Jump to content

Kurnool Airport, Orvakal.


Recommended Posts

  • Replies 99
  • Created
  • Last Reply

Top Posters In This Topic

ఓర్వకల్లు విమానాశ్రయాన్ని కర్నూలు విమానాశ్రయంగా మార్చమని సీఆర్డీఏ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ఓర్వకల్లు దగ్గర నిర్మిస్తున్న విమానాశ్రయం పనులను ఆయన పరిశీలించారు.

సీఎం చంద్రబాబు గారు కర్నూలు విమానాశ్రయం నిర్మాణ పనులను ఆగష్టులోగా పూర్తిచేయాలని ఆదేశించారని తెలిపారు. పనులు పూర్తి చేసి అక్టోబరు నుంచి అమరావతి, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు విమాన సర్వీసులు నడుపుతామన్నారు. విమాన ఛార్జీలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తాయని తెలిపారు.

https://pbs.twimg.com/media/DdPs-EXV4AMomtB.jpg

https://pbs.twimg.com/media/DdPs_bhV0AEzo_W.jpg

Link to comment
Share on other sites

విమానాశ్రయం పనులు వేగవంతం
 డిసెంబరు నుంచి ప్రయాణం జరిగేలా ఏర్పాట్లు
 ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌
knl-gen1a.jpg

ఓర్వకల్లు, న్యూస్‌టుడే: ఓర్వకల్లు సమీపాన విమానాశ్రయ పనులు వేగవంతం చేశామని, అక్టోబరు నాటికి పూర్తిచేసి, డిసెంబరుకు ప్రయాణాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ పేర్కొన్నారు. ఓర్వకల్లులో జరుగుతున్న విమానాశ్రయం పనులను సోమవారం ఆయన పరిశీలించారు. నగరంలోని విద్యుత్తు భవన్‌లో పరికరాలు నిల్వ చేసే గోదామును పరిశీలించి విద్యుత్తు అధికారులతో సమీక్షించారు.  ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం నాంది పలికిందన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతికి వాయు మార్గంలో చేరుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, జూన్‌ 30వతేదీ నాటికి రన్‌వే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. టర్మినల్‌ బిల్డింగ్‌, ఏటీసీ కేంద్రం పనులు ముగిసిన తర్వాత డిసెంబరు ఆఖరు లోగా ఓర్వకల్లు నుంచి విజయవాడ, చెన్నైలకు విమానాలు తిరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రూ.1500 నుంచి రూ.1700 ఛార్జీతో 35 నిమిషాల్లో విజయవాడ చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. నెల్లూరు, పుట్టపర్తిలో విమానాశ్రయ పనులు జరుగుతున్నాయని, జూన్‌ నుంచి విజయవాడకు విమాన ప్రయాణాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఓర్వకల్లు మండలంలోని శకునాల, గడివేముల మండలంలోని గని గ్రామాల్లో ఏర్పాటు చేసిన వేయి మెగావాట్ల సోలార్‌ పార్క్‌ ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపు వచ్చిందన్నారు. రైతులకు ఏడాదికి 50వేల విద్యుత్తు కనెక్షన్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్తు ఆదా చేసే క్రమంలో రైతులకు సోలార్‌ పంపుసెట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కియా, ఇసుజు, హీరో మోటార్స్‌, అశోక్‌ లేలాండ్‌ లాంటి ప్రముఖ జాతీయ అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. 2014 జూన్‌లో రోజుకు 22 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు కొరత ఉండగా, ప్రస్తుతం మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దామన్నారు. 2016 జూన్‌ నాటికే గృహాలకు వందశాతం విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చిన ఘనత ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఎండీ వెంకటేశ్వర్లు,  ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ ఎం.ఎం.నాయక్‌, సీఈ పీరయ్య, ఎస్‌ఈ భార్గవరాముడు, కర్నూలు ఆర్డీవో హుసేన్‌సాహెబ్‌ పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

చకచకా కర్నూల్ ఎయిర్ పోర్టు... జూలై నెల నుంచి అందుబాటులోకి... ఎయిర్ పోర్ట్ కి,పేరు నిర్ణయించిన సియం..

Super User
15 May 2018
Hits: 314
 
orvakallu-15052018-1.jpg
share.png

సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయానికి కర్నూలు విమానాశ్రయంగా నామాకరణం చేయడం జరిగిందని ఇంధన, పెట్టుబడులు, వౌలిక సదుపాయాలు, సీఆర్‌డీఏ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. సోమవారం స్థానిక విద్యుత్ భవన్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నూలు ఎయిర్ పోర్టు (ఓర్వకల్లు) పనులను వచ్చే జూన్ నెరాఖరులోగా పూర్తి చేసి రన్‌వే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక అక్టోబర్ మాసం నుండి కర్నూలు-విజయవాడ, చెన్నై నగరాలకు విమాన సర్వీసులను నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలు - విజయవాడకు అతి తక్కువ టిక్కెట్ ధర రూ.1500కే జిల్లా ప్రజలకు విమానయ ప్రయాణం కల్పిస్తున్నామన్నారు.

 

orvakallu 15052018 2

కర్నూల్ జిల్లా లో ఓర్వకల్లు సమీపాన విమానాశ్రయ పనులు వేగవంతం చేసారు.. అక్టోబరు నాటికి పూర్తిచేసి, డిసెంబరుకు ప్రయాణాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం నాంది పలికింది. రాష్ట్ర రాజధాని అమరావతికి వాయు మార్గంలో చేరుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు , జూన్‌ 30వతేదీ నాటికి రన్‌వే పనులు పూర్తి చేస్తారు.. టర్మినల్‌ బిల్డింగ్‌, ఏటీసీ కేంద్రం పనులు ముగిసిన తర్వాత డిసెంబరు ఆఖరు లోగా ఓర్వకల్లు నుంచి విజయవాడ, చెన్నైలకు విమానాలు తిరిగేలా చర్యలు తీసుకుంటున్నారు..

orvakallu 15052018 3

రూ.1500 ఛార్జీతో 35 నిమిషాల్లో విజయవాడ చేరుకునే అవకాశం ఉంది..నెల్లూరు, పుట్టపర్తిలో విమానాశ్రయ పనులు జరుగుతున్నాయి..పుట్టపర్తి నుంచి జూన్‌ నుంచి విజయవాడకు విమాన ప్రయాణాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.. కర్నూల్ జిల్లాలో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ ఇదే విషయం చెప్పారు. ఈ సెప్టెంబర్ లో ఓర్వకల్లు లో విమానాశ్రయం ప్రారంభం కానుందని ప్రకటించారు. పరిశ్రమల స్థాపనతో కర్నూలు జిల్లా దశ తిరగనుందని, ఓర్వకల్లుకు పరిశ్రమలు తరలి వస్తున్నాయన్నారు. విద్యావంతులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, రూ.85 వేల కోట్లతో పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయని, 85 వేల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...
  • 3 months later...
  • 1 month later...
  • 2 weeks later...
  • 3 weeks later...
రాయలసీమలో నాలుగో ఎయిర్‌పోర్టు.. ట్రయల్ రన్ సక్సెస్!
31-12-2018 13:22:01
 
636818593222402279.jpg
ఓర్వకల్లు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో ట్రయల్ రన్ విజయవంతమైంది. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి పయనమైన విమానం ఓర్వకల్లు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులో విజయవంతంగా ల్యాండ్ అయింది. జనవరి 7 నుంచి ఈ విమానాశ్రయం ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జనవరి 7న ప్రారంభం కానున్న ఈ ఎయిర్‌పోర్టు రాయలసీమలో నాలుగో ఎయిర్‌పోర్టుగా రికార్డులకెక్కనుంది.
 
 
ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌ కేంద్రంగా ఔత్సాహిక ప్రారిశ్రామికవేత్తలు రావాలంటే రవాణా మెరుగుపడాలని ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 999.50 ఎకరాలను ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ అధారిటీకి కేటాయించింది. రూ.90.5 కోట్లతో 2017 జూన్‌లో పనులు చేపట్టారు. కీలకమైన రన్‌వే, అప్రాన్‌, టర్మినల్‌, టవర్‌ భవనం, అప్రోచ్‌ రోడ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి.
Link to comment
Share on other sites

Current running airports
Tirupathi(I hope currently having International status)
Vijayawada(Having International status and have the flights to Singapore)
Vizag(Having International status and have the flights to Singapore,Malaysia,Thailand)
Rajahmundry(Domestic airport with very good traffic)
Kadapa(Domestic airport not bad traffice)
Oravakallu(Kurnool --about to start -- Domestic airport) 

Link to comment
Share on other sites

6 minutes ago, yannamaneni said:

also

Sri Sathya Sai Airport  -- Puttaparthi( Hope not in use)
Dagadarthi -- Nellore ( I think it's under construction) 

Bhogapuram(International airport -- seems to be in Tender's state, Construction yet be start)

సాగర్‌, పుట్టపర్తికి..: విజయవాడ- నాగార్జునసాగర్‌, విజయవాడ- పుట్టపర్తి మధ్య కూడా విమాన సేవలను ప్రవేశపెట్టేందుకు ఏపీఏడీసీఎల్‌ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. ఈ రెండు ప్రాంతాలకు 9 సీట్ల ఎయిర్‌ క్రాఫ్ట్‌ను నడపాలనేది సంస్థ యోచన.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...