Jump to content

విజయవాడ, నున్నలో... ఎలక్ట్రికల్ బైకుల తయారీ సంస్థ...(Electric Bikes)


sonykongara

Recommended Posts

విజయవాడ, నున్నలో... ఎలక్ట్రికల్ బైకుల తయారీ సంస్థ...

 

electric-bike-08122017-1.jpg
share.png

నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని, విజయవాడ శివారు నున్నలో ఎలక్ట్రికల్ బైకుల తయారీ ఫ్యాక్టరీ రానుంది... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ ‘చందన’ కుటుంబానికి చెందిన ఏవీఈ రమణ, చాందినీ చందన దంపతులు ‘చందన కార్ప్‌’ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి ‘అవేరా’ పేరుతో బ్యాటరీ బైకులు, స్కూటర్లను తయారు చేయనున్నారు... రూ.200 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పరిశ్రమపై తొలి దశలో రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు... విజయవాడ శివారు నున్నలో, సుమారు 63 ఎకరాల విస్తీర్ణంలో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. .

 

electric bike 08122017 2

వచ్చే వారం రాష్ట్ర ప్రభుత్వంతో ఈ సంస్థ ఎంవోయూ చేసుకోనుంది. ఈ-బైకుల్లో ఉపయోగించే లిథియం ఐరన్‌ ఫాస్ఫేట్‌(ఎల్‌ఎఫ్‌పీ) బ్యాటరీలను, బోష్‌ కంపెనీ మోటార్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. 60 శాతం పరికరాలను స్థానికంగా తయారు చేస్తారు. అందులో భాగంగా ఈ-బైకులో కీలకమైన చిప్‌లను దక్షిణ కొరియా సాంకేతిక సహకారంతో అనంతపురం, చిత్తూరుల్లోని ఎలకా్ట్రనిక్‌ క్లస్టర్స్‌లో తయారు చేయాలని నిర్ణయించారు. నున్నలో కేవలం అసెంబ్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తారు.

electric bike 08122017 3

వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌ నాటికి పరిశ్రమను ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించాలని చందన కార్ప్‌ భావిస్తోంది. ‘అవేరా’ ద్విచక్రవాహనాల్లో అత్యాధునిక లిథియం ఐరన్‌ ఫాస్ఫేట్‌ బ్యాటరీని వినియోగించడంతోపాటు ఎలక్ట్రిక్‌ మోటార్‌ టెక్నాలజీ ద్వారా గంట చార్జింగ్‌కు 250 కిలోమీటర్ల మైలేజీని సాధించగలుగుతున్నామని సంస్థ ఎండీ రమణ తెలిపారు. ఈ-బైకుల ధర అధికంగా ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలతో సాధారణ బైకుల ధరకే వీటిని అందించేందుకు చందన కార్ప్‌ సిద్ధమవుతోంది. ఈ సంస్థ తయారు చేసే స్కూటర్‌ ధర రూ.2.50 లక్షలు అయితే రాయితీలు పోను రూ.70 వేలకు, స్పోర్ట్స్‌ బైక్‌ ధర రూ.5 లక్షలు కాగా, రూ.లక్షకే విక్రయించనున్నారు.

Edited by sonykongara
Link to comment
Share on other sites

ఏపీలో పారిశ్రామిక కేంద్రంగా మారనున్న ‘నున్న’ గ్రామం
09-12-2017 08:22:00
 
636484045223955569.jpg
  • పారిశ్రామిక కేంద్రంగా నున్న
  • చందనా కార్పొరేషన్‌ అంకురార్పణ
  • రూ.200 కోట్లతో అవేరా బైక్‌ల..
  • యూనిట్‌ ఏర్పాటుకు తాజాగా ఒప్పందం
  • సొంతగా సోలార్‌, ఇంటర్నెట్‌ వ్యవస్థ
  • మార్చినాటికి ఎలక్ట్రికల్‌ బైక్‌ల సవారీ
రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరుతోపాటు తిరుపతి, విశాఖపట్నంలో ఎలక్ర్టిక్‌ బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చందనా కార్పొరేషన్‌ ఎలక్ర్టికల్‌ బైక్‌ల అసెంబ్లింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. విజయవాడ నగరానికి అతి సమీపంలోనే ఉన్న నున్నలో చందనా కార్పొరేషన్‌ భారీ ప్రాజెక్టుకు అంకురార్పణ చేయటం ఈ ప్రాంతాభివృద్ధికి దోహదపడుతుందని స్థానికులు భావిస్తున్నారు. చందనా బాటలోనే మరిన్ని సంస్థలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.
 
నున్న (విజయవాడ రూరల్‌): విజయవాడ రూరల్‌ మండలం నున్నలో చందనా కార్పొరేషన్‌ అరంగ్రేటంతో ఈ ప్రాంతం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయి. రాష్ట్ర విభజన తర్వాత చిన్న చిన్న యూనిట్‌లు నున్న పరిసర ప్రాంతాల్లో ఏర్పాటైనప్పటికీ, తొలిసారిగా భారీ వ్యయంతో ఎలక్ర్టికల్‌ బైక్‌ల అసెంబ్లింగ్‌ యూనిట్‌ రానుండటంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన కియో మోటార్స్‌తో వస్త్ర వ్యాపారంలో దిగ్గజంగా ఉన్న చందనా బ్రదర్స్‌ కుటుంబానికి చెందిన చందనా కార్పొరేషన్‌ పరస్పర అవగాహన కుదుర్చుకుంది. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి సమక్షంలో కొరియాకు చెందిన కియో మోటార్స్‌తో చందనా కార్పొరేషన్‌ అధినేతలు ఆకుల వెంకట రమణ, చాందినీ చందన ఒప్పంద పత్రాలను ఇటీవలే కుదుర్చుకున్నారు.
 
 
          అనంతరం ఎలక్ర్టికల్‌ బైక్‌ల తయారీ, అసెంబ్లింగ్‌ యూనిట్‌లపై మంత్రి సమక్షంలో చర్చలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే కియో మోటార్స్‌తో ఎలక్ర్టికల్‌ వాహనాల వినియోగంపై ఒప్పందం కుదుర్చుకుంది. రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరుతోపాటు తిరుపతి, విశాఖపట్నంలో ఎలక్ర్టిక్‌ బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చందనా కార్పొరేషన్‌ అదే సంస్థలో ఎలక్ర్టికల్‌ బైక్‌ల అసెంబ్లింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ముందుకు రావటం, అది నున్న ప్రాంతంలోనే ఏర్పాటు చేయనుండటంపై ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తన్నారు. చందనా కార్పొరేషన్‌కు నున్న ప్రాంతంలో ఉన్న 63 ఎకరాల మామిడి తోటలోనే దీనిని ఏర్పాటు చేస్తున్నారు.
 
 
           ఎలక్ర్టికల్‌ బైక్‌ల యూనిట్‌ను ‘ఆంధ్రజ్యోతి’ శుక్రవారం పరిశీలించింది. పక్షం రోజుల క్రితమే పూజా కార్యక్రమాలతో యూనిట్‌ను ప్రారంభించారు. మంచి ముహూర్తాలు లేకపోవటంతో హడావుడిగా ప్రారంభించినా, అన్ని రకాల ఎక్విప్‌మెంట్స్‌ వచ్చిన తర్వాత అధికారికంగా ప్రారంభించాలని సంస్థ భావిస్తోంది. ఎలక్ర్టికల్‌ బైక్‌ అసెంబ్లింగ్‌కు అవసరమైన అన్ని రకాల పరికరాలను సంస్థ దిగుమతి చేసుకుంటోంది. అనంతపురం, చిత్తూరులో చిప్‌లను తయారు చేసి, వాటిని అసెంబ్లింగ్‌కు నున్నలోని యూనిట్‌కు తీసుకువస్తారు. ఎలక్ర్టికల్‌ వాహనాలను కొంతకాలంగా ఈ సంస్థ ఉపయోగిస్తోంది.
 
తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించటంతోపాటు జీరో మెయింటెనెన్స్‌ ఉండటంతో చందనా కార్పొరేషన్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.
 
        తొలి దశలో రూ.50 కోట్లతో పెట్టుబడి పెడుతున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఎలక్ర్టికల్‌ బైక్‌లకు విద్యుత్‌ అవసరం ఉండటంతో ప్రత్యేకగా సోలార్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇంటర్నెట్‌ కోసం ప్రత్యేకంగా నెట్‌వర్క్‌ను కూడా రూపొందించుకోవటం విశేషం. చందనా కొర్పొరేషన్‌కు చెందిన అవేరా యూనిట్‌లోనే అత్యాధునిక టెక్నాలజీతో సీసీ కెమేరాల తయారీ, ఎలక్ర్టానిక్‌ డోర్స్‌ నిర్మాణ రంగాన్ని కూడా నున్నలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఈ యూనిట్‌లో మహిళలకు ఉద్యోగవకాశాలు కల్పించనున్నారు.
Link to comment
Share on other sites

experiance lekunda antha money pettara :blink:  e bikes are still to be proven market theda vasthe chandana motham close avuddi.

Hyd lo friend ki telisina vallu local car manufacturing plant open chesaru ittane 100c loss vachindi . Piga final ga aa land kooda government teesesukuntadi plant lekpothe so motham bokke

Link to comment
Share on other sites

19 minutes ago, uravis said:

experiance lekunda antha money pettara :blink:  e bikes are still to be proven market theda vasthe chandana motham close avuddi.

Hyd lo friend ki telisina vallu local car manufacturing plant open chesaru ittane 100c loss vachindi . Piga final ga aa land kooda government teesesukuntadi plant lekpothe so motham bokke

kia vadi tho MOU chesukunnaru

Link to comment
Share on other sites

4 minutes ago, sonykongara said:

kia vadi tho MOU chesukunnaru

He just supplies tech right? doesn't involve in whole production. Main problem is current electric bike range is 100kms max which is not feasible for us. also full charge takes 4-6 hrs again.

Hero sells e bikes from lonng time i hardly see 1 or 2 in hyd. Even big companies struggling to enter  the space. so got doubt as its just start up.

Link to comment
Share on other sites

  • 3 months later...
ఎలక్ట్రిక్‌ వాహనాలు అదుర్స్‌
11-04-2018 01:36:33
 
636590073940655301.jpg
గుంటూరు, ఆంధ్రజ్యోతి: ఆనంద నగరాల శిఖరాగ్ర సదస్సులో మహీంద్రా, గోల్డ్‌స్టోన్‌ ఇన్‌ఫ్రాటెక్‌, ఎవేరా న్యూ అండ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ మోటో కార్‌ టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి.
 
ఎలక్ట్రిక్‌ బస్సు...
ఖరీదు రూ.3కోట్లు. దీనిని 4 గంటలు చార్జింగ్‌ చేయాలి. 300 కిలోమీటర్లు ప్రయాణించగలదు. 31మందికి సీటింగ్‌ సౌకర్యం ఉంది. వికలాంగుల కోసం వీల్‌చైర్‌ సౌకర్యాన్ని కల్పించారు. ఎలాంటి గేర్లూ లేకుండానే రాకపోకలు సాగించే ఈ బస్సు.. గంటకు సుమారు 80కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
 
ఎలక్ర్టిక్‌ కారు...
మహీంద్ర కంపెనీ ఈ-వెరైటీ పేరుతో ఎలక్ర్టిక్‌ కార్లను ఉత్పత్తి చేసింది. దీని ఖరీదు రూ.12.5 లక్షలు. 8:30 గంటలపాటు బ్యాటరీ చార్జింగ్‌ చేయాలి. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈ కారు ప్రయాణించగలదు.
 
ఎలక్ర్టిక్‌ బైకులు
ఎవేరా సంస్థ బేసిక్‌, అడ్వాన్స్‌ మోడల్స్‌ ఎలక్ట్రిక్‌ బైకులను కృష్ణాజిల్లా నున్నలోని ఉత్పాదక కర్మాగారంలో తయారు చేసి ప్రదర్శించింది. లథియంతో బ్యాటరీలను ఉత్పత్తి చేసి బైకులకు అమర్చింది. 4-6గంటల పాటు చార్జింగ్‌ చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదే... అడ్వాన్స్‌ ఫీచర్లతో రూపొందించిన బైక్‌ అయితే ఒకసారి చార్జింగ్‌ చేస్తే 150 నుంచి 180 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వీటి గరిష్ఠ వేగం గంటకు 120 కిలోమీటర్లు.
Link to comment
Share on other sites

On 12/15/2017 at 4:35 AM, uravis said:

He just supplies tech right? doesn't involve in whole production. Main problem is current electric bike range is 100kms max which is not feasible for us. also full charge takes 4-6 hrs again.

Hero sells e bikes from lonng time i hardly see 1 or 2 in hyd. Even big companies struggling to enter  the space. so got doubt as its just start up.

hyd lo mostly failure avuthayi. AP lo kaadu. AP govt does't blindly give land. They also provides guidance by hiring peer veterans in the sector and markets them to own usage. Lokesh vochaka antha maripoyindi ippudu. ikkada emo lokesh meeda doubts paduthunnaru. akkada ayana chinchi istharaku esthunnadu bhayamkaram ga policy changes techi. i hear that any private company can own land (direct registration title transfer) but they have to give back 2% in profits every year to govt. it is one option. most companies are going for this now. :D

Link to comment
Share on other sites

23 minutes ago, LuvNTR said:

hyd lo mostly failure avuthayi. AP lo kaadu. AP govt does't blindly give land. They also provides guidance by hiring peer veterans in the sector and markets them to own usage. Lokesh vochaka antha maripoyindi ippudu. ikkada emo lokesh meeda doubts paduthunnaru. akkada ayana chinchi istharaku esthunnadu bhayamkaram ga policy changes techi. i hear that any private company can own land (direct registration title transfer) but they have to give back 2% in profits every year to govt. it is one option. most companies are going for this now. :D

Great to hear that 

Link to comment
Share on other sites

1 hour ago, LuvNTR said:

hyd lo mostly failure avuthayi. AP lo kaadu. AP govt does't blindly give land. They also provides guidance by hiring peer veterans in the sector and markets them to own usage. Lokesh vochaka antha maripoyindi ippudu. ikkada emo lokesh meeda doubts paduthunnaru. akkada ayana chinchi istharaku esthunnadu bhayamkaram ga policy changes techi. i hear that any private company can own land (direct registration title transfer) but they have to give back 2% in profits every year to govt. it is one option. most companies are going for this now:D

Excellent One.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...