Jump to content

mee seva lo పట్టాదార్‌ పాసుబుక్‌

Recommended Posts

పట్టాదార్‌ పాసుబుక్‌ మీ సేవలో
 
  • రూ.35తో టైటిల్‌డీడ్‌ ప్రింట్‌ కూడా
  • 13 భద్రతా విధానాలతో సౌకర్యం
అమరావతి, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): రెవెన్యూశాఖపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు ఆ శాఖ చర్యలు ప్రారంభించింది. రైతులకు పారదర్శకంగా సేవలందించి భూమిపై వారికున్న హక్కులను బదలాయించేందుకు సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో మీ-సేవలో కొత్త సేవలను ప్రారంభిస్తూ సీసీఎల్‌ఏ ఇచ్చిన ప్రతిపాదనలను అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. టైటిల్‌ డీడ్‌ సహా పట్టాదార్‌ పాసు పుస్తకాన్ని మీసేవలోనే పొందే వెసులుబాటు కలగనుంది. ఇప్పుడున్న మ్యుటేషన్‌ ప్లస్‌ టైటిల్‌ డీడ్‌ కం పట్టాదార్‌ పాస్‌బుక్‌ను 13 భద్రతా విధానాలతో కొనసాగిస్తారు. టైటిల్‌డీడ్‌ కం పట్టాదార్‌ పాసుబుక్‌ ప్రింట్‌ చేసి ఇచ్చేందుకు, ఎలక్ట్రానిక్‌ టైటిల్‌డీడ్‌ కం పట్టాదార్‌ పాస్‌బుక్‌ సౌకర్యం కల్పించేందుకు సంబంధిత నమూనాలను విడుదల చేశారు. టైటిల్‌డీడ్‌ కం పట్టాదార్‌ పాసుబుక్‌ పొందేందుకు మీ సేవలో రూ.35 చెల్లించాల్సి ఉంటుంది. ఆయా భూములకు సంబంధించి ఖాతాదారుడై ఉండి, వారి పేరుతో మ్యూటేషన్‌ అయి వెబ్‌ అడంగల్‌లో కాలమ్‌ నెం.12లో పేరు ఉండాలి. వెబ్‌ల్యాండ్‌లో యజమాని ఖాతాకు ఆధార్‌ నెంబర్‌, మొబైల్‌ నెంబర్‌ అనుసంధానమై ఉండాలి. దరఖాస్తులో పేరు, ఆధార్‌ నెంబర్‌, మొబైల్‌ నెంబర్‌, వెబ్‌ల్యాండ్‌ ఖాతా నెంబర్‌, జిల్లాపేరు, మండలం, గ్రామం, సర్వే నెంబర్‌, విస్తీర్ణం తదితర వివరాలు భర్తీ చేయడంతో పాటు దీనికి సంబంధించి డిక్లరేషన్‌ ఇస్తారు. రైతులు మీ సేవకు దరఖాస్తు చేసుకున్న తర్వాత మ్యుటేషన్‌ ప్లస్‌ టైటిల్‌డీడ్‌ కం పట్టాదార్‌ పాసుబుక్‌ అందిస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌లో మ్యుటేషన్‌ అయిన వాటిని ఆమోదిస్తూ తహసీల్దార్‌ లాగిన్‌కు పంపిస్తారు. తహసీల్దార్‌ టైటిల్‌డీడ్‌ కం పట్టాదార్‌ పాసుబుక్‌ ఇచ్చేందుకు ఆమోదం తెలిపిన తర్వాత దానిని మద్రాసు సెక్యూరిటీ ప్రింటర్స్‌(ఎంఎ్‌సపీ)కు పంపిస్తారు. టైటిల్‌డీడ్‌ కం పట్టాదార్‌ పాస్‌బుక్‌ను 13 సెక్యూరిటీ ఫీచర్స్‌ ద్వారా ముద్రించిన తర్వాత ఎంఎ్‌సపీ రైతులకు రిజిస్టర్‌ పోస్టు ద్వారా పంపుతుంది. ముద్రించి పంపేందుకు వారం గడువు ఇస్తూ అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 18 నాటికి 11,79,561 పట్టాదార్‌ పాసుబుక్స్‌ను ప్రింట్‌ చేశారు. 11,58,262 పట్టాదార్‌ పాసుబుక్‌లను రైతులకు పోస్టు ద్వారా అందజేశారు. ప్రభుత్వ శాఖల సేవలన్నీ టైటిల్‌ డీడ్‌ కం పట్టాదార్‌ పాస్‌బుక్‌ కోసం ఒత్తిడి చేయకుండా ఎలక్ట్రానిక్‌ విధానంలో ఇస్తున్న 1-బీ ఆధారంగా అందించాలని సీసీఎల్‌ఏ ఇప్పటికే ఆదేశాలిచ్చింది.

Link to comment
Share on other sites

మీసేవలో ధ్రువీకరణ పత్రాలు సులభంగా పొందండిలా..
 
636332115311019196.jpg
విజయవాడ: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పదో తరగతి పాసైన విద్యార్థులకు ఇంటర్‌లో ప్రవేశం పొందాలంటే కుల, ఆదాయ, నివాస, పుట్టిన తేదీ వంటి పలు రకాల ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయి. డిగ్రీ, ఆపై చదువుల వారికి, ఉద్యోగాలు చేసే వారికి, రిటైర్‌ అయిన వారికి, రైతులకు, కూలీలకు ఇలా ఒకరేమిటి అన్ని వర్గాల వారికీ ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయి. ధ్రువీకరణ పత్రాలు ఎలా పొందాలో తెలియక చాలా మంది దళారులను నమ్మి నష్టపోతున్నారు. తహసీల్దారు కార్యాలయంలో ఏ ధ్రువీకరణ పత్రాలు లభిస్తాయి? వాటిని ఏ విధంగా పొందవచ్చు? ఇందుకోసం ఎవరిని సంప్రదించాలి? ఎలాంటి ఆధారాలు అవసరం? అనే వివరాలపై అందిస్తున్న ప్రత్యేక కథనం.
 
కుల ధ్రువీకరణ పత్రం కోసం..
కుల ధ్రువీకరణ పత్రాల కోసం ముందుగా దగ్గరలోని మీ సేవ కేంద్రంలో లభించే దరఖాస్తు ఫారం తీసుకుని అందులో పూర్తి వివరాలు పూరించాలి. అవసరమైన జిరాక్స్‌ ప్రతులను జతచేసి 35 రూపాయలు ఫీజు చెల్లించి మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. కొన్నిసార్లు ముందుగానే వీఆర్వో, ఆర్‌ఐలతో దరఖాస్తుపై సంతకం చేయించాల్సి ఉంటుంది. మరికొన్ని సార్లు మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే దానిపై విచారణ జరిపి సెక్షన్‌కు పంపుతారు. అనంతరం తహసీల్దారు ఆన్‌లైన్‌లో సంతకం చేస్తారు. మీసేవ కేంద్రం ద్వారా ఈ పత్రాన్ని దరఖాస్తుదారుడు పొందే వీలుంటుంది. అన్ని తహసీల్దారు కార్యాలయాల్లో 30 పనిదినాల్లోపు అందించాలి. దరఖాస్తుతోపాటు అన్ని ధ్రువీకరణ పత్రాలు జతచేయాలి. లేదంటే వాటిని తిరస్కరించే అవకాశం ఉంటుంది.
 
ఆదాయ ధ్రువీకరణ పత్రం...
ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం మీసేవ కేంద్రంలో దరఖాస్తు నింపి దాంతోపాటు ప్రైవేట్‌ సంస్థలో పనిచేసే ఆదాయ డిక్లరేషన్‌, వేతన సర్టిఫికెట్‌ను జతచేయాలి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు రేషన్‌కార్డులో సూచించిన ఆదాయ ధ్రువీకరణ సరిపోతుంది. వీటితోపాటు అడ్రస్‌ ఫ్రూఫ్‌, ఐడీ ఫ్రూఫ్‌ పత్రాలను జతచేస్తే వాటిని పరిశీలించి తహసీల్దారు కార్యాలయం నుంచి ధ్రువీకరణ ప్రతం మంజూరు చేస్తారు.
 
నివాస ధ్రువీకరణ పత్రం...
నివాస ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తుదారులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు నింపాలి. విద్యాసంస్థల నుంచి ఇచ్చే బోనఫైడ్‌ సర్టిఫికెట్‌తో పాటు అడ్రస్‌ ఫ్రూఫ్‌, ఐడీ ఫ్రూఫ్‌ పత్రాలను జతచేసి, రూ.35 ఫీజు చెల్లించాలి. ఈ దరఖాస్తు తహసీల్దారు కార్యాలయం ద్వారా వీఆర్వోకు చేరిన వెంటనే దానిపై విచారణ జరిపి, అన్ని ఆధారాలూ సరిపోతే ఏడు పనిదినాల్లోగా నివాస ధ్రువీకరణ పత్రాన్ని అందించాల్సి ఉంటుంది.
 
గ్యాప్‌ సర్టిఫికెట్‌..
మండల తహసీల్దారుకార్యాలయాల్లో గ్యాప్‌ సర్టిఫికెట్‌ పొందవచ్చు. విద్యలో వెనుకబడిన విద్యార్థులు, అనారోగ్య కారణాలతో చదవలేని వారు విధిగా ఉన్నత విద్య కోసం ఈ గ్యాప్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ద్వారా స్కాలర్‌షిప్‌లు పొందేందుకు అవసరం ఉంటుంది. దీనికోసం మీసేవ కేంద్రాల్లో పది రూపాయల స్టాంప్‌ పేపరుపై ఎందుకోసం గ్యాప్‌ వచ్చిందో సూచిస్తూ అఫిడవిట్‌ నోటరీ చేయించడంతోపాటు ఇద్దరు గెజిటెడ్‌ అధికారులతో సంతకాలతో కూడిన సర్టిఫికెట్లు, విద్యార్హతల సర్టిఫికెట్లు, అనారోగ్య కారణాలతో గ్యాప్‌వస్తే మెడికల్‌ సర్టిఫికెట్‌ జత చేయాల్సి ఉంటుంది. వీటన్నింటినీ పరిశీలించిన రెవెన్యూ అధికారులు 15 పనిదినాల్లో ఈ గ్యాప్‌ సర్టిఫికెట్‌ను అందజేస్తారు.
 
ఈబీసీ సర్టిఫికెట్‌...
ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ సర్టిఫికెట్‌ (ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలు) అంటారు. దీనిని ఓసీ కులస్థులు బ్రాహ్మణ, రెడ్డి, నాయుడు, కాపు, వైశ్య, చౌదరి తదితర ఉన్నత వర్గాల వారు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈబీసీ సర్టిఫికెట్‌ ఉంటే ప్రభుత్వం చదువుకునేందుకు స్కాలర్‌షిప్‌లను ఇస్తుంది. వీటి కోసం ఆదాయ పత్రాలు, రేషన్‌కార్డు, వేతన స్లిప్‌, విద్యాసంస్థల టీసీ, కుల సంఘాల సర్టిఫికెట్‌, అడ్రస్‌, ఐడీ ఫ్రూఫ్‌లతో పాటు దరఖాస్తు చేసుకుంటే అన్నింటిని విచారించి ఏడు పనిదినాల్లో ఈబీసీ సర్టిఫికెట్‌ ఇస్తారు.
 
ఓబీసీ సర్టిఫికెట్‌...
ఓబీసీ సర్టిఫికెట్‌ను పొందేందుకు దరఖాస్తుదారుడు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు నింపి దాంతోపాటు కులం సూచించే సాక్ష్యంతో కూడిన పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ప్రైవేట్‌ ఉద్యోగి అయితే వేతన స్లిప్‌, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు రేషన్‌కార్డు, విద్యార్హతల పత్రాలు జతచేసి మీసేవలో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని రకాల ఆధారాలను పరిశీలించిన రెవెన్యూ అధికారులు అర్హులైన వారికి 15 పనిదినాల్లో ఓబీసీ సర్టిఫికెట్‌ అందజేస్తారు.
 
దళారులను ఆశ్రయించి మోసపోవద్దు....
తహసీల్దారు కార్యాలయం ద్వారా పొందే అన్ని రకాల ధ్రువీకరణ పత్రాల కోసం నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. మధ్యవర్తులను, దళారులను నమ్మి మోసపోవద్దు. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు కావాలో, వాటికి కావాల్సిన ఆధారాలు జతచేసి దరఖాస్తు చేసుకుంటే, వాటిపై విచారణ జరిపి గడువులోగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధ్రువీకరణ పత్రాలు అందుతాయి. అన్ని మీసేవ కేంద్రాల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ఎవరైనా దళారులు డబ్బులిస్తే పనిచేయిస్తామని నమ్మబలికే ప్రమాదముంది. అలాంటి వారిని నమ్మకుండా కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలి.
Link to comment
Share on other sites

పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు అందుకునే క్రమంలో రైతులు ఎదుర్కునే సమస్యలకు పరిష్కారంగా ‘మీసేవ’ కేంద్రాల్లోనే పట్టాదార్‌ పాస్‌ పుస్తకం పొందేలా రాష్ట్ర రెవెన్యూశాఖ ఏర్పాట్లు చేసింది. మీసేవ కేంద్రాల్లో రూ.25 సేవారుసుం చెల్లించి పాస్‌పుస్తకం ప్రింట్లు పొందవచ్చు. దీనిపై సంబంధిత అధికారుల డిజిటల్‌ సంతకం ఉంటుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలతో రాష్ట్ర రెవెన్యూశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

'మీసేవ' ద్వారా పట్టాదార్‌ పాస్‌ పుస్తకం పొందే విధానం:

మొదట వెబ్‌ల్యాండ్‌లోని అడంగల్‌లో ఉన్న వివరాలకు ఆధార్‌ వివరాలను, మొబైల్‌ నెంబరును చేర్చాలి. వీటి ఆధారంగా మీసేవ కేంద్రంలో టైటిల్‌డీడ్‌, పట్టాదార్‌ పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు ఇవ్వాలి.
పేరు, ఆధార్‌, మొబైల్‌ నెంబర్లు, వెబ్‌ల్యాండ్‌ ఖాతా నెంబరు, సర్వే నెంబర్లు, విస్తీర్ణం తదితరాలను దరఖాస్తులో చేర్చాలి. రూ.25 రుసుం చెల్లించడంతో పాటు నిర్దేశిత నమూనాలో స్వీయ ధ్రువీకరణ ఇవ్వాలి.
పాస్‌పుస్తకం కోరుతున్న భూములకు సంబంధించిన వివరాలను మీసేవలో తనిఖీ చేస్తారు.
అన్నీ సక్రమంగా ఉంటే పాస్‌ పుస్తకం వివరాలు మీసేవ కేంద్రంలోని ఆపరేటర్‌ స్క్రీన్‌పైకి వస్తాయి. వాటిని ప్రింట్‌ తీసి ఇస్తారు. ఈ పత్రాలకీ పలు సెక్యూరిటీ ఫీచర్లు, విశిష్ట సంఖ్య, క్యూఆర్‌ కోడ్‌ ఉంటాయి.

ఉచిత డౌన్‌లోడ్‌ చేసుకునే విధానం:

ఎలక్ట్రానిక్‌ టైటిల్‌ డీడ్‌ కం పట్టాదార్‌ పాస్‌పుస్తకంగా వ్యవహరించే పీడీఎఫ్‌ ఫార్మాట్ బుక్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మీభూమి వెబ్‌సైట్‌తోపాటు మీసేవ, అడంగల్‌, ఏపీ రెవెన్యూ క్యూఆర్‌ స్కానర్‌ (APRevQRScanner) యాప్‌ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే వీలు కల్పించారు. వీటిలోకి వెళ్లాక సిస్టమ్‌ అడిగే వివరాలు సమర్పించాలి. ఆధార్‌ వివరాలతో సరిపోవాలి. అలాగే వెబ్‌ల్యాండ్‌లో నమోదైన మొబైల్‌ నెంబరుకు ఓటీపీ వస్తుంది. ఆ తరవాతే పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో మొబైల్‌కిగానీ, ఈమెయిల్‌కుగానీ పాస్‌ పుస్తకం వస్తుంది. దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రింట్లు తీసుకోవచ్చు. వీటికి కూడా విశిష్ట సంఖ్య, క్యూఆర్‌ కోడ్‌ ఉంటాయి.

19221793_1710661048947479_16780297988369

Link to comment
Share on other sites

Please post instructions if you know, how to download in mobile. Through app? or from site?

మీసేవలో ధ్రువీకరణ పత్రాలు సులభంగా పొందండిలా..

636332115311019196.jpg
విజయవాడ: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పదో తరగతి పాసైన విద్యార్థులకు ఇంటర్‌లో ప్రవేశం పొందాలంటే కుల, ఆదాయ, నివాస, పుట్టిన తేదీ వంటి పలు రకాల ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయి. డిగ్రీ, ఆపై చదువుల వారికి, ఉద్యోగాలు చేసే వారికి, రిటైర్‌ అయిన వారికి, రైతులకు, కూలీలకు ఇలా ఒకరేమిటి అన్ని వర్గాల వారికీ ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయి. ధ్రువీకరణ పత్రాలు ఎలా పొందాలో తెలియక చాలా మంది దళారులను నమ్మి నష్టపోతున్నారు. తహసీల్దారు కార్యాలయంలో ఏ ధ్రువీకరణ పత్రాలు లభిస్తాయి? వాటిని ఏ విధంగా పొందవచ్చు? ఇందుకోసం ఎవరిని సంప్రదించాలి? ఎలాంటి ఆధారాలు అవసరం? అనే వివరాలపై అందిస్తున్న ప్రత్యేక కథనం.
 
కుల ధ్రువీకరణ పత్రం కోసం..
కుల ధ్రువీకరణ పత్రాల కోసం ముందుగా దగ్గరలోని మీ సేవ కేంద్రంలో లభించే దరఖాస్తు ఫారం తీసుకుని అందులో పూర్తి వివరాలు పూరించాలి. అవసరమైన జిరాక్స్‌ ప్రతులను జతచేసి 35 రూపాయలు ఫీజు చెల్లించి మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. కొన్నిసార్లు ముందుగానే వీఆర్వో, ఆర్‌ఐలతో దరఖాస్తుపై సంతకం చేయించాల్సి ఉంటుంది. మరికొన్ని సార్లు మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే దానిపై విచారణ జరిపి సెక్షన్‌కు పంపుతారు. అనంతరం తహసీల్దారు ఆన్‌లైన్‌లో సంతకం చేస్తారు. మీసేవ కేంద్రం ద్వారా ఈ పత్రాన్ని దరఖాస్తుదారుడు పొందే వీలుంటుంది. అన్ని తహసీల్దారు కార్యాలయాల్లో 30 పనిదినాల్లోపు అందించాలి. దరఖాస్తుతోపాటు అన్ని ధ్రువీకరణ పత్రాలు జతచేయాలి. లేదంటే వాటిని తిరస్కరించే అవకాశం ఉంటుంది.
 
ఆదాయ ధ్రువీకరణ పత్రం...
ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం మీసేవ కేంద్రంలో దరఖాస్తు నింపి దాంతోపాటు ప్రైవేట్‌ సంస్థలో పనిచేసే ఆదాయ డిక్లరేషన్‌, వేతన సర్టిఫికెట్‌ను జతచేయాలి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు రేషన్‌కార్డులో సూచించిన ఆదాయ ధ్రువీకరణ సరిపోతుంది. వీటితోపాటు అడ్రస్‌ ఫ్రూఫ్‌, ఐడీ ఫ్రూఫ్‌ పత్రాలను జతచేస్తే వాటిని పరిశీలించి తహసీల్దారు కార్యాలయం నుంచి ధ్రువీకరణ ప్రతం మంజూరు చేస్తారు.
 
నివాస ధ్రువీకరణ పత్రం...
నివాస ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తుదారులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు నింపాలి. విద్యాసంస్థల నుంచి ఇచ్చే బోనఫైడ్‌ సర్టిఫికెట్‌తో పాటు అడ్రస్‌ ఫ్రూఫ్‌, ఐడీ ఫ్రూఫ్‌ పత్రాలను జతచేసి, రూ.35 ఫీజు చెల్లించాలి. ఈ దరఖాస్తు తహసీల్దారు కార్యాలయం ద్వారా వీఆర్వోకు చేరిన వెంటనే దానిపై విచారణ జరిపి, అన్ని ఆధారాలూ సరిపోతే ఏడు పనిదినాల్లోగా నివాస ధ్రువీకరణ పత్రాన్ని అందించాల్సి ఉంటుంది.
 
గ్యాప్‌ సర్టిఫికెట్‌..
మండల తహసీల్దారుకార్యాలయాల్లో గ్యాప్‌ సర్టిఫికెట్‌ పొందవచ్చు. విద్యలో వెనుకబడిన విద్యార్థులు, అనారోగ్య కారణాలతో చదవలేని వారు విధిగా ఉన్నత విద్య కోసం ఈ గ్యాప్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ద్వారా స్కాలర్‌షిప్‌లు పొందేందుకు అవసరం ఉంటుంది. దీనికోసం మీసేవ కేంద్రాల్లో పది రూపాయల స్టాంప్‌ పేపరుపై ఎందుకోసం గ్యాప్‌ వచ్చిందో సూచిస్తూ అఫిడవిట్‌ నోటరీ చేయించడంతోపాటు ఇద్దరు గెజిటెడ్‌ అధికారులతో సంతకాలతో కూడిన సర్టిఫికెట్లు, విద్యార్హతల సర్టిఫికెట్లు, అనారోగ్య కారణాలతో గ్యాప్‌వస్తే మెడికల్‌ సర్టిఫికెట్‌ జత చేయాల్సి ఉంటుంది. వీటన్నింటినీ పరిశీలించిన రెవెన్యూ అధికారులు 15 పనిదినాల్లో ఈ గ్యాప్‌ సర్టిఫికెట్‌ను అందజేస్తారు.
 
ఈబీసీ సర్టిఫికెట్‌...
ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ సర్టిఫికెట్‌ (ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలు) అంటారు. దీనిని ఓసీ కులస్థులు బ్రాహ్మణ, రెడ్డి, నాయుడు, కాపు, వైశ్య, చౌదరి తదితర ఉన్నత వర్గాల వారు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈబీసీ సర్టిఫికెట్‌ ఉంటే ప్రభుత్వం చదువుకునేందుకు స్కాలర్‌షిప్‌లను ఇస్తుంది. వీటి కోసం ఆదాయ పత్రాలు, రేషన్‌కార్డు, వేతన స్లిప్‌, విద్యాసంస్థల టీసీ, కుల సంఘాల సర్టిఫికెట్‌, అడ్రస్‌, ఐడీ ఫ్రూఫ్‌లతో పాటు దరఖాస్తు చేసుకుంటే అన్నింటిని విచారించి ఏడు పనిదినాల్లో ఈబీసీ సర్టిఫికెట్‌ ఇస్తారు.
 
ఓబీసీ సర్టిఫికెట్‌...
ఓబీసీ సర్టిఫికెట్‌ను పొందేందుకు దరఖాస్తుదారుడు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు నింపి దాంతోపాటు కులం సూచించే సాక్ష్యంతో కూడిన పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ప్రైవేట్‌ ఉద్యోగి అయితే వేతన స్లిప్‌, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు రేషన్‌కార్డు, విద్యార్హతల పత్రాలు జతచేసి మీసేవలో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని రకాల ఆధారాలను పరిశీలించిన రెవెన్యూ అధికారులు అర్హులైన వారికి 15 పనిదినాల్లో ఓబీసీ సర్టిఫికెట్‌ అందజేస్తారు.
 
దళారులను ఆశ్రయించి మోసపోవద్దు....
తహసీల్దారు కార్యాలయం ద్వారా పొందే అన్ని రకాల ధ్రువీకరణ పత్రాల కోసం నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. మధ్యవర్తులను, దళారులను నమ్మి మోసపోవద్దు. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు కావాలో, వాటికి కావాల్సిన ఆధారాలు జతచేసి దరఖాస్తు చేసుకుంటే, వాటిపై విచారణ జరిపి గడువులోగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధ్రువీకరణ పత్రాలు అందుతాయి. అన్ని మీసేవ కేంద్రాల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ఎవరైనా దళారులు డబ్బులిస్తే పనిచేయిస్తామని నమ్మబలికే ప్రమాదముంది. అలాంటి వారిని నమ్మకుండా కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలి.

Link to comment
Share on other sites

  • 1 month later...

Ivi anni ravali ante mundu adangal update avvali..

Madi number tappu undi ani survey cheyandi ani pedithe, 1 mnth nunchi surveriors daily repu ani cheputunaru..evadiki complaint ivvalo cheppandi

Surveyor raadu same problem for me

Link to comment
Share on other sites

  • 5 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...