Jump to content

Kadapa steel plant


sonykongara

Recommended Posts

హామీలు అమలు చేస్తాం
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై అధ్యయనం జరుగుతోంది
కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌ స్పష్టం చేశారు. ఏపీలోని కడప, తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు పరిశ్రమల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోందని తెలిపారు. గురువారం దిల్లీలో ఏపీ గనులశాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు, తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌, కేంద్ర సహాయమంత్రి సుజనాచౌదరి, సెయిల్‌, మెకాన్‌ అధికారులతో కలిసి చౌదరి బీరేంద్రసింగ్‌ కార్యదళ(టాస్క్‌ఫోర్స్‌) సమావేశం నిర్వహించారు. అనంతరం కేంద్రమంత్రి సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమల ఏర్పాటుపై గతంలో ఏర్పాటు చేసిన కార్యదళం భిన్నాభిప్రాయాలు వెల్లడించిందన్నారు. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరికొంత సమాచారం కేంద్రానికి పంపించడంతో దానిపై కార్యదళం అధ్యయనం చేస్తోందన్నారు. నెలరోజుల అనంతరం మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. స్వల్ప, దీర్ఘకాలిక మార్గాల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, త్వరలోనే తెలుగు రాష్ట్రాల ప్రజలు తీపి కబురు వింటారని చౌదరి బీరేంద్రసింగ్‌ తెలిపారు.

విశాఖపట్నంలో రూ.6కోట్లతో ఆటోమొబైల్‌ రంగానికి అవసరమైన కోల్డ్‌రోల్డ్‌ కాయిల్స్‌ స్టీల్‌ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ఉక్కుశాఖ సముఖత వ్యక్తం చేసిందని ఏపీ మంత్రి సుజయకృష్ణ  తెలిపారు. దీనికి అవసరమైన భూమి, విద్యుత్తు, గ్యాస్‌ ఇతర అవసరాలను రాష్ట్రం సమకూరిస్తే స్టీల్‌ అథారిటీఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో పరిశ్రమ ఏర్పాటుకి అనుమతించనున్నట్లు కేంద్రమంత్రి సూచించారన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి నివేదిక ఇస్తామని చెప్పినట్లు తెలిపారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకి కేంద్రం సముఖంగా ఉందని చెప్పారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన సాధ్యాసాధ్యాలపై మెకాన్‌ సంస్థ పరిశీలన జరిపి నివేదికను కేంద్రానికి ఇప్పటికే సమర్పించిదన్నారు. దీనిపై సమావేశంలో చర్చించగా స్వల్ప, దీర్ఘకాలిక అంశాలపై మరిన్ని నివేదికలు కోరారని తెలిపారు. కేంద్ర సహాయమంత్రి సుజనాచౌదరి మాట్లాడుతూ.. కడపలో ఉక్కుపరిశ్రమ, విశాఖలో కోల్డ్‌రోల్డ్‌ కాయిల్స్‌ పరిశ్రమలతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నా

Link to comment
Share on other sites

  • Replies 60
  • Created
  • Last Reply

Top Posters In This Topic

తెలుగు రాష్ట్రాలకు త్వరలోనే శుభవార్త
కేంద్రమంత్రి బీరేంద్రసింగ్‌
దిల్లీ: ఉక్కు పరిశ్రమలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు త్వరలో శుభవార్త వింటాయని కేంద్రమంత్రి బీరేంద్రసింగ్‌ అన్నారు. ఈరోజు దిల్లీలో కేంద్రమంత్రి బీరేంద్రసింగ్‌తో కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఏపీ మంత్రి సుజయకృష్ణ రంగారావు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. విభజన చట్టంలో హామీ మేరకు కడప, బయ్యారంలో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుపై చర్చించారు. సుమారు 2 గంటల పాటు సాగిన సమావేశంలో విభజన చట్టం హామీలు నిలబెట్టుకోవాలని బీరేంద్రసింగ్‌ను కోరారు.

ఈ సందర్భంగా బీరేంద్రసింగ్‌ మాట్లాడుతూ.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉందన్నారు. టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నెలరోజుల్లో నివేదిక ఇస్తుందన్నారు. స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా ఏ తరహాఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చ జరిగినట్లు తెలిపారు. నెల రోజుల తర్వాత మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఉక్కు నాణ్యత అధ్యయనానికి టాస్క్‌ఫోర్స్‌ కమిటీకి సమయం పడుతుందని పేర్కొన్నారు.

‘కడపలో ఉక్కు కర్మాగారం వచ్చి తీరుతుంది. దీని ద్వారా కడప వాసులకు ఉద్యోగాలు వ‌స్తాయి. క‌డ‌ప ఉక్కు క‌ర్మాగారానికి, విశాఖ‌లో ఏర్పాట‌య్యే క‌ర్మాగారానికి సంబంధం లేదు` అని కేంద్రమంత్రి సుజనాచౌదరి స్పష్టం చేశారు.

విశాఖ‌లో మ‌రో ఉక్కు ఫ్యాక్ట‌రీ
‘కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరాలు అడిగారు. విశాఖలో మరో ఉక్కు క‌ర్మాగారం ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నిర్ణ‌యం మేర‌కు విశాఖ‌లో మ‌రో ఉక్కు క‌ర్మాగారం ఏర్పాట‌వుతుంది` అని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి సుజయకృష్ణ రంగారావు తెలిపారు.

Link to comment
Share on other sites

‘కడప ఉక్కు’ చకచకా..!
24-11-2017 02:53:53

    ఏర్పాటు ప్రక్రియ వేగవంతం
    త్వరలోనే టాస్క్‌ఫోర్స్‌ నివేదిక
    కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్‌ వెల్లడి
    నెలలో మెకాన్‌ రిపోర్టు: సుజనా
    అన్ని వనరులూ ఉన్నాయి: సుజయకృష్ణ
    ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం

న్యూఢిల్లీ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రక్రియను వేగవంతం చేస్తామని కేంద్ర ఉక్కు మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని, ఇందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీ ఉద్యోగ్‌ భవన్‌లో బీరేంద్ర సింగ్‌ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
 
ఆంధ్రప్రదేశ్‌ తరపున కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర గనుల మంత్రి సుజయకృష్ణ రంగారావు పాల్గొన్నారు. అనంతరం బీరేంద్ర సింగ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. తమ శాఖ నియమించిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ తన మధ్యంతర నివేదికను త్వరలో ఇవ్వనుందని, మిగతా అంశాలపై నిపుణుల సహకారం అవసరమని వెల్లడించారు.
 
కడపలో ఉక్కు ఫ్యాక్టరీ వ్యవహారం చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని, దీనిని త్వరగా తేల్చి ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. సుజయకృష్ణ మాట్లాడుతూ.. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని వనరులు ఉన్నాయని, భూమి, నీరు, విద్యుత్‌ తదితర సదుపాయాలను రాష్ట్రప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. స్వల్పకాలిక, దీర్ఘకాలికంగా ప్రణాళికలు రూపొందించి దీర్ఘకాలికంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై పూర్తి సమాచారమివ్వాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందని చెప్పారు. ఆ సమాచారం వచ్చాక సానుకూల నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు. అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో సహజసిద్ధంగా ఉన్న ఐరన్‌ ఓర్‌ గనుల్లోని ముడి సరుకును ఉపయోగించి కడప జిల్లాలో స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరామని చెప్పారు.
 
దీనివల్ల రాయలసీమ అభివృద్ధి చెందడమే కాకుండా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. 150 మిలియన్‌ టన్నుల ముడిసరుకు అందుబాటులో ఉందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్‌ కేంద్రానికి నివేదిక అందజేసిందని సుజనా చౌదరి తెలిపారు. మెకాన్‌ సంస్థ తన నివేదికను నెల రోజుల్లో ఇస్తుందని, కడపకు ఉక్కు ఫ్యాక్టరీ వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి అరుణా శర్మ, రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్‌, ఏపీఎండీసీ చైర్మన్‌ వెంకయ్యచౌదరి, ఏపీ భవన్‌ అదనపు రెసిడెంట్‌ కమిషనర్‌ అర్జా శ్రీకాంత్‌, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, మెకాన్‌ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. 

Link to comment
Share on other sites

విశాఖలో కోల్డ్‌ రోల్డ్‌ కాయిల్స్‌ స్టీల్‌ ప్లాంట్‌
24-11-2017 02:55:38

    రూ.6 వేల కోట్లతో సెయిల్‌ ప్రతిపాదన

రూ.6 వేల కోట్ల వ్యయంతో విశాఖపట్నంలో కోల్డ్‌ రోల్డ్‌ కాయిల్స్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ ప్లాంటు ఏర్పాటుకు విశాఖే అనువైన ప్రాంతమని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) ప్రతిపాదించింది. ఇక్కడ సాధారణ ఉక్కును అటోమొబైల్స్‌ పరికరాల తయారీకి అనుగుణంగా తీర్చిదిద్దుతారు. అయితే ఈ ప్లాంటు కోసం కొన్ని రాయితీలు ఇవ్వాలని సెయిల్‌ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా.. సీఎం చంద్రబాబుతో చర్చించి చెబుతామని కేంద్ర మంత్రి సుజనాచౌదరి వారికి తెలియజేశారు. అనంతరం ఆయన, సుజయకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ.. కోల్డ్‌ రోల్డ్‌ కాయిల్స్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై త్వరలో సీఎంతో చర్చిస్తామని.. భూమి, నీరు, విద్యుత్‌ సమకూర్చే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
నవ్యాంధ్రకు ఉక్కు వరం
09-12-2017 02:01:33
 
636483816945218924.jpg
 
  • రాష్ట్రానికి ‘ఆటోగ్రేడ్‌ స్టీల్‌’ తయారీ ప్లాంటు
  • రూ.15వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు
  • సెయిల్‌, మిట్టల్‌ సంయుక్త భాగస్వామ్యం
  • ప్లాంటు కోసం గుజరాత్‌, ఏపీ పోటీ
  • నవ్యాంధ్రకు కలిసొచ్చిన ‘తూర్పు తీరం’
  • కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేందర్‌ సింగ్‌ ప్రకటన
హైదరాబాద్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రకు మరో భారీ పరిశ్రమ వస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన ‘సెయిల్‌’, అంతర్జాయతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్‌ మిట్టల్‌ సంయుక్తంగా ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నాయి. కార్లు, ఇతర వాహనాల తయారీలో ఉపయోగించే అత్యుత్తమ ఉక్కు (హై ఎండ్‌ ఆటోమోటివ్‌ స్టీల్‌)ను ఈ ప్లాంటులో ఉత్పత్తి చేస్తారు. రూ.15వేల కోట్ల పెట్టుబడితో ఈ ఉక్కు కర్మాగారం ఏర్పాటు కానుంది. ఉక్కు శాఖ మంత్రి చౌదురి బీరేందర్‌ సింగ్‌ శుక్రవారం హైదరాబాద్‌లో స్వయంగా ఈ విషయం ప్రకటించారు. ‘‘తమ రాష్ట్రాల్లోనే ఈ ప్లాంటు ఏర్పాటు చేయాల్సిందిగా గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ కోరాయి. అయితే... తూర్పు తీరాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీలోనే దీనిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావిస్తున్నాం’’ అని బీరేందర్‌ సింగ్‌ తెలిపారు. దీనిపై సెయిల్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌ జాయింట్‌ వెంచర్‌ను 1birendra.jpgఏర్పాటవుతుందని, ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదురుతుందని ఆయన తెలిపారు. ‘‘ఆర్సెలార్‌ మిట్టల్‌ వద్ద ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానం ఉంది. దీనిని సెయిల్‌తో కలిసి పంచుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది. సంయుక్త భాగస్వామ్యంపై కసరత్తు 99 శాతం పూర్తయిపోయింది. ఒక వారం లేదా రెండు వారాల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది’’ అని కేంద్ర మంత్రి వివరించారు.
 
కార్ల తయారీ హబ్‌గా భారత్‌..
వచ్చే నాలుగేళ్లలో భారత్‌ ప్రపంచ కార్ల తయారీ హబ్‌గా మారే అవకాశం ఉందని మంత్రి బీరేందర్‌ సింగ్‌ తెలిపారు. ప్రపంచంలోని కార్ల తయారీలో భారత్‌ వాటా 28 శాతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వాహన తయారీకి ఉపయోగించే హైఎండ్‌ స్టీల్‌ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరముందని చెప్పారు.
సెయిల్‌-ఆర్సెలార్‌ మిట్టల్‌ భాగస్వామ్యంలో ఏర్పాటు కానున్న ఈ ఆటోగ్రేడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 15 లక్షల టన్నులుగా ఉండనుందని చెప్పారు. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తిని 25 లక్షల టన్నులకు పెంచుకునే వెసులుబాటు ఉందని అన్నారు. భారత్‌లో ఆటో గ్రేడ్‌ స్టీల్‌ తయారీలో చేతులు కలపడంపై అవకాశాలు పరిశీలించాలని 2015లో సెయిల్‌-ఆర్సెలార్‌ మిట్టల్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఇది మరో అడుగు ముందుకు పడింది. మరోవైపు... ఎన్‌ఎండీసీ ఉద్యోగుల కొత్త వేతన సవరణపై శనివారం ప్రకటన చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు.
Link to comment
Share on other sites

3 minutes ago, sonykongara said:
నవ్యాంధ్రకు ఉక్కు వరం
09-12-2017 02:01:33
 
636483816945218924.jpg
 
  • రాష్ట్రానికి ‘ఆటోగ్రేడ్‌ స్టీల్‌’ తయారీ ప్లాంటు
  • రూ.15వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు
  • సెయిల్‌, మిట్టల్‌ సంయుక్త భాగస్వామ్యం
  • ప్లాంటు కోసం గుజరాత్‌, ఏపీ పోటీ
  • నవ్యాంధ్రకు కలిసొచ్చిన ‘తూర్పు తీరం’
  • కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేందర్‌ సింగ్‌ ప్రకటన
హైదరాబాద్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రకు మరో భారీ పరిశ్రమ వస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన ‘సెయిల్‌’, అంతర్జాయతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్‌ మిట్టల్‌ సంయుక్తంగా ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నాయి. కార్లు, ఇతర వాహనాల తయారీలో ఉపయోగించే అత్యుత్తమ ఉక్కు (హై ఎండ్‌ ఆటోమోటివ్‌ స్టీల్‌)ను ఈ ప్లాంటులో ఉత్పత్తి చేస్తారు. రూ.15వేల కోట్ల పెట్టుబడితో ఈ ఉక్కు కర్మాగారం ఏర్పాటు కానుంది. ఉక్కు శాఖ మంత్రి చౌదురి బీరేందర్‌ సింగ్‌ శుక్రవారం హైదరాబాద్‌లో స్వయంగా ఈ విషయం ప్రకటించారు. ‘‘తమ రాష్ట్రాల్లోనే ఈ ప్లాంటు ఏర్పాటు చేయాల్సిందిగా గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ కోరాయి. అయితే... తూర్పు తీరాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీలోనే దీనిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావిస్తున్నాం’’ అని బీరేందర్‌ సింగ్‌ తెలిపారు. దీనిపై సెయిల్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌ జాయింట్‌ వెంచర్‌ను 1birendra.jpgఏర్పాటవుతుందని, ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదురుతుందని ఆయన తెలిపారు. ‘‘ఆర్సెలార్‌ మిట్టల్‌ వద్ద ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానం ఉంది. దీనిని సెయిల్‌తో కలిసి పంచుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది. సంయుక్త భాగస్వామ్యంపై కసరత్తు 99 శాతం పూర్తయిపోయింది. ఒక వారం లేదా రెండు వారాల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది’’ అని కేంద్ర మంత్రి వివరించారు.
 
కార్ల తయారీ హబ్‌గా భారత్‌..
వచ్చే నాలుగేళ్లలో భారత్‌ ప్రపంచ కార్ల తయారీ హబ్‌గా మారే అవకాశం ఉందని మంత్రి బీరేందర్‌ సింగ్‌ తెలిపారు. ప్రపంచంలోని కార్ల తయారీలో భారత్‌ వాటా 28 శాతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వాహన తయారీకి ఉపయోగించే హైఎండ్‌ స్టీల్‌ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరముందని చెప్పారు.
సెయిల్‌-ఆర్సెలార్‌ మిట్టల్‌ భాగస్వామ్యంలో ఏర్పాటు కానున్న ఈ ఆటోగ్రేడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 15 లక్షల టన్నులుగా ఉండనుందని చెప్పారు. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తిని 25 లక్షల టన్నులకు పెంచుకునే వెసులుబాటు ఉందని అన్నారు. భారత్‌లో ఆటో గ్రేడ్‌ స్టీల్‌ తయారీలో చేతులు కలపడంపై అవకాశాలు పరిశీలించాలని 2015లో సెయిల్‌-ఆర్సెలార్‌ మిట్టల్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఇది మరో అడుగు ముందుకు పడింది. మరోవైపు... ఎన్‌ఎండీసీ ఉద్యోగుల కొత్త వేతన సవరణపై శనివారం ప్రకటన చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు.

Already mana English master edusadu ga ? 

Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్‌లో హై ఎండ్‌ ఆటో గ్రేడ్‌ స్టీల్‌ ప్లాంట్‌!
09-12-2017 01:18:13
 
636483790950361784.jpg
  • సెయిల్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌ జెవి
  • ఉక్కు శాఖ మంత్రి బీరేందర్‌ సింగ్‌ వెల్లడి
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): హై ఎండ్‌ ఆటోమోటివ్‌ స్టీల్‌ ఉత్పత్తి కోసం దేశీయ ఉక్కు ఉత్పత్తి దిగ్గజం సెయిల్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌ త్వరలో జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయని ఉక్కు శాఖ మంత్రి చౌదురి బీరేందర్‌ సింగ్‌ వెల్లడించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఇరు సంస్థలు ఒప్పందంపై సంతకాలు చేసుకోనున్నాయని ఆయన చెప్పారు. ఆర్సెలార్‌ మిట్టల్‌ వద్ద ఉన్న టెక్నాలజీని సెయిల్‌ ఈ భాగస్వామ్యంతో వినియోగించుకోవాలని చూస్తోందని తెలిపారు. రానున్న రెండు వారాల్లో జాయింట్‌ వెంచర్‌కు సంబంధించిన ప్రయత్నాలు తుది దశకు చేరుకోనున్నాయని ఆయన పేర్కొన్నారు. సంయుక్త భాగస్వామ్యం కోసం ఎలాంటి సంతకాలు చేసుకోనున్నప్పటికీ ఇందుకు సంబంధించి ఫార్మాలిటీస్‌ అన్నీ పూర్తయ్యాయని మంత్రి చెప్పారు. ఈ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఆఫర్లు వచ్చాయని సింగ్‌ తెలిపారు. అయితే భాగస్వామ్య ప్లాంట్‌ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ అయితే బెటర్‌గా ఉంటుందని భావిస్తున్నట్లు బీరేందర్‌ సింగ్‌ వెల్లడించారు.
 
కార్ల తయారీ హబ్‌గా భారత్‌..
వచ్చే నాలుగేళ్లలో భారత్‌ కార్ల తయారీ హబ్‌గా మారే అవకాశం ఉందని మంత్రి బీరేందర్‌ సింగ్‌ అన్నారు. ప్రపంచంలోని కార్ల తయారీలో భారత్‌ వాటా 28 శాతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. హై- ఎండ్‌ స్టీల్‌ ఉత్పత్తితో ఈ రంగం మరింత వృద్ధిలోకి రానుందని ఆయన అన్నారు. సెయిల్‌-ఆర్సెలార్‌ మిట్టల్‌ భాగస్వామ్యంలో ఏర్పాటు కాను న్న ఈ ఆటో గ్రేడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 15 లక్షల టన్నులుగా ఉండనుందని చెప్పారు. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తిని 25 లక్షల టన్నులకు పెంచుకునే వెసులుబాటు ఉందని అన్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టు వ్యయం 15,000 కోట్ల రూపాయలని మంత్రి తెలిపారు. భారత్‌లో ఆటో గ్రేడ్‌ స్టీల్‌ తయారీ కోసం 2015లో సెయిల్‌-ఆర్సెలార్‌ మిట్టల్‌ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

 

కడప ఉక్కుపై కేంద్రం సానుకూలం
22-12-2017 01:02:35
636495044675316018.jpg
  • సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్రం హామీ
  • సాధ్యాసాధ్యాలపై ప్రతిపాదనలతో రండి: ఉపరాష్ట్రపతి వెంకయ్య
న్యూఢిల్లీ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడానికి తాము సానుకూలంగానే ఉన్నామని కేంద్రం తెలిపింది. అయితే కావాల్సిన సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలని స్పష్టం చేసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. గురువారం పార్లమెంటులో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌తో రాష్ట్ర నేతలు సమావేశమయ్యారు. ‘కడప, బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా అధ్యయనం చేసింది. ఒకసారి సాధ్యం కాదని తేలితే మరోసారి అధ్యయనం చేయించింది.
 
 
కాబట్టి ఇది ఎలా సాధ్యమో రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచనలు చేయాలి’’ అని వెంకయ్య సూచించారు. సమావేశం అనంతరం కేంద్రమంత్రి బీరేంద్రసింగ్‌ విలేకరులతో మాట్లాడుతూ... తమకు కన్సల్టెంట్‌గా ఉన్న మెకాన్‌ సంస్థను సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కాగా, స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై సంక్రాంతిలోగా సానుకూల నిర్ణయం ఉంటుందని కేంద్రమంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఇది వాణిజ్య ప్లాంటు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదీ ఉచితంగా ఇవ్వబోదని, ఈక్విటీ కింద భూమి ఇస్తుందని తెలిపారు. కడపలో కచ్చితంగా స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు అవుతుందని, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, ఎంపీ సీఎం రమేశ్‌ పేర్కొన్నారు.
 
 
మెట్రో డీపీఆర్‌ను ఆమోదించలేదు
విజయవాడ, విశాఖపట్నంలో నిర్మించతలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లను కేంద్రం ఆమోదించలేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి హర్దీప్ సింగ్‌ పూరి వెల్లడించారు. ఈ మేరకు రాజ్యసభలో ఎంపీ ఎంఏ ఖాన్‌ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
 
కొవ్వాడ అణుకేంద్రంలో మార్పుల్లేవు!
అమెరికాకు చెందిన వెస్టింగ్‌హౌజ్‌ కంపెనీతో కలిసి కొవ్వాడలో అణు విద్యుత్తు కేంద్రం ప్రాజెక్టు ఏర్పాటు ప్రణాళికలో ఎటువంటి మార్పులు లేవని, దివాళా తీసిన ఆ కంపెనీతో న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌) సంస్థ చర్చలు జరుపుతోందని స్పష్టం చేశారు. రాజ్యసభలో ఎంపీలు సీఎం రమేశ్‌, విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు గురువారం ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
Link to comment
Share on other sites

Asalu viable kadhu steel plant akkada edo time pass pakodi discussion ki paniki vasthadi e news item anthe world wide steel industry 2008-10 oka sari consolidate ayindhi ave inka profits lo ki rale malli kothadi steel ki antha demand ekkada undhi poni andhuku saripada mines unnaya kadapa lo enni rojulu ani cheptharu ma seema backward ani look at prakasam, nellore west and parts of chitoor avi backward ante kurnool kadapa and ananthapur lo konni mandals lo village ki oka class one contractor untadu mamaulu mandal level leader kuda 20 c samapainchi untadu ichina funds ni use chesukovadam radhu malli ma sommu edo dochukutinaru ani pakana vala mida padadam e mind set nundi bayataki randi govt ni adige badulu 70 years nundi tinaru kada seema leaders valani adagandi 

Link to comment
Share on other sites

Just now, koushik_k said:

ITs not profitable ani cheptane unnaru.  YSRCP ki support chese e district batch ki malli e non profitable promise kosam effort pettala endi.  Dobbamanandi 

party pakana pedithe palegala mindset unnaatha varaku inko 100 years madi inka venukabade untadi antaru

Link to comment
Share on other sites

41 minutes ago, bnalluri said:

Asalu viable kadhu steel plant akkada edo time pass pakodi discussion ki paniki vasthadi e news item anthe world wide steel industry 2008-10 oka sari consolidate ayindhi ave inka profits lo ki rale malli kothadi steel ki antha demand ekkada undhi poni andhuku saripada mines unnaya kadapa lo enni rojulu ani cheptharu ma seema backward ani look at prakasam, nellore west and parts of chitoor avi backward ante kurnool kadapa and ananthapur lo konni mandals lo village ki oka class one contractor untadu mamaulu mandal level leader kuda 20 c samapainchi untadu ichina funds ni use chesukovadam radhu malli ma sommu edo dochukutinaru ani pakana vala mida padadam e mind set nundi bayataki randi govt ni adige badulu 70 years nundi tinaru kada seema leaders valani adagandi 

In general steel industry is not doing good. but idhi Sail and LN Mittal tie up annaru kadha... ikkada steel will be used for automobiles anta..banking on automobile growth in India. land free or almost free ga vastundhi... so input cost taggi profits ravochhu emo..

Link to comment
Share on other sites

5 minutes ago, bnalluri said:

Ledhu bro next to impossible case adi e time lo antha pedda project pull off cheyadam impossible unless banks ah range loans isthe tappa 

govt nijam ga pettalanukunte loans anni vastayi... but entha varuku nijamo manaki telvadhu..

Link to comment
Share on other sites

2 hours ago, bnalluri said:

Asalu viable kadhu steel plant akkada edo time pass pakodi discussion ki paniki vasthadi e news item 

yup, kadapa deposits are very small. aa konchem kosam thousands of crores of investment chestarante nakaithe namma sakyam ga ledu. at best, beneficiation plant may be viable that too will be a politicial decision rather than a economic decision.

check this government report, page 19.

http://ibm.gov.in/writereaddata/files/06062017100713Iron and Steel 2020_2.pdf

 

Link to comment
Share on other sites

కడప ఉక్కు దిశగా మరో అడుగు 
క్షేత్రస్థాయి పరిశీలనకు రానున్న మెకాన్‌ బృందం 
దిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం 
ఈనాడు - దిల్లీ
కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై మరో ముందడుగు పడింది. ఈ అంశంపై కేంద్ర గనులశాఖ నియమించిన సలహా సంస్థ మెకాన్‌ ప్రతినిధులు జనవరి మొదటి వారంలో క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తున్నారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై బుధవారం దిల్లీలో కేంద్ర గనులశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ గనులశాఖ కార్యదర్శి శ్రీధర్‌, ఏపీఎండీసీ ఎండీ వెంకయ్యచౌదరి, కేంద్ర టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులు, మెకాన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. మెకాన్‌ సంస్థ ఇప్పటివరకూ చేసిన అధ్యయనం, గుర్తించిన అంశాలను పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించింది. జమ్మలమడుగు సమీపంలో ఉక్కు కర్మాగారానికి ఎంపిక చేసిన స్థలం, అక్కడి అనుకూలతలను రాష్ట్ర అధికారులు వివరించారు. ఈ స్థలానికి 20 కిలోమీటర్ల దూరంలో రైల్వేలైన్‌, 7 కిలోమీటర్లలో విద్యుత్తు గ్రిడ్‌, 10 కిలోమీటర్ల దూరంలో గండికోట రిజర్వాయర్‌ ద్వారా నీళ్లు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.  2 వేల ఎకరాల భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతపురం జిల్లా ఓబుళాపురం సరిహద్దుల్లో ఉన్న ఇనుప ఖనిజం గనులను ఈ పరిశ్రమకు ఇస్తామని, అక్కడ 110 మిలియన్‌ టన్నుల  నాణ్యమైన ఖనిజం ఉందని వివరించారు. స్థలం, మౌలికవసతుల పరిశీలనకు మెకాన్‌ ప్రతినిధులను ఆహ్వానించారు. జనవరి తొలి వారంలో వస్తామని ప్రతినిధులు హామీ ఇచ్చారు. జనవరి 31న తదుపరి సమావేశం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఆలోపు ఈ సంస్థ నివేదిక ఇవ్వనుంది. తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు కర్మాగారం ప్రతిపాదనలపైనా ఈ సమావేశంలో ప్రాథమికంగా చర్చించారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

సాధ్యాసాధ్యాలపై మెకాన్‌ బృందం పర్యటన
కడప, న్యూస్‌టుడే: కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను చూసేందుకు కేంద్రం నియమించిన మెకాన్‌ బృందం శుక్రవారం జిల్లాలో పర్యటించింది. నలుగురు సభ్యుల ఈ బృందం రెండు రోజులుగా అనంతపురం, కడప జిల్లాలో పర్యటిస్తోంది. గురువారం అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం గనులను పరిశీలించింది. శుక్రవారం మైలవరం మండలంలోనూ, కడప సమీప కొప్పర్తి పారిశ్రామిక వాడలో పర్యటించింది. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన విషయం తెలిసిందే.

Link to comment
Share on other sites

కడప జిల్లాలో ఏర్పాటు కావాల్సిన స్టీల్ ప్లాంట్ విషయంలో మొన్నటి వరకు కదలిక లేదు... అందరూ ఇది మన రాష్ట్రానికి రాదు అని ఫిక్స్ అయిపోయారు కూడా... రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి రావటం, ఉప రాష్ట్రపతి వెంకయ్య స్వయంగా కేంద్ర మంత్రులు, అధికారులతో రివ్యూ చెయ్యటంతో, మళ్ళీ కదలిక వచ్చింది... కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో భాగంగా మెకాన్, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు శుక్రవారం జిల్లాకు చేరుకున్నాయి. బృందం సభ్యులు మైలవరం మండలంలో ఉక్కు పరిశ్రమ ఏర్చాటుకు గల అనుకూల పరిస్థితులను అధ్యయనం చేశారు.


 


నీటి లభ్యత విషయమై మైలవరం జలాశయాన్ని బృందం సభ్యులు పరిశీలించారు. అలాగే ఎం.కంబాలదిన్నె గ్రామా పరిధిలో ఒకే ప్రాంతంలో ఉన్న 3 వేల ఎకరాల భూమి అనుకూలతను పరిశీలించి, రెవెన్యూ అధికారుల ద్వారా వివరాలు సేకరించారు. అలాగే తలమంచిపట్నం గ్రామం వద్ద ఉన్న పవర్ గ్రిడ్, ప్రధాన రహదారి అనుకూలతను పరిశీ లించారు. జమ్మలమడుగు ప్రాంతంలో రైలుమార్గం అందుబాటుపై ఆరా తీసారు.

ఈ నెలలోనే మరోసారి మెకాన్, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు మండలంలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. చివరగా సమర్పించే నివేదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బృందం సభ్యులు జిల్లా కలెక్షర్ను కలిసి మరిన్ని వివరాలు సేకరించి, తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందచేసే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తానికి మూడు రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రానికి సంబధించిన అన్ని పనులు చక చకా చేస్తుంది.. కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలి అని, ఆ అవకశాలు చూడాలి అని రాష్ట్ర విభజన బిల్లులో కూడా ఉంది...

Link to comment
Share on other sites

Tజమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమ
07-01-2018 03:43:33
ఏపీఎండీసీ సమీక్షలో మెకాన్‌ వెల్లడి
అమరావతి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లా జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమను స్థాపించేందుకు వీలుందని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ మెకాన్‌ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమలను స్థాపించడంపై ఈ సంస్థ అధ్యయనంచేపట్టింది. ఇందులో భాగంగా రెండు రోజుల కిందట అనంతపురం జిల్లా డి.హీరేహళ్‌ మండలంలో ఇనుప ఖనిజ నిక్షేపాల పై అధ్యయనం చేసింది. జమ్మలమడుగు ప్రాం తంలోని 3వేల ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఉక్కు పరిశ్రమను స్థాపించేందుకు గల అవకాశా లపైనా సమీక్షించింది. శనివారం హైదరాబా ద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీఎండీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌. వెంకయ్య చౌదరి ఆఽధ్వర్యంలో పరిశ్రమల శాఖ కమిషనర్‌ సిద్ధార్థ జైన్‌, జల వనరులశాఖ, ఇంధనశాఖ ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జమ్మలమ డుగులో ఉక్కు పరిశ్రమల స్థాపిం చాలంటే 2వేల ఎకరాల్లో ప్లాంటు, వెయ్యి ఎకరాల్లో గ్రీనరీ పెంచాలనే నిబంధనలు ఉన్నాయని మెకాన్‌ పేర్కొంది. కాగా.. ఈ సంస్థ ఆదివారం తెలంగాణ ప్రాంతంలో పర్యటించి అక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించనుంది.

Link to comment
Share on other sites

నెలాఖరుకు మెకాన్‌ బృందం నివేదిక
ఈనాడు, అమరావతి: కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్రం ఏర్పాటుచేసిన మెకాన్‌ బృందం శనివారం సచివాలయంలో విద్యుత్తు, జలవనరులు, గనుల శాఖల అధికారులతో సమావేశమైంది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అవసరమయ్యే విద్యుత్తు, నీరు, ఇనుప ఖనిజం లభ్యతపై వీరితో చర్చించింది.దీనిపై మెకాన్‌ బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లు గనుల శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నెలాఖరుకు మెకాన్‌ బృందం తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. మెకాన్‌ బృందంతో పాటు గనుల శాఖ కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి ఉన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 4 weeks later...

ఉక్కు ఫ్యాక్టరీలకు ఓకే!
17-02-2018 02:11:10
సాధ్యాసాధ్యాలపై మెకాన్‌ ముసాయిదా నివేదిక
రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తామన్న కేంద్రం
కడప ఉక్కుకు ఓకే!
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుపై ముందడుగు పడింది. ఏపీలో కడప జిల్లాలో, తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఉక్కు పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వరంగ కన్సెల్టెన్సీ సంస్థ అయిన మెకాన్‌.. ముసాయిదా నివేదికను సిద్ధం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కుశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గతంలో ఈ రెండు జిల్లాల్లో ఉక్కు ఫ్యాక్టరీల ఏర్పాటు అనువైనది కాదని తేలిన నేపథ్యంలో.. వాటిని నెలకొల్పడానికి ఉత్తమమైన మార్గాలను మెకాన్‌ ముసాయిదాలో పేర్కొందని కేంద్రం తెలిపింది. ఈ ముసాయిదాపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చిస్తామని పేర్కొంది. వాస్తవానికి రాష్ట్ర విభజన చట్టం అమల్లోకి వచ్చాక రెండు రాష్ట్రాల్లో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి 2014లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌), ఎండీఎంసీ సంస్థ ప్రతినిధులతో కేంద్ర ఉక్కుశాఖ ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ తమ అధ్యయనంలో కడప, ఖమ్మం జిల్లాల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఆర్థికంగా లాభదాయకం కాదని తేల్చింది. ఖమ్మం జిల్లాలో లభ్యమయ్యే ముడిసరుకు నాణ్యమైనది కాదని, కడపలోనూ అనేక సమస్యలున్నాయని తన నివేదికలో పేర్కొంది. అయితే తమ రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పాల్సిందేనని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రెండూ పట్టుబట్టాయి. ఫ్యాక్టరీల ఏర్పాటును సాధ్యం చేయడానికి కొన్ని ప్రత్యామ్నాయాలను కూడా ప్రతిపాదించాయి. మరోసారి అధ్యయనం చేయించాలని ఒత్తిడి తీసుకొచ్చాయి.
 
రెండు రాష్ట్రాల ఒత్తిడితోనే..
రెండు రాష్ట్రాల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం.. చివరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సెయిల్‌ ప్రతినిధులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. తొలిసారి ఆ కమిటీ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌ నేతృత్వంలో 2017 నవంబరులో ఢిల్లీలో సమావేశమయింది. ఏపీ తరఫున కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావు ఈ సమావేశంలో.. తిరిగి మెకాన్‌ సంస్థతో అధ్యయనం చేయించాలని నిర్ణయించారు. దానికి కొనసాగింపుగా అదే ఏడాది డిసెంబరులోనూ మరోసారి సమావేశం జరిగింది. మధ్యలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జోక్యం చేసుకొని కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్‌, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీంతో ఫ్యాక్టరీల ఏర్పాటును సాధ్యం చేయడానికి నివేదికను రూపొందించడం కోసం మెకాన్‌ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికను అందించాలన్న నిర్ణయం జరిగింది.
 
రాష్ట్రాల ప్రతిపాదనలు ఇవీ..
కడపలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి కావాల్సిన భూమిని ఇవ్వడంతోపాటు రోడ్డు, విద్యుత్తు, నీటి సౌకర్యం ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గతంలోనే ప్రతిపాదించింది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అక్కడ లభ్యమయ్యే ఐరన్‌ ఓర్‌ సరిపోదని తొలి కమిటి తేల్చిన నేపథ్యంలో అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో సహజసిద్ధంగా ఉన్న ఐరన్‌ ఓర్‌ గనుల నుంచి ముడిసరుకును కడపకు తీసుకొచ్చే ఏర్పాటు చేయాలని సూచించింది. అక్కడ 150 మిలియన్‌ టన్నుల ముడిసరుకు అందుబాటులో ఉందని కేంద్రానికి సమాచారమిచ్చింది. అంతేకాకుండా, ప్రైవేటు సంస్థల సహకారంతో ఏర్పాటు చేయడానికి పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది.

Link to comment
Share on other sites

మెకాన్‌ ముసాయిదా నివేదిక సిద్ధం
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని కడప, తెలంగాణలోని ఖమ్మం జిల్లాల్లో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుపై మెకాన్‌ సంస్థ ముసాయిదా సాధ్యాసాధ్యాల నివేదికలను తయారుచేసినట్లు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. నివేదికపై తాము రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామంది. తద్వారా విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో చెప్పినట్లుగా స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది దోహదపడుతుందని తెలిపింది.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...