Jump to content

1100 Effect లంచం డబ్బులు వెనక్కి!


Recommended Posts

లంచం డబ్బులు వెనక్కి!
 
 
  • పరిష్కార వేదికతో చర్యలు
  • ఇప్పటి వరకు 12 మంది తిరిగి ఇప్పించిన వైనం
అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): ఇంతకాలం భవిష్యత్‌లో లంచాలు లేకుండా ఎలా నిర్మూలించాలనే దానిపైనే దృష్టి ఉండేది. కానీ ఇప్పుడు... తీసుకున్న లంచాలను లబ్ధిదారులకు తిరిగి ఇప్పించే సరికొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన ‘పరిష్కార వేదిక’ కాల్‌ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టి.. లంచాలు తిన్నది వాస్తవమని తేలితే తిరిగి ఇవ్వాలని ఆదేశిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు 12 మంది నుంచి లంచాలు తిరిగి ఇప్పించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. లంచాలు తీసుకున్న వారి పేర్లు చెప్పకుండా, వాటి వివరాలను గురువారం ప్రెస్‌మీట్‌లో వివరించారు. పెన్షన్లపై 1,20,800 కాల్స్‌ వస్తే అందులో 4శాతం మంది లంచాలపై ఫిర్యాదులు చేశారన్నారు. రేషన్‌కు సంబంధించి 2లక్షల కాల్స్‌ వస్తే అందులో 1.25శాతం లంచాల ఫిర్యాదులు అందాయన్నారు. చంద్రన్న బీమాలో 3శాతం లంచాలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. మొత్తం 25వేల కాల్స్‌లో ఫిర్యాదులు అందాయన్నారు. ‘కడప జిల్లాలో ఒక బ్రోకర్‌ చంద్రన్న బీమాలో ఒక లబ్ధిదారు నుంచి రూ.వెయ్యి లంచం తీసుకున్నాడు. విచారణ జరిపిస్తే తిరిగిచ్చాడు. కర్నూలు జిల్లాలో ఓ పంచాయతీ కార్యదర్శి పెన్షన్‌ విషయంలో రూ.500 లంచం తీసుకున్నట్లు తేలింది. దానిని తిరిగివ్వాలని ఆదేశించగా... దాంతోపాటు మొత్తం పది మంది వద్ద తీసుకున్న మొత్తాలను ఇచ్చేశాడు. ఫిర్యాదులపై విచారణ జరిపాకే చర్యలు తీసుకుంటాం. రాజకీయ అవినీతి కూడా సహించేది లేదు. 1100 నంబరుకు ఎలాంటి ఫిర్యాదులైనా చేయొచ్చు. ఎక్కడ అవినీతి జరిగినా ప్రజలు సమాచారమివ్వాలి’ అని సీఎం కోరారు.

 

Link to comment
Share on other sites

మెక్కిందంతా కక్కిస్తున్నాం

లంచావతారాలపై విచారించి తీసుకున్న సొమ్ము తిరిగి బాధితులకు ఇప్పించేస్తున్నాం

1100 నెంబరుకు ఏ ఫిర్యాదైనా చేయొచ్చు

నేతలే కాదు ఎవరిపైనైనా చెప్పొచ్చు

పంటల బీమా కనీసం రూ.15 వేలు ఇస్తాం

డాక్టర్‌ షిలా భిµడే కమిటీ సిఫార్సుల ఆమోదం

మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు వెల్లడించిన సీఎం

ఈనాడు - అమరావతి

1ap-main1a.jpg

అందివచ్చిన సాంకేతిక సాయంతో అవినీతిపై పోరు సల్పుతున్నామని, లంచావతారుల భరతం పడుతున్నామని చంద్రబాబు అన్నారు. 1100 నంబరుకు ఏ ఫిర్యాదైనా చేయొచ్చని తెలిపారు. మంత్రిమండలి నిర్ణయాలను ఆయన విలేకరులకు వెల్లడిస్తూ ఈ విషయం చెప్పారు. ఫిర్యాదులన్నింటినీ మీ కోసం వెబ్‌సైట్‌లో పెడుతున్నట్లు చెప్పారు. వచ్చిన ఫిర్యాదులను విచారించి లంచం తీసుకున్నట్టు తేలితే ఆ మొత్తాన్ని తిరిగి బాధితులకు ఇప్పించేస్తున్నామని తెలిపారు.

పాఠశాలల రేషన్‌లైజేషన్‌పై తొందరపడబోమని గిరిజన ప్రాంతాల్లో 10 మంది, ఇతర ప్రాంతాల్లో కనీసం 19 మంది విద్యార్థులు ఉంటే పాఠశాలలు కొనసాగిస్తామని సీఎం అన్నారు. ఈ విషయలో ఎప్పటికప్పుడు ప్రజలకు వివరాలు తెలియజేస్తూనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.విజయవాడలో మెట్రోరైలు నిర్మాణానికి ఖర్చు ఎక్కువ, ప్రయోజనం తక్కువ కనిపిస్తున్నందున దానికి ప్రత్యామ్నాయాన్ని పరిశీలించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. మెట్రో రైలుకి బదులుగా రెండంతస్తుల పైవంతెనలను నిర్మించి, వాటిపై ఎలక్ట్రికల్‌ బస్సులు నడిపితే నిర్మాణ వ్యయంతో పాటు, ఇంధన ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తంచేశారు. విశాఖపట్నంలో మెట్రో రైలు నిర్మాణం లాభదాయకమేనని, అవసరమైతే అనకాపల్లి వరకు పొడిగించవచ్చునని, విజయవాడలో మాత్రం తక్కువ దూరానికే రూ.7,200 కోట్లు ఖర్చవుతున్నందున ప్రత్యామ్నాయం చూడాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రత్యామ్నాయ ప్రతిపాదనలపై అధ్యయనం చేసే బాధ్యతను పురపాలక మంత్రి పి.నారాయణకు ముఖ్యమంత్రి అప్పగించారు.

Link to comment
Share on other sites

nayakula meda kuda cheyyali evarini vadalakudadu mari ekkuva chesthunaru

public dhairyam ga complaint chesina roju,political corruption taggutundhi..dedicated call center elano vundhi..time to time output vadhilithe..enthokontha bayapadatam start ayyi..gradual ga taggudhi..
Link to comment
Share on other sites

అవినీతిపై అస్త్రం ఫిర్యాదుల కేంద్రం

సమాచారమిచ్చిన వాళ్లకు ప్రభుత్వం అండ: పరకాల ప్రభాకార్‌

ఈనాడు, అమరావతి: అవినీతిపరులపై, సర్కారు సేవలకు లంచాలు తీసుకునేవాళ్ల సమాచారాన్ని అందించిన వాళ్లకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ స్పష్టం చేశారు. వివరాలు చెప్పిన వాళ్ల వివరాల్ని గోప్యంగా ఉంచుతామన్నారు. వీరికి తగిన రక్షణ కల్పించాలని, ప్రజావేగుల రక్షణకు సంబంధించిన చట్టాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు తెలిపారు. ‘1100’ నెంబర్‌తో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిర్యాదుల కేంద్రం (కాల్‌సెంటర్‌) అవినీతిపై ఓ అస్త్రమని అభివర్ణించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన విలేకర్లతో ముచ్చటించారు. పింఛన్లు, చంద్రన్న బీమా, రేషన్‌కి సంబంధించి లబ్ధిదారుల నుంచి స్పందన తీసుకున్నామని చెప్పారు. అవినీతికి సంబంధించి మూడు వేల మంది ప్రస్తావించగా... వారితో ఫోన్‌లో మాట్లాడినప్పుడు కొద్ది మందే వివరాలు చెప్పేందుకు సుముఖత వ్యక్తం చేశారని, ఆ వివరాల ఆధారంగా ఎవరికి లంచం ఇచ్చారో వాళ్లతో కూడా మాట్లాడామని వివరించారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులే కాకుండా ప్రజాప్రతినిధులు, ఇంకెవరైనా... ఎక్కడైనా అవినీతికి పాల్పడితే చెప్పాలన్నారు.

రాష్ట్రం వీధినపడ్డ రోజనే... నవనిర్మాణ దీక్షను విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ దగ్గర నిర్వహించడాన్ని ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని పార్టీలు తప్పుబట్టడం విడ్డూరంగా ఉందని పరకాల వ్యాఖ్యానించారు. రాష్ట్రం వీధినపడిన రోజు అనీ, జరిగిన అన్యాయంపై ఓ గంటసేపు మాట్లాడి అందరిలో స్ఫూర్తి నింపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమన్నారు.

Link to comment
Share on other sites

లంచం సొమ్ము కక్కిస్తున్న 1100 కాల్ సెంటర్ Super User 02 June 2017 Hits: 1700  
call-center-ap-02062017.jpg
share.png

ఇంతకాలం భవిష్యత్‌లో లంచాలు లేకుండా ఎలా నిర్మూలించాలనే దానిపైనే దృష్టి ఉండేది. కానీ ఇప్పుడు... తీసుకున్న లంచాలను లబ్ధిదారులకు తిరిగి ఇప్పించే సరికొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

టెక్నాలజీ... ఆధునిక పరిపాలనా వ్యవస్థలో పాలకులకు ఒక అస్త్రం. సమస్యలకు ఒక సులభ పరిష్కార వినియోగ వ్యవస్థ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాల్ సెంటర్లు అవినీతి అధికారుల పై ప్రజలు నేరుగా ఘుళిపించే కొరడాగా మారుతున్నాయి.

'ప్రజలే ముందు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించిన 1100 కాల్ సెంటర్ వల్ల ఆసక్తికరమైన వివరాలు వెల్లడవుతున్నాయి. వివిధ అవసరాలకు సంబంధించి ప్రభుత్వ అధికారులను సంప్రదిస్తున్న లబ్దిదారులకు అక్కడక్కడా అవినీతి జాడ్యం తప్పడం లేదన్నది ప్రభుత్వం ప్రారం భించిన పరిష్కార వేదిక దృష్టికి వస్తుంది. బుధవారం ఒక్క రోజే 12 మంది లబ్దిదారులు, అధికారులకు, దళారులకు లంచం రూపంలో చెల్లించిన నగదును ముక్కపిండి వసూలు చేసి వెనుకకు తిరిగి అప్పగించేలా రియల్ టైం గవర్నెన్స్ విభాగం ఒక కొత్త ప్రయోగాన్ని విజయవంతంగా ప్రారంభించింది.

1100 పేరుతో ముఖ్యమంత్రి ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ప్రారంభించిన కాల్ సెంటర్ నంబర్ చురుగ్గా పని ప్రారంభించింది. మే 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మొత్తం 23,827 ఫోన్ కాల్స్ వచ్చాయి. అలాగే రేషన్ పెన్షన్, చంద్రన్న భీమా పధకం లభ్దిదారుల స్పందన తెలుసుకోడానికి ఈ కాల్ సెంటర్ నుంచి భారీగా ఫోన్ కాల్స్ చేస్తే అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

 

చంద్రన్న బీమా గురించి తెలుసుకోవటానికి 50 వేల పైగా కాల్స్, రేషన్ సంబంధించి తొమ్మిది లక్షలకు పైగా, పెన్షన్ల గురించి 6 లక్షలు, మిర్చి సమస్య పై 20వేలకు పై గా ఫోన్ కాల్స్, కాల్ సెంటర్ నుంచి లబ్దిదారులకు వెళ్ళాయి. లంచం పై వచ్చిన ఫిర్యాదులను తెలుసుకోడానికి కాల్ సెంటర్ ప్రతినిధులు మూడు వేలకు పైగా కాల్స్ చేశారు. ఇలా చేసిన ఫోన్ కాల్స్ వల్ల నిన్న ఒక్క రోజే 12మంది లబ్దిదారులు, అధికారులకు తామిచ్చిన లంచాలను వెనక్కి పొందేలా చేయడంలో రియల్ టైం గవర్నెన్స్ బృందం అధికారులు సక్సెస్ అయ్యారు.

కర్నూలు జిల్లాలో ఓ మహిళ పింఛను కోసం పంచాయతీ కార్యదర్శికి 500 రూపాయలు లంచం ఇచ్చినట్టు తెలియడంతో ఆ లంచం డబ్బును ఆ అధికారి నుంచి 1100 రియల్ టైం గవర్నెన్స్ బృందం వాసులు చేయించి తిరిగి ఆ లభ్దిదారునికి చెల్లించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆమెకే కాకుండా మరో 10 మంది లభ్దిదారులకు లంచం డబ్బు ఆ అధికారి వెనిక్కి ఇచ్చేశారు.

కడప జిల్లలో మరో పించనుదారురాలు ఒక దళారికి 1000 రూపాయలు లంచం ఇవ్వగా 1100 కాల్ సెంటర్ పసిగట్టి ఆ లంచం డబ్బు వెనక్కి ఇప్పించింది.

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఒక పౌరుడు, డెత్ క్లెయిమ్ పరిష్కారం కోసం 500 రూపాయలు లంచం రూపంలో ఇస్తే దాన్ని కూడా ఆ లంచం తీసుకున్న వ్యక్తి నుంచి తిరిగి ఆ పౌరుడికి ఇప్పించారు.

"1100 నంబరుకు ఏ ఫిర్యాదైనా చేయొచ్చని, ఫిర్యాదులపై విచారణ జరిపాకే చర్యలు తీసుకుంటాం. రాజకీయ అవినీతి కూడా సహించేది లేదు. 1100 నంబరుకు ఎలాంటి ఫిర్యాదులైనా చేయొచ్చు. ఎక్కడ అవినీతి జరిగినా ప్రజలు సమాచారమివ్వాలి" అని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు

Link to comment
Share on other sites

Small fishes,kaakunda thimingalaalani kooda catch cheyyali

small fishes padithene, society maruthundi... big fishes okati rendu dorikina peddaga use ledu.. vallu counter cases, stays etc etc. no use.

 

sarigga work aithe idhi oka game changer

Link to comment
Share on other sites

1100 ki vasthunnaa calls data ekkadanna website lo pedathara? 

 

Like how many cases reoported, how many received satisfactory results, how many fake cases, how many unresolved, typical processing time etc?

Link to comment
Share on other sites

1100 ki vasthunnaa calls data ekkadanna website lo pedathara? 

 

Like how many cases reoported, how many received satisfactory results, how many fake cases, how many unresolved, typical processing time etc?

మీ కోసం, ప్రజా సమస్యల పరిష్కార వేదిక - ఆంధ్ర ...

meekosam.ap.gov.in/

Link to comment
Share on other sites

no brother, I am asking if that kind of data will be made public. (not for only who reported) If you think about it, there is nothing to hide, no privacy or civil liberty issues. I am not saying disclose details of pending cases also..

 

Ituvanti data public chesthe ne, work authundi ane confidence vosthundi.. ledante bjp jagan vishyam lo ela undo, manam kuda corrupt people vishyam lo alane unnattu kada..

Link to comment
Share on other sites

no brother, I am asking if that kind of data will be made public. (not for only who reported) If you think about it, there is nothing to hide, no privacy or civil liberty issues. I am not saying disclose details of pending cases also..

 

Ituvanti data public chesthe ne, work authundi ane confidence vosthundi.. ledante bjp jagan vishyam lo ela undo, manam kuda corrupt people vishyam lo alane unnattu kada..

first time tisukunn amoney ichhyi mantaru anta, taruvtha ivvaka pothe peru bayta pedtaru anta,

Link to comment
Share on other sites

first time tisukunn amoney ichhyi mantaru anta, taruvtha ivvaka pothe peru bayta pedtaru anta,

ok, but at least release how many were caught, how many reported, how many fake, how many are satisfied with results etc. Because, repu vere govt vosthe, deenni sabotage chestharu.. okka case kuda bayataki radu, paiga report chesina vadini target chestharu

Link to comment
Share on other sites

హైదరాబాద్‌లో ఉంటే 1100 పనిచేయదోయ్‌!

ఫిర్యాదు చేయాలంటే ఏపీకి రావాల్సిందే

సాంకేతిక సమస్యతో నవ్యాంధ్ర పౌరులకు ఇబ్బందులు

ఈనాడు, అమరావతి: ‘హలో ఇది ఆంధ్రప్రదేశ్‌ కాల్‌ సెంటరా...’ఆతృతగా ఫోనులో ప్రశ్నించిన సుబ్బారావుకు అవతలి వైపు నుంచీ ‘క్షమించాలి, ఇది తెలంగాణ కాల్‌సెంటర్‌’ అని సమాధానం వచ్చింది. అనుమానం వచ్చి తాను డయల్‌ చేసిన నంబరును సరి చూసుకుని మళ్లీ డయల్‌ చేశారు హైదరాబాద్‌లో స్థిరపడిన రాజమండ్రి వాసి సుబ్బారావు. మళ్లీ అదే సమాధానం. రాజమండ్రిలోని తన కుటుంబ సభ్యులకు ఒక సమస్య వస్తే దానిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడానికి ఏపీ కాల్‌ సెంటర్‌ కోసం ప్రయత్నించిన ఆయనకు ఎదురైన సమస్య ఇది. 1100...ఏపీ ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించి పరిష్కార వేదిక కాల్‌సెంటర్‌ నంబర్‌ ఇది. ఈ నంబరుకు రాష్ట్ర ప్రజలు ఫోను చేసి తమ సమస్యలను ఫిర్యాదు చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. ఏపీలో ఉంటున్నవారు తమ ఫోను నుంచి ఈ నంబర్‌కు డయల్‌ చేస్తే సులభంగానే కలుస్తోంది. కానీ రాష్ట్రానికి చెందిన లక్షలాది మంది ప్రజలు హైదరాబాద్‌, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఏపీలో అక్కడి వారికి భూములున్నాయి. కుటుంబ సభ్యులున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీ ప్రభుత్వానికి హైదరాబాద్‌ నుంచీ కాల్‌ సెంటర్‌కు ఫోను చేసి ఫిర్యాదు చేయాలంటే కుదరడం లేదు. తెలంగాణ రాష్ట్రం చిరునామాలో వారి ఫోన్లు నమోదు కావడంతో వారు అక్కడి నుంచి 1100 నంబర్‌కు డయల్‌చేయడంతో... తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌కు వెళుతోంది. దాంతో ఏంచేయాలో తెలియక తెలంగాణలో స్థిరపడిన ఏపీప్రజలు సతమతమవుతున్నారు.

అన్ని రాష్ట్రాలకూ ఒకే నంబర్‌..: తెలంగాణ సహా తమిళనాడు, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా కాల్‌ సెంటర్లను నిర్వహిస్తున్నారు. ఈ కాల్‌ సెంటర్లకు ఆయా ప్రభుత్వాలు 1100 నంబరును ఎంచుకున్నాయి. తమిళనాడు, ఇతర రాష్ట్రాల ప్రజలకు పెద్దగా సమస్యలు లేవు కానీ, ఏపీ, తెలంగాణ ప్రజలకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇది టెలీకాం పరంగా సాంకేతికపరమైన ఇబ్బంది. దీనిపై కాల్‌సెంటర్‌ వర్గాలను ప్రశ్నించగా.. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపాయి.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...