Jump to content

GMR Plans Rs 2,500 crore New Port at Kakinada


Recommended Posts

కాకినాడ సెజ్‌కు పర్యావరణ అనుమతులు

ఈనాడు, దిల్లీ: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కోన గ్రామంలో జీఎంఆర్‌ సంస్థ ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ఆర్థికమండలి ఒకటో దశకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ పర్యావరణ, సీఆర్‌జడ్‌ అనుమతులు మంజూరు చేసింది. యేటా 16 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా జరిగేలా జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ ఇక్కడ ‘డీప్‌వాటర్‌ బహుళ ప్రయోజక ప్రత్యేక ఆర్థికమండలి’ని ఏర్పాటు చేస్తోంది. తొలిదశను 206 హెక్టార్లలో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. భవిష్యత్తు అవసరాల కోసం 609 హెక్టార్లు కేటాయించారు. ఇక్కడ గోదాములు, లాజిస్టిక్‌పార్కులు, షిప్‌బిల్డింగ్‌ తదితరాలు ఏర్పాటు చేస్తారు. రూ.2,123 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా 1,250 మందికి ప్రత్యక్షంగా, 1,500 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.

Link to comment
Share on other sites

జీఎంఆర్‌కే కాకినాడ గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు బిడ్‌!

ఈనాడు, అమరావతి: కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి(కేఎస్‌ఈజడ్‌)లో చేపట్టే గ్రీన్‌ఫీల్డ్‌ కమర్షియల్‌ ఓడరేవు బిడ్డును జీఎంఆర్‌ సంస్థ దక్కించుకోనున్నది. వార్షిక ఆదాయంలో 2.7 శాతాన్ని ప్రభుత్వానికి ఇచ్చేందుకు ముందుకు రావడంతో బిడ్‌ను ప్రాథమికంగా పరిశీలించిన అధికారులు త్వరలో మంత్రి మండలి ఆమోదం కోసం పెట్టనున్నారు. స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో చేపడుతున్న కమర్షియల్‌ ఓడరేవును దక్కించుకునేందుకు జీఎంఆర్‌తోపాటు అదాని గ్రూపు, కృష్ణపట్నం పోర్టు వేర్వేరుగా బిడ్లు దాఖలు చేశాయి. ఆదాయంలో 0.9 శాతం ఇచ్చేందుకు మొదట కోట్‌ చేసిన జీఎంఆర్‌ నిర్వాహకులు సంప్రదింపుల తరువాత దీన్ని 2.7 శాతానికి పెంచేందుకు ముందుకొచ్చినట్లు అధికార వర్గాలు ధ్రువీకరించాయి.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
On 6/10/2018 at 1:26 PM, ramntr said:

ఆ adani ki iche బదులు మన gmr ని encourage chesthe poddiga ports విషయం లో.. 

adani ki isthe  port ki     railway connectivity, road connectivity  modi fast gaa provide chestaadu

Link to comment
Share on other sites

నౌకాశ్రయ అభివృద్ధిలోకి జిఎంఆర్‌ ఇన్‌ఫ్రా
29-06-2018 00:41:44
 
636658297057965461.jpg
  • కాకినాడలో కమర్షియల్‌ పోర్టు అభివృద్ధి
  • స్విస్‌ చాలెంజ్‌ విధానంలో
  • బిడ్‌ దక్కించుకున్న సంస్థ
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : విద్యుదుత్పత్తి, విమానాశ్రయాలు, రహదారుల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న జిఎంఆర్‌ గ్రూప్‌ సంస్థ.. జిఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌.. పోర్టుల (నౌకాశ్రయ) అభివృద్ధిలోకి అడుగుపెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో కొత్త వాణిజ్య నౌకాశ్రయాన్ని (కమర్షియల్‌ పోర్టు) అభివృద్ధి చేయనున్నట్లు జిఎంఆర్‌ ఇన్‌ఫ్రా వెల్లడించింది. స్విచ్‌ చాలెంజ్‌ విధానం ద్వారా ఈ పోర్టుకు సంబంధించిన బిడ్‌ను గెలుచుకున్నట్లు తెలిపింది. కాకినాడ పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు జిఎంఆర్‌ ఇన్‌ఫ్రా పేర్కొంది. అన్ని వాతావరణాలకు తగ్గట్టుగా, డీప్‌ డ్రాఫ్ట్‌ (అత్యంత లోతైన), బహుళ కార్గో పోర్టుగా ప్రతిపాదిత నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది. వ్యూహాత్మక పారిశ్రామిక కారిడార్‌ అయిన విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో ఈ పోర్టు కీలకంగా ఉండనుందని పేర్కొంది. అలాగే అనుబంధ కారిడార్ల ద్వారా ఈ పోర్టు లబ్ది పొందనుందని తెలిపింది. ప్రతిపాదిత పోర్టు తూర్పు తీరంలో గేట్‌వేగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు జిఎంఆర్‌ ఇన్‌ఫ్రా వెల్లడించింది. పోర్టు వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చే నాటికి హ్యాండ్లింగ్‌ సామర్థ్యం 1.6 కోట్ల టన్నులుగా ఉండనుందని తెలిపింది.
 
ఒప్పందంలో భాగంగా పోర్టు ఆపరేటర్‌.. స్థూల రాబడుల్లో 2.7 శాతం మొత్తాన్ని 30 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెల్లించనుంది. ఆంధ్రప్రదేశ్‌ పోర్టు పాలసీలో భాగంగా పోర్టును సమీప జాతీయ రహదారితో అనుసంధానం చేసేందుకు రహదారుల అభివృద్ధి, నీటి సరఫరా సహా విద్యుత్‌ సరఫరాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందించనుంది. మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 200 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. భారత్‌ సహా అంతర్జాతీయంగా పేరొందిన జిఎంఆర్‌ గ్రూప్‌.. కొత్తగా నౌకాశ్రయాల అభివృద్ధిలోకి అడుగుపెట్టడం ద్వారా మరో మైలురాయిని చేరుకుందని జిఎంఆర్‌ ఇన్‌ఫ్రా బిజినెస్‌ చైర్మన్‌ బివిఎన్‌ రావు అన్నారు.
 
ఆర్ధికాభివృద్ధిలో ఈ రీజియన్‌ను మరింత వృద్ధిపథంలోకి తీసుకువెళ్లేందుకు ఈ పోర్టు ఎంతగానో దోహదపడనుందని తెలిపారు. ప్రతిపాదిత పోర్టు ఉండటంతో కీలకమైన ప్రాంతంలో ఉండటంతో ప్రతిష్ఠాత్మకమైన క్లయింట్లను ఆకట్టుకునే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బహుళ ఉత్పత్తుల ప్రత్యేక పెట్టుబడుల జోన్‌గా కాకినాడ స్పెషల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ రీజియన్‌ (కెఎ్‌సఐఆర్‌)ను 8,500 ఎకరాల్లో జిఎంఆర్‌ అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇన్వె్‌స్టమెంట్‌ జోన్‌లోనే భాగంగా 1,950 ఎకరాల్లో జిఎంఆర్‌.. ప్రతిపాదిత పోర్టును ఏర్పాటు చేస్తోంది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 weeks later...

GMR Group to develop commercial port at Kona

 
   

grabon.jpg

GMR Group to develop commercial port at Kona
GMR Group to develop commercial port at Kona
 
 
Amaravati: The GMR group has been selected by Andhra Pradesh government for development of commercial port at Kona village of Thondangi mandal in East Godavari district under public-private partnership (PPP) mode.
 
Adani Ports and SEZ Ltd, Navayuga Engineering Company Ltd and Bothra Shipping Services Pvt Ltd Consortium also competed for the commercial port development project.
 
 
 
 
 
 
 
 
 
 
Though the Adani Ports has emerged as highest bidder by quoting 1.10% of revenue share, the Kakinada SEZ Limited (GMR group), which is an Original Project Proponent (OPP) has finally agreed to improve their revenue share to 2.70 % of gross revenue. 
 
 
 
The Letter of Award (LoA) will be issued to the selected bidder - Kakinada SEZ Limited - after receipt of the security clearance from Union Ministry of Home Affairs.
 
Officials of AP Ports said that the port will be developed at a cost of Rs 2,123 crore. An oil cranker unit is expected to be set up at the port. “As the State government has to provide funds to set up the unit under viability gap funding (VGF) basis, the proposal has been in pending,” a senior official of port authority told The Hans India.
Link to comment
Share on other sites

GMR Infrastructure to set up port at Kona village



grabon.jpg

GMR Infrastructure to set up port at Kona village
GMR Infrastructure to set up port at Kona village
 
 
Rajamahendravaram: GMR Infrastructure Limited, the country's leading infrastructure group, will set up a port at Kona village, 30 kms away from Kakinada in East Godavari district with an estimated cost of Rs 200 crore.
 
Kakinada Special Economic Zone has selected GMR Infrastructure Ltd for constructing the commercial port. According to a press note released by 
its corporate communication wing, the greenfield commercial port will be developed through Swiss challenge mode and it will be an all-weather, deep draft and multi-cargo port.
 
The port is located on Vizag-Chennai Industrial Corridor and is expected to become the gateway to East Coast India as it is in a strategic place, and the operational capacity of port is 16 million metric tonnes.
 
 
 
 
 
 
 
 
 
 
A revenue share of 2.7 per cent in gross revenue goes to state government for a period of 30 years. Meanwhile, the government also gave its nod to provide basic facilities such as road connectivity to port from the national highway.
 
The port helps to strengthen economic base of region. The port will be spread in an area of 1,950 acres while the industrial parks in an area of 8,500 acres which houses a variety of industries such as pharmaceuticals, petrochemicals, food and agro processing, discrete manufacturing, electronics and renewable energy.
Link to comment
Share on other sites

  • 3 months later...
  • 1 month later...
జీఎమ్మార్‌ పోర్టుకు నేడు సీఎం శంకుస్థాపన
04-01-2019 03:11:27
 
కాకినాడ, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు కాకినాడ జేఎన్టీయూ క్రీడా మైదానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. రూ 3వేల కోట్లతో నిర్మించనున్న జీఎమ్మార్‌ గేట్‌వే పోర్టుకు, శ్రీకాకుళం టు కాకినాడ ఏపీజీడీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌, రూ 292 కోట్లతో రాజానగరం-సామర్లకోట ఏడీబీ రోడ్డు విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రూ 400 కోట్లతో కాకినాడ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు పనులతో పాటు.. రూ 296 కోట్లతో ఏలేరు ఆధునికీకరణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు.
Link to comment
Share on other sites

తూర్పుతీరంలో జీఎంఆర్‌ నౌకాశ్రయం 

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన 
హల్దియా పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు ఒప్పందం 
ఈనాడు - కాకినాడ

4business2a_2.jpg

తూర్పుతీరంలో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద గల కోన గ్రామంలో జీఎంఆర్‌ కాకినాడ గేట్‌వే పోర్ట్‌ లిమిటెడ్‌ నిర్మించనున్న నౌకాశ్రయానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం శంకుస్థాపన చేశారు. డీబీఎఫ్‌ఓటీ (డిజైన్‌, బిల్ట్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌) పద్ధతిలో ఈ నౌకాశ్రయం నిర్మాణానికి జీఎంఆర్‌ గ్రూపు సంస్థ అయిన కాకినాడ గేట్‌వే పోర్ట్‌ లిమిటెడ్‌ గత ఏడాది నవంబరులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి విదితమే. కాకినాడ సెజ్‌కు చెందిన 1811 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. సముద్రానికి అభిముఖంగా ఉన్న 133 ఎకరాల స్థలాన్ని ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. ఈ నౌకాశ్రయం నుంచి బొగ్గు, సాధారణ సరకులు, వంట నూనెలు, ముడి చమురు ఎగుమతి- దిగుమతికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీని నిర్మాణ వ్యయం రూ.3,000 కోట్లు. కొత్త నౌకాశ్రయం వల్ల కాకినాడ సెజ్‌లో పారిశ్రామిక కార్యకలాపాలు బహుముఖంగా విస్తరించే అవకాశం ఏర్పడుతుంది.

కాకినాడ సెజ్‌లో పెట్రోకెమికల్‌ ప్రాజెక్టు 
కాకినాడ సెజ్‌లో అతిపెద్ద పెట్రోకెమికల్‌ ప్రాజెక్టు రాబోతోంది. ప్రసిద్ధి చెందిన టీజీవీ గ్రూపు సంస్థ అయిన హల్దియా పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌ రిఫైనరీ/ పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ను జీఎంఆర్‌ గ్రూపునకు చెందిన కాకినాడ సెజ్‌లో ఏర్పాటు చేయటానికి శుక్రవారం కాకినాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. హల్దియా పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌ ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా వద్ద నాఫ్తా ఆధారిత అతిపెద్ద పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ నిర్వహిస్తోంది. ఈ సంస్థ తాజాగా కాకినాడ సెజ్‌లో ఏర్పాటు చేసే పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ వల్ల రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయి.

‘24 నెలల్లో పూర్తిచేయాలి’ 
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ నౌకాశ్రయ నిర్మాణాన్ని 24 నెలల్లో పూర్తిచేయాలని  కోరారు. ‘దేశంలో ఎక్కడా ఇలాంటి మౌలిక సదుపాయాలుండవు. జాతీయ రహదారి, రైల్వేస్టేషన్‌, విమానాశ్రయం, బీచ్‌ అన్నీ ఉన్నాయి’ అన్నారాయన. భవిష్యత్తులో రాష్ట్రంలోని నాలుగు ఉత్తమ నగరాల్లో ఒకటిగా కాకినాడ అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జీఎంఆర్‌ గ్రూపు దిల్లీ, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుల నిర్మాణాన్ని సమర్థంగా పూర్తిచేసినట్లు గుర్తుచేశారు. జీఎంఆర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ గ్రంధి మల్లికార్జునరావు మట్లాడుతూ  కాకినాడ సెజ్‌లో పెట్రో కెమికల్స్‌, వ్యవసాయ ప్రాసెసింగ్‌, ఎలక్ట్రానిక్‌, బొమ్మలు, క్రీడా సామగ్రి తయారీ పరిశ్రమలు వస్తాయన్నారు. ఈ ప్రాంతం జాతీయ, అంతర్జాతీయ వ్యాపార సంస్థలకు వేదిక కాబోతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, జీఎంఆర్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌, అర్బన్‌ ఇన్‌ఫ్రా విభాగ ఛైర్మన్‌ బీవీఎన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

 

 
 
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...