Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

orvakal mega industrial corridor kurnool

Featured Replies

  • 4 weeks later...
  • Replies 99
  • Views 11.1k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • sonykongara
    sonykongara

    Japanese firm Yitoa Micro Technology Corporation signs MoU with Andhra Pradesh Govt to set up ₹14,000 crore semiconductor plant at Oravakallu Industrial Park, Kurnool

  • sonykongara
    sonykongara

  • sonykongara
    sonykongara

    జైరాజ్ ఇస్పాత్ నిగమ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది! ఓరవకల్లు, కర్నూలు

Posted Images

  • 1 month later...
  • 3 weeks later...
  • 3 weeks later...
  • Author

రూ.2,786 కోట్లతో ఓర్వకల్లు నోడ్‌!

Eenadu icon

By Andhra Pradesh News DeskPublished : 07 May 2026 05:48 IST

Ee

Font size

3 min read

మొదటి దశకు భూసేకరణ దాదాపుగా పూర్తి
అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు
2028 అక్టోబరు నాటికి పనులు పూర్తి
మాస్టర్‌ప్లాన్‌.. పర్యావరణ అనుమతులు పూర్తి
జీవీపీఆర్‌ ఇంజినీర్స్‌కు పనుల కేటాయింపు

AP06052026main-14a.webp

హైదరాబాద్‌- బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో (హెచ్‌బీఐసీ) భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఓర్వకల్లు నోడ్‌ నిర్మాణం జరుగుతోంది. మొదటి దశ భూసేకరణ దాదాపు పూర్తైంది. ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. రెండు దశల్లో ప్రాజెక్టును అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. మొదటి దశలో 2,621.22 ఎకరాల్లో పారిశ్రామిక మౌలిక సదుపాయాలను కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో ఇప్పటికే 2,513.55 ఎకరాల భూసేకరణ పూర్తయింది. ఇక్కడే 282 ఎకరాలను డ్రోన్‌ సిటీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది. రూ.2,786.10 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూపొందించిన ప్రతిపాదనలను క్యాబినెట్‌ కమిటీ ఆన్‌ ఎకనమిక్‌ ఎఫైర్స్‌ (సీసీఈఏ) ఆమోదించింది. ఇందులో రూ.1,771.19 కోట్లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఐసీడీసీ గ్రాంటుగా అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.1,014.91 కోట్ల విలువైన భూములను ప్రాజెక్టు కోసం సమకూర్చనుంది. ఇప్పటికే రూ.500.25 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ప్రాజెక్టును 2028 అక్టోబరు 30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పనులకు పిలిచిన టెండరును జీవీపీఆర్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ 6.8 శాతం అధికంగా కోట్‌చేసి (రూ.1,197.03 కోట్లు) దక్కించుకుంది. ఇక్కడ రిలయన్స్‌ బెవరేజస్‌తో పాటు పలు భారీ పరిశ్రమలకు ప్రభుత్వం ఇప్పటికే భూములు కేటాయించింది.


పర్యావరణ అనుమతులు..మాస్టర్‌ప్లాన్‌కు ఆమోదం

  • ప్రాజెక్టు మాస్టర్‌ ప్లాన్‌ను ఏపీ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌  అథారిటీ గతేడాది జులై 7న ఆమోదించింది. 

  • ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అనుమతులను కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. 

  • రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సీఎఫ్‌ఈ అనుమతులు ఇచ్చింది. 

AP06052026main-14b.webp


రూ.12 వేల కోట్ల పెట్టుబడులకు అవకాశం

మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా రూ.1,2000 కోట్ల విలువైన పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు     అవకాశం ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు.     వాటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 45 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. 

ఈ ప్రాంతంలో నాన్‌-మెటాలిక్‌ మినరల్స్, ఫార్మా, ఫుడ్‌ అండ్‌ ఆగ్రో, రసాయనాలు, టెక్స్‌టైల్‌ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా అధికారులు పేర్కొంటున్నారు. 


ఓర్వకల్లుకు కనెక్టివిటీ కోసం..

  • దూపాడు రైల్వే స్టేషన్‌ నుంచి ఓర్వకల్లు నోడ్‌ మీదుగా బేతంచర్ల వరకు రైల్వే లైన్‌ ఏర్పాటుకు డీపీఆర్‌ తయారీని రైల్వే శాఖ పూర్తి చేసింది.

  • జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌) 44, ఎన్‌హెచ్‌ 40లను కలుపుతూ వెల్దుర్తి నుంచి హుస్సేనాపురం వరకు సుమారు 34 కి.మీలు ప్రస్తుతం ఉన్న స్టేట్‌ వైవేని నాలుగు లేన్ల రహదారిగా విస్తరించేందుకు వీలుగా అధికారులు ప్రతిపాదించారు. 

  • శ్రీశైలం బ్యాక్‌ వాటర్స్‌ నుంచి 74 ఎంఎల్‌డీల నీటిని ఓర్వకల్లు నోడ్‌కు ముచ్చుమర్రి దగ్గర నుంచి తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందుకోసం 54.74 కి.మీ.ల పైప్‌లైను పనులను గుత్తేదారుకు టెండరు ద్వారా కేటాయించారు. 


డ్రోన్‌సిటీకి ప్రత్యేకంగా కేటాయింపు

ఓర్వకల్లు నోడ్‌ అభివృద్ధి కోసం కేటాయించిన భూముల్లో డ్రోన్‌ సిటీ కోసం 282 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 500కు పైగా సంస్థల ఏర్పాటుకు అవకాశం కల్పించడం ద్వారా సుమారు 40,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.


ఈనాడు, అమరావతి

  • 1 month later...

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.