Jump to content

Chandranna Village Malls


Recommended Posts

పేదలకు బ్రాండెడ్‌ సరకులు

గ్రామీణ మాల్స్‌గా చౌకధర దుకాణాలు

టెండర్లు పిలిచిన పౌరసరఫరాల సంస్థ

ప్రీబిడ్‌ సమావేశానికి అనూహ్య స్పందన

ఈనాడు, అమరావతి: చౌకధర దుకాణాలను గ్రామీణ మాల్స్‌గా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ దుకాణాల ద్వారా బ్రాండెడ్‌ సరకులను తక్కువ ధరకే కార్డుదారులకు విక్రయించే ప్రక్రియలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మరో అడుగు వేసింది. ఈ సరకులను దుకాణాలకు సరఫరా చేసేందుకు సరఫరాలదారుల నుంచి ప్రతిపాదనలు కోరింది. ఈ ప్రతిపాదనలు సమర్పించేందుకు ఈ నెల 26 వరకు సమయాన్నిచ్చింది. బుధవారం ఆ సంస్థ వెలగపూడిలోని సచివాలయంలో ప్రీ-బిడ్‌ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి రిలయన్స్‌, వాల్‌మార్ట్‌, మెట్రో, ఇతర స్థానిక సరఫరా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. రాజస్థాన్‌లో ఈ తరహా ప్రయోగాన్ని ప్రారంభించినప్పుడు ఇలాగే నిర్వహించిన ప్రీ-బిడ్‌ సమావేశానికి కేవలం ఫార్చ్యూన్‌ గ్రూప్‌ ప్రతినిధులే హాజరైనట్లు తెలిసింది. దీంతో మన రాష్ట్రంలో అనూహ్య స్పందన వచ్చినట్లయిందని పౌర సరఫరాలశాఖ అధికారులు వ్యాఖ్యానించారు.

* కనీసం 30శాతానికి తక్కువ కాకుండా రాయితీపై చేయాలి.

* ప్రతీ సరకుకు మూడు రకాల బ్రాండ్లను అందుబాటులోఉంచాలి.

* పట్టణ, నగర ప్రాంతాలే కాకుండా ఒక మోస్తరు మండల కేంద్రాల్లోని చౌకధర దుకాణాల్లోనూ ఈ సరకులను కార్డుదారులకు అందుబాటులోకి తీసుకురావాలి.

* సాంకేతిక బిడ్లు వచ్చాక, ఆర్థిక బిడ్లను సమర్పించాల్సి ఉంటుందని వాటి ప్రక్రియ (ప్రాసెస్‌)ను పూర్తి చేసేందుకు కనీసం 30 నుంచి 45 రోజులు అవసరమవుతుంది కాబట్టి సెప్టెంబరు నుంచి సరకులను చౌకధర దుకాణాల్లోకి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధం కావాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 4 weeks later...
  • 3 weeks later...
15లోపే మోడల్‌ విలేజ్‌మాల్‌
 
 
636415818467790149.jpg
  • సీఎం చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం
  • జిల్లా కేంద్రంలోని పలు రేషన్‌ షాపుల పరిశీలన
గుంటూరు: రేషన్‌ షాపులన్నింటిని దశలవారీగా విలేజ్‌ మాల్స్‌గా మార్చే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కనీసం ఒక్కొక్క షాపుని అయినా అక్టోబర్‌ 15వ తేదీలోపు విలేజ్‌మాల్‌గా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీచేశారు. ఆ మేరకు న్యూఢిల్లీకి చెందిన ఎంటర్‌ప్రెన్యూర్‌ కేపీఎంజీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ జిల్లా కేంద్రానికి వచ్చి డీఎస్‌వో ఈ.చిట్టిబాబుతో చర్చలు జరిపారు. అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో రేషన్‌షాపులను సందర్శించారు. గురువారం సాయంత్రంలోపు ఒక షాపుని ఎంపికచేసి ప్రభుత్వానికి నివేదిస్తారని అధికారవర్గాలు తెలిపాయి.
జనవరి నాటికి ప్రతీ జిల్లాలో కనీసం 500షాపులను విలేజ్‌మాల్స్‌గా మార్చాలన్న లక్ష్యాన్ని పౌరసరఫరాల శాఖకు సీఎం నిర్దేశించారు. విలేజ్‌మాల్‌ ఒక మినీ సూపర్‌బజార్‌ తరహాలో ఉంటుంది. దాని సైజు కనీసం 20 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు ఉండేలా రూపొందిస్తారు. దానిని మాల్‌గా మార్చేందుకు ప్రభుత్వమే రూ. 5లక్షల వరకు వెచ్చిస్తుంది. వాల్‌మార్ట్‌, రిలయన్స్‌, బిగ్‌బజార్‌ సంస్థలతో ఇప్పటికే ఒక ఒప్పందం కుదుర్చుకొన్నది. ఆయా సంస్థల నుంచి సరుకులను ప్రభుత్వం కొనుగోలు చేసి విలేజ్‌మాల్స్‌కి సరఫరా చేస్తుంది. మాల్స్‌లో విక్రయించే ధర కంటే తక్కువకే నాణ్యమైన, బ్రాండెడ్‌ సరుకులను పంపిణీచేస్తుంది. వాటిని డీలర్లు వారి విలేజ్‌మాల్‌లో ప్రదర్శించి రేషన్‌ డీలర్లను ఆకర్షించాలి.
 
        ఒక్కో రేషన్‌షాపు పరిధిలో 500 కార్డులు ఉన్నాయి. దీనిని పరిగణనలోకి తీసుకొంటే అంతే సంఖ్యలో కుటుంబాలు ఉన్నట్లు. ఒక్కో కుటుంబానికి నెలకు రూ. 2,500 వరకు నిత్యావసర సరుకుల రూపంలో ఖర్చు అవుతున్నట్లు సర్వే ద్వారా ఒక నిర్ణయానికి వచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకొంటే రూ. 10 లక్షల వరకు బిజినెస్‌ జరపవచ్చు. కార్డుదారులకు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందుబాటులో ఉంచడం వల్ల కచ్ఛితంగా ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. పౌరసరఫరాల వ్యవస్థలో ఇదొక విప్లవాత్మకంగా మారే అవకాశం ఉందని జిల్లా సరఫరాల అధికారి చిట్టిబాబు తెలి పారు. బుధవారం గుంటూరు నగరంలోని నల్లచెరువు, ఇశ్రాయల్‌పేట, ఆర్‌టీసీ కాలనీ, శ్రీనివాసరావుపేట, మణిపురం ప్రాంతాల్లో తాను, సీఎస్‌డీటీలు ఫణికుమార్‌, సాంబశివరావు పర్యటించి షాపులను పరిశీలించామని డీఎస్‌వో చిట్టిబాబు చెప్పారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న వారు వాటి యజమానుల నుంచి ఆమోదం పొందాల్సి ఉందని చెప్పారు. తొలుత ఎక్కువగా సరుకులు పంపిణీ జరుగుతున్న షాపుని ఎంపిక చేసి ఆ తర్వాత అన్ని షాపులను విలేజ్‌మాల్స్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తామని వివరించారు.
Link to comment
Share on other sites

వచ్చే నెలలోనే గ్రామీణ మాల్స్‌
23-09-2017 04:25:11
 
అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): రేషన్‌ షాపులను గ్రామీణ మాల్స్‌గా మార్చే ప్రక్రియ కొలిక్కొస్తోంది. అక్టోబరు చివరి వారంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా గ్రామీణ మాల్స్‌ను ప్రారంభించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయానికొచ్చింది. బయటి ధరల కంటే 20శాతం తక్కువకు అన్నిరకాల సరుకులను కార్డుదారులకు అందించడం గ్రామీణ మాల్స్‌ ఉద్దేశం. దీనిపై చాలాకాలంగా కసరత్తు జరుగుతోంది. ఇటీవలే టెండర్లు పిలవగా పలు సంస్థలు ముందుకొచ్చాయి. చివరిగా రిలయన్స్‌, ఫ్యూచర్‌ రిటైల్‌, వాల్‌మార్ట్‌లు సరుకుల పంపిణీకి ఎంపికయ్యాయి.
 
రిలయన్స్‌ అన్ని జిల్లాల్లో, ఫ్యూచర్‌ రిటైల్‌ ఆరు జిల్లాల్లో, వాల్‌మార్ట్‌ మూడు జిల్లాల్లో సరుకుల పంపిణీకి అంగీకారం తెలిపాయి. దానికి అనుగుణంగా వచ్చే నెలలో పైలెట్‌ ప్రాజెక్టు చేపట్టి, అనంతరం దీన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల కార్డుదారులకు తక్కువ ధరలకే సరుకులు లభించడంతోపాటు డీలర్లకు కూడా మేలు జరనుంది. గ్రామీణ మాల్‌ విస్తీర్ణం కనీసం 200 చదరపు అడుగులు ఉండాలని, స్థానికంగా రోడ్డుకు గరిష్ఠంగా 100మీటర్ల లోపు ఉండాలని నిబంధన విధిస్తున్నారు. ఎక్కువ వస్తువులు ఉంటాయి కాబట్టి అందుకు తగట్టుగా మాల్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
Link to comment
Share on other sites

గ్రామాల్లోనూ ఆన్‌లైన్‌ షాపింగ్‌!
 
 
636427685695582427.jpg
  • గ్రామీణ మాల్స్‌లో సదుపాయం
  • 24గంటల్లో డెలివరీ..15% రాయితీ
  • రాష్ట్ర ప్రభుత్వ వినూత్న విధానం
అమరావతి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం ఆన్‌లైన్‌ షాపింగ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. నిత్యావసర వస్తువులు మినహా కొంచెం ఖరీదైనవి ఏవి కొనాలన్నా ప్రజలు ఆన్‌లైన్‌ దారి పడుతున్నారు. నిర్వహణ భారం లేకపోవడం వల్ల బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే ఆన్‌లైన్‌లో కొంతమేర తక్కువ ధరలకు ఉత్పత్తి సంస్థలు వస్తువులను అందుబాటులో ఉంచడం వినియోగదారులకు కలిసివస్తోంది.
 
అయితే, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ‘ఆన్‌లైన్‌’ సంస్కృతి తక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కొత్తగా తాను అందుబాటులోకి తీసుకొస్తున్న గ్రామీణ మాల్స్‌లో ఆన్‌లైన్‌ సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రజలు వారికి కావాల్సిన వస్తువులను రేషన్‌ డీలర్‌ ద్వారా ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకుని 24 గంటల్లో పొందే వెసులుబాటు ఈ విదానం వల్ల కలగనుంది. విజయవాడ, గుంటూరు నగరాల్లో ఒక్కొక్కటి చొప్పున నెలకొల్పిన మోడల్‌ గ్రామీణ మాల్స్‌ త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత జిల్లాకు కనీసం 500 చొప్పున ఏర్పాటుచేయాలని, ఆ తర్వాత క్రమంగా అన్నిచోట్లా విస్తరింపజేయాలని నిర్ణయించారు.
 
బయటి ధరల కంటే కనీసం 15శాతం తక్కువ ధరకు గ్రామీణ మాల్స్‌లో సరుకులు అందుబాటులో ఉంచుతారు. సాధారణంగా మాల్స్‌లో లభించే అన్నిరకాల వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. నిర్వహణ భారం ప్రభుత్వం భరిస్తుండటంతో రిలయన్స్‌, ఫ్యూచర్‌గ్రూప్‌, వాల్‌మార్ట్‌ సంస్థలు 15నుంచి 30శాతం తక్కువ ధరలకు గ్రామీణ మాల్స్‌కు వస్తువులు సరఫరా చేస్తాయి.
 
అందులో 60శాతం ప్రజలకు, 40శాతం డీలరుకి వెళ్లేలా లాభాన్ని పంచుతారు. అయితే రేషన్‌ డీలర్లు నిత్యావసర వస్తువులు మినహా ఖరీదైన వస్తువులను దిగుమతి చేసుకునే అవకాశం పెద్దగా ఉండదు కాబట్టి గ్రామీణమాల్‌లో కంప్యూటర్‌ స్ర్కీన్‌ ఏర్పాటుచేస్తారు. డీలరు ద్వారా తమకు ఏం కావాలో అందులో చూసుకుని బుకింగ్‌ చేసుకుంటే 24గంటల్లో ఆ వస్తువు రేషన్‌ షాపునకు డెలివరీ అవుతుంది. అది కూడా కనీసం 15శాతం తక్కువకే. ఉదాహరణకు రూ.10వేల మొబైల్‌ ఫోన్‌ కొనాలని భావిస్తే కనీసం రూ.1,500 తెల్ల రేషన్‌ కార్డుదారునికి ఆదా అవుతుంది.
 
రిలయన్స్‌ సంస్థతో కలిసి ఈ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. రిలయన్స్‌ సంస్థ సుమారు 70వేల ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతుంది. కాగా గ్రామీణమాల్స్‌ ఏర్పాటుపై ఈనెల 10న ముఖ్యమంత్రి సమక్షంలో సమావేశం జరగనుంది. గ్రామీణ మాల్స్‌కు వస్తువులు సరఫరా చేసేందుకు మూడు సంస్థలు ముందుకొచ్చాయి.
 
రిలయన్స్‌ 13 జిల్లాలు, ఫ్యూచర్‌ గ్రూప్‌ ఆరు జిల్లాలు, వాల్‌మార్ట్‌ మూడు జిల్లాల్లో వస్తువులను సరఫరా చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. గ్రామీణ మాల్స్‌ ద్వారా తెల్లకార్డుదారులకు కూడా తక్కువ ధరలకే నాణ్యమైన వస్తువులు అందుతాయని పౌరసరఫరాలశాఖ అధికారులు అంటున్నారు. త్వరలోనే లోగో, బ్రాండ్లపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అనేక కారణాలతో ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యమైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించింది. ప్రస్తుతం రేషన్‌షాపుల్లో కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. దీంతో పేద ప్రజల్లో ప్రజాపంపిణీ వ్యవస్థపై ఆసక్తి తగ్గింది. ఈ ప్రభావంతో ప్రతినెలా రేషన్‌ తీసుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఈ క్రమంలో గ్రామీణ మాల్స్‌ ద్వారా ప్రజాపంపిణీని దగ్గర చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు చేపట్టింది.
Link to comment
Share on other sites

నూతన సంవత్సర కానుకగా చక్కెర

రూ.200 కోట్ల మేర రాయితీ

చౌకదుకాణాల్లో ‘అన్న’ గ్రామీణ మాల్స్‌

త్వరలో 4599 డీలర్‌ పోస్టుల భర్తీ

మర్యాద తప్పితే డీలర్‌షిప్‌ రద్దు!

పౌరసరఫరాల శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు

13ap-main5a.jpg

ఈనాడు అమరావతి: తెలుపురంగు కార్డుదారులకు నూతన సంవత్సర కానుకగా చక్కెరను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నిలిపివేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే రాయితీని భరించి కార్డుదారులకు తక్కువ ధరకు చక్కెరను అందజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపారు. బహిరంగ మార్కెట్‌ కన్నా 50శాతం తక్కువ ధరకే కార్డుదారులకు అందించాలని, వచ్చే ఏడాది జనవరి నుంచి ఇవ్వాలని శుక్రవారం సీఎం నిర్వహించిన పౌరసరఫరాల శాఖ సమీక్షలో నిర్ణయించారు. దీని కోసం ఏటా రూ.200 కోట్లు రాయితీని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని అంచనా వేశారు. ‘‘అయినా ఫర్వాలేదు. చక్కెరను ఇవ్వండి. ప్రత్యేక అవసరాలు ఉండే కూరాకుల, రజక, మత్స్యకార వంటి సామాజికవర్గాలకు చెందిన కార్డుదారులకు తెలుపురంగు కిరోసిన్‌ను కూడా పంపిణీ చేయండి...’’ అని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.

తొలి దశలో 6500 ‘అన్న’ గ్రామీణ మాల్స్‌

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29,500 చౌకధర దుకాణాల్లోనూ ‘అన్న’ గ్రామీణ మాల్స్‌ను ఏర్పాటు చేయాలని, వచ్చే నెల నుంచే తొలి దశలో 6500 పట్టణ దుకాణాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రేషన్‌ బియ్యం వద్దనుకునే కార్డుదారులు ఆ బియ్యం విలువ మేరకు ఇతర సరకులను వీటిల్లో కొనుగోలు చేసుకునే వెసులుబాటును కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. రిలయన్స్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నందున ఆయా సంస్థల బ్రాండ్‌ సరకులతో పాటు డ్వాక్రా, గిరిజన ఉత్పత్తులు, స్థానిక పచ్చళ్లు వంటివీ అందుబాటులోకి తీసుకురావాలని తీర్మానించారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నుంచి తిరిగివచ్చిన తర్వాత విజయవాడ, గుంటూరులో ఏర్పాటు చేస్తున్న నమూనా గ్రామీణ మాల్స్‌ను ప్రారంభించాలని భావిస్తున్నారు. చంద్రన్న గ్రామీణ మాల్స్‌ పేరును మంత్రి పుల్లారావు సూచించినా దానికి సీఎం స్పందించలేదని సమాచారం. త్వరలో ఖాళీగా ఉన్న 4599 డీలర్ల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. కొన్ని దుకాణాల్లో కార్డుదారుల ‘ధ్రువీకరణ’ను గుర్తించడంలో కొందరు డీలర్లు విఫలమవుతున్నారని పౌరసరఫరాల శాఖ సంచాలకుడు రవిబాబు ఈ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనికి కారణాలు విశ్లేషించి డీలర్లకు వెంటనే శిక్షణ ఇప్పించండి, అప్పటికీ వారిలో మార్పు రాకపోతే చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేయండని సీఎం సూచించారు. వీరి డీలర్‌షిప్‌ రద్దు చేసేలా పౌరసరఫరాల శాఖ కంట్రోల్‌ ఆర్డరులోనూ సవరణ తీసుకువచ్చేందుకు కసరత్తు జరుగుతోందని, కార్డుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడని డీలర్లపై చర్యలు ఉండేలా కూడా ఈ ఆర్డరులో మార్పు చేస్తున్నామని అధికారులు వివరించారు. ధాన్యం సేకరణలో మరింత పారదర్శకతను తీసుకురావడంతో పాటు దళారులను కట్టడి చేసి రైతుల డబ్బు రైతులకే చేరేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పౌరసరఫరాల సంస్థ ఎండీ రామ్‌గోపాల్‌ ముఖ్యమంత్రికి నివేదించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఎలా పనిచేస్తుందనేదీ వివరించారు. లోపాలు దొర్లకుండా పటిష్టంగా సిద్ధం చేసి ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

కోటి ఎకరాల్లో ఉద్యాన పంటలు

రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం కోటి ఎకరాలకు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయాధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో సమావేశమయ్యారు. కరవు నివారణకు ముందు జాగ్రత్త చర్యలతో సిద్ధంగా ఉండాలన్నారు. ఎగుమతికి అనువైన నాణ్యమైన ఉత్పత్తులు కావాలని, ప్రస్తుత ఆదాయానికన్నా 20 రెట్లు అధికాదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వా రంగంలో వృద్ధి సాధించిన దేశాలను పరిశీలించి అక్కడ అవలంభిస్తున్న పద్ధతులను పాటించాలని సూచించారు. రాష్ట్రంలో పైర్లు వేసిన భూమిలో 98 శాతం ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా జియో ట్యాగింగ్‌ చేయడాన్ని ఆయన అభినందించారు. అనంతపురం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే 20 శాతం అధికంగా నమోదైందని, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని చెప్పారు. ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం లక్ష్యం 42.07 లక్షల హెక్టార్లు కాగా 40.47 లక్షల హెక్టార్లలో పైర్లు వేశారని, దాని వల్ల 89 శాతం లక్ష్యాన్ని సాధించామని వివరించారు. చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో వంద శాతం పంట వేశారని చెప్పారు.

ఖరీఫ్‌లో 12 శాతం వృద్ధి

ఈ ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.87,471 కోట్లుగా ఉండగా... ఖరీఫ్‌లో రూ.50,919 కోట్లకు గాను.. రూ.47,156 కోట్ల మేర రుణాలిచ్చారని చంద్రబాబు తెలిపారు. ఖరీఫ్‌ సీజన్లో 12 శాతం వృద్ధి సాధిస్తామనే అంచనాలున్నాయన్నారు. రైతుల్లో ‘ప్లాంటిక్స్‌ యాప్‌’పై అవగాహన పెంచాలని సూచించారు. విశాఖలో వచ్చే నవంబరు 15 నుంచి 17వ తేదీ వరకు జరిగే సదస్సుకు బిల్‌గేట్స్‌ రానున్నారని చంద్రబాబు తెలిపారు. ఈ సదస్సుకు అధికారులు ‘స్మార్ట్‌ ఫార్మింగ్‌, సంపన్న రైతు సమ్మిట్‌’ అనే పేరును ప్రతిపాదించగా మార్పులు చేయాలని సూచించారు. ప్రోగ్రెస్‌ ఆఫ్‌ ఫార్మర్‌, స్మార్ట్‌ ఫార్మర్‌, ప్రోగ్రెస్‌ ఆఫ్‌ ఫార్మింగ్‌ ప్లాట్‌ఫాం అనే పేర్లు కూడా ఎలా ఉంటాయో ఒకసారి పరిశీలించాలని సూచించారు. వివిధ జిల్లాల్లోని అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. అక్కడ జలాశయాల్లో నీటి మట్టం పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, వ్యవసాయ అనుబంధ రంగాల శాఖల ఉన్నత కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

అన్న విలేజ్‌ మాల్స్‌’ వస్తున్నాయ్‌!
14-10-2017 02:54:20

 
636435464621559577.jpg
  • తొలి దశలో 6,500 రేషన్‌ షాపులకు కొత్తరూపు
  • దశలవారీగా మిగతా దుకాణాలు కూడా..
  • నిత్యావసరాలు, వ్యవసాయోత్పత్తుల విక్రయం
  • బందరు లడ్డు, కాకినాడ కాజా, పచ్చళ్లు కూడా..
  • జనవరి నుంచి సగం ధరకే అరకిలో పంచదార: సీఎం
అమరావతి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ‘అన్న విలేజ్‌ మాల్స్‌’ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. మొత్తం 29 వేల చౌకధరల దుకాణాలను దశలవారీగా ‘విలేజ్‌ మాల్స్‌’గా మార్చాలని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో పౌరసరఫరాల శాఖ సమీక్షా సమావేశం జరిగింది. ‘అన్న విలేజ్‌మాల్స్‌’ పేరుతో తొలి విడతగా 6500 దుకాణాలకు త్వరలో కొత్త రూపు తీసుకురావాలని నిర్ణయించారు. రిలయన్స్‌, ప్యూచర్‌ గ్రూపుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ దుకాణాలను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతోపాటు, ప్రత్యేకంగా లోగో రూపొందించాలని సీఎం తెలిపారు. కనీసం 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ‘అన్న విలేజ్‌మాల్‌’ వ్యయంలో 25 శాతం ప్రభుత్వం భరిస్తుంది. మరో 25 శాతం ‘ముద్ర’ రుణంగా డీలరుకు ఇప్పిస్తుంది. ఈ మాల్‌లో డ్వాక్రా, మెప్మా, జీసీసీ ఉత్పత్తులతో పాటు ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసే వివిద వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతారు. బందరు లడ్డు, కాకినాడ కాజా, తెలుగింటి పచ్చళ్లు కూడా లభిస్తాయి. ఎవరైనా సరే తమ ఉత్పత్తులను ‘అన్న విలేజ్‌ మాల్‌’లో విక్రయించుకునే సౌలభ్యాన్ని కల్పిస్తారు. రేషన్‌ బియ్యం వద్దనుకునే తెల్లకార్డుదారులకు.. అంతే విలువైన నగదుతో ‘మాల్‌’లో కావలసిన ఆహార పదార్థాలు కొనుక్కునే వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. కేంద్ర ప్రభుత్వం రాయితీ ఎత్తివేసినా తెల్ల రేషన్‌ కార్డుదారులకు మార్కెట్‌ ధర కన్నా 50 శాతం తక్కువకు నెలకు అరకిలో పంచదార పంపిణీ చేయాలని స్పష్టంచేశారు. వచ్చే జనవరి నుంచి అందించే రేషన్‌లో పంచదారను జత చేయాలని చెప్పారు. ఖాళీగా ఉన్న 4,599 చౌకధరల దుకాణాలకు డీలర్లను వెంటనే నియమించాలని ఆదేశించారు. రేషన్‌ సరుకుల పంపిణీలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలన్నారు. ప్రత్యేక అవసరాలు ఉన్న కూరాకుల, రజక, మత్య్సకార తదితర సామాజికవర్గాల వారికి తెల్ల కిరోసిన్‌ ఇవ్వాలని తెలిపారు.
Link to comment
Share on other sites

బడుగులకు ‘తీపి’ కబురు!!

చక్కెర పునరుద్ధరణకు ప్రణాళిక

కొన్ని వర్గాలకు తెలుపు రంగు కిరోసిన్‌

‘అన్న’ గ్రామీణ మాల్స్‌గా రేషన్‌ దుకాణాలు

చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం

న్యూస్‌టుడే - రాజాం

16ap-state9a.jpg

రేషన్‌ దుకాణానికి వెళ్తే బియ్యం తప్ప మరో వస్తువు కనిపించడం లేదు. దీంతో ఈ దుకాణాలు ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కాని పరిస్థితి పేదల్లో నెలకొంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం సరికొత్త చర్యలకు తెర తీస్తోంది. ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో రేషన్‌ దుకాణాలను ‘అన్న’ విలేజ్‌(గ్రామీణ) మాల్స్‌గా మార్చాలని భావిస్తోంది. ఇప్పటికే దీనిపై విధి విధానాలు ఎలా ఉండాలన్న దానిపై ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి.

బియ్యం, పంచధార, గోధుములు, కిరోసిన్‌ ఇవన్నీ రేషన్‌ దుకాణాల ద్వారా సరఫరా చేసేవారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అయితే తొమ్మిది రకాల వస్తువులు అందించేవారు. తరవాత క్రమేపీ రేషన్‌ దుకాణాలు కళ తప్పాయి. పేదలకు ప్రైవేటు మార్కెట్టే దిక్కయ్యింది. ఏ నిత్యావసర వస్తువు కావాలన్నా ప్రైవేటుకు పరుగులు తీసేవారు. ఇది పేదలకు భారంగా పరిణమించింది. బడుగుల ఇబ్బందులను ప్రభుత్వమూ గుర్తించింది. ఎలా చేస్తే బాగుంటుందన్న కోణంలో కసరత్తు ప్రారంభించింది. 2018 జనవరి నెల నుంచి చక్కెరను పునరుద్ధరించాలని నిర్ణయించింది. గతంలోలా కాకుండా బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే ధర కూడా తక్కువగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటోంది. 50 శాతం రాయితీతో పంచదారను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

కొన్ని వర్గాల కోసం కిరోసిన్‌!

ప్రస్తుతం కిరోసిన్‌ భారంగా మారింది. కొన్ని వర్గాలకు కిరోసిన్‌ అత్యవసరం. రాష్ట్రంలోనే అత్యధిక తీర ప్రాంతం జిల్లాలో ఉంది. మత్స్యకారులకు కిరోసిన్‌తో పని ఎక్కువ. జిల్లాలో 50 వేల మత్స్యకార కుటుంబాలున్నాయి. రజకులు, కూరాకుల కుటుంబాలూ అధికమే. వీరికి కిరోసిన్‌ అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి వర్గాలకు కిరోసిన్‌ను పునరుద్ధరించాలని నిర్ణయించడం ఆయా వర్గాలకు వూరట కలిగించే అంశమే! తెలుపు రంగు కిరోసిన్‌ను ఆయా వర్గాలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇప్పటికే సంబంధిత యంత్రాంగానికి సూచించడంతో ఆశలు రేకెత్తుతున్నాయి.

‘అన్న’ గ్రామీణ మూల్స్‌

జిల్లాలో మొదటి విడతలో 400 రేషన్‌ దుకాణాలను ‘అన్న’ గ్రామీణ మాల్స్‌గా మార్చాలన్న ప్రణాళిక ఉంది. జిల్లాలో 1,973 రేషన్‌ దుకాణాలు ఉండగా, ఇందులో మొదటి విడతలో 400 మాల్స్‌ ఏర్పాటు చేసి అన్ని సరుకులు అందుబాటులోకి తక్కువ ధరకే తేవాలన్నది లక్ష్యంగా చెబుతున్నారు. రిలయన్స్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌ సంస్థల ఆధ్వర్యంలోఇవి కొనసాగుతుండటంతో నాణ్యమైన సరుకులు పొందే వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు.

16ap-state9b.jpg

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...