Jump to content

ఏపీ బడ్జెట్‌ రూ.1,91,063.61 కోట్లు


Ramesh39

Recommended Posts

ఏపీ బడ్జెట్‌ రూ.1,91,063.61 కోట్లు
1237178BRK82A.JPG

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1,91,063.61 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో బడ్జెట్‌ ప్రసంగం చేస్తున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి సాయం అందడం లేదని.. విభజనలో ఆదాయాన్ని, రాజధానిని కోల్పోవడం రాష్ట్రానికి తీరని నష్టం కలిగించిందన్నారు. అసమజసంగా జరిగిన విభజన వల్లే రాష్ట్రానికి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. కేంద్రం నుంచి సకాలంలో అందని సాయం సమస్యను మరింత జఠిలం చేసిందన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకెళ్తున్నా్మన్నారు. కేంద్రం ఉదాసీనత కనబరచకపోతే మరింత వృద్ధి, ప్రగతి సాధ్యమయ్యేదని అభిప్రాయపడ్డారు. హామీల అమలుకు, ఇతర రాష్ట్రాలతో సమానంగా నిలిచేవరకు పట్టుదలతో పోరాడతామన్నారు. మూడేళ్లలో జాతీయ సగటు వృద్ధి 7.30 శాతంతో పోలిస్తే.. రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించడం ముదావహమన్నారు. నిస్ఫృహ నుంచి ఆశ, భ్రమల  నుంచి విశ్వాసం, నిరాదరణ నుంచి అభివృద్ధి దిశగా రాష్ట్రం పయనం సాగిస్తోందన్నారు.

బడ్జెట్‌ స్వరూపం

* మొత్తం బడ్జెట్‌.. రూ.1,91,063.61కోట్లు

* రెవెన్యూ వ్యయం.. రూ.1,50,270.99కోట్లు

* మూలధన వ్యయం.. రూ.28.678.49కోట్లు

* గతంలో పోలిస్తే 21.70శాతం పెరిగిన బడ్జెట్‌

1237198BRK82B.JPG
బడ్జెట్‌ పూర్తి సారాంశం కోసం క్లిక్‌ చేయండి

కేటాయింపులు ఇలా..

* వ్యవసాయ రంగానికి రూ.12,352కోట్లు. గతంలో పోలిస్తే 35.91 శాతం అదనం

* సాగునీటి రంగానికి రూ.16,978.23కోట్లు. గతంలో పోలిస్తే 32.95శాతం అదనం

* గ్రామీణాభివృద్ధికి రూ.20,815కోట్లు.

* ఇంధన రంగానికి రూ.5,052.54కోట్లు

* పరిశ్రమల శాఖకు రూ.3,074.87కోట్లు

* రవాణా శాఖకు రూ.4,653కోట్లు

* గృహ నిర్మాణ శాఖకు రూ.3,679కోట్లు

* సాధారణ సేవల కోసం రూ.56,113.17కోట్లు

* పోలవరం ప్రాజెక్టుకు రూ.9,000కోట్లు

* రైతు రుణమాఫీకి రూ.4,100కోట్లు

* విద్యా రంగానికి రూ.24,185.75కోట్లు. గతంలో పోలిస్తే 18.65 శాతం అదనం

* క్రీడలు, యువజన సేవల శాఖకు రూ.1,635.44 కోట్లు. గతంలో పోలిస్తే 62.7 శాతం అదనం

* సాంకేతిక విద్యకు రూ.818.02కోట్లు

* కళ, సాంస్కృతిక రంగానికి రూ.94.98కోట్లు

* సమాచార, పౌర సంబంధాల శాఖకు రూ.224.81కోట్లు

* కార్మిక, ఉపాధి కల్పనకు రూ.902.19కోట్లు

* వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం రూ.4,477కోట్లు

* బీసీ సంక్షేమానికి రూ.12,200కోట్లు

* కాపుల సంక్షేమానికి రూ.1,000కోట్లు

* మేదరుల సంక్షేమానికి రూ.30కోట్లు

* నాయీ బ్రాహ్మణుల కోసం రూ.30కోట్లు

* వైశ్యుల సంక్షేమం కోసం రూ.30కోట్లు

* కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం రూ.70కోట్లు

* చేతివృత్తులకు ఆదరణ పథకానికి రూ.750 కోట్లు

* చేనేతలను ప్రోత్సహించేందుకు జనతా వస్త్రాల పథకం కింద రూ.250కోట్లు

* జనతా వస్త్రాల సరఫరా కోసం రూ.200కోట్లు

* చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ.100కోట్లు, బీసీలకు రూ.100కోట్లు

* సామాజిక భద్రత కోసం రూ.3,029కోట్లు

* ఆర్థికంగా వెనుకబడిన కులా విద్యార్థులకు బోధన ఫీజు కోసం రూ.700కోట్లు

* కాపు సామాజిక విద్యార్థులకు రూ.400కోట్లు

* హోంశాఖకు రూ.6,226కోట్లు

* పర్యాటక శాఖకు రూ.290కోట్లు

* తాగునీరు, పారిశుద్ధ్యం కోసం రూ.2,623కోట్లు

* ఫైబర్‌ గ్రిడ్‌ కోసం రూ.600కోట్లు

* మెడ్‌ టెక్‌ జోన్‌ కోసం రూ.270కోట్లు

* అన్నా క్యాంటీన్ల కోసం రూ.200కోట్లు

* స్టార్టప్‌ల కోసం రూ.100కోట్లు

* ఎన్టీఆర్‌ జలసిరి కోసం రూ.100కోట్లు

* డ్వాక్రా మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్ల కోసం రూ.,100కోట్లు

* వారానికి ఐదు రోజులు గుడ్లు పథకానికి రూ.266కోట్లు

* పౌష్టకాహార లోపం నియంత్రణకు రూ.360కోట్లు

* హిజ్రాల సంక్షేమానికి రూ.20కోట్లు

* న్యాయశాఖకు రూ.886కోట్లు

* నిరుద్యోగ భృతికి రూ.1000కోట్లు

* ఎన్టీఆర్‌ ఫించన్లకు రూ.5,000కోట్లు

* ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవకు రూ.1000కోట్లు

* స్వచ్ఛభారత్‌ కోసం రూ.1,450కోట్లు

* విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు రూ.1,168కోట్లు

* గృహ నిర్మాణం-భూసేకరణకు రూ.575కోట్లు

* ఈ-ప్రగతికి రూ.200కోట్లు

* మెగా సీడ్‌ పార్క్ కోసం రూ.100కోట్లు

* చర్మకారుల జీవనోపాధి కోసం రూ.60కోట్లు

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...