత్రపటంలో ప్రత్యేక గుర్తింపు పొందిన దీనిని పదేళ్ల క్రితం యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి అనుబంధ పరిశ్రమల రాకతో రేవులో వ్యాపార లావాదేవీలు పెరిగాయి. మొత్తం 42బెర్తుల లక్ష్యంగా ఇప్పటికి 15బెర్తులు పూర్తయ్యాయి. తూర్పు తీర దేశాలతోపాటు యూరప్‌లోని పలు రేవులకు వాణిజ్య నౌకల రాకపోకలు ఊపందుకున్నాయి. ఎగుమతులకు అవసరమయ్యే అనుమతులను సత్వరమే ఇవ్వడంతో వ్యాపారవేత్తలు రేవుపై ఆసక్తి చూపుతున్నారు. చెన్నై- బెంగళూరు, వైజాగ్‌- చెన్నై కారిడార్‌(నడవా)లో దీనిని చేర్చడం, సాగరమాలలో భాగం కావడం మరింత అభివృద్ధికి అవకాశం కలగనుంది. రవాణా సౌలభ్యం కోసం అవసరం మేరకు రైల్వేలైనునూ విస్తరించారు.

దిగుమతులు కీలకం : పలు దేశాల నుంచి దిగుమతులు చేసుకొనే సరకులు రేవులో కీలకం. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, చైనా నుంచి బొగ్గు, ముడి ఇనుపఖనిజం, ముడి చక్కెర, సోలార్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఎరువుల నౌకలు నిరంతరం రాకపోకలు సాగిస్తున్నాయి. మలేషియా, అర్జెంటీనా, సింగపూర్‌ దేశాల నుంచి ముడి పామాయిల్‌, పొద్దుతిరుగుడు, సోపు నూనెలు నేరుగా అన్‌లోడింగ్‌ జరుగుతున్నాయి. బంగ్లాదేశ్‌, శ్రీలంక, బ్రెజిల్‌ వంటి దేశాలకు బియ్యం, మొక్కజొన్న, క్వార్జ్‌, సీఫుడ్స్‌, గ్రానైట్‌, పైపులను నౌకల్లో తరలిస్తున్నారు.

అనుబంధ పరిశ్రమలు : రేవు అనుబంధంగా ఎన్నో పరిశ్రమలు చుట్టుపక్కల ఏర్పాటయ్యాయి. తాప విద్యుత్తు కేంద్రాలు 5,240మెగావాట్ల సరఫరా చేస్తుండగా మరో 6వేల మెగావాట్ల ఉత్పత్తి చేసేందుకు భూసేకరణ చేశారు. విదేశాల్లో డిమాండ్‌ లేని వంటనూనెలను దిగుమతి చేసుకుని ఏడు పామాయిల్‌ శుద్ధి కర్మాగారాల ద్వారా మార్కెట్‌కు తరలిస్తున్నారు. వెంకటాచలం మండలంలో యూపీఐ పాలిమర్స్‌ కంపెనీ స్థాపించి విడుదలయ్యే పీవీసీ పైపులు తూర్పు తీర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గోతాల పరిశ్రమల ఉత్పత్తి దక్షిణ భారత్‌లోని పలు ప్రాంతాలకు రవాణా జరుగుతోంది. ఆయా ప్రాజెక్టులకు అవసరమయ్యే ముడి సరకులను విదేశాల నుంచి తెచ్చి దేశీయంగాను, అంతర్జాతీయంగాను ఎగుమతులు చేస్తున్నారు. ఓడరేవు సమీపంలో సిమెంటు, బీరు ఫ్యాక్టరీలు కూడా నిర్మాణంలో ఉన్నాయి. అన్ని పరిశ్రమల్లో దాదాపు 12వేల మంది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధికి మార్గం చూపుతున్నాయి. భవిష్యత్తులో నిత్యావసర వస్తువుల నుంచి ఆటోమొబైల్‌, రవాణా రంగం, విద్యుత్‌ పరికరాల ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది.

ప్రగతిలో కంటెయినర్‌ రవాణా : తక్కువ కాలంలో కంటెయినర్‌ రవాణా ప్రగతి ఊపందుకుంది. ఇతర దేశాల నుంచి వచ్చిన కంటెయినర్లను సకాలంలో గమ్యస్థానాలకు చేర్చడంలో సాంకేతికతను అందిపుచ్చుకుంది. దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ డివిజన్‌కు రేవు ద్వారా జరిగే రవాణాతో అధిక రాబడి వస్తోంది. దీంతో బెంగళూరు, నాగపూర్‌తోపాటు పలు రాష్ట్రాలకు రైల్వే కంటెయినర్‌ ప్రధానపాత్ర పోషిస్తుంది. ఈపూరు సమీపంలో నిర్మాణంలో కంటెయినర్‌ కార్పొరేషన్‌ (కాంకర్‌) పనులు తుది దశలో ఉన్నాయి. మౌలిక సదుపాయాల్లో భాగంగా రేవుకు జాతీయ రహదారిని అనుసంధానిస్తూ రోడ్డు సదుపాయం కల్పించారు. అభివృద్ధిలో పోటీపడుతున్న ప్రైవేటు పోర్టుల్లో కృష్ణపట్నంకు ప్రత్యేక స్థానం దక్కనుంది.

రేవు భద్రతకు ఐసీజీఎస్‌ : ఓడరేవు భద్రతకు భారతీయ కోస్తాదళ కేంద్రాన్ని కృష్ణపట్నంలో ఏర్పాటు చేశారు. విదేశీ చొరబాట్లు, గుర్తు తెలియని బోట్ల సంచారం వంటి అంశాలను గస్తీలో ఐసీజీఎస్‌ సిబ్బంది గమనిస్తుంటారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే ఉగ్రవాద చర్యలను ఎదుర్కోవడంలో వీరిపాత్ర ప్రత్యేకం. గతంలో అనధికారికంగా సముద్రంలో వేట సాగిస్తున్న విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...
విస్తరణ బాటలో కృష్ణపట్నం పోర్టు
10-09-2018 01:47:46
 
636721408635251093.jpg
  • ఏడాదిన్నరలో లిక్విడ్‌ కార్గో టెర్మినల్‌
  • రూ.500 కోట్ల వరకు పెట్టుబడి
  • సిఇఒ అనిల్‌ యెండ్లూరి
న్యూఢిల్లీ: కృష్ణపట్నం పోర్టు పెద్ద ఎత్తున విస్తరణకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ద్రవ (లిక్విడ్‌) పదార్ధాల ఎగుమతి, దిగుమతుల కోసం ప్రత్యేకంగా లిక్విడ్‌ కార్గో టెర్మినల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వచ్చే 12-18 నెలల్లో రూ.500 కోట్ల పెట్టుబడితో ఈ టెర్మినల్‌ ఏర్పాటు చేస్తామని పోర్టు సిఇఒ అనిల్‌ యెండ్లూరి వెల్లడించారు. ‘లిక్విడ్‌ కార్గో టెర్మినల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం వచ్చే 12-18 నెలల్లో రూ.500 కోట్ల వరకు పెట్టుబడి పెడతాం. దీనికి తోడు కంటెయినర్‌ టెర్మినళ్ల సామర్ధ్యాన్నీ విస్తరిస్తాం’ అన్నారు. లిక్విడ్‌ కార్గో టెర్మినల్‌ ద్వారా ద్రవ రూపంలో ఉండే అనేక ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులు చేపట్టాలని పోర్టు భావిస్తోంది. ఈ టెర్మినల్‌ వినియోగించుకునే అవకాశం ఉన్న పలు కంపెనీలతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టు ఆయన చెప్పారు.
 
కంటైనర్ల సామర్థ్య విస్తరణ
ఇప్పటికే ఏర్పాటు చేసిన బల్క్‌, కంటైనర్‌ టెర్మినళ్ల సామర్ధ్యాన్ని కృష్ణపట్నం పోర్టు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటోంది. కొత్తగా ఎనిమిది లక్షల టియుఇ కంటెయినర్ల సామర్థ్యాన్ని ఏర్పాటు చేస్తోంది. దీంతో మొత్తం కంటైనర్ల నిర్వహణ సామర్ధ్యం 20 లక్షల టియుఇలకు పెరుగుతుంది. గత ఏడాది కృష్ణపట్నం రేవు 4.8 లక్షల టియుఇల కంటైనర్లను నిర్వహించింది. ఈ సంవత్సరం అది ఆరు లక్షలకు పెరుగుతుందని భావిస్తోంది. ‘గత ఆర్థిక సంవత్సరం (2017-18) మొత్తం మీద 4.5 కోట్ల టన్నుల సరుకుల ఎగుమతి, దిగుమతులు నిర్వహించాం. ఈ ఆర్థిక సంవత్సరం దాన్ని ఆరు కోట్ల టన్నులకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని అనిల్‌ చెప్పారు. తూర్పు తీరంలోని రేవులకు సరుకుల నౌకలను ఆకర్షించడంలో ఎలాంటి ఇబ్బందులు లేవని అనిల్‌ స్పష్టం చేశారు. కృష్ణపట్నం పోర్టు కార్యకలాపాలే ఇందుకు నిదర్శనమన్నారు. గత రెండేళ్లలో తమ రేవు ద్వారా సరుకుల ఎగుమతి, దిగుమతులు వరసగా 114 శాతం, 88 శాతం చొప్పున పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు.
 
ఎల్‌ఎన్‌జి టెర్మినల్‌పై ఆసక్తి
ఎల్‌ఎన్‌జి టెర్మినల్‌ ఏర్పాటుపైనా కృష్ణపట్నం పోర్టు ఆసక్తి చూపిస్తోంది. అవసరమైతే ఈ ప్రాజెక్టు ఈక్విటీలో కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకూ ఆసక్తితో ఉన్నట్టు అనిల్‌ యెండ్లూరి చెప్పారు. ఈ టెర్మినల్‌ ఏర్పాటు కోసం ఇప్పటికే పలు గ్యాస్‌ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. అయితే ఎంత సామర్ధ్యం, ఎంత పెట్టుబడితో ఈ టెర్మినల్‌ ఏర్పాటు చేసేది వెల్లడించేందుకు అనిల్‌ నిరాకరించారు. కార్ల ఎగుమతి, దిగుమతుల కోసం ప్రత్యేక టెర్మినల్‌ ఏర్పాటుకు కృష్ణపట్నం పోర్టులో అవకాశం ఉందన్నారు. పోర్టుకు సమీపంలో ఏర్పాటవుతున్న కియా, ఇసుజు మోటార్‌ ప్లాంట్లతో ఇందుకు అవకాశం ఏర్పడుతుందని కంపెనీ భావిస్తోంది.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...
  • 2 months later...
ఓబులవారిపల్లె-కృష్ణపట్నం రైల్వేలైనుపై తొలి రైలు కూత
12-01-2019 07:49:29
 
636828762526778508.jpg
  • 25 కిలోమీటర్ల మేర ట్రయల్‌రన్‌ ప్రారంభం
  • కడప జిల్లా వాసుల హర్షం
  • నెరవేరిన రెండు దశాబ్దాల కల
రాజంపేట/కడప: రెండు దశాబ్దాలుగా జిల్లావాసులు ఎదురు చూస్తున్న ఓబులవారిపల్లె-కృష్ణపట్నం రైల్వే లైను మధ్య ఎట్టకేలకు రైలు కూత కూసింది. ఈ ప్రాంతంలో శుక్రవారం తొలిసారి రైలు నడవడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మంగంపేట- చెర్లో పల్లె మధ్య ఈ రైలు నడిచింది. ఇంజన్‌కు ఒక బోగిని ఏర్పాటుచేసి మంగంపేట స్టేషన్‌ మాస్టర్‌ అజయ్‌, రైల్వే సిబ్బంది, పీడబ్ల్యూ సిబ్బంది, రైల్వే ఎలక్ట్రికల్‌ సిబ్బంది, ఇంజనీ రింగ్‌ విభాగం ట్రైల్‌రన్‌లో పాల్గొన్నారు. అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయ కుండానే రైలు నడిపారు.
 
 
ఓబులవారిపల్లె-కృష్ణపట్నం రైల్వేలైన్‌ను 2006లోఅప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వంలో ప్రారంభించారు. రూ.600 కోట్లతో పూర్తికావా ల్సిన ఈ రైల్వేలైన్‌ నేడు రూ.1646 కోట్లకు చేరింది. 136 కిలోమీటర్ల మధ్య సాగే ఈ రైల్వేమార్గం జిల్లాలోని ఓబులవారిపల్లె, మంగంపేట, చెర్లోపల్లె మీదుగా నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం వరకు సాగనుంది. ఒక్క కిలోమీటర్‌కు రూ. 47కోట్లకు పైగా ఖర్చు చేశారు. ప్రధానంగా ఆసియాలోనే అతిపెద్ద సొరంగ మార్గమైన ఈ రైలుమార్గానికి అడ్డువచ్చే రెండు వెలుగొండలను తొలిచి 7.5 కి.మీ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఒక సొరంగమార్గం 100శాతం పూర్తి కాగా రెండవ సొరంగమార్గం పూర్తి కావచ్చింది. ఈ రైలు మార్గానికి 1900 ఎకరాల భూమిని రైల్వేశాఖకు అందజేశారు. ప్రస్తుత ఉప రాష్ట్రపతి, అప్పటి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కృషితో ఈ రైలుమార్గం ఏర్పడింది.
 
 
ఈ రైలుమార్గం ద్వారా సీమలోని నాలుగు జిల్లాలకు, కోస్తా ప్రాంతానికి 72 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఈ ప్రాంతంలో సుమా రు 12 రైల్వేస్టేషన్‌లున్నాయి. జిల్లాలోని మంగంపేట, నేతివారిపల్లె, చెర్లోపల్లె, ఓబుల వారిపల్లె రైల్వే స్టేషన్లుండగా నెల్లూరు జిల్లాలో ఎనిమిది రైల్వే స్టేషన్లున్నాయి. ఈ రైల్వేమార్గం త్వరితగతిన పూర్తయితే సీమ ప్రాంతంతో పాటు కోస్తాకు అనుసంధాన మార్గం ఏర్పడుతుంది. ప్రధానంగా బళ్లారి హోస్‌పేట నుంచి ఇనుపరాయి, కృష్ణపట్నం పోర్ట్‌ ద్వారా ఎరువులు, అనేక ఖనిజాలను ఎగుమతులు, దిగుమతులు చేసుకోవడానికి ఈ రైల్వేమార్గం ఉపయోగపడుతుంది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
పశ్చిమలో ప్రగతి కూత
 

చివరి దశకు కృష్ణపట్నం - ఓబులవారిపల్లె ట్రాక్‌ పనులు
ట్రైల్ రన్‌ విజయవంతం
పెరగనున్న రవాణా.. తగ్గనున్న దూరం
వెంకటాచలం, న్యూస్‌టుడే

nlr-top1a_43.jpg

జిల్లాలోని పడమటి పల్లెల్లో రైలు కూత వినిపించనుంది. నిన్న మొన్నటి వరకు రోడ్డు మార్గాలే సక్రమంగా లేని మెట్ట ప్రాంతాల్లోనూ ఇక రైళ్లు పరుగులు తీయనున్నాయి. కలగానే మిగులుతుందనుకున్న రైలు మార్గం ఏర్పాటు ఎట్టకేలకు సాకారమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైలు మార్గం పూర్తికావస్తుంది. రైల్వే అధికారులు తొలిసారిగా ఈమార్గంలో మంగళవారం ట్రయిల్‌ రన్‌  విజయ వంతమైంది. మొత్తం మార్గాన్ని  నెల రోజుల్లో  పూర్తిస్థాయిలో సిద్ధం చేయనున్నారు. ఈ మార్గం పూర్తయితే కృష్ణపట్నం పోర్టుకు ఎగుమతులు, దిగుమతులు గణనీయంగా పెరనున్నాయి. నెల్లూరు- కడప జిల్లాల మధ్య దూరం కూడా తగ్గనుంది.

ప్రస్తుతం సొరంగ మార్గం మినహా ఇస్తే రెండు వైపులా  రైల్వేలైను పనులు పూర్తయ్యాయి. సొరంగ మార్గం పనులు కూడా సగానికి పైగా పూర్తయ్యాయి.  సొరంగం మినహా పనులు పూర్తి కావటంతో అధికారులు మంగళవారం వెంకటాచలం నుంచి సొరంగ మార్గం వరకు 65 కిలోమీటర్ల మేర ప్రయోగాత్మకంగా రైలును తిప్పారు. ఈ దూరాన్ని కేవలం 40 నిమిషాల్లోపలే.. రైలింజన్‌ చేరింది. రైల్వే చీఫ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ వీఆర్‌ నాయుడు ఆధ్వర్యంలో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.

* జాతీయ రహదారి, గ్రామీణ రహదారులు, గ్రామాల్లోకి వెళ్లే మార్గాలున్న ప్రాంతాల్లో బాక్స్‌టైపు బ్రిడ్జిలు, పంటకాలువలు ఉన్న చోట కల్వర్టులు, పటిష్టమైన బ్రిడ్జిల నిర్మాణాలు చేశారు.

సులభ రవాణాకు బీజం
* పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాలంటే రవాణా వ్యవస్థ కీలకం. రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉంటే ఏరంగంలో అయినా విస్తృత అభివృద్ధి సాధించవచ్చు.
* ఓబులవారిపల్లె నుంచి కృష్ణపట్నం పోర్టుకు కేవలం రవాణా కోసమే ఈమార్గాన్ని మొదట ఏర్పాటు చేశారు.
* ప్రస్తుతం ఓబులవారిపల్లె నుంచి నేరుగా లైను వేయటంతో సుమారు 76 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.
* ప్రస్తుతం ఈమార్గంలో కసుమూరు, ఆదురుపల్లి, రాపూరు, చెర్లోపల్లి, మంగంపేటల వద్ద మొత్తం అయిదు రైల్వే స్టేషన్‌లను ఏర్పాటు చేశారు.
* పోర్టుకు రవాణా కోసం ఏర్పాటు చేసిన ఈమార్గంలో ప్రయాణికుల సౌకర్యార్థ్యం ప్యాసింజర్‌ రైళ్లు కూడా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనల్లో అధికారులు ఉన్నట్లు తెలిసింది. ఇటీవల ఈరైల్వే లైను పనులను భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పరిశీలించిన విషయం తెలిసిందే. ఆసమయంలో ఆయన రైల్వే అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ప్యాసింజర్‌ రైళ్లు తిరిగేందుకు కూడా చర్యలు తీసుకోవాలని, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువమంది ప్రయాణికులు ఎక్కే అవకాశం ఉన్న ప్రాంతాల్లో రైల్వేస్టేషన్‌లను కూడా ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలని అధికారులకు సూచించారు.

* ప్రస్తుతం ఒకమార్గం మాత్రమే ఏర్పాటు చేయగా, రవాణా పెరిగే అంశాన్ని బట్టి రెండో మర్గం కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Link to comment
Share on other sites

  • 2 months later...
నవయుగ కంటైనర్‌ టెర్మినల్‌ రికార్డు
29-03-2019 02:51:51
 
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నెల్లూరులోని నవయుగ కంటైనర్‌ టెర్మినల్‌ 2018-19 ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల టిఇయుల వస్తురవాణా సాధించి సరికొత్త మైలురాయిని చేరింది. ఎంవీ ఎస్‌ఎ్‌సఎస్‌ కచ్‌ నౌక ద్వారా ఈ రికార్డును సాధించినట్టు టెర్మినల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జితేంద్ర నిమ్మగడ్డ తెలిపారు. 2013-14లో 58,577 టిఇయుల వస్తురవాణాతో ప్రారంభమైన ఈ టెర్మినల్‌ ఐదేళ్ళ కాలంలో 9 రెట్లు వృద్ధిని సాధించిందని ఆయన చెప్పారు. ఈ రికార్డును సాధించడం ద్వారా తూర్పు కోస్తాలో ఎన్‌సీటీ ఒక ట్రాన్షి్‌పమెంట్‌ హబ్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని కృష్ణపట్లం పోర్టు సీఈఓ, డైరెక్టర్‌ అనిల్‌ యెండ్లూరి అభినందించారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...