May 24, 20251 yr Author ప్యూర్ సంస్థకు ప్రత్యేక ప్రోత్సాహకాలకు అనుమతి ప్యూర్ ఎనర్జీ లిమిటెడ్‌కు టైలర్ మేడ్ ఇన్సెంటివ్‌లు చెల్లించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ యూనిట్‌ను రూ.1,286 కోట్లతో ఏర్పాటు చేసేందుకు సంస్థ ప్రతిపాదనను ఎస్‌ఐపీబీ ఆమోదించింది. By Andhra Pradesh News DeskPublished : 24 May 2025 04:09 IST Ee Font size 1 min read ఈనాడు, అమరావతి: ప్యూర్ ఎనర్జీ లిమిటెడ్‌కు టైలర్ మేడ్ ఇన్సెంటివ్‌లు చెల్లించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ యూనిట్‌ను రూ.1,286 కోట్లతో ఏర్పాటు చేసేందుకు సంస్థ ప్రతిపాదనను ఎస్‌ఐపీబీ ఆమోదించింది. ఆ సంస్థకు ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో 105.12 ఎకరాలను కేటాయించింది. రెండు దశల్లో ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఆ సంస్థ స్థిర మూలధన పెట్టుబడి కింద 2028 డిసెంబరు నాటికి పెట్టే రూ.1,019 కోట్ల పెట్టుబడుల్లో 34.6 శాతం టైలర్ మేడ్ ఇన్సెంటివ్‌ల కింద చెల్లించాలని నిర్ణయించింది. ఈ మొత్తాన్ని 10 ఏళ్లలో చెల్లించేందుకు అనుమతించింది. ఆ సంస్థ కల్పించే ఉపాధికి ప్రోత్సాహకాల కింద గరిష్ఠంగా రూ.39.84 కోట్లు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ కింద రూ.25 కోట్లు (ఎఫ్‌సీఐ మొత్తంపై గరిష్ఠంగా 5 శాతం), జీఎస్టీ మినహాయింపుల కింద రూ.82.63 కోట్లతో పాటు వినియోగించిన విద్యుత్తుకు యూనిట్‌కు రూపాయి చొప్పున ఏడేళ్ల పాటు గరిష్ఠంగా రూ.2.80 కోట్లు రాయితీ ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతించింది. బ్లూ జెట్ హెల్త్‌కేర్‌కు .. బ్లూ జెట్ హెల్త్‌కేర్ లిమిటెడ్‌కు ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రోత్సాహకాలు అందించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 3 దశల్లో రూ.2,600 కోట్ల పెట్టుబడులతో ఇంటర్మీడియట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. పరిశ్రమ ఏర్పాటు ద్వారా సుమారు 1,250 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. సంస్థకు 102.48 ఎకరాలను కేటాయించేందుకు నిర్ణయించింది. మూలధన రాయితీ కింద 30 శాతం (గరిష్ఠంగా రూ.316.5 కోట్లు), డీ కార్బనైజేషన్ సబ్సిడీ రూ.87 కోట్లు, ఐదేళ్లలో లోకల్ ప్రొక్యూర్‌మెంట్ రాయితీ కింద గరిష్ఠంగా రూ.32.83 కోట్లతో పాటు మరికొన్ని మినహాయింపులు ఇచ్చేందుకు అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
May 24, 20251 yr Author కర్నూలు నుంచి అనంతపురం వరకు మెగా పారిశ్రామిక కారిడార్ కర్నూలు నుంచి అనంతపురం వరకు మెగా పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. By Andhra Pradesh News DeskPublished : 24 May 2025 05:17 IST Ee Font size 1 min read మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన చేస్తున్న మంత్రి టీజీ భరత్ తదితరులు ఈనాడు, కర్నూలు: కర్నూలు నుంచి అనంతపురం వరకు మెగా పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని 19వ వార్డులో రూ.12.28 కోట్ల విలువైన 31 అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఓర్వకల్లు మెగా పారిశ్రామిక హబ్‌లో రూ.14 వేల కోట్లతో నిర్మించే సెమీ కండక్టర్ పరిశ్రమకు త్వరలో శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అక్కడే రూ.వెయ్యి కోట్లతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమ రాబోతోందని చెప్పారు. రూ.2,065 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తిల్లో పారిశ్రామిక నోడ్ల అభివృద్ధికి టెండర్లు పిలుస్తున్నామని, రెండేళ్లలో ఆ పనులు పూర్తవుతాయని వెల్లడించారు.
May 30, 20251 yr Author సెన్సోరెమ్’కు 25 ఎకరాల కేటాయింపు ఈనాడు, అమరావతి: కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కాంటాక్ట్ ఇమేజ్ సెన్సర్ మాడ్యూల్స్ ప్యాకింగ్, ఇన్‌ఫ్రారెడ్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ కోసం సెన్సోరెమ్ ఫొటోనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు 25 ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు కోసం ఆ సంస్థ రూ.1,057.92 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా 622 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఏపీ సెమి కండక్టర్ అండ్ డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ కింద టైలర్‌మేడ్ విధానంలో ప్రోత్సాహకాలు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతించింది.
June 4, 20251 yr Author ఓర్వకల్లు..పరిశ్రమల ఇల్లు ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో ‘ఉపాధి’ మెట్లకు అడుగులు పడుతున్నాయి. ఇక్కడ 2,621 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్రం ముందుకొచ్చింది. By Andhra Pradesh Dist. DeskPublished : 04 Jun 2025 03:51 IST Ee Font size 3 min read 2,621 ఎకరాల్లో మౌలిక వసతులు టెండర్లు ఆహ్వానించిన ఎన్‌ఐసీడీసీ ముందుకొచ్చిన బడా కంపెనీలు ఆగస్టు రెండో వారంలో పనులు పారిశ్రామిక వాడకు కేటాయించిన భూములు కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో ‘ఉపాధి’ మెట్లకు అడుగులు పడుతున్నాయి. ఇక్కడ 2,621 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్రం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఐసీడీసీ) ఇటీవల టెండర్లు ఆహ్వానించింది. ఎల్‌అండ్‌టీ, మాంటెకార్లో, సెల్‌కాన్ వంటి 16 బడా సంస్థలు పాల్గొన్నాయి. త్వరలో టెండర్లు ఖరారుకానున్నాయి. పనుల ప్రారంభానికి ఆగస్టు రెండో వారంలో భూమి పూజ చేయనున్నారు. అక్కడ ఇప్పటికే 5, 10, 20, 30 ఎకరాల విస్తీర్ణాల్లో ప్లాట్లు ఉన్నాయి. రహదారులు, డ్రైనేజీ, విద్యుత్తు, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, అక్కడక్కడ కాలువలు, వంతెనలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఆయా పనులు రెండేళ్లలో పూర్తి చేయనున్నారు. రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి ఓర్వకల్లులో పారిశ్రామికవాడను అభివృద్ధి చేయాలని 2017-18లో తెదేపా నిర్ణయించింది. 9,750 ఎకరాలు సేకరించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా పట్టించుకోలేదు. ‘కూటమి’ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దృష్టి సారించింది. కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి కేంద్రం పచ్చజెండా ఊపింది. రూ.1,000 కోట్లు వెచ్చించి 2,621 ఎకరాలను అభివృద్ధి చేయనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. కేంద్రం వెయ్యి కోట్ల నిధులు వెచ్చిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 శాతంతో అభివృద్ధి పనులకు సహకారాన్ని అందిస్తున్నాయి. ముచ్చుమర్రి నుంచి నీటి సరఫరా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్‌కు 0.94 టీఎంసీల నీరు అవసరం అవుతుంది. ముచ్చుమర్రి నుంచి 54.74 కి.మీ. మేర పైపులైన్ నిర్మించి నీటిని సరఫరా చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు 70 శాతం పూర్తయ్యాయి. నాలుగు నెలల్లో మిగిలిన 16 కి.మీ. మేర పైపులైన్ పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకొన్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్‌కు సమీపంలో విమానాశ్రయం ఉండటంతో పారిశ్రామికవేత్తలు రావడానికి మార్గం అనుకూలంగా ఉంది. ఇటీవల విజయవాడకు సర్వీసును ప్రారంభించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి పరిశ్రమల యజమానులు ఓర్వకల్లు కారిడార్ సందర్శనకు వస్తున్నారు. రైలు మార్గం సుగమం కల్లూరు మండలం దూపాడు నుంచి వయా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ సమీపం నుంచి బేతంచెర్ల వరకు రైల్వేలైన్ ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం చేశారు. భూసేకరణ చేపట్టాల్సి ఉంది. 57 కి.మీ. మేర నిర్మించే ఈ రైల్వే లైన్‌కు కేంద్రం నిధులు ఇవ్వనుంది. తరలొస్తున్న పరిశ్రమలు హైదరాబాద్‌కు చెందిన ఫ్యూర్ ఇ.వి. ఎలక్ట్రానిక్ బైక్‌ల సంస్థ రూ.1,200 కోట్లతో వంద ఎకరాల్లో ఈ-బైక్‌ల పరిశ్రమను నెలకొల్పనుంది. ఈ సంస్థ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. డ్రోన్ పరిశ్రమ ఏర్పాటుకు మూడు వందల ఎకరాలు కేటాయించారు. సిగాచి పరిశ్రమ కొలువుదీరనుంది. అదేవిధంగా వంద ఎకరాల్లో రూ.వెయ్యి కోట్లతో మరో ఫార్మా కంపెనీ నెలకొల్పేందుకు అడుగులు పడుతున్నాయి. గుట్టపాడు సమీపంలో రూ.3 వేల కోట్లతో జైరాజ్ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమను నెలకొల్పారు. ప్రస్తుతం ఉత్పత్తిని ప్రారంభించారు. నిత్యం 24 గంటల పాటు నిరంతరాయంగా పరిశ్రమ నడుస్తోంది. ఏడాదికి 0.375 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం. ఇక్కడ ఉత్పత్తయిన స్టీల్‌ను హైదరాబాద్‌కు ఎగుమతి చేస్తున్నారు.
June 12, 20251 yr Author సీమ ద్వారం.. పరిశ్రమ నాదం తుంగభద్ర.. కృష్ణమ్మ ప్రవహిస్తున్న నేల.. విలువైన ఖనిజాలు ఉన్న ఖిల్లా.. హైదరాబాద్-బెంగళూరు నగరాల మధ్యనున్న ప్రాంతం.. ఒకప్పుడు ‘సిరి’సంపదలతో తులతూగిన సీమ ముఖ ద్వారం.. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ఇసుమంత అభివృద్ధి చేయలేదు. By Andhra Pradesh Dist. DeskUpdated : 12 Jun 2025 06:23 IST Ee Font size 4 min read పారిశ్రామికవాడకు రూ.2786.10 కోట్లు ఏడాదిలోనే పెట్టుబడుల వెల్లువ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పిన్నాపురం గ్రీన్‌కో ప్రాజెక్టు స్వరూపం ఈనాడు, కర్నూలు : తుంగభద్ర.. కృష్ణమ్మ ప్రవహిస్తున్న నేల.. విలువైన ఖనిజాలు ఉన్న ఖిల్లా.. హైదరాబాద్-బెంగళూరు నగరాల మధ్యనున్న ప్రాంతం.. ఒకప్పుడు ‘సిరి’సంపదలతో తులతూగిన సీమ ముఖ ద్వారం.. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ఇసుమంత అభివృద్ధి చేయలేదు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సీమ పారిశ్రామిక ప్రగతి దిశగా అడుగులు వేస్తోంది. ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను రూ.2786.10 కోట్లతో అభివృద్ధి చేసే పనులకు అడుగులు పడుతున్నాయి. 2,624.64 ఎకరాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు ఇటీవల టెండర్లు పిలిచారు. పనులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్’(నిక్‌డిట్)తో ఒప్పందం కుదుర్చుకొంది. తొలిదశ పనుల్లో భాగంగా పారిశ్రామికవాడలోని 517 ఎకరాల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులను మొదలుపెట్టనున్నారు. ఇక్కడ పదివేల ఎకరాలు అందుబాటులో ఉండటంతో దశలవారీగా మిగిలిన భూముల్లోనూ పలు రకాల పరిశ్రమలు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ‘పోగు’ ఉపాధి పేగు చేనేతపురిలో పారిశ్రామిక వెలుగులు కాంతులీననున్నాయి. ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో బనవాసిఫారం వద్ద టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు 77 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. రూ.20 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఓ పారిశ్రామికవేత్త ముందుకొచ్చారు. 25 ఎకరాల్లో పరిశ్రమలను నెలకొల్పనున్నారు. సౌర.. పవన విద్యుత్తు ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల పరిధిలో 1680 మెగావాట్ల సామర్థ్యంతో సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణానికి ఒప్పందాలు జరిగాయి. వాటి నిర్మాణం పూర్తైతే ఆ ప్రాంతంలోని పలువురికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దీంతోపాటు ఆయా సంస్థలు కూడా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. నియోజకవర్గానికో ఎంఎస్‌ఎంఈ పార్కు ఓర్వకల్లు మండలం గుట్టపాడు క్లస్టర్‌లో 167 ఎకరాల్లో ప్లాట్లు వేయగా.. డోన్ నియోజకవర్గం జగదుర్తిలో 25 ఎకరాల్లో పార్కును అభివృద్ధి చేశారు. ఈ రెండు ఎంఎస్‌ఎంఈ పార్కులకు సంబంధించిన ప్లాట్లను ఇప్పటికే ఏపీఐఐసీ వారు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. ఒక ఎకరాకు పది మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. మంత్రాలయం నియోజకవర్గంలో 30 ఎకరాల్లో, కోడుమూరులో 50 ఎకరాలు, ఆలూరులో 10 ఎకరాల్లో, ఆళ్లగడ్డలో 40 ఎకరాల్లో త్వరలో ఎంఎస్‌ఎంఈ పార్కులు రాబోతున్నాయి. బ్రాహ్మణపల్లె ఎంఎస్‌ఎంఈ పార్కులో ముగ్గురు, ఇటిక్యాలలో ఒకరు, తంగడంచలో ఒకరు పరిశ్రమలను నెలకొల్పేందుకు ముందుకొచ్చారు. ఎగరనున్న డ్రోన్లు డ్రోన్ హబ్‌ను ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 300 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ రూ.వెయ్యి కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.. ఐదువేల మందికి ఉద్యోగాలొచ్చే అవకాశం ఉంది. ‘ఈవీ పార్కు’ రయ్.. రయ్ ఎలక్ట్రిక్ వాహనాలు జిల్లాలో తయారు చేయనున్నారు. ఓర్వకల్లులో 1200 ఎకరాల్లో రూ.13 వేల కోట్లతో ‘ఈవీపార్క్’ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదిరింది. ఈ పార్కులో దశలవారీగా 25వేల మందికి ఉపాధి లభించనుంది. ఇందులో పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తొలిదశలో 300 ఎకరాల్లో ఈవీ మొబిలిటీ పార్కును ఏర్పాటు చేయనున్నారు. 130 ఎకరాలు.. రూ.14 వేల కోట్ల పెట్టుబడి జపాన్‌కు చెందిన ఇటోయె మైక్రో టెక్నాలజీ కార్పొరేషన్, దేశానికి చెందిన హైడ్రెస్ గ్రూప్, బీఎన్ గ్రూప్‌లు సంయుక్తంగా రూ.14 వేల కోట్లతో సెమీకండక్టర్ తయారీ పరిశ్రమను ఓర్వకల్లులో నెలకొల్పనున్నారు. 130 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమ వల్ల రెండు వేల మందికి ప్రత్యక్షంగా, 10 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. బెవరేజెస్ యూనిట్ రూ.1,622 కోట్ల పెట్టుబడులతో బెవరేజెస్ యూనిట్ ఏర్పాటుకు ఫార్చ్యూన్-500 జాబితా కంపెనీ రిలయన్స్ ఆసక్తి కనబరుస్తోంది. కర్నూలు జిల్లాలో ఏర్పాటుకు డీపీఆర్‌ను ప్రభుత్వానికి సమర్పించింది. అందులో ప్యాకేజ్డ్ కార్బొనేటెడ్ సాఫ్ట్‌డ్రింక్‌లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారు చేయనున్నారు. టమాటా శుద్ధి... రైతు వృద్ధి పత్తికొండ సమీపంలోని దూదెకొండలో రూ.11 కోట్లతో టమాటా ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. దీన్ని మరో నాలుగు నెలల్లో పూర్తి చేయనున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాలో 25 వేల ఎకరాల్లో టమాటా పండించే రైతులకు మేలుచేకరూనుంది. గ్రీన్‌కో కాంతులు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా సౌర, వాయు, జలవనరులను ఉపయోగించి ఒకేచోట ఏకంగా ఆరువేల మెగావాట్ల విద్యుత్తును జిల్లాలో ఉత్పత్తి చేయనున్నారు. ప్రపంచంలోనే తొలి ‘సమీకృత పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు’ (ఐఆర్‌ఈపీ)ను గ్రీన్‌కో సంస్థ పిన్నాపురంలో నిర్మిస్తోంది. ఏకంగా రూ.24వేల కోట్లతో చేపడుతున్న ప్రాజెక్టు పనులు చివరి దశకొచ్చాయి.
June 26, 20251 yr Author కర్నూలు సమీపంలో రిలయన్స్ భారీ పరిశ్రమ.. భూమి కేటాయించిన ప్రభుత్వం By Andhra Pradesh News TeamPublished : 26 Jun 2025 21:20 IST Ee Font size 1 min read అమరావతి: కర్నూలు సమీపంలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు రిలయన్స్ సంస్థకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.1622 కోట్ల పెట్టుబడితో శీతలపానియాలు, జ్యూస్‌లు, డ్రింకింగ్ వాటర్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమ ఏర్పాటుతో స్థానికంగా 1200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆదేశాల్లో సర్కారు తెలిపింది. పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనలను ఈనెల 19న సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదం లభించింది. కర్నూలు సమీపంలోని ఓర్వకల్లులో ఎపీఐఐసీ ల్యాండ్ బ్యాంక్‌లో పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. ప్లాంట్ ఏర్పాటు కోసం ఎకరా రూ.30 లక్షల చొప్పున 80 ఎకరాల భూమి కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఎపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ప్రకారం ప్రోత్సాహకాలు సైతం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించాలని ఉత్తర్వుల్లో రిలయన్స్ సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఎపీఐఐసీ చైర్మన్, ఎండీని ఆదేశిస్తూ పరిశ్రమలు, వాణిజ్య విభాగం కార్యదర్శి చిరంజీవి చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు.
September 9, 2025Sep 9 Author TG Bharath: కర్నూలులో రూ.6 వేల కోట్లతో మరో పరిశ్రమ By Andhra Pradesh News DeskUpdated : 09 Sep 2025 06:28 IST Ee Font size 1 min read మంత్రి టీజీ భరత్ ఈనాడు, కర్నూలు: కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో త్వరలో రూ.6 వేల కోట్లతో ఓ పరిశ్రమ ఏర్పాటుకానుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. కర్నూలులో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’పై సోమవారం నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. కర్నూలులో పెట్టుబడి పెట్టేందుకు అంగీకరిస్తూ ఓ సంస్థ తనకు సమాచారం ఇచ్చిందని, ప్రభుత్వంతో అధికారిక ఒప్పందం కుదుర్చుకునేముందు ఆ సంస్థ పేరు వెల్లడిస్తానని చెప్పారు. పరిశ్రమల శాఖ నుంచి రావాల్సిన అనుమతులు, సింగిల్ విండో పద్ధతిలో ఆన్‌లైన్‌లో చేసిన దరఖాస్తులకు అనుమతులు వేగంగా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన రాయితీలను త్వరలోనే విడుదల చేస్తామన్నారు. కర్నూలులో ఇప్పటికే రూ.పది వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఖరారయ్యాయని గుర్తుచేశారు. దీంతోపాటు రూ.1,600 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ప్రారంభించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుమతులు తీసుకుందని.. ఆ పరిశ్రమను మరో రూ.1,300 కోట్లతో విస్తరించాలని సంస్థ నిర్ణయించిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ కారణంగా 15 నెలల్లో రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలొస్తాయని మంత్రి భరత్ చెప్పారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
October 12, 2025Oct 12 Author Orvakal: రాష్ట్రప్రభుత్వ చొరవ, కేంద్ర సహకారంతో.. రూ.వేల కోట్ల పెట్టుబడులు By Andhra Pradesh News TeamPublished : 12 Oct 2025 04:24 IST Ee Font size 2 min read ఓర్వకల్లు నోడ్‌లో అధికారిక ఒప్పందాల విలువ రూ.29,427.25 కోట్లు మరో రూ.6వేల కోట్ల ఒప్పందానికి రంగం సిద్ధం ప్రధాని మోదీ రాకతో మరింత ప్రాధాన్యం ఓర్వకల్లు సమీపంలోని గుట్టపాడులో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న జైరాజ్ ఇస్పాత్ పరిశ్రమ ఈనాడు-కర్నూలు, న్యూస్‌టుడే-ఓర్వకల్లు: కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకుని పలు ప్రాజెక్టులను ప్రతిపాదించడం, వాటి సాకారానికి కేంద్రం సహకరిస్తుండడంతో కర్నూలు జిల్లా ప్రగతిపథంలో పరుగులు పెట్టనుంది. హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక నడవా (హెచ్‌బీఐసీ) పరిధిలో ఓర్వకల్లు నోడ్ అభివృద్ధికి కేంద్రం తొలివిడతగా రూ.వెయ్యి కోట్లు కేటాయించడంతో ఆ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందడానికి మార్గం సుగమమైంది. ప్రధాని మోదీ ఓర్వకల్లు వస్తున్న నేపథ్యంలో రూ.29వేల కోట్ల పైచిలుకు పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటుకాబోతున్న పారిశ్రామిక ప్రాంతాన్ని సందర్శిస్తారని చెబుతున్నారు. రాయలసీమకు ఎకనమిక్ గ్రోత్ కారిడార్ ఏర్పాటుచేయాలని, నెల్లూరు, రాయలసీమ జిల్లాలను ఎకనమిక్ డెవలప్‌మెంట్ రీజియన్‌గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దీంతో కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని మెగా ఇండస్ట్రియల్ హబ్ ప్రాంతానికి మరింత మహర్దశ పట్టేలా ఉంది. మొత్తం ఐదువేల ఎకరాల్లో ఓర్వకల్లు నోడ్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. తొలిదశలో 2,471 ఎకరాలను పరిశ్రమలకు వీలుగా అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం మొత్తం రూ.2,870.39 కోట్లు వెచ్చిస్తారు. ఇందులో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తుండడంతో పాటు పలు ఒప్పందాలు కూడా జరిగాయి. జపాన్‌కు చెందిన ఇటోయే మైక్రో టెక్నాలజీ కార్పొరేషన్, భారత్‌కు చెందిన హైడ్రస్, బీఎస్ గ్రూప్‌లు కలిపి మొత్తం రూ.14వేల కోట్లతో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో 2వేల మందికి ప్రత్యక్షంగా, 12వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. కర్నూలును ఈవీ హబ్‌గా మార్చడానికి వీలుగా ‘ఈవీ పార్క్’ను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. 1200 ఎకరాల్లో ఏర్పాటుకాబోయేప్రాజెక్టులో మొత్తం రూ.13వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సంస్థ రూ.758 కోట్ల పెట్టుబడితో పలురకాల ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఓర్వకల్లులో ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఈ సంస్థ 500 మందికి ఉపాధి కల్పిస్తుంది. మహిళలతో పలు కుటీర పరిశ్రమలు పెట్టించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది, వేలమంది మహిళలకు ఉపాధి కల్పించడంలో కీలకపాత్ర పోషిస్తున్న అలీప్ సంస్థ కూడా ఓర్వకల్లులో ఒక రూ.36.25 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఓర్వకల్లులో రూ.6వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఓ సంస్థ ముందుకొచ్చింది. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి త్వరలో కార్గో, ఎం.ఆర్.ఒ., సిమ్యులేటర్ సేవలనూ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయ అభివృద్ధికి ప్రస్తుత ప్రభుత్వం రూ.10 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. కర్నూలు నుంచి దూపాడు, ఓర్వకల్లు మీదుగా బేతంచెర్లకు కొత్త రైల్వేలైను నిర్మాణానికి రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. ఓర్వకల్లు సమీపంలోని గుట్టపాడులో జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమను 350 ఎకరాల్లో రూ.1600 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేశారు. ఓర్వకల్లు సమీపంలోని కాల్వ గ్రామంలో ఉన్న ఫ్రెష్‌బౌల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను రూ.33 కోట్లతో విస్తరించనున్నారు.
October 15, 2025Oct 15 Author కర్నూలులో యాక్సెల్ ఈఎస్‌జీ డ్రోన్ల తయారీ యూనిట్ By Andhra Pradesh News TeamPublished : 15 Oct 2025 05:34 IST Ee Font size 1 min read ఈనాడు, అమరావతి: కర్నూలు జిల్లాలో డ్రోన్‌లు, సెన్సర్‌లు, బయోచార్ తయారీ యూనిట్ ఏర్పాటుకు యాక్సెల్ ఈఎస్‌జీ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు 80 ఎకరాల భూములు కేటాయించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూనిట్ మొదటి దశలో రూ.75 కోట్ల పెట్టుబడులు సంస్థ పెట్టనుంది. 700 మందికి ఉపాధి లభిస్తుందని ప్రతిపాదనల్లో పేర్కొంది. ఎకరా రూ.లక్ష చొప్పున రాయితీ ధరకు ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రాజెక్టు మొదటి దశ పనులను 18 నెలల్లో పూర్తి చేయాలని నిర్దేశించింది. మూడు దశల్లో కలిపి రూ.300 కోట్ల పెట్టుబడులు సంస్థ పెడుతుందని.. 3,000 మందికి ఉపాధి కల్పించనున్నట్ల్లు పేర్కొంది.
Create an account or sign in to comment