Jump to content

South Korean City' likely to come up in AP


sonykongara

Recommended Posts

అనంతలో ఇంటిగ్రేటెడ్‌ స్మార్ట్‌ సిటీ!
05-12-2017 03:39:45
 
636480419864425833.jpg
బీటీఎన్‌ కంపెనీ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వైకిమ్‌తోనూ సీఎం సమావేశమయ్యారు. దేశంలో మొదటి లోకల్‌ ఫ్రెండ్లీ సస్టెయినబుల్‌ ఇంటిగ్రేటెడ్‌ స్మార్ట్‌ సిటీని అనంతపురంలో ఏర్పాటు చేయడంపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. దక్షిణ కొరియా-ఇండియా మధ్య రూ.64405 కోట్ల(10 బిలియన్‌ డాలర్ల) ఆర్థిక సాయానికి జరిగిన ఒప్పందంలో భాగంగా ఈ సిటీని నిర్మించనున్నారు. పరిశ్రమల శాఖ, ఈడీబీలకు స్మార్ట్‌సిటీపై ప్రతిపాదనలు అందించాలని బీటీఎన్‌ సంస్థకు సీఎం సూచించారు. అనంతరం పోస్కో దేవూ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జూ సీబీతో సీఎం సమావేశమయ్యారు. ఇండియాలో ఎల్‌ఎన్‌జీ వాల్వ్‌ చెయిన్‌ బిజినెస్‌ పట్ల పోస్కో ఆసక్తి కనబరిచింది. ఉక్కు, రసాయనాలు, ఇంజనీరింగ్‌, నిర్మాణ రంగాలతోపాటు కమోడిటీ ట్రేడింగ్‌లో పోస్కోకు విశేషానుభవం ఉంది. ఆ తర్వాత హ్యోసంగ్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ జెజూంగ్‌లీతో సీఎం భేటీ అయ్యారు.
Edited by sonykongara
Link to comment
Share on other sites

కొరియా పథం
రాష్ట్రంలో వెయ్యి ఎకరాల్లో  ‘కొరియా నగరం’
మూడు దశల్లో రూ.10వేల కోట్ల పెట్టుబడి
తొలిరోజు కుదిరిన రెండు ఒప్పందాలు
అనంత, అమరావతిల్లో ‘లొట్టె’ పెట్టుబడులు
దక్షిణకొరియాలో పలుసంస్థలతో చంద్రబాబు భేటీ
ఈనాడు - అమరావతి
4ap-main4a.jpg

వ్యాంధ్రలో పెట్టుబడులకు దక్షిణకొరియాకు చెందిన పలు పరిశ్రమలు ఆసక్తి చూపిస్తున్నాయి. మూడురోజుల పాటు ఆ దేశంలో పర్యటించడానికి సియోల్‌ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆ దేశ అధికారులు, పలు పరిశ్రమలు ఘనస్వాగతం పలికాయి. పలు సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. తొలిరోజు రెండు ఒప్పందాలు జరిగాయి. అనంతపురం జిల్లాలో ఏర్పాటవనున్న కొరియా నగరం, కియాకు-విక్రేత సంస్థలతో అవగాహన ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రికి, రాష్ట్ర అధికారుల బృందానికి కియా కార్ల ప్రత్యేకతను సంస్థ అధికారులు వివరించారు. సోమవారం జరిగిన ప్రత్యేక విందులో కియా సీఈఓ హ్యూంగ్‌ కీన్‌ లీ, ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షులు గ్యూన్‌ కిమ్‌ తదితరులతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను దక్షిణకొరియా రెండో రాజధానిగా భావించి అక్కడ పెట్టుబడులు పెట్టాలన్నారు. మీకు ఎలాంటి వ్యాపార అవరోధాలు తలెత్తవని, ఇబ్బందులు ఎదురైతే వెంటనే పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. కొరియా ప్రాథమిక విద్యా వ్యవస్థపై తమ ప్రభుత్వం అధ్యయనం చేయదలిచిందన్నారు. కీన్‌ లీ మాట్లాడుతూ తమ సంస్థ విద్యుత్తు వాహనాల తయారీ కూడా ప్రారంభించిందని చెప్పారు. ప్రస్తుతం ఒక్కసారి ఛార్జి చేస్తే 170 కిలోమీటర్లు ప్రయాణించే వాహనాలు తయారు చేశామని, దాన్ని సామర్థ్యం 200 కిలోమీటర్లకు పెంచుతున్నట్లు చెప్పారు. అమరావతిలో విద్యుత్తు వాహనాలను వినియోగించనున్నామని, తమకు సహకరించాలని సీఎం కోరారు. రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, ఎన్‌. అమరనాథరెడ్డి, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, పరిశ్రమలశాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, ఏపీఐఐసీ ఎండీ ఎ.బాబు, ఈడీబీ సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్‌, పరిశ్రమలశాఖ  ప్రతినిధి ప్రీతమ్‌రెడ్డి పాల్గొన్నారు.

4ap-main4b.jpg

తొలి రోజు
కొరియా నగరం: అనంతపురం జిల్లాలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు. తొలిదశలో 700 ఎకరాలు సేకరిస్తారు. మూడుదశల్లో మొత్తం రూ.10వేల కోట్ల పెట్టుబడులకు 37 కొరియా సంస్థలు ముందుకొచ్చాయి. పారిశ్రామిక నగరం, టౌన్‌షిప్‌, నక్షత్రాల హోటళ్లు, రిసార్టులు, గోల్ఫ్‌కోర్సు లాంటివి ఏర్పాటు చేస్తారు. ప్రాథమికంగా 9వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది. మూడుదశలయ్యేటప్పటికి 40 వేల మందికి ఉపాధి కల్పించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి, ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)తో పలు కొరియా సంస్థలు అంగీకార పత్రాల (లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌)పై సంతకాలు చేశాయి. ఇక్కడ కనీసం వంద కొరియా సంస్థలు వస్తాయని అంచనా.
కియా విక్రేత సంస్థలు: కియాకు చెందిన 17 విక్రేత పరిశ్రమలు, ఏపీఐఐసీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. విడిభాగాలు తయారు చేసే ఈ సంస్థలు ఇక్కడ రూ.4,995 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. 7,171 మందికి ఉపాధి లభించనుంది.
లొట్టె: 1.80 లక్షల మంది ఉద్యోగులున్న ఈ సంస్థ అతిపెద్దదైన వాటిల్లో 8వది. చాక్లెట్‌ తదితర రంగాల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందింది. చంద్రబాబుతో లొట్టె సీఈఓ వాంగ్‌ కాగ్‌ జు భేటీ అయ్యారు. అనంతపురం, అమరావతిలో హోటళ్లు, ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.

4ap-main4c.jpg

దాసన్‌: దాసన్‌ నెట్‌వర్క్‌ ఛైర్మన్‌ నామ్‌ మెయిన్‌తో జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రి ఏపీ ఫైబర్‌నెట్‌పై ప్రదర్శన ఇచ్చారు.  ఫిబ్రవరిలో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానించారు. భారత్‌లో తయారీ రంగంలో భారీ పెట్టుబడులకు ఆసక్తి వ్యక్తం చేసింది.
జుసంగ్‌: ఇంధన రంగ ఉత్పత్తుల్లో ప్రసిద్ధ సంస్థ. సీఎంతో సీఈఓ వాంగ్‌ చుల్‌ జు భేటీ అయ్యారు. 2022కల్లా భారత్‌లో 100 గిగావాట్‌ల సౌర విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే 3.4 గిగావాట్‌ల కేంద్రాలు భారత్‌లో ఉన్నాయి. నవశకం ఎల్‌ఈడీ బల్బుల తయారీపై పరిశోధన చేస్తున్నట్లు వాంగ్‌ తెలపగా...ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు.
ఐరిటెక్‌: ఐరిస్‌ ఆధారిత సొల్యూషన్స్‌ సంస్థ సీఈఓ కిమ్‌ డెహోన్‌తో భేటీ. ఇప్పటికే రాష్ట్రంలో కలసి పనిచేస్తున్న ఐరిటెక్‌. ఈ నెల 10 తర్వాత రాష్ట్రానికి వస్తానన్న కిమ్‌ డెహోన్‌. ఏపీ ప్రభుత్వం అమలు చేయదలచిన భూదార్‌ను సీఎం వివరించారు.
పోస్కోదేవూ: భారత్‌లో ఎల్‌ఎన్జీ వాల్వ్‌ చెయిన్‌ ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నామని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షులు జుసీబో వెల్లడి. కాకినాడ పరిసర ప్రాంతాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని వివరించిన సీఎం.
హ్యోసంగ్‌: నైలాన్‌ పాలిస్టర్‌ రంగంలో అనుభవమున్న ఈ సంస్థ భారత్‌లో పెట్టుబడులు పెట్టనుంది. ఆంధ్రాకు వస్తే ఏ రాష్ట్రం ఇవ్వలేనంత రాయితీలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు.
కోకమ్‌: ఎనర్జీ స్టోరేజీలో ప్రసిద్ధ సంస్థ. జీవితకాలం పనిచేసే అత్యాధునిక బ్యాటరీల తయారీపై పరిశోధనలు చేస్తున్నట్లు చంద్రబాబుకు ఆ సంస్థ సీఈఓ జేజే హాంగ్‌ వివరించారు. భారత్‌తో తమకు అనుబంధం ఉందని, కొరియా భాషలో పది శాతం పదాలు సంస్కృతం నుంచే వచ్చాయని వెల్లడించారు.
హెనోల్స్‌ కెమికల్స్‌: ఆంధ్రాలో నీటిశుద్ది పరిశ్రమల ఏర్పాటుకున్న అవకాశాలపై ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గెనెబోక్‌ కిమ్‌ ఆసక్తి. స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించే పెయింట్‌ను కూడా తయారు చేసే ఈ సంస్థను విశాఖ భాగస్వామ్య సదస్సుకు సీఎం ఆహ్వానించారు. గ్రాన్‌ సియోల్‌ సంస్థ ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు.

Link to comment
Share on other sites

కొరియా నగరం: అనంతపురం జిల్లాలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు. తొలిదశలో 700 ఎకరాలు సేకరిస్తారు. మూడుదశల్లో మొత్తం రూ.10వేల కోట్ల పెట్టుబడులకు 37 కొరియా సంస్థలు ముందుకొచ్చాయి. పారిశ్రామిక నగరం, టౌన్‌షిప్‌, నక్షత్రాల హోటళ్లు, రిసార్టులు, గోల్ఫ్‌కోర్సు లాంటివి ఏర్పాటు చేస్తారు. ప్రాథమికంగా 9వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది. మూడుదశలయ్యేటప్పటికి 40 వేల మందికి ఉపాధి కల్పించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి, ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)తో పలు కొరియా సంస్థలు అంగీకార పత్రాల (లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌)పై సంతకాలు చేశాయి. ఇక్కడ కనీసం వంద కొరియా సంస్థలు వస్తాయని అంచనా.
కియా విక్రేత సంస్థలు: కియాకు చెందిన 17 విక్రేత పరిశ్రమలు, ఏపీఐఐసీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. విడిభాగాలు తయారు చేసే ఈ సంస్థలు ఇక్కడ రూ.4,995 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. 7,171 మందికి ఉపాధి లభించనుంది.

Link to comment
Share on other sites

Govt. kuda schools, transportation facilities (bus stand, depot, rail connection) and hospitals kuda plan cheyyali

choostha vunte leader vatini asalu pattinchukovatla

same thing happened with Hitech city area

 

antha private ante - total money minded avuthundi

Edited by rk09
Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:

CRDA lo transportation master plan jica vadu chesthunadu bro

cool - but want to see it by govt. only like APSRTC busstands, depots, hospitals. If its private partnership and you know - what happens later especially when govt. changes

Link to comment
Share on other sites

1 hour ago, rk09 said:

Govt. kuda schools, transportation facilities (bus stand, depot, rail connection) and hospitals kuda plan cheyyali

choostha vunte leader vatini asalu pattinchukovatla

same thing happened with Hitech city area

 

antha private ante - total money minded avuthundi

First Penukonda revamp cheyali. Roads widen cheyali and sanitation care teesukovali. Penukonda is the nearest town for basic shopping. Road to puttaparthi is in pathetic condition and should be doubled.

As you said, Railway station develop cheyali, trains halt ivvali and ROB's, doubling and electrification are already planned and will finish in feb 2019.

Only govt hospital, no famous private hospital in penukonda, but Puttaparthi hospital and saveera hospital in Anathapur might cater the needs for time being.

Local leaders should bring up all these issues to the CM and get them sorted out.

 

 

 

 

 

 

 

 

 

 

 

Link to comment
Share on other sites

కొరియాంధ్ర
22-10-2018 02:39:58
 
  • విస్తృత పెట్టుబడులకు దక్షిణ కొరియా సంస్థల ఆసక్తి
  • ఆహార, వస్తు తయారీపై దృష్టి
  • అపెరల్‌-టెక్స్‌టైల్స్‌ రంగాల్లోనూ పెట్టుబడులు
  • లక్షా 30 వేల మందికి ఉపాధి దొరికే అవకాశం!
  • నేడు ముఖ్యమంత్రితో ఆ సంస్థల ప్రతినిధుల భేటీ
అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఏపీలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియా పారిశ్రామిక సంస్థలు సంసిద్ధత వ్యక్తంచేస్తున్నాయి. వెనుకబడ్డ జిల్లా అనంతపురంలో దక్షిణ కొరియాకు చెం దిన కార్ల తయారీ దిగ్గజ సంస్థ ‘కియ’ తన ప్లాంటును పెట్టాక.. దాదాపు 17 సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఇప్పుడు ఆ దేశానికి చెందిన ఆహార త యారీ, వస్తు తయారీ, అపెరల్‌-టెక్స్‌టైల్‌ సంస్థలు పెట్టుబడుల ప్రతిపాదనలతో వస్తున్నాయి.
 
 
ఈ సంస్థల ప్రతినిధులు సోమవారం విజయవాడ రానున్నారు. సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. ‘కి య’ యూనిట్‌తో 10 వేల మందికి ఉపాధి కలుగుతుంటే.. ఇప్పుడు వీటి వల్ల ఏకంగా 1,30,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఏపీఈడీబీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నా యి. కొరియా సంస్థల ప్రతినిధులు తొలుత రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. అనంతరం సీఎంను కలుస్తారు. ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నదీ వివరిస్తారు. ఈ ప్రతిపాదనలకు సీఎం ఆమోద ముద్ర వేస్తే ఆయా సంస్థలు తరలివస్తాయి.
 
 
2029 నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి 1000 బిలియన్‌ డాలర్లు..
కొరియా ప్రతినిధులకు ఏపీఈడీబీ ఈ సందర్భంగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనుంది. ఏటికేడాదీ రాష్ట్రాభివృద్ధికి నిర్దుష్ట లక్ష్యాలను నిర్దేశించుకుంటూ పా లన సాగిస్తోందని, తత్ఫలితంగా 2029 నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి 1000 బిలియ న్‌ డాలర్లకు చేరుకుంటుందని తెలియజేస్తుంది. రాష్ట్రప్రభుత్వ ఈజ్‌ ఆఫ్‌ డూయిం గ్‌ బిజినెస్‌ విధానంవల్ల నాలుగేళ్లలో 706 సంస్థలు 22.18 బిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టి 3 లక్షల మందికి ఉపాధిని కల్పించాయని.. మరో 612 సంస్థల స్థాప న వివిధ దశల్లో ఉందని.. 156.72 బిలియ న్‌ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయని వెల్లడించనుంది.
 
 
ప్రకాశం జిల్లాలో ఆసియా పల్ప్‌ అండ్‌ పేపర్‌ మిల్స్‌
వెనుకబడిన ప్రకాశం జిల్లాలో రూ.20,000 కోట్ల భారీ పెట్టుబడితో ఆసియా పల్ప్‌ అండ్‌ పేపర్‌ మిల్స్‌ రానుంది. ఇందుకు సంబంధించి సంప్రదింపులన్నీ పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వంతో త్వరలోనే అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నది. ఈ యూనిట్‌ వస్తే 20,000 మందికి ఉపాధి లభిస్తుంది. ప్రధానంగా కాగిత పరిశ్రమకు అవసరమైన గుజ్జు కోసం 50,000 మంది రైతులతో అవగాహన కుదుర్చుకోనుంది. ప్రకాశం జిల్లా రైతాంగానికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది.
 
  •  
Link to comment
Share on other sites

రాష్ట్రంలో కొరియా నౌకా నిర్మాణం
23-10-2018 02:38:16
 
636758590973202648.jpg
  •  అమరావతిలో దక్షిణ కొరియా పారిశ్రామిక ప్రాంతం
  •  ఆటోమొబైల్‌, ఆహార తయారీ, నిర్మాణ రంగాలలో పెట్టుబడులకు ఆసక్తి
  •  సీఎం చంద్రబాబుతో సమావేశమైన ‘బుసాన్‌’ బృందం
అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దక్షిణ కొరియా పారిశ్రామిక సంస్థలు నౌకా నిర్మాణం విభాగాన్ని స్థాపించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. నీటి శుద్ధి ప్రక్రియ సాంకేతికను అందించటానికి బుసాన్‌ బృందం ముందుకొచ్చింది. రాష్ట్రంలో ప్రధానంగా ఆహార, వస్తు తయారీ పరిశ్రమలు, ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌, నిర్మాణ రంగం, నౌకా నిర్మాణ రంగాలపై ఈ బృందం ప్రధానంగా దృష్టి సారించింది. దక్షిణ కొరియాలోని భారత రాయబారి జియాంగ్‌ డాక్‌ మిన్‌ నేతృత్వంలో బుసాన్‌ పారిశ్రామికవేత్తలతో కూడిన 20మంది సభ్యుల బృందం సోమవారం ఉండవల్లి ప్రజావేదికలో సీఎం చంద్రబాబుతో భేటీ అయింది. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామంటూ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో 974 కిలో మీటర్ల పొడవైన సముద్ర తీర ప్రాంతం... భారీ, చిన్నతరహా ఓడరేవులు ఉన్నందున రాష్ట్రంలో లక్షలాది మందికి ఉపాధిని కల్పించేలా షిప్‌ బిల్డింగ్‌ యూనిట్‌ను స్థాపించేందుకు సుముఖంగా ఉన్నామని బుసాన్‌ పారిశ్రామిక బృందం తెలిపింది.
 
శ్రీకాకుళం జిల్లాలో ఈ యూనిట్‌ను పెట్టే ఆలోచనలో ఉన్నామని, ఇప్పటికే దీనిపై కసరత్తు చేశామని ఆ ప్రతినిధులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ‘‘దక్షిణ కొరియా, ఆంధ్రప్రదేశ్‌లకు పలు అంశాలలో సారూప్యత ఉంది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి’’ అన్నారు. రాష్ట్రంలో కొరియా పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసేందుకు గతంలో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. రాష్ట్రంలో అంతర్గత జల రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో కొరియన్‌ పారిశ్రామిక నగరం ఏర్పాటు చేయాలని బుసాన్‌ బృందాన్ని కోరిన ముఖ్యమంత్రి అమరావతిలోనూ దక్షిణ కొరియా పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో షిప్‌ బిల్డింగ్‌ యూనిట్‌ను స్థాపించాలని బూసాన్‌ పారిశ్రామిక బృందం ముందుకు రావడాన్ని సీఎం ఆహ్వానించారు. సముద్ర రవాణాలో దేశంలోనే ఏపీ రెండో స్థానం సాధించిందని చెప్పారు. రాష్ట్రం నుంచి మూడు రాష్ట్రాలకు అంతర్గత జల రవాణా మార్గాల్లో సరుకు రవాణాకు ఆస్కారం ఉందన్నారు. సీఎం చంద్రబాబుకు కొరియన్‌ పారిశ్రామికవేత్తల బృందాన్ని ఈడీబీ సీఈవో కృష్ణ కిశోర్‌ పరిచయం చేశారు. సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి పాల్గొన్నారు.
 
సొమ్మసిల్లిన కొరియన్‌ ప్రతినిధి
భేటీలో భాగంగా కొరియన్‌ ప్రతినిధులను వ్యక్తిగతంగా సీఎం చ్రందబాబు సన్మానించారు. ఆ తర్వాత సీఎం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలో కొరియన్‌ పారిశ్రామిక ప్రతినిధి ఒకరు సొమ్మసిల్లి పడిపోయారు. ఉన్నపళంగా పడిపోవడంతో ఆ పారిశ్రామికవేత్త దవడకు గాయమైంది. సీఎం నివాసంలో ఉండే వైద్యులు వెంటనే ఆయనకు కుట్లు వేసి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ వెంటనే మంత్రి అమరనాథరెడ్డి హుటాహుటిన ఆ ప్రతినిధిని విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
Link to comment
Share on other sites

అమరావతిలోనూ దక్షిణకొరియా వాడ
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
ఉండవల్లిలో సీఎంను కలిసిన ఆ దేశ పారిశ్రామికవేత్తల బృందం
నౌకా నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత
22ap-state1a.jpg

ఈనాడు, అమరావతి: ‘కొరియా దేశపు పరిశ్రమలతో అనంతపురం జిల్లా అతి స్వల్పకాలంలో ఆటోహబ్‌గా మారింది. అదే స్ఫూర్తితో అమరావతిలోనూ దక్షిణ కొరియా పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దక్షిణ కొరియాలో భారత కాన్సుల్‌ జనరల్‌ జియాంగ్‌ డాక్‌ మిన్‌ ఆధ్వర్యంలో ఆ దేశ పారిశ్రామికవేత్తల బృందం సోమవారం రాత్రి ఉండవల్లిలోని ప్రజావేదిక సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసింది. నౌకా నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు, నీటిని శుద్ధి చేసే సాంకేతికతను రాష్ట్రానికి అందించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు, దక్షిణ కొరియాకు కొన్ని అంశాల్లో సామీప్యత ఉందని వ్యాఖ్యానించారు. కొరియా ప్రజలు సృజనతో క్రియాశీలకంగా ఉంటారని, వారి నుంచి ప్రేరణ పొంది రాష్ట్రంలో బూసాన్‌ తరహా పారిశ్రామిక నగరాన్ని తీర్చిదిద్దడానికి సిద్ధమయ్యామని ఆయన గుర్తు చేశారు. నీటి శుద్ధిలో దక్షిణ కొరియా సాధించిన ప్రగతి కొత్త రాష్ట్రానికి ఉపయోగపడుతుందన్న ఆకాంక్షను ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. బూసాన్‌ నుంచి మరిన్ని పరిశ్రమలు తీసుకురాడానికి సహకరించాలని ప్రతినిధుల బృందాన్ని కోరారు. 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

నౌకా రంగంలో పెట్టుబడులు అభినందనీయం
రాష్ట్రంలో అనేక ఓడరేవులను అభివృద్ధి చేస్తున్న దశలో నౌకా నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం అభినందనీయమని చంద్రబాబు అన్నారు. ప్రపంచస్థాయి మెగా పోర్టులతో సముద్ర రవాణాలో అతి పెద్ద లాజిస్టిక్‌ కేంద్రంగా ఉన్న బూసాన్‌ నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టడం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సముద్ర రవాణాలో దేశంలోనే రెండు స్థానాన్ని సాధించామని ప్రతినిధుల బృందానికి చంద్రబాబు వివరించారు. తూర్పు తీర ముఖ ద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడులకు అన్ని విధాలా అనుకూలమని అన్నారు. ఇక్కడి నుంచి మూడు రాష్ట్రాలకు కాలువల ద్వారా సరుకు రవాణా చేయాలన్నదే లక్ష్యమని, అటోమొబైల్‌ రంగంలోనూ సానుకూల వాతావరణాన్ని నెలకొల్పడంతో కియా వంటి దిగ్గజ సంస్థ రాష్ట్రానికి వచ్చిందని వివరించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి కార్యనిర్వాహకాధికారి జాస్తి కృష్ణ కిశోర్‌ తొలుత కొరియా పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. సమావేశంలో పరిశ్రమలశాఖ మంత్రి అమరనాధరెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

స్పృహతప్పి పడిన కొరియన్‌ పారిశ్రామికవేత్త
ఈనాడు డిజిటల్‌, అమరావతి: చంద్రబాబును ఉండవల్లిలో సోమవారం రాత్రి కలిసి బయటికి వస్తున్న దక్షిణ కొరియా పారిశ్రామిక ప్రతినిధుల బృందంలో ఒకరు  స్పృహతప్పి కిందపడిపోయారు. మంత్రి అమరనాధరెడ్డి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి సీఈవో కృష్ణకిశోర్‌ వెంటనే తమ వాహనంలో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అధిక రక్తపోటు కారణంగా స్పృహతప్పినట్లు వైద్యులు గుర్తించి చికిత్స అందిస్తున్నారు.

Link to comment
Share on other sites

5 hours ago, Jaitra said:

Korea,vallu vasthey gettigaa,Ap thalaraatha maaripothundhi

Culture marali AP lo.... labor shortage undhi AP lo.... janaalu kastapadey tatwam taggutondi.... oka section mathramey kastapadutondi.... those who has no option rather than to work hard are working hard. Some sections are enjoying freebies and some sections have become blood suckers. 

Edited by sskmaestro
Link to comment
Share on other sites

1 hour ago, sskmaestro said:

Culture marali AP lo.... labor shortage undhi AP lo.... janaalu kastapadey tatwam taggutondi.... oka section mathramey kastapadutondi.... those who has no option rather than to work hard are working hard. Some sections are enjoying freebies and some sections have become blood suckers. 

Thanks to all our political parties and governments. Okadu rice isthaam ante okadu vandi pedathaam antaadu,.. :wall: .

Young country in the world thokka thotakura ani meetings lo chepthaam, sankshemam ani cheppi somaripothulani chesthaam. em pani cheyyakunda oorkane time pass cheyyalane untadi evadikaina, kadupu kalutuntene kada pani chesukunedi, motham meeda monthly illu nadipedi govt panchi ichi, neeku vache naalugu chillara ralla ki thaagi paduko, malli aa taxes ye neeku panchuthaamu :wall:

Yuva nestham, Youngsters ki kontha varaku ivvu thappu ledu, kani make sure all the beneficiaries are being listed and collect back from them as and when they get to earn. On top of that, govt also must make them responsible for that money. Training ippinchi, job techukune daaka vallaki help cheyyi thappuledu, ichina aa dabbulu repay cheyinchuko,.. emi undadu,.. ee panchataalento.. same case with Raithu bandhu anta(naa state kaadu so :run_dog:)

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...