Jump to content

Anantapur politics


Recommended Posts

టీడీపీ, వైసీపీని వేధిస్తున్న వర్గ విబేధాలు
02-08-2018 18:27:58
 
636688312792820119.jpg
 
అనంతపురం: జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడేకొద్దీ... రాజకీయపార్టీలు వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నాయి. నేతలు ఇప్పటినుంచే గ్రామాల బాట పట్టి జనంలోకి వెళుతున్నారు. అధికారపార్టీ వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తుంటే.. గ్రూపు తగాదాలు కాస్త ఇరకాటంలో పెడుతున్నాయి. అటు వైసీపీలోనూ తారాస్థాయిలో తగాదాలున్నాయి.
 
అనంతపురం జిల్లాలో నేతలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ప్రధాన పార్టీల నేతలు.. క్యాడర్‌ను అప్రమత్తం చేస్తూ బూత్‌ కమిటీలు, వార్డు కమిటీలను ఏర్పాటుచేసుకునే పనిలో ఉన్నారు. ఇంటింటికి తెలుగుదేశం, గ్రామదర్శిని వంటి కార్యక్రమాలతో అధికారపార్టీ నేతలు జనంలోకి వెళుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి కంచుకోటగా నిల్చిన అనంతపురం జిల్లాలో మళ్లీ తమనే ఓటర్లు ఆదరిస్తారని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు గడపగడపకు వెళుతున్న వైసీసీ నేతలు నవరత్నాలపై ప్రచారం చేస్తున్నారు. మిగిలిన పార్టీలు కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.
 
వైఎస్ హయాంలో 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలాన్ని చాటుకుంటే.., రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీ అడ్రస్ గల్లంతయ్యింది. జిల్లాలో 14 అసెంబ్లీ , 2 లోక్‌సభ నియోజకవర్గాలుంటే.. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయఢంకా మోగించింది. 12 అసెంబ్లీ, రెండు లోక్‌సభ సీట్లను కైవసం చేసుకుంది. వైసీపీ టికెట్‌పై కదిరిలో చాంద్‌ భాషా, ఉరవకొండలో విశ్వేశ్వర్‌రెడ్డి గెలిచారు. అయితే.., చాంద్‌బాషా టీడీపీలో చేరడంతో...వైసీపీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే మిగిలారు. స్థానికపోరు విషయానికి వస్తే అనంతపురం జిల్లాలో మెజార్టీ సర్పంచ్‌లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు టీడీపీకి చెందినవారే ఉన్నారు. మున్సిపాల్టీల్లో కూడా అధికారపార్టీదే హవా. వైసీపీది రెండో స్థానం కాగా... కాంగ్రెస్‌, బీజేపీ, కమ్యునిస్ట్‌ పార్టీలది కేవలం నామమాత్రపు ప్రాతినిధ్యమే.
 
వచ్చే ఎన్నికల్లో ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు టీడీపీ, సత్తా చాటేందుకు వైసీపీ పయత్నిస్తున్నాయి. కానీ టీడీపీని గ్రూపు లుకలుకలు, వైసీపీని వర్గ విభేదాలు వేధిస్తున్నాయి. అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బాధ్యతలు తీసుకున్నాక గ్రూపు విభేదాల్ని కట్టడి చేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. కానీ కొత్తగా సమస్యలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
 
అనంతపురంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి ఎంపీ జేసీకి మధ్య దూరం పెరిగిపోయింది. ఎంపీ జేసీ తన పట్టు నిలుపుకోవడానికి శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. నగరం లో రోడ్ల విస్తరణ కోసం సీఎం దగ్గరకు వెళ్లి జీఓ తీసుకువచ్చారు. కానీ అది క్షేత్ర స్థాయిలో కార్యరూపం దాల్చలేదన్న అసంతృప్తి ఎంపీలో ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గుంతకల్లులో మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాను పార్టీలోకి చేర్చుకోవడం, అనంతపురంలో గురునాథరెడ్డికి అహుడా చైర్మెన్ పదవి ఇప్పించాలనే డిమాండ్లను సీఎం ముందు ఉంచారు జేసీ. దీనిపై అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌లను సీఎం పిలిపించి సముదాయించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ జేసీ పంతం నెగ్గుతుందా? లేదా? అనే విషయం భవిష్యత్తులో తేలనుంది. పైగా జిల్లాలో 2019 ఎన్నికలకు తాను అభ్యర్థుల జాబితాను ఇస్తానని, ఆ మేరకు టికెట్లు ఇస్తే టీడీపీ విజయదుందుభి మోగిస్తుందని జేసీ గతంలో ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న వారిలో చాలామంది ఓడిపోతారని మీడియా సమావేశాల్లో వెల్లడించడం, వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయనని ప్రకటించడం పార్టీ వర్గాల్లో కలకలం సృష్టించింది.
 
రాయదుర్గంలో మంత్రి కాలవ శ్రీనివాసులు చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా... అక్కడ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి వేరుగా పార్టీ వ్యవహారాలు నడపడం ఇబ్బందిగా మారింది. కదిరిలో ఎమ్మెల్యే చాంద్ బాషాకు, నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి కందికుంట ప్రసాద్‌కు మధ్య చాలా గ్యాప్ ఉంది. ధర్మవరంలో ఎమ్మెల్యే సూరి, మంత్రి సునీత వర్గానికి గ్యాప్ కొనసాగుతోంది. ఇలా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య గ్రూపు విబేదాలు కొనసాగుతున్నాయి. మరో వైపు ఎన్నడూ లేనివిధంగా టీడీపీ దిగువ శ్రేణి నేతలు కూడా కొందరు ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అన్నిరకాల పనులను ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులే చేయడం విమర్శలకు తావిస్తోంది.
 
అనంతపురం జిల్లాలో టీడీపీ తర్వాత బలంగా ఉన్న వైసీపీలోనూ వర్గ విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ నేతలు టికెట్ల కోసం పోటీపడుతూ ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. అయితే రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే టికెట్ల కోసం పోట్లాడుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మెజార్టీ అసెంబ్లీ స్థానాలకు వైసీపీ సమన్వయ కర్తలుగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు పనిచేస్తున్నారు. జగన్ నాలుగు రోజులకోసారి సమన్వయకర్తను మారుస్తూ పోవడం కూడా విమర్శలకు దారి తీస్తోంది. అనంతపురంలో సమన్వయకర్తగా ఉన్న గురునాథ రెడ్డి పార్టీని వీడటంతో నదీమ్ అహమ్మద్‌కు అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఆయన్ను తప్పించి అనంత వెంకటరామిరెడ్డికి అప్పగించారు. కాంగ్రెస్‌లో అన్నీ తానై పనిచేసిన మాజీ ఎంపీకి జిల్లాలో కీలక బాధ్యతలు అప్పగించకపోవడం... జగన్ రాజకీయ పరిణితిని ప్రశ్నించేలా చేస్తోంది.
 
కదిరి, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లోనూ వైసీపీ గ్రూపు విబేధాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అనంతపురంలో సక్సెస్‌ కాని నదీమ్‌ అహ్మద్‌ను హిందూపురం సమన్వయకర్తగా నియమించడం చర్చనీయాంశమైంది. నదీమ్‌ను మార్చడంపై మైనార్టీలు విమర్శలు గుప్పిస్తున్నారు. అనంతపురం పార్లమెటరీ నియోకవర్గానికి సమన్వయకర్తగా బోయ సామాజిక వర్గానికి చెందిన తలారి రంగయ్యను జగన్ నియమించారు. ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిన తలారి రంగయ్యకు రాజకీయ అనుభవం లేదు. కానీ బోయ సామాజికవర్గానికి చెందిన కాలవ శ్రీనివాసులును ఓటర్లు ఆదరించినట్లుగా తలారి రంగయ్యకు బ్రహ్మరథం పడతారని వైసీపీ భావిస్తోంది. అయితే కాలవ శ్రీనివాసులు తొలిసారి ఎంపీగా గెల్చారు. కానీ ఆ తర్వాత రెండుసార్లు ఎంపీగా పోటీచేసి ఓడిపోయారనేది వైసీపీ గుర్తించుకోవాలనే టాక్ నడుస్తోంది.
Link to comment
Share on other sites

ఆయన వైసీపీలోకి వెళతారనే ప్రచారం జోరుగా సాగడంతో...
02-08-2018 11:55:18
 
636688077190944412.jpg
  • నారా లోకేష్‌ను కలిసిన గుర్నాథరెడ్డి
  • అర్ధగంట పాటు ఏకాంత చర్చలు
అనంతపురం: మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. విజయవాడలో బుధవారం ఆయనతో ఏకాంతంగా అర్ధగంట పాటు చర్చలు జరిపారు. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి గుర్నాథరెడ్డి చేరిన విషయం విదితమే. అయితే ఇటీవల ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మళ్లీ వైసీపీలోకి వెళతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్‌ను గుర్నాథరెడ్డి కలిసి చర్చించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై గుర్నాథరెడ్డిని ప్రశ్నించగా.. తమ పార్టీ నాయకుడు కాబట్టి కలిసి.. పార్టీ విషయాలు మాట్లాడుకున్నామని, చురుగ్గా పనిచేయాలని సూచించారని తెలిపారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
టీడీపీ కంచుకోటలో లుకలుకలు
13-08-2018 10:57:14
 
636697546350971694.jpg
  • టీడీపీ ఎంపీపీపై అవిశ్వాస నోటీసు ఇచ్చిన ఆ పార్టీ కౌన్సిలర్లు
  • తెరవెనుక రాజకీయం నడుపుతున్న ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి
  • ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు
అనంతపురం: మండలాధ్య క్షురాలు పాల్తూరి పుష్పావతిపై అవిశ్వాసం పెట్టేందుకు అధికారికంగా ముహూర్తం ఖరారు అయినట్లు సమాచారం. ఈ నెల 25 లేదా 27 వ తేదీ విశ్వాస పరీక్ష పెట్టేందుకు అధికారులు నోటీసులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. నియో జకవర్గంలో చర్చనీయాం శంగా మారింది. ప్రస్తుతం ఎంపీపీగా ఉండే పాల్తూరి పుష్పావతిపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ఎంపీటీసీలు టీడీపీ వారే కావడం విశేషం. వాస్తవానికి ప్రస్తుతం ఎంపీపీగా ఉండే పాల్తూరి పుష్పావతి తొలి రెండున్నరేళ్లు పదవీ కాలం తరువాత స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకుని అదే టీడీపీకి చెందిన కాదలూరు మోహన్‌రెడ్డి భార్య కాదలూరు శైల జరెడ్డికి ఎంపీపీ పదవి ఇవ్వాలని అప్పుడు రాజకీయ ఒప్పందం కుదిరిందని ఎంపీటీసీలు అంటున్నారు.
 
 
అప్పడు పార్టీ ఇన్‌చార్జిగా ఉండే దీపక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ప్రస్తుత మంత్రి కాలవ శ్రీనివాసులు సమక్షం లోనే పదవీ కాల రాజకీయ ఒప్పందం కుదిరిం దన్న కొందరు ఎంపీటీసీలు తెలిపారు. అయితే ఎంపీపీ పదవి నుంచి దిగడానికి ఎంపీపీ పాల్తూరి పుష్పావతి భర్త మహబలి ససేమిరా అంటున్నట్లు సమాచారం. అప్పటి మాట ప్రకారం దిగిపోవాలని మంత్రి కాలవ శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్‌ పూల నాగరాజు ఎంపీపీకి చెప్పినా అయన మొండికేసి సీటును అతుక్కుని కూర్చున్నారు. దీంతో ఎంపీటీసీలు ఎంపీపీపై ఆవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. మండలంలో 13 ఎంపీటీసీ స్థానా లున్నాయి. వీటిలో 9 స్థానాలు టీడీపీ, 4 స్థానాలు వైసీపీకి దక్కాయి. అవి శ్వాసం నెగ్గాలంటే కనీసం ఏడుగురు సభ్యుల మ ద్దతు ఉండాలి.
 
 
తెర వెనుక రాజకీయం నడుపుతున్న ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి?
ఎంపీపీపై అవిశ్వాసం వెనుక ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి తెరవెనుక రాజకీయం నడుపుతున్నట్లు టీడీపీ వర్గీయులు బహిరంగంగా అంటున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఎంపీపీ పాల్తూరి పుష్పా వతి మహబలి దీపక్‌ రెడ్డి వర్గీయుడిగా ముద్రపడ్డారు. కాదలూరు మోహన్‌రెడ్డి కూడా దీపక్‌ రెడ్డి, ఎంపీ దివాకర్‌రెడ్డికి అనుకూలుడే. కానీ ఇక్కడ ఎంపీపీని దింపే విషయంలో అవిశ్వా సంలో పాల్తూరి మహబలి నెగ్గితే పరోక్షంగా దీపక్‌రెడ్డి గెలిచినట్టే. ఎలాగైనా మహబలి భార్య పుష్పావతిని ఎంపీపీ పదవిలో కొనసాగేలా చేయాలని దీపక్‌రెడ్డి రాజకీయ ఎత్తులు వేసు న్నారు. మహబలి వేసే ప్రతి రాజకీయ అడుగూ దీపక్‌రెడ్డి సలహాతోనే వేస్తున్నానని స్వయాన మహబలే బహిరంగంగా అంటున్నారు.
 
ఎంపీపీ దింపే విషయంలో కూడా మంత్రి గట్టిగా ఉన్నారు. అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి తన స్వ లాభం కోసం పార్టీ అడ్డుపెట్టుకుని లేని రాజకీ యం దీపక్‌రెడ్డి ఆడుతూ ప్రశాంతగా ఉండే నియోజక వర్గంలో గ్రూపులు కడుతున్నాడని కొందరు టీడీపీ సీనియర్‌ కార్యకర్తలు ముఖ్య మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గత నాలుగేళ్లగా ఎమ్మెల్సీగా ఉండి ఎనాడూ పెద్దగా పట్టించుకోని దీపక్‌రెడ్డి ఇప్పడు ఎందుకు టీడీపీ పార్టీనే టార్గెట్‌ చేస్తూ గ్రామాల్లో తిరుగుతున్నా రు. ఒక బీసీ మంత్రి ఉండే నియోజక వర్గంలో దీపక్‌రెడ్డి గ్రూపు రాజకీయ చేయడం భావ్యం కాదని కొందరు టీడీపీలో ఉండే బీసీ నాయకులు మండిపడుతున్నారు. మొత్తం మీద ఎంపీపీ అవి శ్వాసం రాజకీయం అసక్తిగా మారింది.
 
 
వైసీపీ పాత్ర ఎంత..?
డి.హీరేహాళ్‌ ఎంపీపీపై అవిశ్వాసం రోజు వైసీసీ పాత్ర ఏమిటి..? అనేది చర్చలు సాగు తున్నాయి. టీడీపీలో ఉండే గ్రూపు రాజకీయా లను వైసీపీ అనుకూలంగా మల్చుకో వాలనే ఎత్తులు వేస్తుంది. టీడీపీలో గ్రూపుల పెట్టి వీరిలో ఒకరి మన మద్దతు ఇస్తే వారిలో గ్రూపులు పెంచిన వాళ్లు అవుతామని దీని ఫలి తం రాబోవు రోజుల్లో రాజకీయం మనకు అను కూలంగా ఉండే అవకాశం ఉంటుందని వైసీపీ ప్రధాన నాయకులు ఎత్తులు వేస్తున్నారని సమా చారం. ఆదివారం బళ్లారిలో వైసీసీ నాయకులను ఒక టీడీపీ నాయకుడు కలిసి నాకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఇందుకు అవస రం అయితే వచ్చే రాజకీయ రోజుల్లో వైసీపీకి మద్దతుగా ఉంటామని బళ్లారిలోనే ఉండే ఒక టీడీపీ నాయకుడు వైసీపీ నాయకులతో అన్నట్లు విశ్వసనీయ సమాచారం.
 
 
కాదలూరు మోహన్‌రెడ్డికే ఎంపీ దివాకర్‌రెడ్డి మద్దతు.!
ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి పాల్లూరి మహబలికి మదత్తుగా ఉంటే.. ఆయన మామ ఎంపీ జెసీ దివాకర్‌రెడ్డి కాదలూరు మోహన్‌రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నట్లు సమాచారం. ఎంపీ దివాక ర్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి చేరినప్పుడు అప్పుడు కాంగ్రెస్‌లో ఉండే డి.హీరేహాళ్‌ మండ లంలో మిగిలిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో పాటు మోహన్‌రెడ్డి చేరాడు. దీంతో కాదలూరు మోహన్‌రెడ్డికి ఎంపీ మద్దతుగా నిలుస్తున్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ప్రకటన
13-08-2018 11:10:55
 
636697554557093539.jpg
  • వచ్చే ఎన్నికల్లో నా కుమారుడే ఎమ్మెల్యే అభ్యర్థి
తాడిపత్రి/అనంతపురం: వచ్చే ఎన్నికల్లో నా కుమారుడు అశ్మిత్‌రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల బడతాడంటూ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పట్టణంలోని కొత్త పెన్నా బ్రిడ్జి వద్ద నూతనంగా ఏర్పాటు చే యనున్న పార్కుకు ఆదివారం ఎమ్మెల్యే జేసీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నా మీద ఉన్న ప్రేమ, ఆదరాభిమానాలే నా కుమారుడి పట్ల చూపాలని కోరారు. అభివృద్ధి పనులు చేపట్టడంలో తనను తలపిస్తున్నాడని తెలిపారు. అనేక కార్యక్రమాలకు స్పర్శ స్వచ్చంధ సంస్థ ద్వారా చేయూతనందిస్తూ అభివృద్ధికి తో డ్పడుతున్నాడని తెలిపారు.
 
రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీచేస్తానని తెలిపారు. కౌన్సిలర్‌గా ఉండి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు పట్టణాభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు. మొదటినుంచీ తనకు ప్రజలే బలం, బలహీనత అన్నారు. వారి కారణంగానే తాను ఇంతవాడినయ్యానన్నారు. తన లక్షణాల ను పుణికి పుచ్చుకున్న జేసీ అశ్మిత్‌ కూడా ని యోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ రా ష్ట్రంలో ఇతర నియోజకవర్గాలకు మార్గదర్శకంగా నిలుస్తాడని తెలిపారు.
 
 
asmith-reddy.jpgనాన్న, పెదనాన్న కలలను నెరవేరుస్తా: జేసీ అశ్మిత్‌
నాన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి, పెదనాన్న జేసీ దివా కర్‌రెడ్డి కలలను నెరవేర్చడమే తన ఆశయమని ఎమ్మెల్యే తనయుడు జేసీ అశ్మిత్‌రెడ్డి అన్నారు. భవిష్యత్తులో పట్టణంలో సూపర్‌స్పెషాలిటీ హా స్పిటల్‌ ఏర్పాటుచేయాలన్న వారి ఆశయాలను నెరవేరుస్తానన్నారు. రానున్న కాలంలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో సౌకర్యాల మెరుగుతో పాటు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. పేదలకు మెరుగైన వైద్యం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషిచేస్తానని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటు లో ఉండి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు కృషిచేస్తానని తెలిపారు.
 
 
పార్కు నిర్మాణానికి పలువురి విరాళం
పార్కు నిర్మాణానికి ఎమ్మెల్యే జేసీ సమక్షంలో పలువురు విరాళాలను ప్రకటించారు. వారిలో స్పర్శ స్వచ్చంధ సంస్థ అధ్యక్షుడు జేసీ అశ్మిత్‌రెడ్డి రూ.10 లక్షలు, ప్రయివేటు స్కూల్‌ అసోసియే షన్‌ రూ. లక్ష, మార్కెట్‌యార్డు మాజీచైర్మన్‌ భోగాతి నారాయణరెడ్డి రూ. లక్ష, ఫ్లయాష్‌ బ్రిక్స్‌ యజమాని మధు రూ.25 వేలు చొప్పున విరా ళాలను ప్రకటించారు.
 
 
అల్పాహారం ఏర్పాటు
కొత్త పార్కు శంకుస్థాపన కోసం భారీగా తరలివచ్చిన వారికోసం ఎమ్మెల్యే జేసీ వివిధ రకాలతో కూడిన అల్పాహారాన్ని ఏర్పాటుచేశారు. ఉదయం 8 గంటలకే భారీగా జనాలు తరలివచ్చారు. వీరందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ జిలాన్‌బాషా, తాడిపత్రి నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్వీ రవీంద్రారెడ్డి, టౌన్‌బ్యాంకు అధ్యక్షుడు దద్దం సుబ్బరాయుడు, నాయకులు సూర్యముని, మార్కెట్‌యార్డుచైర్మన్‌ వేలూరు రాజశేఖర్‌నాయుడు, కమీషనర్‌ శివరా మక్రిష్ణ, తహసీల్దార్‌ యల్లమ్మ, ఇన్‌చార్జ్‌ డీఎస్పీ విజయ్‌కుమార్‌, ఎంఈఐ కరుణసాగర్‌రెడ్డి, పెన్నా సిమెంట్స్‌ జీఎం క్రిష్ణయాదవ్‌, సీజీఎం సుధాకర్‌రెడ్డి, మాజీకౌన్సిలర్‌ జగన్మోహన్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు, ఆర్‌ఎంపీలు, మాజీ సైనికోద్యోగులు, వైశ్యసంఘం, పద్మశాలీయ సేవాసమితి, ముస్లిం మైనార్టీ, దూదేకుల సంఘం, రోటరీ, లయన్స్‌క్లబ్‌ సభ్యులు, ప్రభుత్వ, ప్రయివేటుపాఠశాలల ఉపాధ్యాయులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

diwakar reddy gang ni party nundi tharimeyali abba. full corruption velladi ikkada. big flyovere contract SR constructions ki ippinchukoni full commissions thintunnadu diwakar reddy. ippudu old town lo kuda road contracts teesukoni commissions thinali ani chusthunnadu JC. ikkad prabhakar chowdary lekunte TDP ki intha manchi name vochi undedi kaadu. 

veedi corruption gurunchi telise CBN ekkada emantado ani maadi Reddy kulam. reddies votelu padalante naa cutout undali ani JC gaadu trick play chesthunnadu ikkada. 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
1 hour ago, Dravidict said:

Watching Prabhakar's interview for the first time. Konni chotla konchem ekkuva cheppukuntunnattu anipinchina, overall ga he looks like a genuine and straight forward guy. He has almost everything on his fingertips ?

https://youtu.be/LxaS0n2uHk8

He has done very good work when he was Municipal Chairman in late 1990s. He is somewhat mirror image of CBN in the style of work...may be magnitude is smaller

Link to comment
Share on other sites

On 8/13/2018 at 3:23 PM, Seniorfan said:

vaadiki vese reddy votes anni YCP ki vellai last time..... TDP votes tho gelichadu....

Valla jeevitham lo 10K majority tho gelavaledhu JC family. TDP valla ala gelicharu eesari. 

 

But MP kooda Anantapur lo gelusthundhi ani expect cheyaledhu. Alantidhi almost 1 lak majority ante really great. JC kooda baaga kastapaddadu elections time lo. We have to appreciate that. 

Link to comment
Share on other sites

  • 6 months later...
3 minutes ago, Seniorfan said:

Sriram ee elections lone poti cheyali....next time ki late avuthundhi.... JC gaadi youth tho baatu ... idhebest time....

Better to contest from Rapthaadu..anyway suneethamma vunna motham sreeram ee ga control chesedi

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...