sonykongara Posted June 23, 2018 Posted June 23, 2018 బుగ్గవాగుకు గ్రీన్ సిగ్నల్..!23-06-2018 09:26:11 రిజర్వాయర్ సామర్థ్యం పెంపు కోసం ఎదురుచూపులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసిన ఎమ్మెల్యే యరపతినేని నిధులు విడుదల చేయాలని లేఖ రాసిన నరసరావుపేట ఎంపీ రాయపాటి రూ.220 కోట్లు కేటాయింపునకు ఆమోదం లభించినట్లు సమాచారం గుంటూరు, పిడుగురాళ్ల: పల్నాటి సిగలో సిరుల మాగాణి బుగ్గవాగు రిజర్వాయర్ సామర్ధ్యం పెంపుపై రెండు జిల్లాల రైతాంగం గంపెడాశలు పెట్టుకుంది. వాస్తవానికి ఈ మధ్య కాలంలో నాగార్జున సాగర్ కాలువ ఆధునికీకరణకు మంజూరైన నిధుల్లోనే బుగ్గవాగుకు న్యాయం జరుగుతుందని అందరూ భావించారు. అయితే గుంటూరు, ప్రకాశం జిల్లాల వరప్రదాయినిలాంటి ఈ రిజర్వాయర్‌పై సరిగ్గా అవగాహనలేని కొందరు అధికారులు ఈవిషయంలో ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించారు. కేవలం సాగునీటి అవసరాలకే పరిమితం అవుతుందన్న భావనను ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులకు కల్పించారు. దీంతో రూ.420 కోట్ల నిధులకు బ్రేక్ పడింది. వాస్తవానికి బుగ్గవాగు రిజర్వాయర్ సామర్థ్యం పెంపుతో రెండు జిల్లాల్లో తాగు నీటి సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. రిజర్వాయర్ సామర్థ్యాన్ని 3.5 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు పెంచడం ద్వారా పల్నాడులో వెనుకబాటు చవిచూస్తున్న మాచర్ల, గురజాల, వినుకొండ నియోజకవర్గంలో కొంత భాగం సిరులు పండుతాయి. రిజర్వాయర్ సా మర్థ్యం పెంపుతో సాగు, తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు, పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతుంది. వీటేటితో పెద్దగా పట్టింపులేని ఒకరిద్ద రు అధికారులు నిధుల కేటా యింపునకు అడ్డుపడటం ద్వారా పల్నాడులోని ఉభ య నియోజకవర్గాలకు తీవ్ర అన్యాయం చేశారు. పట్టువదలక.. 1955 నుంచి 1967 వరకు సాగిన బుగ్గవాగు రిజర్వాయర్ నిర్మాణంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తాతయ్య యరపతినేని తిరుపతయ్య అత్యంత కీలకంగా వ్యవహరించారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలలోని 13 లక్షల హెక్టారుల భూమికి ఈ ప్రాజెక్టు ద్వారా నీరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిర్మాణం, భూసేకరణలో యరపతినేని తిరుపతయ్య చూపిన చొరవతో సకాలంలో పనులు పూర్తయ్యాయి. మంచికల్లు గ్రామానికి చేరువలో ఉండే రిజర్వాయర్ నిర్మాణం కోసం దుర్గి, రెంటచింతల, మాచర్ల మండలాల సరిహద్దులలోని 3,072 ఎకరాల భూమిని సమకూర్చటంలో ఆయనదే కీలక పాత్రగా చెప్తారు. తాత హయాంలో 3.5 టిఎంసీల నీటిని నిల్వ పెట్టేందుకు నిర్మించిన బుగ్గవాగు రిజర్వాయర్ సామర్థ్యం పెంపు విషయాన్ని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి తెరపైకి తెచ్చారు. ఇప్పటికే ఈ విషయమై పలుమార్లు ముఖ్యమంత్రిని, సంబంధిత శాఖా మంత్రిని కలసి సామర్థ్యం పెంపు ఆవశ్యకతను వివరించటంతోపాటు, అంచనాలకు సంబంధించిన నివేదికను అందజేశారు. యరపతినేని విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే నేరుగా జోక్యం చేసుకున్నారని తెలుస్తోంది. సంబంధిత అధికారులకు కూడా తగిన ఆదేశాలిచ్చినట్లు సమాచారం. నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు కూడా బుగ్గవాగు రిజర్వాయర్ సామర్థ్యం పెంపుపై ప్రభుత్వానికి లేఖ రాశారు. రాయపాటి ప్రతిపాదించిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు రిజర్వాయర్ సామర్థ్యం పెంపు అవసరమని లేఖలో పేర్కొన్నారు. రూ.220 కోట్లు విడుదలకు గ్రీన్ సిగ్నల్..! ఎట్టకేలకు యరపతినేని విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం బుగ్గవాగు రిజర్వాయర్ సామర్ధ్యం పెంపునకు రూ.220 కోట్లు విడుదల చేసేందకు సిద్ధమైనట్లు తెలిసింది. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కూడా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రెండు జిల్లాల రైతాంగానికి మేలు చేయటంతోపాటు, మాచర్ల, గురజాల నియోజకవర్గాల పరిధిలోని ప్రజల తాగు నీటి ఇబ్బందులు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని అన్నారు.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.