Jump to content

అదిరిపోయే ప్లాన్‌తో దూసుకుపోతున్న బాలయ్య..!


Recommended Posts

అదిరిపోయే ప్లాన్‌తో దూసుకుపోతున్న బాలయ్య..!
04-07-2018 11:06:11
 
636662991722031009.jpg
ఆయన నిత్యం బిజీబిజీ! పది నిముషాలపాటు కూర్చొని మాట్లాడేంత తీరిక ఉండదు. అటువంటి నేత ఏకంగా గ్రామాల్లో పల్లెనిద్రలతో ప్రజల్లో మమేకం కావడానికి ప్రయత్నించడం చర్చనీయాంశమైంది. ఇంతకూ ఆ నేత ఎవరు? ఎందుకు అలా చేశారు? ఆసక్తికర కథనం మీకోసం!
 
 
        నందమూరి బాలకృష్ణ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు తనయుడు. నిత్యం సినిమా షూటింగ్‌లతో తీరిక లేకుండా ఉంటారు. అలాంటి బాలయ్యబాబు ప్రజాసేవ చేయాలనే తలంపుతో మొన్న జరిగిన ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసీ గెలుపొందారు. గెలిచిన తర్వాత కొంతకాలం ప్రజలకు అందుబాటులోకి రాలేకపోయారు. అప్పట్లో బాలయ్యకి పీఏగా ఉన్న శేఖర్‌ ధోరణిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను తప్పించి నేరుగా ప్రజలకి దగ్గరవడానికి ప్రయత్నించారు బాలకృష్ణ. సినిమాలు, ఇతర వత్తిళ్లు ఉన్నప్పటికీ అడపాదడపా హిందూపురానికి వచ్చివెళ్లేవారు.
 
 
      అయితే ఇటీవల బాలయ్య తన పంథాని మార్చేశారని నియోజకవర్గ వాసులు చెప్పుకుంటున్నారు. పల్లెల్లో ప్రజలు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు తెలుసుకోవడానికి ఏకంగా పల్లెనిద్ర కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. సినిమాలు, ఇతర కార్యక్రమాలను పక్కనపెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలను కలుస్తున్నారు. వారి సమస్యలు వింటున్నారు. గత వారంలో రెండు రోజులపాటు పల్లెనిద్ర చేశారు. దీంతో బాలయ్యపై ప్రజల్లో మరింత అభిమానం పెరిగింది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బాలయ్య మరింత స్పీడ్ పెంచారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
 
 
      గత ఎన్నికల్లో చిలమత్తూరు మండలంలో బాలయ్యబాబుకి తక్కువ మెజారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలకు మరింత దగ్గర కావాలని బాలకృష్ణ ప్రయత్నించారు. చాగలేరు గ్రామంలో దళితవాడలో సామూహిక సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. స్వయంగా ఒక మహిళకు భోజనం తినిపించారు. సీసీరోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ మొదటి రోజు బిజీగా గడిపారు. అదే రోజు దిగువల్లి తాండాలో ఒక ఇంట్లో పల్లెనిద్ర చేశారు. తెల్లవారు జామున త్రెడ్ మిల్‌పై వ్యాయమం చేశారు. ఉదయం మొదలు రాత్రి పొద్దుపోయే వరకు ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. రెండవ రోజు ఇదే మండలంలో పలు గ్రామాల్లో పర్యటించారు. వీరాపురంలో పల్లెనిద్ర చేశారు. ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
 
     బాలయ్య వస్తున్నారంటే నియోజకవర్గ ముఖ్య నేతలంతా ఆయన వెంట ఉంటుంటారు. అయితే ఈసారి పంథాను మార్చారు. జిల్లా నేతలు కానీ.. స్థానిక నియోజకవర్గ నేతలు కానీ తన వెంట లేకుండా ఆయన జాగ్రత్తపడ్డారు. ఆయా గ్రామ నేతలను వెంటబెట్టుకుని వారినే వేదికల మీదకు ఎక్కించి మాట్లాడించారు. దీంతో స్థానిక నేతలకు బాలయ్య మరింత చేరువయ్యారనే అభిప్రాయం ఏర్పడింది. బాలయ్యకి కొంచెం కోపమెక్కువ అన్న భావన ప్రజల్లో ఉంది. అయితే ఈసారి ఆయన ఎంతో ఓపికని ప్రదర్శించారు. ప్రతీ ఒక్కరు చెప్పే విషయాలను సావధానంగా వినడం తాజా కోణం. ప్రజలు తన దృష్టికి తెచ్చే సమస్యలపై ఆయన వెంటనే స్పందించారు. ఆయా సమస్యలను పరిష్కారించమని అధికారులకు ఆదేశించారు.
 
 
       పల్లెనిద్రలపై విశ్లేషకులు దృష్టిసారించారు. "ప్రజలకి బాలయ్యబాబు అందుబాటులో ఉండటం లేదనే'' అపవాదు నుంచి బయటపడటానికి ఆయన ప్రయత్నించారని వారు అంచనా వేస్తున్నారు. హిందూపురంలో స్థానిక నేతల మధ్య గ్రూపు విభేదాలు ఉన్న నేపథ్యంలో వారిని దూరంపెట్టి.. తానే నేరుగా జనంలోకి వెళ్లడం కార్యకర్తలకి ఆనందం కలిగించింది. ఇక్కడ గతంలో పోటీచేసిన నందమూరి హరికృష్ణ ప్రజలకి దూరంగా ఉన్నారనే విమర్శలను ఎదుర్కొన్నారు. బాలయ్య మాత్రం ఇలాంటి విమర్శలకు ఆస్కారం ఇవ్వకూడదనే ప్లాన్డ్‌గా కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు. లేపాక్షి, చిలమత్తూరు, హిందూపురం మండలాల్లో టీడీపీ నేతల మధ్య గ్రూపు విభేదాలు ఎక్కువ. ఇక్కడ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు అబ్దుల్ ఘని, రంగనాయకులు, సీసీ వెంకటరాముడుతోపాటు ముఖ్య నేతలు పలువురు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వారి మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమవడం సహజం. ఈ నేపథ్యంలో బాలయ్య ఆచితూచి వ్యవహరిస్తూ స్వయంగా జనంలోకి వెళ్లడం వల్ల.. అన్నింటికీ పరిష్కారం దొరుకుతుందనే భావన పార్టీ వర్గాలలో ఏర్పడింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...