Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Ramayapatnam Port

Featured Replies

  • 1 month later...
  • Replies 136
  • Views 16.4k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • 4 months later...
  • Author

రామాయపట్నం పోర్టు వద్ద ఇండస్ట్రియల్‌ హబ్‌

 

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 29 Jan 2026 04:56 IST
Ee
Font size
 
 
 
 
4 min read
 
 

సోలార్‌ ప్రాజెక్టుల కోసం పలు సంస్థలకు భూ కేటాయింపులు
ఎమ్మిగనూరులో మెగా టెక్స్‌టైల్స్‌ పార్కుకు 77.37 ఎకరాలు
మంత్రివర్గ సమావేశ వివరాల్ని వెల్లడించిన మంత్రి పార్థసారథి 

AP280126main-27a.webp

ఈనాడు, అమరావతి: రామాయపట్నం పోర్టు సమీపంలో ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటుకుగాను భూముల కేటాయింపునకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. విశాఖలో ప్రపంచస్థాయి ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిశోధన కేంద్రం ఏర్పాటుకు, అల్లూరి జిల్లాలో ఎమ్యూజ్‌మెంట్‌ థీమ్‌ పార్కు అభివృద్ధికి, ప్రకాశం జిల్లాలో రిలయన్స్‌ బయోగ్యాస్‌ ప్లాంట్లు నిర్మాణానికి భూములు కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామంలో మెగా టెక్స్‌టైల్స్‌ పార్కు ఏర్పాటుకు 77.37 ఎకరాల్ని ఏపీఐఐసీ ఉచితంగా కేటాయింపునకు ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో దీన్ని చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు వివరించారు. అందులోని అంశాలు..

  • ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటుకు రామాయపట్నం పోర్టు చుట్టుపక్కల ఉన్న రావూరు, చేవూరు గ్రామాల్లో 1,831 ఎకరాల్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని పంచాయతీలు నిరాకరించడంతో ప్రభుత్వం వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంది. ఆ మేరకు ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటుకుగానూ గుడ్లూరు మండలం రావూరు గ్రామంలోని 659-9, 660-4 సర్వే నంబర్లలోని 8.06 ఎకరాల్ని, ఇదే గ్రామంలోని 39, 48-1 సర్వే నంబర్లలోని 70.61 ఎకరాలు కేటాయించనున్నారు. చేవూరు గ్రామంలోని 185, 198 సర్వే నంబర్లలోని 16.46 ఎకరాలు కేటాయించనున్నారు. 
  • 2 weeks later...
  • 1 month later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • Author

తూర్పు తీరంలో కార్గో రైల్‌ టెర్మినల్‌

Eenadu icon

By Andhra Pradesh News DeskPublished : 22 Apr 2026 06:12 IST

Ee

Font size

3 min read

రూ.1,615 కోట్లతో ఏర్పాటు
2027 జనవరి నాటికి మొదటి దశ పూర్తి
తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు సేవలు
ఏటా 10 కోట్ల టన్నుల సరకు రవాణాకు అవకాశం

220426apmain14a.webp

ఈనాడు, అమరావతి: రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా రూ.1,615 కోట్లతో కార్గో రైల్‌ టెర్మినల్‌ ఏర్పాటుకానుంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెట్టు సమీపంలోని చేవూరు, మోచర్ల గ్రామాల పరిధిలో దీన్ని ఏర్పాటుచేస్తారు. రామాయపట్నం కార్గో రిసెప్షన్‌ టెర్మినల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ పేరిట పోర్టు సమీపంలో ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. దీనిద్వారా రైలు-రోడ్డు మార్గాలు అనుసంధానమై, సరకు రవాణా సులభమవుతుంది. 2027 జనవరి నాటికి ప్రాజెక్టు మొదటిదశ పనులు పూర్తిచేయాలన్నది లక్ష్యం. 2028 డిసెంబరు నాటికి మిగిలిన మూడు దశలు పూర్తవుతాయి. దీనిద్వారా 1,300 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.

సరకు రవాణాకు డిమాండ్‌

రామాయపట్నం, కృష్ణపట్నం, విశాఖపట్నం పోర్టులు.. విశాఖ-చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధితో తూర్పుతీరంలో సరకు రవాణాకు డిమాండ్‌ పెరుగుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు సరకు రవాణా సేవలు అందించగలరు. ప్రాజెక్టులో భాగంగా బల్క్‌ హ్యాండ్లింగ్, వేర్‌హౌసింగ్‌ సౌకర్యాలు, కోల్డ్‌చైన్‌ మౌలిక సదుపాయాలు, ఆటోమొబైల్, లాజిస్టిక్స్‌ యార్డు, రసాయనాల నిర్వహణకు ప్రత్యేక జోన్‌లతో ఆధునిక మల్టీమోడల్‌ కార్గో రైల్‌ టెర్మినల్‌ అందుబాటులోకి వస్తుంది.

నాలుగు దశలు.. 429 ఎకరాలు

ఈ ప్రాజెక్టును 429 ఎకరాల్లో నాలుగు దశల్లో సంస్థ అభివృద్ధి చేయనుంది. మొదటి దశలో చేవూరులోని 153.77 ఎకరాల్లో లాజిస్టిక్‌ మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. తదుపరి మూడు దశల్లో 275 ఎకరాల్లో మిగతా సౌకర్యాలు సమకూరుస్తుంది. రెండోదశలో రూ.325 కోట్లు, మూడోదశలో రూ.500 కోట్లు, నాలుగో దశలో రూ.555 కోట్లు సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది.

  • ఈ ప్రాంతంలో రేక్‌ నిర్వహణ సామర్థ్యం ప్రస్తుతం నెలకు 18 రేక్‌లుగా ఉంది. దీన్ని నెలకు 135 రేక్‌లకు పెంచేలా ప్రాజెక్టును రూపొందించారు.

  • 2030 నాటికి రైలు రవాణాను 27% నుంచి 45%కు పెంచాలన్నది కేంద్రం ఆలోచన. తద్వారా సరకు రవాణా వ్యయాన్ని తగ్గించాలన్నది లక్ష్యం. ప్రస్తుతం రోడ్డుమార్గంలో సుమారు 65% సరకు రవాణా అవుతోంది.


ఏటా 10 కోట్ల టన్నుల సరకు రవాణా

కార్గో రైల్‌ టెర్మినల్‌ ద్వారా బొగ్గు, ఇనుప ఖనిజం, సిమెంటు, ఇతర ఉత్పత్తులు కలిపి ఏటా సుమారు 100 మిలియన్‌ (10 కోట్ల) టన్నుల సరకు రవాణాకు అవకాశం ఉందని అంచనా.

  • ఏటా గరిష్ఠంగా 40 ఎంటీల బొగ్గు రవాణాకు అవకాశం. రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని పారిశ్రామిక అవసరాలకు బొగ్గు రవాణాకు అవకాశం.

  • ఒడిశా, ఛత్తీస్‌గఢ్, దక్షిణ భారతదేశంలోని మైనింగ్, స్టీల్‌ క్లస్టర్లకు ఇనుప ఖనిజం, ఉక్కు కార్గో ఏటా గరిష్ఠంగా 25 ఎంటీలు.

  • దక్షిణ ప్రాంతంలో పట్టణీకరణ, మౌలికసదుపాయాల వృద్ధి కారణంగా సిమెంట్, క్లింకర్, నిర్మాణ సామగ్రి గరిష్ఠంగా 15 ఎంటీల మేర రవాణాకు అంచనా.

  • వ్యవసాయ, శుద్ధి, ప్రాసెసింగ్‌ పరిశ్రమల నుంచి వచ్చే ఎరువులు, పెట్రోలియం, రసాయనాలు, ఖనిజాలు సుమారు 20 ఎంటీల రవాణాకు అవకాశం. 

  • కంటెయినరైజ్డ్, త్వరగా పాడయ్యే కార్గో.. వ్యవసాయ, సముద్ర ఉత్పత్తులు సుమారు 8 ఎంటీల వరకు ఉంటాయని అంచనా.


  • 1 month later...
  • Author
On 1/23/2019 at 6:23 PM, sonykongara said:

This is one of the best birthdays ever for me! GoAP signed an MoU with @TheJSWGroup in the presence of Chairman @sajjanjindal. JSW will invest a whopping Rs. 3500 Cr to construct two jetties at Ramayapatnam port at a cost of Rs.1000 Cr and lay slurry pipeline to the port...

DxmE4x9UYAAB0tZ.jpg

DxmE4xmU8AIUrFf.jpg

DxmE4xyUwAABSxS.jpg

AP1GczOI_t1B_NE25Ct8Cz6bnpPEUZZrOW729G1g

  • Author

ప్రకాశంలో ఇనుము శుద్ధి కర్మాగారం!

Eenadu icon

By Andhra Pradesh News DeskPublished : 03 Jun 2026 04:58 IST

Ee

Font size

2 min read

gg-pref.gif

ఏపీఎండీసీ భాగస్వామ్యంతో ఏర్పాటుచేయనున్న జేఎస్‌డబ్ల్యూ 
రూ.1,230 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రభుత్వానికి ప్రతిపాదన

ap020626main3a.webp

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో మరో దిగ్గజ సంస్థ జిందాల్‌ సౌత్‌ వెస్ట్‌(జేఎస్‌డబ్ల్యూ) స్టీల్‌ లిమిటెడ్‌ ముడి ఇనుము శుద్ధి కర్మాగారాన్ని ప్రకాశం జిల్లా కొణిజేడు-మర్లపాడు దగ్గర ఏర్పాటు చేయబోతోంది. ఈ ప్రాజెక్టులో రూ.1,230.20 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఏటా 5 మిలియన్‌ టన్నుల ముడి ఇనుప ఖనిజాన్ని వినియోగించనుంది. దీనికోసం ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎండీసీ) పేరిట ఉన్న గనులను లీజు కింద వినియోగించుకోనుంది. ఇనుప ఖనిజం గనుల నుంచి 15 ఏళ్ల పాటు సంస్థ తవ్వకాలు జరపనుంది. బదులుగా ఎలాంటి పెట్టుబడి లేకుండా జాయింట్‌ వెంచర్‌(జేవీ) కంపెనీగా ఏపీ జేఎస్‌డబ్ల్యూ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటుచేసి అందులో 11% వాటా ఇచ్చేందుకు ప్రతిపాదించింది. మిగతా వాటాతో ఏపీ జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతిష్ఠాత్మక జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ సంస్థగా ఉంటుంది. వైఎస్సార్‌ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు జేఎస్‌డబ్ల్యూ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెలలో నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయనున్న ముడి ఇనుము శుద్ధి కర్మాగారానికి సంబంధించిన ప్రతిపాదనను జేఎస్‌డబ్ల్యూ ప్రభుత్వానికి అందించింది.

2027 డిసెంబరు నాటికి ఉత్పత్తిలోకి: 2027 డిసెంబరు నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసి ఉత్పత్తిలోకి తేవాలన్నది లక్ష్యం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే.. 2026 ఆగస్టులో నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు ప్రతిపాదనలో పేర్కొంది. దీని ప్రకారం.. 2027 ఏప్రిల్‌ నాటికి సివిల్‌ పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యం. పరిశ్రమ భవనాల నిర్మాణానికి రూ.143.40 కోట్లు, ప్లాంటు, యంత్రాలకు రూ.914.80 కోట్లు జేఎస్‌డబ్ల్యూ ఖర్చు చేయనుంది.


రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం

  • ఈ ప్రాజెక్టుతో 155 మందికి ప్రత్యక్ష ఉపాధి. లాజిస్టిక్స్, ముడిసరకు రవాణా, ఇతర అనుబంధ కార్యకలాపాలతో మరికొంత మందికి ఉపాధి అవకాశాలు. 

  • ఖనిజాలపై విధించే రాయల్టీ, డిస్ట్రిక్స్‌ మినరల్‌ ట్రస్ట్‌ ఫండ్, ఖనిజాన్వేషణ నిధి, ఏపీఎండీసీకి ముడి ఇనుము ధర కలిపి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.4,480 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా. 

  • శుద్ధి చేసిన ఖనిజాల విక్రయాల ద్వారా ప్రాజెక్టు జీవిత కాలంలో ఏపీఎండీసీకి రూ.224 కోట్ల ఆదాయం సమకూరుతుంది.


ఆదాయ పంపిణీకి అనుసరించే విధానం

  • జేవీ కంపెనీకి వచ్చే మొత్తం ఆదాయంలో(టాప్‌-లైన్‌ రెవెన్యూ) ఏపీఎండీసీకి వాటా ఇవ్వదు. 

  • కంపెనీలో భాగస్వాముల పెట్టుబడుల వాటా ఆధారంగా వచ్చే లాభాల పంపిణీ ఉంటుంది.  

  • ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే ఏపీఎండీసీకి సంస్థలో 11% ఇవ్వనుంది.

  • మూలధన వ్యయం, నిర్వహణ వ్యయాన్ని జేఎస్‌డబ్ల్యూ సమకూరుస్తుంది. ప్రాజెక్టును జేఎస్‌డబ్ల్యూ నిర్వహిస్తుంది.

  • భాగస్వాముల మధ్య ఖర్చులను మినహాయించిన తర్వాతే లాభాల పంపిణీ జరుగుతుంది.


Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.