Jump to content

Water transportation


Recommended Posts

 

టెక్నాలజీతో పడవ ప్రమాదాలకు చెక్ పెట్టలేమా..?
03-06-2018 15:52:33
 
636636379609815437.jpg
 
ఆంధ్రజ్యోతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది కాలంలో రెండు భారీ పడవ ప్రమాదాలు జరిగాయి. రెండు ఘటనల్లోనూ 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడే కాదు.. పడవ ప్రమాదాలు ఎప్పుడు ఎక్కడ జరిగినా జరిగే ప్రాణనష్టం అపారంగా ఉంటుంది. చుక్కల్ని తాకుతున్న సాంకేతిక పరిజ్ఞానానానికి పడవల్ని కంట్రోల్ చేసే శక్తి లేదా.. ? ఎందుకు లేదు.. కచ్చితంగా ఉంది కావాలంటే మమ్మల్ని మోడల్‌గా తీసుకోండి అంటోది డోవర్ స్టేట్. పడవ ప్రమాదాలకు డోవర్ స్టేట్ ఎలా చెక్ పెట్టింది.. ?
 
2017 నవంబర్‌లో కృష్ణా జిల్లా విజయవాడకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద పర్యాటకులతో ప్రయాణిస్తున్న ప్రైవేటు బోటు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదపు విషాదాన్ని మరువక ముందే గోదావరిలో ఇటీవలే మరో భారీ దుర్ఘటన. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు - పశ్చిమగోదావరి జిల్లా కోండ్రుపేట సమీపంలోని వాడపల్లి మధ్యన లాంచీ మునిగిపోయింది. ఏకంగా 22 మందిని మృత్యువు దిగమింగింది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన కాలంలోనూ ఇంకా ఈ విషాదాలేంటనిపిస్తుంది. వీటికి చెక్ చెప్పే దారే లేదా అనిపిస్తుంది. అలా వెదికినప్పుడు కనిపించిన సాంకేతిక ఆశా దీపమే డోవర్ స్టేట్ ప్రయోగం.
 
డోవర్‌ స్టేట్‌.. ఇంగ్లండ్‌ - ఫ్రాన్స్‌ మధ్యన ఉంటుంది. అక్కడ బోటు ప్రమాదాలు భారీగానే జరిగేవి. ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ ప్రాణనష్టం కూడా ఎక్కువే. ప్రమాదాల నివారణకు అత్యాధునిక టెక్నాలజీ సాయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. ఫలితంగా ప్రమాదాలకు అడ్డుకట్ట పడింది. డోవర్‌ సాంకేతికతను అందిపుచ్చుకొన్న ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, సింగపూర్‌, అమెరికా మంచి ఫలితాలు సాధించాయి.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులపై సుమారు 70 బోట్లు తిరుగుతున్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇందులో గోదావరిపై సుమారు 52, కృష్ణానదిపై 18 పడవలున్నాయి. వీటికి ఇరిగేషన్‌తో పాటు సంబంధిత శాఖల అనుమతులు ఉన్నాయి. అనధికారికంగా లాంచీలు, పడవలూ తిరుగుతున్నా వాటి వివరాలు ప్రమాదాలు జరిగినప్పుడే బయటకొస్తాయి. ప్రమాదాలు జరిగిన పడవలకు మరమ్మతులు నిర్వహించి మళ్లీ తిప్పేస్తుంటారు. దేవీపట్నం దగ్గర గోదావరిలో మునిగిపోయిన లాంచీ గతంలోనూ ప్రమాదానికి గురైంది. రిపేర్లు చేసి.. పేరు మార్చి నడిపేస్తున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. వీటిని నియంత్రించాలంటే టెక్నాలజీని ఉపయోగించడం తప్ప మరో మార్గం లేదనేది నిపుణుల మాట. దీనిపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి డోవర్‌ స్టేట్‌ చేపట్టిన ప్రయోగాన్ని అమలు చేసే యోచనలో ఉంది. వెసల్‌ ట్రాఫిక్‌ విధానంతోనే ప్రమాదాలకు చెక్‌ పెట్టే అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారు.
 
డోవర్‌ స్టేట్‌ తీరంలో మొత్తం 200 బోట్లు నడుస్తున్నాయి. వీటి పర్యవేక్షణ అంతా అక్కడ ప్రభుత్వమే చూసుకుంటుంది. మొదట సముద్రానికి దగ్గరలో ఒక భారీ టవర్‌ను నిర్మించారు. ఆ టవర్‌లో ఆటోమెటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ అమర్చారు. ఇది సుమారు 500 కిలోమీటర్ల వరకూ పని చేస్తుంది. ఈ పరిధిలో అధికారిక అనుమతి లేకుండా ఏ బోటు నదిలోకి ఎంటర్ అయినా తెలిసిపోతుంది. అనుమతి ఉన్న ప్రతి బోటును జీపీఎస్‌తో అనుసంధానం చేస్తారు. ఫలితంగా ఎన్ని బోట్లు నడుస్తున్నాయో తెలిసిపోతుంది. వాటి పనితీరుపై పక్కా పర్యవేక్షణ వీలవుతుంది.
 
ప్రమాదాలకే కాదు.. డోవర్ స్టేట్ ప్రయోగం ద్వారా దొంగలకూ చెక్ పెట్టవచ్చు. 500 కి.మీ. పరిధిలో ప్రతి చిన్న కదిలికా సిబ్బందికి ఇట్టే తెలిసిపోతుంది. కాబట్టి సముద్రంలో అక్రమ చొరబాటుదార్లనూ దొంగలను వెంటనే గుర్తిస్తారు. ప్రమాదాలను నివారిస్తారు. పరిమితికి మించి జనాలను ఎక్కించినా, లైఫ్‌ జాకెట్‌లు ఇవ్వకపోయినా టవర్‌లో ఉన్న సిబ్బందికి సమాచారం వస్తుంది. వాకీటాకీల ద్వారా బోటు సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. ఇందుకు హై రేడియో ఫ్రీక్వెన్సీ పరికరాలు ఉపయోగిస్తుంటారు. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నా.. తుఫాన్లు, ఈదురుగాలులు వీచేందుకు అవకాశం ఉన్నా.. ముందే హెచ్చరిస్తారు. వెంటనే దగ్గరలోని ఒడ్డుకు బోటును చేర్చి ప్రమాదాలు జరగకుండా కాపాడతారు.
 
మన రాష్ట్రంలోనూ ఇలాంటి విధానాన్ని తీసుకువస్తే తప్ప బోటు ప్రమాదాల నివారణ సాధ్యం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అనుమతి లేని బోట్లను కట్టడి చేయడానికి గోదావరి, కృష్ణానది దగ్గరలో రెండు టవర్లు నిర్మించాల్సి ఉంటుంది. ఏఐఎస్‌, జీపీఎస్‌ పరికరాలు లక్ష రూపాయలకే లభిస్తుండటంతో ఇది పెద్దగా ఆర్థికంగా భారం కాదనేది వారి వాదన. డోవర్‌ స్టేట్‌ ఏఐఎస్ ను కేవలం 500కి.మీ.లకే పరిమితం చేసింది కానీ, దానిని 2వేల కి.మీ. పరిధిలో నిఘాకు ఉపయోగించవచ్చని చెబుతున్నారు.

 

Link to comment
Share on other sites

ప్రభుత్వ ఆధీనంలోనే జల రవాణా!
18-05-2018 03:10:47
 
636622098486325374.jpg
 • బోట్లు, పడవల ఇష్టా రాజ్యానికి అడ్డుకట్ట
 • ఆర్టీసీ మాదిరే జల రవాణా నిర్వహించాలి
అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజు 5 నుంచి 10 వేల మంది జల మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. కోట్లు విలువ చేసే సరుకు రవాణా జలమార్గం ద్వారానే జరుగుతుంది. ఈ మొత్తం రవాణా అంతా గాలిలో దీపం చందంగానే తయారైంది. ఏ బోటు ఎప్పుడు మునుగుతుందో... ఎంత మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో చెప్పలేని దుస్థితి. ఆరు నెలల క్రితం విజయవాడలోని పవిత్ర సంగమం వద్ద పర్యాటక బోటు మునిగి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వారం రోజుల క్రితం గోదావరి నదిలో ఒక బోటు ఆకస్మాత్తుగా కాలి పోయింది. అదృష్టవసాత్తూ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. అదే గోదావరి నదిపై మంగళవారం ప్రయాణికుల బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది అమాయకులు విగతజీవులయ్యారు. ఇవి కాకుండా రోజూ ఏదో ఒక చోట చిన్న చిన్న ప్రమాదాలు జరిగి ప్రాణాపాయం జరుగుతూనే ఉంది. రాష్ట్రంలో ముఖ్యంగా గోదావరి, కృష్ణా నదులపై వందల సంఖ్యలో బోట్లు తిరుతున్నాయి. వీటిలో కేవలం ఒకటి లేదా రెండు శాతం బోట్లకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉంది. మిగిలిన 98 శాతం బోట్లు అక్రమంగా, ఎలాంటి అనుమతులు లేకుండానే నడుస్తున్నాయి. రాష్ట్రంలో జల రవాణా వ్యవస్థకు ప్రభుత్వం ఎలాంటి విధానాలూ రూపొందించకపోవడమే దీనికి ప్రధాన కారణం. బోట్లలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో పదుల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. జల రవాణా మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉంటే తప్ప అక్రమ బోట్ల కట్టడి సాధ్యం కాదు.
 
ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక వ్యవస్థ
దేశ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థ, రాష్ట్రంలోని ఆర్టీసీ కూడా మొత్తం ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నాయి. ప్రయాణికులు సురక్షితంగా గమ్యం చేరాలంటే ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తారు. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు తప్ప భారీ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఆర్టీసీలో చాలా తక్కువ. రైల్వే, ఆర్టీసీ మాదిరే జల రవాణాకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. జల రవాణ వ్యవస్థను మొత్తం ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని ప్రత్యేక కార్పొరేషన్‌, యంత్రాంగం ఏర్పాటు చేస్తే తప్ప ప్రమాదాలు నివారణ సాధ్యపడదు. సముద్రంలో నౌకను నడపాలంటే మన దేశంలో పోర్టు డిపార్ట్‌మెంట్‌ అనుమతి తప్పనిసరి. పోర్టు డిపార్ట్‌మెంట్‌ నౌకలకు అనుమతులు ఇచ్చే సమయంలో ప్రయాణికుల రక్షణకు తొలి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రయాణికులకు అవసరమైన సెఫ్టీ పరికరాలు మొత్తం నౌకలో ఉంటే తప్ప అనుమతులు లభించవు. ఇటువంటి కఠినమైన నిబంధనలతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆర్టీసీ మాదిరిగానే జల రవాణాకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి... బోట్లు కూడా ప్రభుత్వమే నడిపే విధంగా ఏర్పాటు చేయాలి. దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు పర్యాటక పరంగా కూడా ప్రయోజనకరం. కోల్‌కత్తాలోని హౌరా బ్రిడ్జి సమీపంలో ప్రత్యేక బోట్లు ఉంటాయి. చాలా మంది ప్రయాణికులు హౌరా బ్రిడ్జి వద్ద రైలు దిగిపోయి... బోటులో కోల్‌కత్తా వైపుకు వెళ్తుంటారు. ప్రయాణికులు సౌకర్యార్థం, రక్షణ కోసం ఈ బోట్లను ప్రభుత్వమే నడిపిస్తుంది. ఇదే విధానం ఏపీలోనూ అమలు చేస్తే ప్రయోజనకరం. ఇక, జల రవాణాను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా కసరత్తు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పర్యాటకశాఖ పరిధిలో ఒక బోటింగ్‌ విభాగం పని చేస్తుంది. ఇది కేవలం పర్యాటక శాఖకు సంబంధించిన బోట్లను మాత్రమే పర్యవేక్షిస్తుంది. ఈ విభాగాన్ని మరింత పటిష్టం చేసి, స్వతంత్ర వ్యవస్థగా మారిస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఏపీటీడీసీ పరిధిలో ఉన్న ఈ విభాగాన్ని ఏపీటీఏ పరిధిలోకి తీసుకుని, ప్రత్యేక అధికారాలు అప్పగించాల్సిన అవసరం ఉంది. దీని వల్ల రాష్ట్రంలో ఒకవైపు పర్యాటక పరంగా అభివృద్ధి చెందుతూనే, జల రవాణా పటిష్టం పడుతుంది. జల రవాణా ద్వారా ప్రభుత్వానికి కూడా భారీ ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. దీని వల్ల బోటులో పని చేసే సిబ్బంది, డ్రైవర్‌ దగ్గర నుంచి అందరూ శిక్షణ పొంది ఉంటారు. దీనివల్ల ప్రయాణికుల భద్రతకు భరోసా ఉంటుంది.
Link to comment
Share on other sites

 • 1 month later...
13 minutes ago, JVC said:

Complete the whole sentence.Govt employees badhakastulu. Lanchagondilu. Not possible

boats ki permissions ichhe atanu maa frnd on godavri river... vadi pani vadini enadu chakkaga cheyanivvaledu.. just checking ki vastam antene presidents mla lu phone chesevallu.. akkarledu mundu certificate ichheyyandi ani.. now u can tell.. edo urike sollu cheppadam kadu..

Link to comment
Share on other sites

@surapaneni1 letters evvamantea evvatamanaa ? Minister cheppadani murder cheai  antea chestaraaa? Don’t they hav back bone? Commonsence use cheayanaa? Papam  govt employees assaul  lanchalu teesukoru, just becoz of cm and ministers they are like tat else they are very genuine honest and hard working 

Edited by V Jagadeesh
Link to comment
Share on other sites

3 hours ago, surapaneni1 said:

boats ki permissions ichhe atanu maa frnd on godavri river... vadi pani vadini enadu chakkaga cheyanivvaledu.. just checking ki vastam antene presidents mla lu phone chesevallu.. akkarledu mundu certificate ichheyyandi ani.. now u can tell.. edo urike sollu cheppadam kadu..

Mee odu vaallu icheyamante ichestaada? Sincerity ledannatte ga? Ala ayina... 

Half knowledge evarido ee db lo ide section lo Chala sarlu prove ayindi le.. manam Inka daani gurinchi maatlaadukovatam endukule

Link to comment
Share on other sites

1 hour ago, V Jagadeesh said:

@surapaneni1 letters evvamantea evvatamanaa ? Minister cheppadani murder cheai  antea chestaraaa? Don’t they hav back bone? Commonsence use cheayanaa? Papam  govt employees assaul  lanchalu teesukoru, just becoz of cm and ministers they are like tat else they are very genuine honest and hard working 

Kurchoni typings cheyyatam veru.. situations handle cheyyatam veru... bayatanundi chusetodiki anta bane kanipistundi.... inka migatadi mee istam..

Link to comment
Share on other sites

39 minutes ago, JVC said:

Mee odu vaallu icheyamante ichestaada? Sincerity ledannatte ga? Ala ayina... 

Half knowledge evarido ee db lo ide section lo Chala sarlu prove ayindi le.. manam Inka daani gurinchi maatlaadukovatam endukule

ya keybord  undani emi telvakunda vagetollaki evadem cheptadu.. dark lo unnodiki anta chikatigane kanapadudi.. gottam galla daggara prove cheskovlsina avasaram evadiki ledu..

Link to comment
Share on other sites

Situation between govt. employees and politicians is because of two reasons... corruption and fear

1) Corruption, Both politicians and govt. employees are corrupt and give certificates with out checking, they get their share. They don't care about consequences as they know they can play with loop holes in system and laws by supporting each other.

   Reason: Greed for easy money

2) Fear, Though employee does not like to certify with out checking, as politicians force, their fear for loosing job and difficulties they create in their job makes them to do what politicians want. 

    Reason: Fear to face life with less money, see around you! you will find many people.

                 These people think they do not have skills to earn money if they loose their current job, which they got by earning certificate from a university (or) They fear of about relationships in life, if they earn less than what they are earning now. They look to be genuine reasons, but they are not.

In either of case, both politicians and employees are reasons. If some one is saying only one category is the reason for this issue, he must have submitted himself to one (or) both the reasons and is playing blame game.

 

Link to comment
Share on other sites

జనహితం.. జలప్రయాణం!
18-07-2018 03:58:06
 
636674830866952129.jpg
 • ఆర్టీసీలా.. జల రవాణాకు ప్రత్యేక సంస్థ
 •  జల రవాణాలోకి ప్రభుత్వం
 •  పడవ ప్రమాదాలకు ఇక ఫుల్‌స్టాప్‌
 •  జల ప్రయాణానికి ప్రత్యేక నియమావళి
 •  కేరళ నమూనాపైనా అధ్యయనం
 
జనహితం.. జలప్రయాణం!
కేరళలోలా మనకూ జల రవాణా వ్యవస్థ ఉంటే... అది సురక్షిత ప్రయాణాన్ని అందిస్తే... దాన్ని ప్రభుత్వమే స్వయంగా నిర్వహిస్తే... అందుకోసం ఒక ప్రత్యేక శాఖనే ఏర్పాటుచేస్తే... ఎంత బాగుంటుందో కదా..! అందుకే జల రవాణా బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయించింది.
 
అమరావతి, జూలై 17(ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకూ ప్రైవేటు ఆపరేటర్ల ఇష్టారాజ్యానికి వదిలేసిన జల రవాణా ను క్రమబద్ధం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజల ప్రాణ రక్షణ, పడవ ప్రమాదాల నివారణకు తానే జల రవాణా వ్యవస్థను నిర్వహించాలని భావిస్తోంది. అందుకోసం రోడ్డు రవాణాకు ఆర్టీసీ ఉన్నట్లే.. జల రవాణాకు కూడా ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పడవ ప్రయాణాల నుంచి పర్యాటక జలరవాణా వరకు అంతా సురక్షితంగా, నియంత్రిత వ్యవస్థలో సాగేలా ఈసంస్థ పర్యవేక్షణ చేస్తుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని నదులు, కాలువలు, ఇతర జలవనరుల్లో రవాణా అంతటినీ దీని కిందకు తీసుకొస్తారు. ఈ శాఖే అక్కడ బోట్లను ఏర్పాటుచేస్తుంది. చార్జీలను నిర్ణయిస్తుం ది. ప్రయాణీకుల రక్షణకు జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రైవేట్‌ ఆపరేటర్లు సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల విషాదక ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
 
నదీ తీరాన గ్యారేజీలు
ప్రస్తుతం రాష్ట్రంలో బోట్ల నిర్వహణ గజిబిజిగా ఉంది. జలవనరులశాఖ, పర్యాటకశాఖ మధ్య సమన్వయం లేదు. ప్రైవే టు బోట్‌ ఆపరేటర్ల మీద నియంత్రణలేదు. ప్రమాదాలు నివారించే బాధ్యత ఏ శాఖది అన్న విషయంలోనూ స్పష్టత లేదు. మారుమూల ప్రాంతాల్లో జలరవాణాపై అసలేం జరుగుతుం దో ప్రభుత్వానికి తెలిసే పరిస్థితి లేదు. నాటు పడవల నుంచి ఇంజన్‌ పడవల వరకు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉంటున్నా యి. నడిచినంత కాలం బాగానే ఉంటున్నా.. ఏదైనా జరిగితే పరిస్థితి పెను విషాదమే. అందుకే మొత్తం జల రవాణా వ్యవస్థను ఒకే గూటికిందకు తేవాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని జలమార్గాలు.. జల రవాణా అంతా ఈసంస్థ కిందకు వస్తుంది. నిర్వహణ, ఆపరేషన్స్‌, మరమ్మతులు. జలరవాణా నిర్వహణ, అక్కడ జరిగే కార్యకలాపాలు చూడడమే కాకుండా... మరమ్మతులు కూడా ఈసంస్థ పరిధిలోకి తెస్తారు. మరమ్మతుల కోసం నదీ తీరప్రాంతాల్లోనే ప్రత్యేక గ్యారేజ్‌లను ఏర్పాటుచేస్తారు.
 
ప్రయాణికులకూ నిబంధనలు
సురక్షితమైన జలరవాణాకు ఒక మాన్యువల్‌ను రూపొందిస్తారు. సురక్షిత జలమార్గాల్లోనే రవాణా ఉండేలా చూస్తారు. జలరవాణా చేసే బోట్లకు ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. బోటు వచ్చే, బయల్దేరే సమయం అందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఫలానా సమయానికి బస్సు ఉందని ఇంటర్నెట్‌లో చూసినట్లుగా... ఈబోట్‌ల సమయాలను కూడా ముం దే చూసుకుని వెళ్లేలా ఏర్పాట్లుంటాయి. అదే సమయంలో మరో కీలకమైన అంశంపైనా ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రయాణీకులకు కూడా ఒక మాన్యువల్‌ ఉంటుంది. ఇంతమందికి మించి ప్రయాణీకులు బోటు ఎక్కకూడ దు? వరద సమయాల్లో, ప్రవాహం ప్రమాదకరం అనుకున్న సమయంలో బోటు వేయాలని ఒత్తిడి చేయకుండా ఉండేలా నిబంధనలు రూ పొందిస్తారు. వరదలు, ప్రమాదకర ప్రవాహాల సమయంలో రవాణా పూర్తిగా నిలిపేస్తారు. లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తారు. అధికారులు తమ పరిధిలోని జలరవాణా మొత్తాన్ని పర్యవేక్షిస్తారు.
 
టెక్నాలజీతో అనుసంధానం
జలరవాణాకు అధునాతన టెక్నాలజీని కూడా అనుసంధానం చేయాలనే ఆలోచన లో ఉన్నారు. నదుల మధ్యలో రవాణాలో ఉన్న బోట్లు ఏపాయింట్‌లో ఉన్నాయన్న విషయాలను జియోట్యాగింగ్‌ ద్వారా గుర్తించడం, ఏదైనా ప్రమాదం సంభవిస్తే సాంకేతికతను వినియోగించే అంశాలను పరిశీలిస్తున్నారు. ఇంగ్లండ్‌-ఫ్రాన్స్‌ మధ్యలోని డోవర్‌ స్టేట్‌ తీరంలో ఉన్న వ్యవస్థను దీనికోసం పరిశీలిస్తున్నారు.
 
కేరళ వ్యవస్థపై అధ్యయనం
కేరళ జలరవాణాకు పెట్టింది పేరు. ఆ రాష్ట్రంలోని అత్యధిక జిల్లాల్లో జలరవాణానే కీలకం. కేరళలో ఏటా 1.5 కోట్ల మంది జలరవాణా ద్వారా ప్రయాణం చేస్తుంటారు. అతి పెద్ద తీరప్రాంతం ఉన్నప్పటికీ ప్రమాదాలు బహు తక్కువ. ఆ నమూనాను కూడా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.
Link to comment
Share on other sites

మోడల్‌ జెట్టీ..మోడల్‌ బోట్‌
18-07-2018 03:58:33
 
 • ప్రమాదాల నివారణకు పర్యాటక శాఖ కసరత్తు
అమరావతి, జూలై 17(ఆంధ్రజ్యోతి): ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో బోటు ప్రమాదాలు భారీగా పెరిగాయి. ఈ ప్రభావం పర్యాటక శాఖపైనా పడింది. దీని నుంచి బయటపడేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సేఫ్‌ బోటిం గ్‌ వ్యవస్థతో పర్యాటకుల్లో భరోసా కల్పించేందుకు కొత్త ప్రణాళికలు సిద్ధం చేసింది. దేశంలోనే తొలిసారిగా మోడల్‌ జెట్టీలను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. మరో నెల రోజుల్లో పర్యాటక శాఖ వీటిని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. తొలుత విజయవాడలో పైలెట్‌ ప్రాజెక్టుగా మోడల్‌ జెట్టీల నిర్మాణం చేపట్టనున్నారు. దీని కోసం భవానీ ఐల్యాండ్‌తో పాటు పున్నమి, దుర్గాఘాట్‌లను ఎంపిక చేశారు. ఈ మోడల్‌ జెట్టీల వద్ద పర్యాటకులకు భద్రత పరమైన సమాచారం ఉంచుతారు. అలాగే, మోడల్‌ బోట్‌ను కూడా పరిచయం చేయాలని పర్యాటక శాఖ చూస్తోంది. ఈ మోడల్‌ బోటులో ఎయిర్‌ హోస్టెస్‌ మాదిరి తరహాలో బోట్‌ హోస్టె్‌సను నియమించనున్నారు.
Link to comment
Share on other sites

 • 2 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
 • Recently Browsing   0 members

  • No registered users viewing this page.
×
×
 • Create New...