Jump to content

SAGAR right&Gundlakamm :18 lakh acres golden days very soon


AnnaGaru

Recommended Posts

50 minutes ago, balayyatheking said:

4 years nundi beedu padi unnayi maa bhumulu..maaku ravalsina water ni rayalaseema ani atu pamputhunnaru...ee year ayina vasthayo ledo..

Last year only extra water given to Rayalaseema as some water save due to pattiseema. Other 3 years not much water available for Rayalaseema.

Link to comment
Share on other sites

29 minutes ago, balayyatheking said:

mundhuga chepparuga...water availability ni batti..last year icharu..anthaka mundu bore thone..

ఇంకొక రెండు మూడేళ్లు కష్టాలు తప్పవు ఏమో 

పోలవరం పూర్తి ఐతే సీన్ మారిపోతుంది 

కృష్ణ-గోదావరి మెగా డెల్టా ఈజ్ కమింగ్ 

Link to comment
Share on other sites

7 minutes ago, AbbaiG said:

ఇంకొక రెండు మూడేళ్లు కష్టాలు తప్పవు ఏమో 

పోలవరం పూర్తి ఐతే సీన్ మారిపోతుంది 

కృష్ణ-గోదావరి మెగా డెల్టా ఈజ్ కమింగ్ 

bro, emiti sangthi polavaram chintalapudi works ela jarugutunnayi

Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

bro, emiti sangthi polavaram chintalapudi works ela jarugutunnayi

No tours next two weeks. Chintalapudi structures work very weak. Post chesarugaa

Nekkanti transferred to krishna delta engineering team :(

Edited by AbbaiG
Link to comment
Share on other sites

మసకబారిన మాగాణం 
మూడేళ్లుగా సాగర్‌ కుడికాలువ ఆయకట్టుకు అందని సాగునీరు 
వరి రైతుకు రూ.3,260 కోట్ల ఉత్పత్తి నష్టం 
బీళ్లుగా మారిన 95వేల ఎకరాలు 
అధికశాతం మెట్టగా మారిన వైనం 
పత్తి, కంది, సజ్జ, జూట్‌ వైపు మొగ్గు 
గిట్టుబాటు  ధరలు దక్కని తీరు 
తిండిగింజల నుంచి పశువుల మేత దాకా కొనుక్కోవాల్సిందే.. 
29ap-main12a.jpg
మూడేళ్ల నుంచీ సాగునీరు లేక నాగార్జునసాగర్‌ కుడికాలువ ఆయకట్టు మాగాణిలో 95వేల ఎకరాల వరకు బీడుగా మారింది. అందులో నిలువెత్తు కంపచెట్లు పెరిగాయి. మాగాణి కాస్త మెట్టగా మారిపోతోంది. కొందరు రైతులు ప్రత్యామ్నాయ పంటల బాట పట్టినా అవీ కలిసి రావడం లేదు. పత్తికి గులాబీరంగు పురుగు, కంది, జూట్‌ తదితర పంటలకు ధర దక్కడం లేదు. మూడేళ్లుగా నీరివ్వకపోవడం వల్ల ఆయకట్టు పరిధిలోని 61 మండలాల రైతులు రూ.3,260 కోట్ల వరి ఉత్పత్తిని నష్టపోయారు. ధాన్యపు రాశులతో కళకళలాడే నట్టిళ్లలోకి.. పట్టణాల నుంచి తెచ్చిన పాతిక కిలోల బియ్యం బస్తాలు వచ్చాయి. పాడి పశువులకు మేత లేక లారీలలో తెప్పించుకోవాల్సిన దుస్థితి. వ్యవసాయ కూలీలు ఉపాధి వెదుక్కుంటూ పట్టణాలకు వలస పోతున్నారు.

నీరందక కుడికాలువ ఆయకట్టులోని మాగాణిలో 22 శాతం బీడుగా మారింది. పశువులు   మేపడానికే ఉపయోగపడుతున్నాయి. సత్తెనపల్లి, ముప్పాళ్ల, రొంపిచర్ల ప్రకాశం జిల్లా త్రిపురాంతకం, అద్దంకి, సంతమాగులూరు ప్రాంతాల్లో  సమస్య అధికంగా ఉంది.


మాగాణి నుంచి పత్తికి..
దర్శి మండలంలో మూడేళ్లుగా ఆయకట్టులో మెట్ట పంటలసాగు పెరుగుతూ వస్తోంది. గట్లు పగలగొట్టి మెట్టగా మార్చాలంటే ఎకరాకు రూ.2వేలకు పైనే ఖర్చవుతోందని రైతులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట, గురజాల, చిలకలూరిపేట, నర్సరావుపేట, సత్తెనపల్లి తదితర నియోజకవర్గాల పరిధిలో మాగాణి భూముల్లో పత్తి, మొక్కజొన్న సాగు భారీగా పెరిగింది. నీరొచ్చినప్పుడు వీటిని మళ్లీ మాగాణిగా మార్చాలంటే ఎకరాకు రూ.5వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుందని గుంటూరు జిల్లా కొమెరపూడి రైతు ఎర్రా శివయ్య వివరించారు.

నాడు 4.25 లక్షల క్వింటాళ్ల  ధాన్యం.. నేడు 1.31 లక్షల క్వింటాళ్ల కందులు 
ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, దర్శి, అద్దంకి ప్రాంతంలో కంది, జూట్‌, సజ్జ ఇతర పంటలు సాగు చేస్తున్నారు. పంగులూరు, మేదరమెట్ల, మార్టూరు, ఇంకొల్లు ప్రాంతాల్లో జూట్‌ వేసినా కొనేవారే కరవయ్యారు. ఈ జిల్లాలోని మండలాన్నే తీసుకుంటే మూడొంతులు సాగర్‌ ఆయకట్టు పరిధిలోనిదే. మూడేళ్లుగా నీళ్లు లేక ఈ ఒక్క మండలంలోనే ఏడాదికి రూ.65.87 కోట్ల విలువైన ధాన్యం ఉత్పత్తి పడిపోయింది. ఇప్పుడు అక్కడక్కడ బోర్లు, బావుల కిందనే నాట్లు పడుతున్నాయి. మాగాణి సాగు అధికంగా ఉండే గ్రామాల్లో ఒకటైన రాజంపల్లిలో 90 శాతం విస్తీర్ణం కంది కిందకు వచ్చింది. గతంలో ఏటా పదెకరాలు వరి వేసి 300 బస్తాల వరకు పండించే మాదల శ్రీనివాసరావుకు గతేడాది కంది వేస్తే 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అదీ మద్దతు ధరపై అమ్మితే పెట్టుబడులైనా వచ్చాయని వివరించారు. కందికి వేరుపురుగు ఆశించి నష్టపోతున్నామని రైతులు గుర్రం ప్రసాద్‌, తోట ఏడుకొండలు, బి.శ్రీనివాసులు తదితరులు వివరించారు.


గోదారమ్మపైనే ఆశ.. 
29ap-main12b.jpg
కృష్ణా జలాల రాక కరవైన పరిస్థితుల్లో ప్రభుత్వం గోదావరి జలాలను నాగార్జునసాగర్‌ కుడి కాలువ ఆయకట్టు రైతులకు మళ్లించేందుకు ప్రణాళిక రూపొందించింది. గోదావరి వరద కాలంలో 73 టీఎంసీలు తెచ్చేలా ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుడుతోంది. గోదావరి పెన్నా అనుసంధానంలో భాగంగా తొలిదశ పేరుతో రూ.6,020 కోట్ల అంచనా వ్యయంతో ఇప్పటికే టెండర్లు పిలిచింది. గోదావరి నుంచి వరద జలాలను పోలవరం కుడి కాలువ ద్వారా ఇప్పటికే ప్రకాశం బ్యారేజికి తెచ్చి కృష్ణా డెల్టాకు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు చింతలపూడి ఎత్తిపోతల ద్వారా మరో 7000 క్యూసెక్కులు అదనంగా తీసుకువచ్చి సాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు ఇవ్వాలని ప్రణాళిక రూపొందించారు. ప్రకాశం బ్యారేజి ఎగువన హరిశ్చంద్రాపురం వద్ద ఎత్తిపోతల ద్వారా అయిదు దశల్లో ఎత్తిపోసి నకరికల్లు మండలం నరసింగపాడు వద్ద సాగర్‌ కుడికాలువలో కలుపుతారు. జులై నెలాఖరుకల్లా గుత్తేదారులను ఖరారు చేసి ఆగస్టులో శంకుస్థాపన చేయబోతున్నారు. వచ్చే ఏడాది ఖరీఫ్‌ కాలానికి ఈ నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. సాగర్‌ ఆయకట్టులో పలువురు రైతులతో మాట్లాడినపుడు ఈ ప్రాజెక్టుపైనే ఎక్కువ మంది ఆసక్తి కనబర్చారు. ఇది పూర్తయితే సాగుకు ఢోకా ఉండదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
లక్షల బస్తాలు పండించిన ఊళ్లోనే..
ఆయకట్టు పరిధిలోని వందలాది గ్రామాల్లో ఎటు చూసినా ధాన్యం నిల్వలుండేవి. వరి వేసే ప్రతి రైతు ఇంట్లోనూ 20 బస్తాలకు పైగా తిండిగింజల కోసం ఉంచి మిగిలినవి విక్రయించేవారు. సాగు లేకపోవడంతో ఇప్పుడు 90 శాతం రైతులు నెలనెలా బియ్యం  కొనుక్కుంటున్నారు.
29ap-main12c.jpg29ap-main12e.jpg
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడి.. మొత్తం 4 వేల ఎకరాల విస్తీర్ణంలో 3 వేల ఎకరాలు మాగాణి ఉండేది. ఖరీఫ్‌, రబీల్లో కలిపి మొత్తం 1.30 లక్షల బస్తాల ధాన్యం పండించిన గ్రామం ఇది.. కూలీలకు చేతినిండా పని దొరికేది. ఇప్పుడీ ఊళ్లోని కిరాణా దుకాణాల్లో పట్టణం నుంచి బియ్యం తెచ్చి అమ్ముతున్నారు. ‘‘పంట లేనప్పుడు ఏం చేస్తాం.. నెలకు 40 కిలోల బియ్యం కొనుక్కుంటున్నాం.’’ అని గతంలో ఏటా 150 బస్తాలు పైగా అమ్మే చల్లా అర్జునరెడ్డి, ముప్పాళ్ల రైతు దొంతి కృష్ణారెడ్డిలు వివరించారు. ‘‘కొమెరపూడిలో వరి పంటపై ఎరువులు, పురుగు మందుల వ్యాపారం రూ.3కోట్లకు పైగా జరుగుతుంది. మూడేళ్లు పాటు సాగర్‌ నీరివ్వకపోవడంతో వ్యాపారం రూ.30లక్షలకు పడిపోయిందని’’ వ్యాపారి తటవర్తి సత్యనారాయణ పేర్కొన్నారు.
జలసిరుల కోసం.. మేడపి తహ.. తహ.. 
29ap-main12f.jpg
సాగర్‌ నీరు రాకపోవడంతో ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపిలో 80 శాతం మాగాణి పొలం మెట్టగా మారింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్‌ జలసిరిని అందిపుచ్చుకుని కంది, మొక్కజొన్న, సజ్జ, పత్తితోపాటు కూరగాయలు, పండ్లతోటలు వేస్తున్నారు. ఒక్క ఏడాదిలోనే 76 ఎన్టీఆర్‌ జలసిరి బోర్లు వేసి మోటార్లు బిగించారు. ఇదే సమయంలో 70 పైగా విద్యుత్తు ఆధారిత బోర్లు కూడా అమర్చారు.

కూలీలు.. సిమెంటు పనులకు 
వరిసాగుంటే ఎకరాకు 40 మంది వరకు కూలీల అవసరం ఉండేది. ఇప్పుడు వారందరికీ పని దూరమైంది. దీంతో కూలీలు ఇప్పుడు పట్టణాల్లో సిమెంటు, అపార్టుమెంట్ల నిర్మాణ పనులకు వెళ్తున్నారని కొమెరపూడి రైతు చల్లా కొండారెడ్డి పేర్కొన్నారు.

పశువుల మేతకూ కష్టాలే 
ఇంటికి నాలుగైదు మేలుజాతి పశువులతో.. పాల ఉత్పత్తి అధికంగా ఉండే ఈ గ్రామాల్లో ఇప్పుడు ఎకరా వరిగడ్డిని రూ.12వేల చొప్పున కొనుక్కోవాల్సి వస్తోందని దర్శి మండలం కొత్తరెడ్డిపాలెం రైతు మేడం పద్మారెడ్డి వివరించారు.

కౌలుకూ వెనకడుగు.. 
బొల్లాపల్లి వెల్లటూరులో వేణుగోపాలస్వామి దేవాలయ భూములు వేలం వేస్తే 18 ఎకరాలకు గతంలో రూ.1.18 లక్షలు పలికిన భూములు ఈ ఏడాది రూ.42 వేలకే తీసుకున్నారు. కోటప్పకొండ భూములు ఎవరూ తీసుకునేందుకు ముందుకు రాక మూడుసార్లు వాయిదా వేయాల్సి వచ్చింది.

ఎక్కువ నష్టపోయింది ఇక్కడి రైతాంగమే.. 
రాష్ట్ర విభజన తర్వాత.. సాగుపరంగా నాగార్జునసాగర్‌ కుడికాలువ రైతాంగమే ఎక్కువగా నష్టపోయింది. దిగువన ఉన్న కృష్ణా డెల్టాకు పట్టిసీమ నుంచి నీరు తెచ్చి ఇస్తున్నారు. ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి రాయలసీమ జిల్లాలకు సాగునీటి సరఫరా జరుగుతోంది. మధ్యలో ఉన్న కుడికాలువ ఆయకట్టులోనే మాగాణి సాగుకు నీరందని పరిస్థితి నెలకొంది.

29ap-main12d.jpg 
29ap-main12g.jpg 
29ap-main12h.jpg 
29ap-main12i.jpg
 
 
Link to comment
Share on other sites

గోదావరి - పెన్నా నదుల అనుసంధానంలో మొదటి అడుగు
31-07-2018 09:31:23
 
636686262842484433.jpg
  • తొలి దశలో హరిశ్చంద్రాపురం నుంచి..
  • నకరికల్లు వరకు నీటి మళ్లింపు
  • 7 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహంతో పైపులైన్‌..
  • గ్రావిటీ కాలువ నిర్మాణం
  • 73 టీఎంసీల నీటిని తరలించి 9.61 లక్షల ఎకరాల..
  • సాగర్‌ ఆయకట్టు స్థిరీకరణ
  • రూ.6,020 కోట్లకు టెండర్లు పిలిచిన జలవనరుల శాఖ
  • 18 నెలల్లో పూర్తికి లక్ష్యం
గుంటూరు/అమరావతి: గోదావరి - పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా మొదటి దశలో చేపట్ట బోతున్న ప్రాజెక్టు నిర్మాణానికి తొలి అడుగుపడింది. ఇందుకోసం రూ.6,020 కోట్ల నిధులు అవసరమౌతాయని అంచనా వేస్తున్నారు. పట్టిసీమ/పోలవరం కుడికాలువ ద్వారా వచ్చే గోదావరి వరద నీటిని అమరావతి రాజధాని పరిధిలోని ప్రకాశం బ్యారేజ్‌లో హరిశ్చంద్రాపురం వద్ద నుంచి నకరికల్లు వరకు ఏడు వేల క్యూసెక్కులను తరలించనున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు ఈపీసీ పద్ధతిన టెండర్లు స్వీకరించి ఆ తర్వాత అర్హతలను బట్టి ఏజెన్సీని ఖరారు చేస్తారు. మొత్తం 18 నెలల వ్యవధిలో మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకొన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.
 
 
సాగునీటికి కొరత లేకుండా..
రాష్ట్రానికి జీవనాడిగా పోలవరం ప్రాజక్టుని భావిస్తున్న ప్రభుత్వం దాని ద్వారా ఇప్పటికే గోదావరి - కృష్ణ నదులను తాత్కాలిక పట్టిసీమ పంపుహౌస్‌తో అనుసంధానం చేసింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత కుడికాలువ నీటిని పెన్నా నదికి తీసుకెళ్లి గోదావరి - పెన్నా నదుల అనుసంధానాన్ని కూడా పూర్తిచేసి రాష్ట్రంలో సాగునీటికి కొరత లేకుండా చేయాలనేది లక్ష్యంగా పెట్టుకొంది. ఇందుకు ప్రధాన కారణం కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వర్షాలు కురవకపోవడం, కాస్తో, కూస్తో వచ్చిన వరద నీరు ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులను దాటి ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఏటా రెండు వేల టీఎంసీలకు పైగా వరద నీరు గోదావరి ద్వారా సముద్రంలో కలుస్తున్న నేపథ్యంలో ఆ నీటిని తరలించడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవచ్చని సీఎం చంద్రబాబు బృహత్తరమైన ఆశయానికి నాంది పలికారు.
 
 
ప్రాజెక్టు తీరు ఇలా..
ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్‌లో నిల్వ అవుతున్న నీరు వద్ద సముద్రమట్టం చూస్తే 15 మీటర్లుగా ఉంది. మరోవైపు నకరికల్లు వద్ద సముద్ర నీటిమట్టం 140 మీటర్లుగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఎత్తిపోతల పథకాల ద్వారా 125 మీటర్ల ఎత్తునకు నీటిని పంపింగ్‌ చేసేందుకు ఈ ప్రాజెక్టుని నిర్మించనున్నారు. ప్రాజెక్టు పూర్తి అయితే సాగర్‌ డ్యాం నుంచి కృష్ణానది నీటి విడుదల కోసం ఆయ కట్టు రైతులు ఎదురు చూడాల్సిన పని లేదు. డెల్టా రైతులతో పాటే జూన్‌, జూలై నెలల్లోనే మాగాణి పంటల సాగు చేపట్టొచ్చు.
 
 
తొలుత హరిశ్చంద్రాపురం వద్ద 7 వేల క్యూసెక్కుల నీటిని పంపింగ్‌ చేయగల ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తారు. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల పొడవునా పైపులైన్లలో నీరు ప్రవహిస్తుంది. ఆ తర్వాత 56 కిలోమీటర్ల పొడవునా గ్రావిటీ ఛానెల్‌ నిర్మిస్తారు. ఐదు దశల్లో నీటిని ఎత్తిపోస్తారు. ఇందుకోసం హరిశ్చంద్రాపురంతో పాటు లింగాపురం, గోరంట్ల, భృగుబండ, నకరికల్లు వద్ద పంపుహౌస్‌లు నిర్మిస్తారు. నాగార్జునసాగర్‌ కుడికాలువ 80వ కిలోమీటర్‌ వద్ద నకరికల్లులో గోదావరి - పెన్నా కాలువని అనుసంధానం చేస్తారు. అక్కడే డెలివరీ సిస్టమ్‌ని నిర్మిస్తారు. ఇలా ఏటా 73 టీఎంసీల గోదా వరి నీటిని నాగార్జునసాగర్‌ కుడికాలువకు తరలించడం ద్వారా 9.61 లక్షల ఎకరాల ఆయకట్టుని స్థిరీ కరిస్తారు. దీంతో సాగర్‌ ఆయకట్టులో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి కష్టాలు తొలగిపోతాయి.
 
 
ఏడాదిన్నరలో పూర్తి చేస్తాం..
గోదావరి - పెన్నా నదుల అనుసంధానం తొలిదశ ప్రాజెక్టు కోసం గత శనివారం టెండర్లు పిలిచాం. ఈపీసీ పద్ధతిన ఏజెన్సీని ఖరారు చేస్తాం. ఇందుకోసం జలవనరుల శాఖ నుంచి పరిపాలన అనుమతి తీసుకోవడం జరిగింది. 18 నెలల వ్యవధిలో ప్రాజెక్టు పూర్తిచేసి సాగర్‌ కుడికాలువ ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలనేది లక్ష్యంగా పెట్టుకొన్నాం. - ఎం.బాబూరావు, జలవనరుల శాఖ ఎస్‌ఈ
Link to comment
Share on other sites

11 minutes ago, sonykongara said:

anna garu bro  edi ela

unless there is too much gradient, water can flow backwards too. 

e.g rivas/eluru canal in Vijayawada. It used to bring water in to krishna river. after praksam barrage, it is taking water from barrage(through increased depth).

Link to comment
Share on other sites

Nakerekallu nunchi down ki vastundi water...Nakerekallu is where NSP right splits into tWO main branches...

 

FOr karempudi&above buggavagu water will be reserved for them.....There is existing regulator before Nakerekallu and buggavagu will help them....

Link to comment
Share on other sites

2 minutes ago, AnnaGaru said:

Nakerekallu nunchi down ki vastundi water...Nakerekallu is where NSP right splits into tWO main branches...

 

FOr karempudi&above buggavagu water will be reserved for them.....There is existing regulator before Nakerekallu and buggavagu will help them....

neneu ade aukunna bro, ayithe godavari water maku ravu annamata, ayina buggavaghu dam storage capacity penichina kuda 3 tmc kanna penchatam kastam kadha emo chudali

Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:

neneu ade aukunna bro, ayithe godavari water maku ravu annamata, ayina buggavaghu dam storage capacity penichina kuda 3 tmc kanna penchatam kastam kadha emo chudali

above karempudi....usage ki buggavagu more than enough as stage...also pidiguralla-janapadu branch gets water with gravity from this NSP-godavari

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

5 minutes ago, sonykongara said:

Bollapalli reservoir ki same plan na, vere ga thovvutara canals 200 tmc ante

bollapalli ki ZERO canal work....once water reaches Nakereallu using existing NSP canal they lift to bollapalli reservoir....

 

Karempudi-Macherla ki godavari water radu

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

120 రోజుల్లో మొత్తం 73 టీఎంసీలు మళ్లించాలని...

* 120 రోజుల్లో మొత్తం 73 టీఎంసీలు మళ్లించాలని ప్రాథమిక భావన. రోజుకు 7000 క్యూసెక్కుల మళ్లింపు.

* ఆరుదశల్లో ఎత్తిపోతల సాగుతుంది. మొత్తం 16.58 కిలోమీటర్ల మేర పైపులైను ఏర్పాటు చేస్తారు.

* 50.72 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాలువ నిర్మిస్తారు.

* 15 మీటర్ల వద్ద కృష్ణా నది నుంచి నీటిని ఎత్తిపోసి... +140 మీటర్ల వద్ద సాగర్‌ కుడి కాలువలో పోస్తారు. దాదాపు కారంపూడి వద్ద కాలువలో నీళ్లు కలుస్తాయి.

* 28.20 మెగావాట్ల విద్యుత్తు అవసరమవుతుంది.

Link to comment
Share on other sites

త్వరలో గోదావరి-పెన్నా తొలిదశ
రూ.20వేల కోట్లతో ప్రణాళిక సిద్ధం
ఇందులో భాగంగానే ప్రకాశం ఎత్తిపోతల
గోదావరి-పెన్నా అనుసంధాన దిశలోనే తొలిదశ నిర్మాణం
రెండు మూడు నెలల్లోనే ప్రారంభించేలా ఏర్పాట్లు
ఈనాడు - అమరావతి
19ap-main6a.jpg

నాగార్జునసాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు గోదావరి నీళ్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్తర పథకానికి శ్రీకారం చుడుతోంది. గోదావరి-పెన్నా అనుసంధాన తొలిదశగా అతి త్వరలోనే దీన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పోలవరం కుడి కాలువ నుంచే పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల ద్వారా దాదాపు 14 వేల క్యూసెక్కుల వరకు ప్రకాశం బ్యారేజికి తీసుకొస్తారు. ఆ అదనపు నీటిని ప్రకాశం బ్యారేజి ఎగువ నుంచి ఎత్తిపోసి సాగర్‌ కుడి కాలువకు చేరుస్తారు. గోదావరి-పెన్నా అనుసంధాన ప్రణాళికలో భాగంగా...ఆ ప్రాజెక్టు ఏ ఎలైన్‌మెంట్‌లో చేపడుతున్నారో ఆ దిశలోనే ఈ పనులుంటాయి. ఇప్పుడు చేసే పనులు ఆ అనుసంధాన పనులకు ఉపయోగించుకునేందుకు అనువుగా ఉంటాయి. రాబోయే రెండు మూడు నెలల్లో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.20 వేల కోట్లు ఖర్చు కానుంది. ఎంత మేర నీటిని ఎత్తిపోయాలి, తొలిదశలో ఎంత మేర ఖర్చు తగ్గించుకోవచ్చో అనే అంశంపై జలవనరులశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తుది ప్రణాళిక రూపుదిద్దుకోవాల్సి ఉంది.

ఈ ప్రాజెక్టు ఎలా....
ప్రస్తుతం పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి వరద కాలంలో పోలవరం కుడి కాలువ నుంచి 80 టీఎంసీలకు పైగా నీటిని ప్రకాశం బ్యారేజికి మళ్లిస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ఆ కాలంలో రోజూ 8000 క్యూసెక్కులు మళ్లిస్తున్నారు. పోలవరం కుడి కాలువ 17000 క్యూసెక్కుల ప్రవాహానికి వీలుగా నిర్మించారు. ఈ కాలువలో పట్టిసీమ నుంచి అదనంగా వచ్చే నీటి కన్నా ఎక్కువగా మళ్లించే ఏర్పాటు ఇప్పటికే పూర్తయింది. మరో వైపు పట్టిసీమ సమీపంలో గోదావరిపై చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఖరీఫ్‌ కాలానికల్లా పూర్తి చేసేలా ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి. అయితే చింతలపూడి కాలువలు, ఇతరత్రా పనులు ఆలస్యమయ్యే పరిస్థితి
కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చింతలపూడి నుంచి  6000 క్యూసెక్కుల వరకు పోలవరం కుడి కాలువకు మళ్లించి మొత్తం ప్రకాశం బ్యారేజికి రమారమి 14000 క్యూసెక్కుల వరకు మళ్లించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.  ఇందుకు  కుడి కాలువలో ఎక్కడైనా కాలువ కట్ట ఎత్తు పెంచాల్సి ఉంటే ఆ మేరకు పనులు చేసుకుని గోదావరి నీటిని అదనంగా ప్రకాశం బ్యారేజికి మళ్లిస్తారు. ఆ నీరు ప్రకాశం బ్యారేజిలో చేరితే దాదాపు వైకుంఠపురం వరకు  నీరుంటుంది. వైకుంఠపురం బ్యారేజి నిర్మాణం చేపట్టకముందే అక్కడి నుంచి నీటిని ఎత్తిపోసుకోవచ్చు.

120 రోజుల్లో మొత్తం 73 టీఎంసీలు మళ్లించాలని...
* 120 రోజుల్లో మొత్తం 73 టీఎంసీలు మళ్లించాలని ప్రాథమిక భావన. రోజుకు 7000 క్యూసెక్కుల మళ్లింపు.

* ఆరుదశల్లో ఎత్తిపోతల సాగుతుంది. మొత్తం 16.58 కిలోమీటర్ల మేర పైపులైను ఏర్పాటు చేస్తారు.

* 50.72 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాలువ నిర్మిస్తారు.

* 15 మీటర్ల వద్ద కృష్ణా నది నుంచి నీటిని ఎత్తిపోసి... +140 మీటర్ల వద్ద సాగర్‌ కుడి కాలువలో పోస్తారు. దాదాపు కారంపూడి వద్ద కాలువలో నీళ్లు కలుస్తాయి.

* 28.20 మెగావాట్ల విద్యుత్తు అవసరమవుతుంది.

Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:
120 రోజుల్లో మొత్తం 73 టీఎంసీలు మళ్లించాలని...

* 120 రోజుల్లో మొత్తం 73 టీఎంసీలు మళ్లించాలని ప్రాథమిక భావన. రోజుకు 7000 క్యూసెక్కుల మళ్లింపు.

* ఆరుదశల్లో ఎత్తిపోతల సాగుతుంది. మొత్తం 16.58 కిలోమీటర్ల మేర పైపులైను ఏర్పాటు చేస్తారు.

* 50.72 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాలువ నిర్మిస్తారు.

* 15 మీటర్ల వద్ద కృష్ణా నది నుంచి నీటిని ఎత్తిపోసి... +140 మీటర్ల వద్ద సాగర్‌ కుడి కాలువలో పోస్తారు. దాదాపు కారంపూడి వద్ద కాలువలో నీళ్లు కలుస్తాయి.

* 28.20 మెగావాట్ల విద్యుత్తు అవసరమవుతుంది.

e plan marcharu ga chivari ki

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...