Jump to content

కేసీఆర్‌ కూటమికి పవార్‌ అడ్డు చక్రం!


Recommended Posts

భాజపాయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే యత్నంలో ఎన్సీసీ అధినేత 
27న శరద్‌ ఇంట భేటీకి మమతా, అఖిలేశ్‌ తదితరులు 
తెరాస మూడో కూటమి ఆశలకు ఈ సమావేశ ఫలితమే కీలకం! 

Link to comment
Share on other sites

దేశంలో కాంగ్రెస్సేతర, భాజపాయేతర పార్టీలతో మూడో కూటమిని పట్టాలెక్కించాలని భావిస్తున్న తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ యత్నాలకు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ అవరోధంగా నిలవనున్నారా? మరాఠా నేత ఈ నెల 27న దిల్లీలో నిర్వహిస్తున్న భాజపాయేతర పక్షాల సమావేశం నుంచి వెలువడే రాజకీయ సందేశమే ఈ అంశాన్ని నిర్ణయిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో భాజపాను వ్యతిరేకిస్తున్న పలు పార్టీలు కాంగ్రెస్‌తో జత కట్టేందుకూ సిద్ధంగా లేవు. ఇటీవలే ఎన్డీయేను వీడిన తెలుగుదేశం పార్టీకి కూడా ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌ భాగస్వామిగా ఉన్న కూటమితో కలసి పనిచేయటం ఇబ్బందికరమే. ఈ పరిస్థితిని గమనించిన శరద్‌ పవార్‌ ...తృణమూల్‌ కాంగ్రెస్‌, బిజూ జనతా దళ్‌ (బిజద) వంటి పార్టీలకు చేరువయ్యేందుకు యత్నిస్తున్నారు.

ఎన్సీపీ భుజాలపై.. 
మహారాష్ట్రలో 2014లో దేవేంద్ర ఫడణవీస్‌ నేతృత్వంలో భాజపా-శివసేన సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తిన ప్రతిసారీ శరద్‌ పవార్‌కు చెందిన ఎన్సీపీ...భాజపా ప్రభుత్వానికి అండగా ఉంటామన్న సంకేతాలిచ్చింది. తమ ప్రభుత్వానికి ఎన్సీపీ ఇచ్చిన భరోసాకు ఫలితంగా కాంగ్రెస్‌-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వ హయాం(1999-2004)లో ఎన్సీపీ మంత్రుల ప్రమేయం ఉందని భావిస్తున్న రూ.72వేల కోట్ల సాగునీటి కుంభకోణం వైపు ఫడణవీస్‌ ప్రభుత్వం కన్నెత్తి కూడా చూడలేదు. ఆ విధంగా ఎన్సీపీ-భాజపా పరస్పరం సహకరించుకున్నాయని సమాచారం. 2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్సీపీ...లౌకికవాదం విషయంలో తన సహజ స్నేహితుడైన కాంగ్రెస్‌ పార్టీకి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో శరద్‌పవార్‌కున్న పలుకుబడిని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. పరస్పర అవగాహనలో భాగంగానే భాజపాను వ్యతిరేకించే పార్టీలన్నిటినీ తన చిరకాల మిత్రుడు కాంగ్రెస్‌ వెనక మోహరింపజేసే కృషిని శరద్‌ పవార్‌ తన భుజాలపై వేసుకుని యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.

నేతలకు స్వయంగా ఆహ్వానాలు 
దిల్లీలోని తన నివాసంలో ఈనెల 27న ఏర్పాటు చేసిన సమావేశానికి భాజపాయేతర రాజకీయ పార్టీల నేతలను శరద్‌ పవార్‌ స్వయంగా ఆహ్వానిస్తున్నారు. మంగళవారం లఖ్‌నవూ వెళ్లి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇప్పటికే ప్రత్యేక దూత ద్వారా ఆహ్వానం పంపగా ఆమె హాజరయ్యేందుకు అంగీకరించారని తెలిసింది. ఈ నెల 26 నుంచి నాలుగు రోజుల పాటు దిల్లీలో ఉండే ఆమె యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీకి అవకాశాలున్నాయని టీఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌ పార్టీపై మమతా బెనర్జీకి ఇదివరకు ఉన్నంత ఆగ్రహంలేదని, జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌తో కలసి పనిచేయటం ఆమెకు అభ్యంతరం ఉండకపోవచ్చని టీఎంసీ వర్గాలు వ్యాఖ్యానించాయి. రాజ్యసభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ నుంచి అయిదో స్థానంలో తన అభ్యర్థిని గెలిపించుకోవటానికి కాంగ్రెస్‌...సీపీఎం మద్దతుకు బదులుగా తృణమూల్‌ కాంగ్రెస్‌ సాయాన్ని స్వీకరించటం గమనార్హం. ఈ క్రమంలో తన చిరకాల రాజకీయ విరోధి, పశ్చిమ బెంగాల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అధిర్‌ రంజన్‌ చౌదరి సలహాను సోనియా గాంధీ పక్కన పెట్టటం కూడా మమతా బెనర్జీ మారిన మనసుకు కారణం కావచ్చని భావిస్తున్నారు. అందువల్లే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కోల్‌కతాలో తన భేటీని ఫలవంతం అని మాత్రమే మమతా బెనర్జీ పేర్కొన్నారని అంటున్నారు. భాజపాయేతర కూటమికి కాంగ్రెస్‌ను దూరంగా ఉంచే ప్రతిపాదనపై తొందర వద్దని, భావసారూప్య పార్టీలన్నిటితో చర్చలు జరగనివ్వాలని కేసీఆర్‌కు సూచించారని వినికిడి.

ఈ నేపథ్యంలోనే శరద్‌పవార్‌ ఇంట జరిగే సమావేశానికి భాజపాయేతర పార్టీలు ఎన్ని హాజరవుతాయి అన్నది ఆసక్తికరం. వాటి సంఖ్య తక్కువగా ఉంటే భాజపాయేతర పార్టీల్లో అత్యధికం కాంగ్రెస్‌ నాయకత్వంలో ఏకమయ్యేందుకు సుముఖంగా లేవనే సంకేతాలు వెలువడుతాయి. ఒకవేళ అధిక సంఖ్యలో విచ్చేస్తే...ఆ పార్టీలన్నీ తమ విభేదాలను పక్కనపెట్టి భాజపాతో తలపడేందుకు కాంగ్రెస్‌ నాయకత్వంలో పనిచేయటానికి సిద్ధమనే అభిప్రాయం కలుగుతుంది. ఇదే జరిగితే కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న భాజపాయేతర, కాంగ్రెస్సేతర మూడో కూటమికి అవకాశాలు సన్నగిల్లినట్లేనని రాజకీయ పండితుల విశ్లేషణ.

Link to comment
Share on other sites

Only sp ni laagithe what use in UP? Laagithe sp+bsp la ni kalipi laagaali.... up lo sp+bsp+congress kalisi contest cheyyaali like they did with rjd+jdu in Bihar..... veelaithe Shiva Sean tho koodaa deal set cheskovaali ncp.... Delhi and Punjab lo aap should ally with congress.... 

3rd front possible kakapothe our priority should be UPA3.... Telugu vaallu unna prathi bjp area li tdp contest cheyyaali either to win or split bjp votes.... 

3rd front or UPA  - ultimate target is modi ki bonda pettadam ..rest all fall in place automatically ....

Link to comment
Share on other sites

4 minutes ago, nbk@myHeart said:

Sharad powar gadu pm ante first oppose chesedi Sonia and congress emo.... 2004 lo Sonia pm kaakpotaaniki main reason eede ga.... :D

May be. But things have changed since then, he said it was a mistake and supported couple of congress govt.’s. Rahul dude went and met him recently.

Link to comment
Share on other sites

30 minutes ago, Kiran said:

Musalodiki PM ambition okati migilipoyinattu undhi

manushula swabhaavam vicitram gaa unTadi kiran bro bhEtaaLa Katha lo laaga ......yenta vayassu vacchinaa manishi emotional being...oka emotional attachment tO model approval kOsam taha taha unTadi .....okkOsaari ekkuva long term parichayam kuuDaa avasaram unDadu, attachment ki....few moments are also enough  to get connected that way....

moddu seenu ki suri Katha tO hero, meppinchaali baavani .....enta kalvanaTlu kanipinchinaa PK looks for that ultimate acceptance from his brother chiru.....Pawar ki Adi oka kala yb chavan sisyarikam lo vEsukonna beejam....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...