Jump to content

కంగుతిన్న కమలం 


Ramesh39

Recommended Posts

కంగుతిన్న కమలం 
ఉప ఎన్నికల్లో భాజపాకు గట్టి ఎదురుదెబ్బ 
  యూపీ, బిహార్‌లలోని మూడు లోక్‌సభ స్థానాల్లోనూ ఓటమి 
  ప్రతిష్ఠాత్మక గోరఖ్‌పూర్‌, ఫూల్‌పుర్‌లో సమాజ్‌వాదీ పార్టీ విజయం 
  కలిసొచ్చిన బీఎస్పీ మద్దతు 
బిహార్‌లోని అరారియాలో ఆర్జేడీ గెలుపు 
14hyd-main3a.jpg

లఖ్‌నవూ/పట్నా: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామన్న ధీమాతో ఉన్న భారతీయ జనతా పార్టీకి బుధవారం వెలువడిన మూడు లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాల రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో పార్టీకి కంచుకోట వంటి గోరఖ్‌పూర్‌, ఫూల్‌పుర్‌లతో పాటు బిహార్‌లోని అరారియాలో ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. ఏడాది క్రితం యూపీలో తిరుగులేని ఆధిక్యంతో భాజపా అధికారాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు యోగి ఆదిత్యనాథ్‌, ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యలు ఈ రెండు లోక్‌సభ స్థానాలకు రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో ఈ రెండు స్థానాలూ సమాజ్‌వాదీ పార్టీ పరమయ్యాయి. గోరఖ్‌పూర్‌లో ఆదిత్యనాథ్‌ అయిదు దఫాలు వరుసగా గెలవగా, 2014 ఎన్నికల్లో ఫూల్‌పుర్‌ భాజపా వశమయ్యింది. ఈ ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులకు మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ మద్దతిచ్చింది. ‘ఉప ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీల పొత్తు ప్రభావాన్ని అంచనావేయటంలో విఫలమయ్యాం. అతివిశ్వాసం మమ్మల్ని దెబ్బతీసింద’ని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యానించారు. గోరఖ్‌పూర్‌లో భాజపా అభ్యర్థి ఉపేంద్ర దత్‌ శుక్లాను ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్‌ నిషాద్‌ 21,961 ఓట్ల తేడాతో ఓడించారు. ఫూల్‌పుర్‌లో భాజపా అభ్యర్థి కౌశలేంద్ర సింగ్‌పై ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్‌ సింగ్‌ 59,460 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. బిహార్‌లో లాలూప్రసాద్‌ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ ...అరారియా స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోగలిగింది. ఇక్కడి ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి ప్రదీప్‌ కుమార్‌ సింగ్‌పై ఆర్జేడీ అభ్యర్థి సర్ఫరాజ్‌ ఆలం 60వేల ఓట్లతేడాతో విజయం సాధించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీయు .. మహాకూటమిని వీడి ఎన్డీయే గూటికి చేరిన తర్వాత జరిగిన తొలి ఉప ఎన్నిక ఇది. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ జైలులో ఉన్నప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి గెలుపొందటం నితీశ్‌కుమార్‌కు తగిలిన ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. జహానాబాద్‌ అసెంబ్లీ స్థానాన్నీ ఆర్జేడీ తిరిగి నిలబెట్టుకుంది. ఇక్కడ జేడీయూ అభ్యర్థి అభిరామ్‌ శర్మను ఆర్జేడీ అభ్యర్థి సుదయ్‌ యాదవ్‌ 30వేల ఓట్ల తేడాతో ఓడించారు.

భారతీయ జనతా పార్టీకి లభించిన ఒకే ఒక్క ఊరట ఏమిటంటే బిహార్‌లోని భబువా అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకోవటం. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి శంభు సింగ్‌ పటేల్‌పై భాజపా అభ్యర్థి 14వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలుపొందారు. బిహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌ కలసి పోటీ చేశాయి. 

Link to comment
Share on other sites

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వెనుక బీజేపీ ఉందన్న అనుమానాన్ని సీఎం చంద్రబాబు వ్యక్తపరచారు. ఏపీ ప్రజల సహేతుకమైన డిమాండ్‌ను పరిష్కరించడం మానేసి.. జగన్‌ను, పవన్‌ను అడ్డం పెట్టుకుని టీడీపీపై విమర్శలు చేయించడం వెనుక బీజేపీ నైజం ఏంటో తెలుస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశంలో యాంటీ మోదీ, యాంటీ బీజేపీ భావన బలంగా ఉందని ఆయన చెప్పారు. ఇందుకు నిన్న వెల్లడైన యూపీ, బీహార్ ఉప ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...