Jump to content

House site pattas


Recommended Posts

  • 2 weeks later...
ప్రతి కుటుంబానికీ ఇంటి స్థలం
02-07-2018 02:19:28
 
636660947665324032.jpg
  • 4 పద్ధతుల్లో కేటాయింపు
  • సర్కారు నిర్ణయం!
  • రాబోయే నాలుగు నెలల్లోనే 5,763 కోట్ల విలువైన పట్టాలు పంపిణీ
  • 750 కోట్లతో ప్రైవేట్‌ భూముల కొనుగోలు
  • క్రమబద్ధీకరణతో విశాఖలో సానుకూల స్పందన
  • నాలుగేళ్లలో రాష్ట్రంలో 3.57లక్షల మందికి పట్టాలు
అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల! ఇల్లు లేకపోయినా.. కనీసం ఇంటి స్థలమైనా ఉండాలని ఆశిస్తారు! కానీ, ఈ రోజుల్లో సామాన్యులకు ఇది అందని ద్రాక్షే! అయితే ఈ కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు లేకుంటే సొంతింటి స్థలమైనా ఉండేలా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారు. ఈ నేపథ్యంలో నాలుగు రకాల పద్ధతుల ద్వారా ఇళ్ల స్థలాలను ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ఉన్న పేదలకు ఆ భూమిని క్రమబద్ధీకరించడం, గతంలో వేసిన లే అవుట్లలో అక్కడక్కడా మిగిలిపోయిన స్థలాలను పేదలకు పంచడం, బడ్జెట్‌లో పెట్టిన నిధులతో కొనుగోలు చేసి ఇవ్వడం, ఇళ్ల స్థలాలకు అనువైన ప్రభుత్వ భూములుంటే పట్టాలివ్వడం. ఇలా ఈ నాలుగు మార్గాల్లోను అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సర్కారు నిర్ణయం తీసుకొంది.
 
 
విశాఖలో ఆక్రమణల క్రమబద్ధీకరణకు మంచి స్పందన రావడంతో.. ఆ మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించబోతున్నారు. ప్రైవేటు భూమిని పేదల పట్టాల కోసం కొనుగోలు చేసేందుకు బడ్జెట్‌లో రూ.500కోట్లను, ఎస్సీలకు స్థలాల కోసం రూ.250కోట్లను ప్రత్యేకంగా కేటాయించారు. ఈ రూ.750కోట్లను రాబోయే ఈ నాలుగేళ్లలో 3.57లక్షల మందికి ప్రభుత్వం ఇళ్లస్థలాలు ఇచ్చింది. ఇలా ఇచ్చిన స్థలాల విలువ రూ.16,707కోట్లు. ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే మూడు విడతలుగా రూ.10,600కోట్ల విలువైన 9.16లక్షల చదరపు గజాల స్థలాన్ని 61,375కుటుంబాలకు అందించారు. నెల్లూరు జిల్లాలో 46,946పట్టాలు, చిత్తూరులో 45,042, కృష్ణాలో 41,695, అనంతపురంలో 39,841, తూర్పుగోదావరి జిల్లాలో 28,594, కడప జిల్లాలో 23,457, విజయనగరం జిల్లాలో 16,687 పట్టాలు ఇచ్చారు.
 
 
గ్రామీణ ప్రాంతాల్లో 2,20,298 మందికి, పట్టణ ప్రాంతాల్లో 1,36,959 మందికి పట్టాలు అందజేశారు. మరోవైపు మీసేవ పోర్టల్‌ ద్వారా ఇళ్ల స్థలాల కోసం వచ్చిన దరఖాస్తుల్లో అర్హత కలిగినవి సుమారు 6 లక్షలు ఉన్నట్లు తేల్చారు. త్వరలోనే 28,137మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. 2019నాటికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 19లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఆ మేరకు పనులు వేగంగా జరుగుతున్నాయి. సంక్షేమం, పింఛన్లు, పెళ్లికానుక, రేషన్‌, చంద్రన్నబీమా, రైతుకు బీమా, ఉపాధిహామీ పనులు వంటివి చేస్తున్నా.. ప్రతి ఒక్కరికీ తలదాచుకునేందుకు ఒక గూడు, దానికోసం స్థలం ఉండాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. పేదలకు ఇదొక స్థిరాస్థిలా ఉంటుందని, జీవితకాలం గుర్తుగా మిగిలిపోతుందని పేర్కొంటున్నారు.
 
 
నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వారికి ఊరట!
సొంతింటి స్థలం ఇచ్చేందుకు జిల్లాల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఆయా జిల్లాల్లో ఎన్ని దరఖాస్తులు ఉన్నాయి? వారికి ఇవ్వడానికి ఎంత భూమి అవసరం? అందుబాటులో ఉన్నదెంత? ప్రభుత్వ భూములు, కొనుగోలు చేసే ప్రైవేటు భూముల పరిస్థితి ఏంటి? తదితర విషయాలపై నిర్దిష్టంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఏపీటిడ్కో ద్వారా పట్ణణ ప్రాంతాల్లో, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పట్టాల పంపిణీ చేపట్టనున్నారు.
 
 
మరోవైపు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో దీర్ఘకాలంగా ఉన్న సమన్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సహకార ఉమ్మడి వ్యవసాయం(కో ఆపరేటివ్‌ జాయింగ్‌ ఫార్మింగ్‌) కింద ఈ రెండు జిల్లాల్లో ఎస్సీలకు 1975లో భూములిచ్చారు. సాగుచేసుకునేది ఎస్సీ రైతులే అయినా, వారి పేరుపై పట్టాలుండవు. దీంతో వారు బ్యాంకు రుణాలకు వెళ్లాలన్నా, సబ్సిడీలు తెచ్చుకోవాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్క నెల్లూరు జిల్లాలోనే ఇలాంటి భూములు సుమారు లక్ష ఎకరాలున్నాయి. ఈ భూములను సాగుచేసుకుంటున్న 66వేల మంది రైతు కుటుంబాలకు పట్టాలివ్వనున్నారు. ఇలాగే చిత్తూరు జిల్లాలో నెలకొన్న సమస్యను పరిష్కరించబోతున్నారు.
 
 
పసుపు, కుంకుమ పెట్టి
ఒకప్పుడు పేదలకు ఇంటి స్థలం ఇవ్వాలంటే ఎంతో కొంత సమర్పించుకోవాల్సి వచ్చేది. అయితే గతానికి భిన్నంగా ఇళ్లపట్టాలను పేదలకు అందించే కార్యక్రమానికి చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒకేరోజు పెద్దఎత్తును కార్యక్రమం ఏర్పాటుచేసి, పసుపు-కుంకుమ పెట్టి మరీ పట్టాలు పంపిణీ చేశారు. మహిళల పేరుమీదే పట్టాలు ఇవ్వడం, అదీ గౌరవప్రదంగా ఇవ్వడం, ఆ రోజు భోజనాలు కూడా పెట్టడం లాంటి వినూత్న పద్ధతికి తెరతీసింది. ఒక్క విశాఖపట్నం జిల్లాలో మూడుసార్లు ఇలా పట్టాలు పంచారు. కర్నూలు జిల్లా నంద్యాలలో భూమా నాగిరెడ్డి చనిపోవడానికి కొంతకాలం ముందు సుమారు 10వేల మందికి ఇలాగే పట్టాలిచ్చారు. విజయవాడలో ఈ రకంగానే పట్టాలిచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన వారందరికీ 2022 నాటికి సొంతింటి స్థలాన్ని సమకూర్చాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.
Link to comment
Share on other sites

లక్ష పట్టాల పంపిణీ లక్ష్యం నిర్ధేశించిన సీఎం
06-07-2018 08:36:56
 
636664630180242519.jpg
  • జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 75 వేల వరకు కసరత్తు
  • నెలాఖరులోనే విజయవాడలో పంపిణీ చేయాలనే ఆలోచన
విజయవాడ: జిల్లావ్యాప్తంగా 75వేల ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి లక్ష్యాన్ని నిర్ధ్దేశించుకున్న జిల్లా యంత్రాంగం .. సీఎం ఆదేశించిన విధంగా లక్ష పట్టాలే లక్ష్యంగా సవరించుకుంది. ఈ నెలాఖరుకే జిల్లాస్థాయి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవాడలో భారీ ఎత్తున నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. విజయవాడలో 40 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న దానిపై ఇప్పటికే జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. తాజాగా గురువారం ముఖ్యమంత్రి మరో 20వేల టార్గెట్‌ పెంచటంతో జిల్లా యంత్రాంగం వారం రోజుల్లో ఇంకా నగరంలో ఎన్ని పట్టాలు ఇవ్వవచ్చన్న దానిపై లెక్క తేల్చనుంది. విజయవాడలో 40వేల ఇళ్ల పట్టాల క్రమబద్ధ్దీకరణకు సంబంధించి రెవెన్యూ యంత్రాంగం సర్వే చేయిస్తోంది. మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తే కేవలం 16వేలు మాత్రమే వచ్చాయి. విశాఖపట్నంలో ఇళ్ల సర్వే చేపట్టిన సంస్థ ప్రస్తుతం విజయవాడలో కూడా అధ్యయనం చేస్తోంది.
 
ఈ సంస్థ ఇంకా నివేదిక ఇవ్వలేదు. ఈ సంస్థ ఇచ్చే రిపోర్టు ప్రకారం 40వేలు ఇళ్ల పట్టాలు ఇవ్వగలమా ? ఇంకా ఎక్కువ ఇవ్వవచ్చా.. అనే అంశంపై స్పష్టత వస్తుంది. దీంతో పాటు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు సంబంధించి కూడా కొంత సర్వే జరుగుతోంది. వీటికి సంబంధించి కూడా స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు 40వేల నుంచి 60వేలకు టార్గెట్‌ ఇచ్చినా.. మొత్తంగా 40వేలకు మించి ఇళ్ల పట్టాలు ఉండవన్న భావనలో అధికారులు ఉన్నారు. సీఎం టార్గెట్‌ను పెంచిన నేపథ్యంలో, జిల్లావ్యాప్తంగా ఎలాగూ ఇప్పటికే 75వేల ఇళ్ల పట్టాలకు రంగం సిద్ధం చేసుకున్న యంత్రాంగం మరో 25వేల పట్టాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. శుక్ర, శనివారాల్లో కలెక్టర్‌ వరుస సమావేశాలు నిర్వహించి అవగాహనకు వస్తారు. భూమి ఎంతవరకు అందుబాటులో ఉంది? దాంట్లో పట్టాలు గతంలో ఇచ్చినవి ఏమైనా ఉన్నాయా? ఖాళీగా ఉంటే.. ఇప్పుడు తాజాగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవటం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
 
ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న అభ్యం తరాలు లేని వాటికి పట్టాలివ్వటం, గతంలో భూ సేకరణ చేసి ఉంటే అవి ఖాళీగా ఉన్నా అలాంటి వాటికి, గతంలో కేటాయించినా కట్టుకోకుండా వదిలివేసినవి, తండ్రి చనిపోతే వారి బిడ్డకు ఇవ్వటం, ఒరిజినల్‌ అసైనీ లేకపోతే కొన్నవారికి అర్హత ఉంటే అలాంటి వారికి కేటాయించటం, అసైన్‌ మెంట్‌ భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తారు.. దీని తర్వాత రెండు, మూడు విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కానీ, జిల్లా వ్యాప్తంగా లక్ష ఇళ్ల పట్టాలకు రంగం సిద్ధం చేయగలమో, లేదో నిర్ణయిస్తారు. ఆ వెంటనే పంపిణీకి విజయవాడలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పట్టాల పంపిణీకి చర్యలు తీసుకోనున్నారు.
Link to comment
Share on other sites

  • 4 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...