Jump to content

Buddhist Circuit in AP


Recommended Posts

రాష్ట్రంలో ‘బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌’
11-08-2017 03:37:44
 
636380194659818319.jpg
  • ‘‘స్వదేశీ దర్శని స్కీమ్‌’’ ద్వారా అభివృద్ధి
  • రూ.100 కోట్లు విడుదలకు కేంద్రం ఆమోదం
  • మొదటి దశలో ఏడు ప్రాంతాలను గుర్తింపు
  • శ్రీకాకుళం, విశాఖ, అమరావతిల్లో ముఖ్య ప్రాంతాలు ఎంపిక
 
అమరావతి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ప్రభుత్వం అనేక మార్గాలను ఆన్వేషిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న బుద్ధిజం ఆలయాలను, ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేంద్రం ప్రభుత్వం ప్రారంభించిన ’’స్వదేశీ దర్శనీ’’ పథకంలో భాగంగా ’’బుద్ధిస్ట్‌ సర్కూట్‌’’ పేరుతో ఈ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే బౌద్ధ ఆలయాల అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రూ.120 కోట్లతో ప్రతిపాదనలు పంపింది.
 
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం కొన్ని మార్పులు చేస్తూ రూ.100 కోట్ల విడుదల చేసేందుకు సిద్ధమయింది. ప్రాజెక్టు పేరులోనే ఉన్నట్లుగా శ్రీకాకుళం దగ్గర నుంచి అమరావతి వరకూ ఒక సర్కూట్‌గా ఆలయాలను అభివృద్ధి చేయనున్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖలో మధ్యలో ఉన్న తోట్లకొండ, బావికొండ, బజ్జనకొండతో పాటు లింగాలకొండ, సాలిహుందం ప్రాంతాల్లో 190.65 ఎకరాలను అభివృద్ధి చేస్తారు. దీంతో పాటు గుంటూరు జిల్లాల్లో పాత అమరావతిలో 7.68 ఎకరాలు, అనుపులో 117 ఎకరాలు అభివృద్ది చేయనున్నారు. పర్యాటక శాఖ ఎంపిక చేసిన ప్రాంతాల్లో మ్యూజియంలు, మెడిటేషన్‌ సెంటర్లుతో పాటు ఆ ప్రాంతంలో పార్కులు, రిసార్టులు వంటివి అభివృద్ధి చేస్తారు.
 
మన రాష్ట్రంలో ముఖ్యమయిన బుద్ధిజం ప్రాంతాలు సుమారు 20 వరకూ ఉన్నాయి. వీటిలో 15 ప్రాంతాలను స్వదేశీ దర్శనీ భాగంగా ’’బుద్ధిస్ట్‌ సర్కూట్‌’’గా అబివృద్ది చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలించిన కేంద్రం మొదట విడతలో 7 ప్రాంతాలను అభివృద్ది చేయాలని సూచిస్తూ... రూ.100 కోట్లు కేటాయించేందుకు సిద్ధమయింది. అలాగే, రూ.33 కోట్లతో నాగార్జున కొండను అభివృద్ది చేసేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు కేంద్రానికి సంబంధించి ’’ప్రసాద్‌ స్కీమ్‌’’లో భాగంగా అభివృద్ది చేస్తున్న ధ్యాన బుద్ధా ప్రాజెక్టు కూడా మరో రెండు నెలల్లో పూర్తి కావస్తోంది.
 
రూ.27 కోట్లతో అభివృద్ధి చేయాలని తలపెట్టిన ధ్యాన బుద్ధా ప్రాజెక్టులో ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి అయ్యాయి. మరో 30 శాతం పనులు కొనసాగుతున్నాయి. ఆక్టోబర్‌ చివరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే అమరావతి పేరు ప్రఖ్యాతలు ప్రపంచ వ్యాప్తం అవుతాయి.
Link to comment
Share on other sites

ష్ట్రంలో బౌద్ధ క్షేత్ర వలయం..

అమరావతి సహా 5 కేంద్రాలను కలుపుతూ ప్రాజెక్ట్‌

స్వదేశ్‌ దర్శన్‌ పథకం కింద రూ.60 కోట్లు కేటాయించేందుకు కేంద్రం అనుమతి

21ap-main2a.jpg

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో బౌద్ధ క్షేత్ర వలయం(బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌) ఏర్పాటుకు మరో అడుగు ముందుకుపడింది. దీని అభివృద్ధికి స్వదేశ్‌ దర్శన్‌ పథకం కింద రూ.60కోట్లు కేటాయించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అమరావతి, నాగార్జునసాగర్‌, బావికొండ, తొట్లకొండ, దంతవరపుకోట(దంతపురి) కేంద్రాలను కలుపుతూ ఈ వలయాన్ని తీర్చిదిద్దాలని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. సోమవారం దిల్లీలో జరిగిన కేంద్ర మంజూరు, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి ముకేష్‌కుమార్‌ మీనా, ఆ శాఖ సంచాలకుడు హిమాన్షు శుక్లా వివరించారు. ఈ క్రమంలో ప్రాజెక్టుకు రూ.60కోట్లు కేటాయించేందుకు కమిటీ ఆమోదముద్ర వేసింది. ఏపీలో బౌద్ధమత చారిత్రక సంపదకు కొదవలేదని, దాన్ని పూర్తిస్థాయిలో పరిరక్షించుకోవడంతోపాటు, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకూ పరిచయం చేయాలనే ఈ సర్క్యూట్‌ను ప్రతిపాదించినట్లు వివరించారు. చారిత్రక ఆనవాళ్లను భద్రపరచి భావితరాలకు అందించడం ద్వారా వారసత్వ సంపదను కాపాడినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. స్వదేశ్‌ దర్శన్‌ పథకం కింద మొదట అమరావతిలో ధ్యానబుద్ధ వనం, పర్యాటక సౌకర్య కేంద్రం, సౌండ్‌, లైటింగ్‌ ప్రదర్శన, విద్యుదీకరణ, పార్కింగ్‌ తదితర పనులను ఇందులో చేపట్టాలని ప్రతిపాదించినట్లు కమిటీకి వివరించారు. తర్వాత తొట్లకొండ, బావికొండ, సాగర్‌, దంతపురి క్షేత్రాలను అభివృద్ధి చేస్తామన్నారు. మరోవైపు శాలిహుండం, బొజ్జనకొండ, లింగల కొండలను కూడా పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేయనున్నామని తెలిపారు.

Link to comment
Share on other sites

  • 1 month later...

just a Q. y cbn like buddha. --------------------------------------

now this

 

i'm not against buddhism. but just want to know if there is any reason for cbn inclination towards buddism

 

TM bro......cbn is a good man, god bless him for Andhra's sake. But his outlook in this is purely material, how to appeal to other countries especially eastern Asia etc for the obvious... In something like this Outside-In outlook, not the other way around....

 

(Going back to history- listless materialism,erosion of ethics, liberal & promiscuous life styles prevailed around one time here due to Buddhism; Thats why it was deteriorated & near extinct from our land)

Link to comment
Share on other sites

CBN has nothing to do with Hussain Sagar Buddha Statue. It was all NTR's 

i think renovation or something around tb inculding budda vigraham... and increasing some toursim based on this..at that time for them, i remeber reading it.... just got into mind and was checking if there is any conenction in idealogy or something

 

tank bund lo buddha vigraham pettindi NTR

Link to comment
Share on other sites

TM bro......cbn is a good man, god bless him for Andhra's sake. But his outlook in this is purely material, how to appeal to other countries especially eastern Asia etc for the obvious......In somethings like this,  Outside-In outlook not the other way around....

 

(Going back to history- listless materialism,erosion of ethics, liberal & promiscuous life styles prevailed around one time here due to Buddhism; Thats why it was deteriorated & near extinct from our land)

:cheers:

Link to comment
Share on other sites

Buddhism ki Andhra tho chala charitra undi....

 

Khandahar lo laga dwamsam chesukokunda protect chesi promote cheyyatam best for state.....CBN is doing that.....

 

Srilanka this year expecting 1.7 million Chinese Busshist visitors....where as manaki charitra unna faclities leka ravatam ledu....

Link to comment
Share on other sites

:cheers:

 

 ప్రతిదీ వ్యాపారమనుకొంటాడు వెస్ట్రన్ , జీవితం లో అదొక భాగం మాత్రమే- ఇండియన్ కల్చర్ కి ......మూలాలతో అనుసంధానమే  మంచి విలువలకి మార్గం...
 
Telugus  more than others in the country, plagued with rampant materialism...But, we will get to good places from current corruption & cultural degradation, no doubt...
 
 
Link to comment
Share on other sites

  • 3 months later...
భట్టిప్రోలులో బుద్ధ ప్రతిమ
28-01-2018 08:21:03
 
636527244618597636.jpg
గుంటూరు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): భట్టిప్రోలు బౌద్ధ స్థూపం ప్రదేశాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు జిల్లా టూరిజం శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అమరావతి పుణ్యక్షేత్రంలోని ధరణికోటలో నిర్మించిన ధ్యానబుద్ధ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఐకాన్‌గా మారిన నేపథ్యంలో భట్టి ప్రోలులోనూ ఒక బుద్ధుడి విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకొంది. ఇందు కోసం రూ.60 లక్షలతో ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించింది. దీనికి త్వరలోనే ఆమోదం లభించే అవకాశం ఉన్న ట్లు అధికారవర్గాలు తెలిపాయి. బుద్ధుడి విగ్రహం నిర్మాణం అనంతరం భట్టిప్రోలు బౌద్ధస్థూపం పరిసర ప్రదేశాలు పర్యా టకులను విశేషంగా ఆకట్టుకొనే అవకాశం ఉందని చెబుతున్నాయి.
 
జిల్లాలో మూడు బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి. వాటిల్లో అమరావతి, నాగార్జునకొండ తర్వాత భట్టిప్రోలు మూడో స్థానంలో ఉన్నది. ఇక్కడి స్థూపానికి చార్రితక హోదా ఉన్నది. ప్రాచీన సాల రాజ్యం కాలంలో దీనిని ప్రతి పాలపురగా పిలిచేవారు. రెండు - మూడు శతాబ్ధాల బీసీ కాలంలో విక్రమార్క కోట దిబ్బని నిర్మించారు. దీనినే బౌద్ధస్థూపంగా పిలుస్తోన్నారు. అయితే ఈ ప్రదేశం జిల్లా కేంద్రానికి ఇంచుమించు 50 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉండటంతో పర్యాటకులను ఆకట్టుకోలేకపోతోంది. అక్కడ పర్యాటకుల కోసం ఎలాంటి సౌకర్యాలు లేవు. కార్తీక మా సంలో పాఠశాలల విద్యార్థులు పిక్నిక్‌ కోసం ఇక్కడికి వచ్చి వెళుతుంటారు. సాధారణ రోజుల్లో పర్యాటకుల ఈ క్షేత్రాన్ని సందర్శించే వారి సంఖ్య 100 లోపే ఉంటోంది.
 
అమరావతి రాజధాని ప్రాంతంలో భట్టిప్రోలు ఉండటంతో ఇక్కడి బౌద్ధ స్థూపం ఉన్న చారిత్రక ప్రదేశాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని స్థానిక నాయకులు ప్రభుత్వానికి నివేదించారు. స్థానిక మంత్రి నక్కా ఆనంద్‌బాబు భట్టిప్రోలుని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అమరావతిలో ధ్యానబుద్ధ ప్రాజెక్టు రూపశిల్పి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ మల్లికార్జునరావు పర్యాటక శాఖకు నోడల్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తోన్నారు. ఆయనకే భట్టిప్రోలులో బుద్ధడి విగ్రహం నిర్మించే బాధ్యతలను ప్రభుత్వం కేటాయిం చనుంది. ధ్యానబుద్ధ తరహాలోనే ఒక ఐకానిక్‌ విగ్రహాన్ని ఆయన డిజైన్‌ చేస్తారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఆసియా ఇతర దేశాల నుంచి బౌద్ధ భిక్షువులు అమరావతి, నాగార్జునకొండతో పాటు భటి ్టప్రోలు సందర్శించేలా చేసేందుకు ఇప్పటికే పర్యాటక శాఖ చర్యలు చేపట్టింది. వచ్చే నెల మొదటివారంలో పెద్దఎత్తున కార్యక్రమాలను కూడా భట్టిప్రోలులో నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో భట్టిప్రోలు రూపురేఖలు త్వరలోనే మారిపోతాయన్న ఆశాభావం వ్యక్తమౌతోంది.
Link to comment
Share on other sites

  • 4 months later...
  • 1 month later...
  • 2 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...